Jump to content

నా వ్యాఖ్యలు నొప్పించి ఉంటే మన్నించండి : బాలకృష్ణ


Alapati's

Recommended Posts

Guest Urban Legend

ఆ వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కాదు: బాలకృష్ణ.

 

హైదరాబాద్‌: మహిళలంటే తనకు మొదట్నుంచీఅపారమైన గౌరవమని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఏ ఇంటి మహిళ అయినా.. తమ ఇంటి ఆడపడుచుగా చూడటం సంప్రదాయమన్నారు. మహిళలను తోబుట్టువులుగా చూడటం తన తండ్రి నుంచి సంక్రమించిన వారసత్వమన్నారు. ఇటీవలి సావిత్రి సినిమా ఆడియో విడుదల వేడుకలో సరదాగా మాట్లాడిన మాటలు ఎవరినీ ఉద్దేశించి చేసినవి కాదని వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలకు ఎవరైనా నొచ్చుకొని ఉంటే మన్నించాలని కోరారు.

Link to comment
Share on other sites

సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్‌లో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం సాయంత్రం వివరణ ఇచ్చారు. ఇతరులను గౌరవించడం, మహిళలను తోడబుట్టినవారిగా చూడడం తమ ఇంటి సంప్రదాయం అని అన్నారు. తన మాటలకు ఎవరైనా నొచ్చుకుని ఉంటే మన్నించాలని ఆయన అన్నారు. తాను ఎవరినీ నొప్పించడం కోసం ఆ విధంగా వ్యాఖ్యలు చేయలేదని, సినిమాకు సంబంధించి కథాపరంగా సన్నివేశాల గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలని, వాటిని అపార్థం చేసుకోవద్దని బాలయ్య వివరణ ఇచ్చారు.

 

 

సినిమా వేడుకలో సరదాగా చేసిన వ్యాఖ్యలను వేరే ఉద్దేశంతో చూడవద్దని బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఏ ఇంటి మహిళ అయినా... తమ ఇంటి ఆడపడుచుగా చూడడం తమ సంప్రదాయమని, మహిళలను తోబుట్టువులుగా చూడడం తనకు తన తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన గుణమని, మహిళల పట్ల తనకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం (రేపు) మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ర్టాల్లో ఉన్నవారకి, దేశ విదేశాల్లో ఉన్న సోదరీమణులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని బాలయ్య కోరారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

 

 


సినిమాకు సంబంధించి కథాపరంగా సన్నివేశాల గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలని, వాటిని అపార్థం చేసుకోవద్దని బాలయ్య వివరణ ఇచ్చారు.
Link to comment
Share on other sites

 

సినిమాకు సంబంధించి కథాపరంగా సన్నివేశాల గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలని, వాటిని అపార్థం చేసుకోవద్దని బాలయ్య వివరణ ఇచ్చారు.

 

raana movie loni dialogue anukuntunna...
Link to comment
Share on other sites

 

సినిమాకు సంబంధించి కథాపరంగా సన్నివేశాల గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలని, వాటిని అపార్థం చేసుకోవద్దని బాలయ్య వివరణ ఇచ్చారు.

 

Link to comment
Share on other sites

Iron legg lu saami..... New NTR and NR.... Assalu maa balayya ki macha ledhu ippati varaku.... Ella Dikkumalina audio fn ki vellatam valla ee daridram....

 

Kshaminchatame kani kshminchamani adagatam ippati varaku vinalaaa.....

 

Matter chala lite.... But asalu Balayya veltunna path lo ee mullu enduku vachindoo....

Link to comment
Share on other sites

Iron legg lu saami..... New NTR and NR.... Assalu maa balayya ki macha ledhu ippati varaku.... Ella Dikkumalina audio fn ki vellatam valla ee daridram....

 

Kshaminchatame kani kshminchamani adagatam ippati varaku vinalaaa.....

 

Matter chala lite.... But asalu Balayya veltunna path lo ee mullu enduku vachindoo....

First Paragraph :roflmao: :roflmao: on a lighter note
Link to comment
Share on other sites

asalu ah dikkumalina Rohit gadu .. Bob cinema fans show choosi .. Eh face petkuni audtio function ki Balayya ni pilchadu .. Bondam gadu

Ayana stunts ayanavi.. Bob fan base kosam poyadu emo.. Aina Bob gadu Kani bob fans Kani dekaru ga.. Obvious ga :sleep:

interviews lo pebbi bob antadu.. Audios ki Nbk ni pilustaru.. Everything part of game veNu annay

Link to comment
Share on other sites

Iron legg lu saami..... New NTR and NR.... Assalu maa balayya ki macha ledhu ippati varaku.... Ella Dikkumalina audio fn ki vellatam valla ee daridram....

 

Kshaminchatame kani kshminchamani adagatam ippati varaku vinalaaa.....

 

Matter chala lite.... But asalu Balayya veltunna path lo ee mullu enduku vachindoo....

madyalo NR and TR em chesarule annayi

Link to comment
Share on other sites

"అసలు నందమూరి బాలకృష్ణ గారు "సావిత్రి" ఆడియో ఫంక్షన్లో ఏమి మాట్లాడారు....ఎందుకు కొంతమంది ఉద్దేసపూర్వకముగా రాజకీయం చేస్తున్నారు"

 

సిద్ధాంత పరముగా నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని అయినా.....సినిమా పరముగా “జై బాలయ్య” అని వెహికల్స్ వెనుక రాసుకుని తిరగటం, లేదా మీటింగ్లలో “జై జై బాలయ్య” అని స్లోగన్లు ఇచ్చే విపరీత అభిమానిని (Extremist) ను అయితే కాదు. అయితే “సావిత్రి” సినిమా ఆడియో ఫంక్షన్ లో బాలకృష్ణ గారు “నటులు నటించే పాత్రల మీద మాట్లాడుతూ వాడిన రెండు మూదు పదాలని కొంతమంది ఉద్దేసపూర్వకముగా, కుటిలత్వంతో కాంట్రవర్సీ చేస్తుండటాన్ని చూసి ఈ పోస్ట్ పెడుతున్నాను. (బయో డేటా లో “సెక్స్” అన్న చోట “Male/Female” అని జెండర్ రాయటానికి బదులుగా “Virgin/Never Had” అని రాసే బాచ్ ఇది. ప్రతి విషయాన్ని తప్పుడు కోణంలో చూసే ఈ బాచ్.)

 

ఈ కాంట్రవర్సీ ని create చేసిన వారు కాని, ప్రచారం చేస్తున్న వారు కాని, దీనిని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ పై, అలాగే చంద్రబాబు గారి విమర్శలు చేస్తున్న పని పాట లేని మేధావులు కాని...వారిలో అసలు ఎంత మంది పూర్తిగా ఈ వీడియోను చూసారు అంటే...సందహేమే? కొంతమంది మిత్రులకి అనుకోవచ్చు ..ఎందుకు నేను దీని మీద ఇంత టైం స్పెండ్ చేసాను అని...

 

ఈ సుడో మేధావులు గుంపు, వారి వెనుక ఉన్న “ఆంధ్ర అభివృద్ధి నిరోధకుల రాజకీయ సంఘాలు” చేస్తున్న దుష్ప్రచారం సామాజిక మీడియా ప్రభావం రోజు రోజుకి అధికం అవుతున్న ఈ రోజుల్లో ఒక చెడు సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి ...ఈ స్పీచ్ విశ్లేషణ చెయ్యాల్సివస్తుంది...ఇటువంటి అనారోగ్య ప్రచారాలని ప్రోత్సహిస్తే ...సామజిక మీడియా ద్వారా ఈ Perpetrators/Trespassers ఎంత దూరం అయ్యిన వెళ్తారు ...ఈ రోజు బాలకృష్ణ గారు అయారు ...రేపు మనం కూడా బాధితులం కావొచ్చు.

 

మొత్తం 15 నిముషాలు స్పీచ్ ఇది. బాలకృష్ణ గారు ఈ స్పీచ్ లో ఎన్నో అంశాలు మీద మాట్లాడారు. స్పీచ్ మొదట్లోనే “ఈ సినిమా కధానాయకులకి” అనగానే హీరో రోహిత్ గురించో, లేక తారకరత్న గురించో చెబుతున్నారు అనుకున్నవారికి “ఈ సినిమాకి ఇద్దరు కధానాయకులు ఒకరు సినిమా దర్శకులు మరొకరు సంగీత దర్శకులు అని చెబుతూ సినిమా ప్రొఫెషనల్స్ మీద ఆయనకున్న గౌరవాన్ని చెప్పారు. (ఈ దుష్ప్రచార గుంపుకి ఒక సీనియర్ నటుడు తన తోటి కళాకారులకు, టేక్నిసియన్లకు ఇచ్చే గౌరవం వినపడలేదు/కనపడలేదు)

 

తరవాత అయన ప్రజలతో ఎలా మమేకము అవుతున్నారో చెబుతూ ...రాజకీయ నాయకులూ కేవలం పాలించబడే ప్రజలకి పాలకులుగా గాక సేవకులుగా ఉండాలి అని స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు చెప్పిన సిద్ధాంతాన్ని గుర్తుచేస్తూ, అలాగే ఆడియో ఫంక్షన్ అనేది ఒక పండగ అంటూ సందోర్భోచితముగా ఒక శ్లోకాన్ని వాడారు.

 

తరవాత ...సినిమా టైటిల్ గురించి చెబుతూ “సావిత్రి” ఎంత గొప్ప టైటిల్, ఫిమేల్ ఓరియెంటెడ్ టైటిల్ అని “లెజెండ్” సినిమాలో ఆడవారి గొప్పదనాన్ని సూచిస్తూ పలికిన “వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ స్రుష్టి ఏ నాస్తి” (స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టియే లేదు) ఇక్కడ ఉపయోగించారు.” (ఈ గుంపు కి ఇది కూడా వినపడలేదు) .

 

తరవాత ఈ సినిమా సంగీతం గురించి మాట్లాడారు. ఈ సందర్భముగా తల్లీ తండ్రుల గొప్పదనాన్ని ఎంత అద్బుతముగా చెప్పారో వినపడలేదు (6 వ నిముషము దగ్గర వినండి). సంగీతం గొప్పదనం, మన జీవితాలలో సంగీతం పాత్ర గురించి, వేదాలు గురించి మూడు – నాలుగు నిముషాలు మాట్లాడారు.

 

పాటలు పాడిన ప్రతి ఒక్క గాయకుడిని పేరు పేరు నా అభినందించారు. (నాకు తెలిసి ఆడియో ఫంక్షన్ కు వచ్చే చాలామంది అతిధులు అసలు సంగీతం గురించే మాట్లాడారు. వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడతారు.). ఈ సందర్బముగా కమెడియన్ నటుడు ‘రాజేష్’ ను పలకరించి అతను పాధబివందం చేస్తుంటే నిలువరిచి ఎంతో సరదాగా మాట్లాడారు. (జూనియర్ నటుడు అయ్యినా...వాళ్ళ పట్ల బాలకృష్ణ అభిమానం చూపిస్తున్న విధానం కనపడలేదు ఈ మేధావులకు).

 

అసలు కాంట్రవర్సీ చేయబడిన వ్యాఖ్యలు/పదాలు ఏంటి. బాలకృష్ణ గారు స్పీచ్ లో ఏమి మాట్లాడారు As it is గా

 

“నటుడు అనేవాడు రకరకాల పాత్రలు చెయ్యాలి. మన తారకరత్న ఉన్నాడు. సాయి కొర్రపాటి గారి సినిమాలో మంచి పాత్ర చేస్తున్నాడు. ఒక మంచి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాబోతుంది అతనికి ఆ చిత్రంతో. ఎవరు కూడా అన్ని పాత్రలు చేయలేరు. ఒక అదృష్తం ఉండాలి. నేను కూడా అన్ని పాత్రలలో ఇమడలేను. కొన్ని కొన్ని పాత్రలు వరకే నేను చేయ్యగాలుగుతాను. అమ్మాయల వెంట పదమంటే ఎలా ..ఊరుకుంటార మా ఫాన్స్, ఊరుకోరుగా...వెళ్లి ముద్దు అయినా పెట్టాలి (పాత్ర పరముగా), కడుపు అయిన చేసేయాలి (పాత్ర పరముగా). కమిట్ అయిపోవాలి. కొన్ని కొన్ని పాత్రలలో ఇముడుతాను. రకరకాల పాత్రలు చెయ్యాలి అని ఉంటుంది నాకు” ఇలా సాగింది అయన స్పీచ్.

 

అంటే “సింహ సినిమాలో డాక్టర్ పాత్ర లాంటివి నాకు సూట్ అవుతాయి కాని అమ్మాయల వెంట పడే రొమాంటిక్ పాత్రలు నాకు సూట్ కావు అని అయన ఉద్దేశం. ఈ సందర్భముగా అయన నటించిన కొన్ని పాత్రలను కూడా ఉదహరించారు.

 

తరవాత ఈ సినిమా నటులు రోహిత్, తారక్ రత్న, ఇతర తారాగణం గురించి పేరు పేరు నా ఇంట్రడ్యూస్ చేసారు... తన నటనా అనుభవంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసాను అని చెబుతూ క్రౌడ్ ను ఎంతెర్తైన్ చెయ్యటానికి సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఆక్టర్స్ గా ఎలా స్తిరపదాలో కూడా నటులకి సలహాలు ఇచ్చారు.

 

ఇక్కడ బాలకృష్ణ గారు తప్పు మాట్లాడారు అన్ని చెబుతున్న పదాలు ....పాత్ర పరముగా మాట్లదినివ్వే కాని....అలా చెయ్యాలి అని చెప్పినట్టు గా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కేవలం కల్పితం. ఏమి మాట్లాడం అనేది ఎంత ముఖ్యమో, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాము అనేది అంతే ముఖ్యం. ఎన్నో మంచి విషయాలు మాట్లాడిన అవేమి పట్టించుకోకుండా...పాత్రలు గురించి సందర్బానుసారం చేసిన ఒక వ్యాఖ్యని మాత్రం “కాంట్రవర్సీ” చేస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...