Jump to content

kondaveedu fort and golden temple


Recommended Posts

 • Replies 192
 • Created
 • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

I am from Guntur.. working in Europe.   How abt u? 

దశదిశలా.. కొండవీడు ఖ్యాతి
19-02-2019 08:20:43
 
636861612441254714.jpg
 • అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం..
 • పర్యాటక రంగానికి ప్రాధాన్యం
 • ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
 • కొండవీడు ఘాట్‌ రోడ్డు ప్రారంభం
 • నగర వనానికి శంకుస్థాపన
చిలకలూరిపేట టౌన్‌/యడ్లపాడు: కొండవీడు కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఏడు వందల ఏళ్ల చరిత్ర అధ్యయనం చేయడంతోపాటు కొండవీడు అభివృద్ధికి ప్రత్యేక వ్యవస్థ, మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని జిల్లా కలెక్టర్‌, అటవీ, పర్యాటక శాఖాధికారులను ఆదేశించారు. కొండవీడు ఉత్సవాల ముగింపు సందర్భంగా ఘాట్‌రోడ్డు, నగరవనాన్ని ఆయన ప్రారంభించారు. తమ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే కొండవీడు, కొండపల్లి, కోటప్పకొండ.. ఇలా చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నట్టు వివరించారు. నిన్న మొన్నటివరకు పుస్తకాలు, సినిమాలకే పరిమితమైన కొండవీడు చరిత్రను భావితరాలకు కళ్లకు కట్టినట్టుగా చూపిస్తామని పేర్కొన్నారు.
 
ఎన్టీఆర్‌ కొండవీటి సింహం సినిమా సమయంలో కొండవీడు గురించి బయటి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఒకప్పుడు నడవడానికి కూడా వీలులేని ప్రదేశమైన కొండవీడుపైకి నేడు చక్కగా సందర్శకులు, పర్యాటకులు వెళుతున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాముఖ్యత ఇవ్వబట్టేనన్నారు. కొండవీడు కొండపై మ్యూజియం, ఆడిటోరియం, జంతు ప్రదర్శనశాల, రోజూ లైట్‌ అండ్‌ సౌండ్‌, రోప్‌వే, చారిత్రక దేవాలయాల అభివృద్ధి, వృక్షసంపద పరిరక్షణకు బొటానికల్‌ గార్డెన్‌, స్టార్‌ హోటల్‌, పర్యాటకులకు అవసరమైన తదితర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. కొండవీడుపై పురాతన సంపద పరిరక్షణకు సెక్యూరిటీ, బొల్లుమోర వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకునేవిధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. కొండవీడు కొండపై అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రిసార్ట్‌ నిర్మించేందుకు గోల్కొండ గ్రూపు సంస్థల చైర్మన్‌ నడికట్టు రామిరెడ్డి ముందుకు రావడం సంతోషంగా ఉన్నదని ఆయనను అభినందించారు సర్వీస్‌ సెక్టార్‌లోని అన్ని రంగాలను అభివృద్ధిచేసి ఆంధ్రప్రదేశ్‌ ఆదాయాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తున్నామన్నారు.
 
 
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఇక కొండ దిగువన సభా వేదికపై భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీత యల్లా వెంకటేశ్వరరావు బృందంతో మృదంగ వాద్యం వీనులవిందు చేసింది. ప్రఖ్యాత మెజీషియన్‌ బీఎస్‌ రెడ్డి ప్రదర్శన ఆకట్టుకుంది. భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ విజయభాస్కర్‌, ఏపీ నాటక అకాడమీ వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావులు పర్యవేక్షించారు.
 
 
ఆవిష్కరణలు..
ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పురా వస్తుశాఖ రూపొందించిన కొండవీడు చరిత్ర డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. ఈమని శివనాగిరెడ్డి, శివారెడ్డిలు రూపొందించిన కొండవీటి వైభవం, కొండవీటి సామ్రాజ్యం, కొండవీటి కైఫియత్‌ల పుస్తకాలను ఆవిష్కరించారు. కొండవీడు ఉత్సవంతోపాటు అభివృద్ధి పనులకు కృషి చేసిన పురావస్తుశాఖ కమిషనర్‌ వాణీమోహన్‌, పర్యాటకశాఖ జేడీ మల్లిఖార్జునరావు, జిల్లా అటవీశాఖాధికారి మోహనరావు, ఘాట్‌ రోడ్డు కాంట్రాక్టర్‌ను అభినందించి జ్ఞాపికలు అందించారు. పార్టీ నాయకులు ముఖ్యమంత్రికి జ్ఞాపిక బహుకరించారు. కార్యక్రమంలో మంత్రి నక్కా ఆనందబాబు, కలెక్టర్‌ కోన శశిధర్‌, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, టీడీపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ పుష్పరాజ్‌, మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, ఏపీ గ్రంథాలయ పరిషత్‌ చైౖర్మన్‌ దాసరి రాజామాస్టారు, జడ్పీ చైౖర్‌పర్సన్‌ జానీమూన్‌, క్రిష్టియన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మ్యానీ, పర్యాటక శాఖ ఎండీ ధనుంజయరెడ్డి, శివనాగిరెడ్డి, ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, రాయపాటి శ్రీనివాస్‌, రాయపాటి రంగారావు, టీడీపీ నాయకులు మన్నవ సుబ్బారావు, నాట్స్‌ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్‌కృష్ణ, చిట్టాబత్తిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తదితర నాయకులు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
 
 
కొండవీడుకోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. కొండవీడు అభివృద్ధికి ప్రభుత్వం రూ.90కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికి రూ.60కోట్లతో పనులు పూర్తి చేశాం. ముఖ్యమంత్రి సహకా రంతో దశల వారీగా కొండవీడును మరింతగా అభివృద్ధి చేస్తాం.
- ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మం
Link to post
Share on other sites

గుంటూరు జిల్లాలో ఎంతో ఘనమైన చరిత్రగల కొండవీడు కోట ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 34కోట్ల వ్యయంతో నిర్మించిన కొండవీడు ఘాట్ రోడ్డును ప్రారంభించారు.పలుఅభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని, నూతనంగా నిర్మించనున్న కొండవీడు నగర వనానికి శంకుస్థాపన చేశారు.

కొండవీడు చరిత్రపై డాక్యుమెంటరీ విడుదల చేసి, కొండవీడు సామ్రాజ్యం, వైభవం, కైఫీయత్ పుస్తకాలను ఆవిష్కరించారు. కొండపైన పుట్టాలమ్మ, ముత్యాలమ్మ, వెదుళ్ల చెరువులు, కట్టడాలు, దేవాలయాలను పరిశీలించారు.

కొండవీడు కోటను మరింత ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చాలనే ధృడసంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదివరకే రూ. 90కోట్లను కేటాయించడం జరిగింది, అందులో భాగంగా రూ. 60కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. 

https://pbs.twimg.com/media/DzxChHlUYAAvwdz.jpg:large

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  No registered users viewing this page.


×
×
 • Create New...