Jump to content

బాలయ్య


Recommended Posts

 

 

He is a director's Hero అనేవాళ్ళు. అంటే మొత్తం డైరెక్టర్ కి వదిలేసి రెండోది ఆలోచించకుండా  డైరెక్టర్ ఏది చెప్తే అది చెయ్యటం. అది వృత్తి ధర్మం. డైరెక్టర్ విలువ  డైరెక్టర్ కి ఇవ్వాలి. హీరో పని హీరో చెయ్యాలి అని నమ్మే వ్యక్తి.  అలా చెయ్యటం వల్ల కొన్ని సినిమాలు ఘోరం గా పోయాయి. కొన్ని చాలా చాలా  బాగా ఆడాయి. సినిమాల సంగతి పక్కన పెట్టేద్దాం. 

 

కొన్ని సంవత్సరాల క్రితం అన్నగారు స్థాపించిన బసవ తారకం కాన్సర్ ఆసుపత్రి బాధ్యతలని భుజాన వేసుకున్నాడు. ప్రపంచం మొత్తం తిరిగి విరాళాలు సేకరించాడు. ఆసుపత్రికి కావాల్సిన సౌకర్యాలు మొత్తం సమకూర్చాడు. ఆసుపత్రి లో రోగుల్ని పరామర్శించే వాడు. కొద్ది కాలం లోనే ఆసుపత్రికి అవార్డ్స్ వచ్చాయి. ప్రశంసలు వచ్చాయి.  దీని సంగతి కూడా పక్కన పెట్టేద్దాం.

0402-cancer-Balayya.jpg

 

APJ-Abdul-Kalam-1.jpg

 

Balakrishna.jpg

 

1276456460_55.jpg

 

 

ఇక రాజకీయాలకి వద్దాం.. వీటికి బాలయ్య సరిపోడేమో అన్నారు కొందరు. హిందూపూర్ లో నామినేషన్ వేసిన రోజు నుంచి వోటర్లు వోట్ వేసే రోజు వరకు ఒక MLA అభ్యర్ధి గా ఏమేమి చెయ్యాలో అంతకంటే బాగా చేసాడు అనిపించింది. ఆ స్థాయి వ్యక్తి  పోలింగ్ రోజున బూత్ బూత్ కి తిరిగి పరిస్థితులు చూడవసర్లేదు. కాని తిరిగారు. వోటర్లకి ఉన్న ఇబ్బందుల్ని పరిష్కరించాడు. 

 

10277391_10204225513502231_8021823990023

 

1017044_10204225516662310_44721245942520

 

 

10156124_10204225517022319_5291187266821

 

 

 

10306487_721846764504477_686503772503482 

 

10313836_10204232201509427_6491986100164

 

 

బాలయ్య మనసు పాదరసం అని విన్నాను. మనసు మాత్రమే కాదు. మనిషి కూడా అలాంటి ఆయనే అని చూసి తెలుసుకున్నాను . పాదరాసాన్ని ఎందులో పోసినా ఆ ఆకృతి వచ్చేలా , బాలయ్య కూడా ఏ  బాధ్యత తీసుకున్నా,  దానిని అత్యంత శ్రద్ధ తో పూర్తి  చేస్తారని తెలిసింది ఇవాళ.

 

సూపర్ బాలయ్య.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...