Jump to content

VRA Salaries Hike | From Rs. 6,565 to Rs.10,500 | CM Chandrababu


Recommended Posts

వీఆర్‌ఏల వేతనాల పెంపు
రూ.10,500కు పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎం
ఈనాడు డిజిటల్‌ - అమరావతి
2ap-main5a.jpg

గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారి కష్టాలను దృష్టిలో ఉంచుకునే వేతనాలు రూ.6,565 నుంచి రూ.10,500కు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. శనివారం సాయంత్రం వీఆర్‌ఏల సంఘం గౌరవాధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీఆర్‌ఏలు ముఖ్యమంత్రిని ఉండవల్లిలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే వీఆర్‌ఏల వేతనాన్ని రూ.3వేల నుంచి రూ.6,565కు, నాలుగేళ్లలో మూడింతలు పెంచామని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తున్నామని వివరించారు. ఇదే స్ఫూర్తితో వీఆర్‌ఏలు గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తూ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ‘ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో ఆయా దేశాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మోదీ సింగపూర్‌ పర్యటన సందర్భంగా అక్కడి ప్రధాని అమరావతి అభివృద్ధిని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి  ప్రవాసులకూ మంచి ప్రేరణనిస్తోంది. అందువల్లే నవ నిర్మాణ దీక్షలో  ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ స్ఫూర్తి భవిష్యత్తులోనూ కొనసాగాలి’ అని సీఎం తెలిపారు. వేతనాలు పెంచినందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీఆర్‌ఏల సంఘ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌, రాష్ట్ర వీఆర్‌ఏల సంఘం అధ్యక్షులు కైకాల గోపాలరావు, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ చౌదరి,  టి.వెంకటేశ్వర్లు ఉన్నారు.

వీఆర్‌ఏల కుటుంబాల్లో ఆనందం: బొప్పరాజు
చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న 27వేల మంది వీఆర్‌ఏల వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వారి కుటుంబాల్లో ఆనందం నింపుతోందని రాష్ట్ర వీఆర్‌ఏల సంఘం గౌరవాధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

2014 నాటికి VRA ల జీతం 3,400/-.

తెలుగుదేశం ప్రభుత్వం 2014 లో 6300/- చేసింది..

ఇప్పుడు 10,400/- చేసింది.

27,000 VRA ల కుటుంబాలకు లబ్ధి

Link to comment
Share on other sites

  • 3 weeks later...
వీఆర్‌ఏల సమావేశానికి పటిష్ట ఏర్పాట్లు
25-06-2018 10:02:52
 
636655177730814677.jpg
  • కృష్ణా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌
విజయవాడ (ఆంధ్రజ్యోతి): గ్రామ రెవెన్యూ సహాయకుల ఆత్మీయ అభినందన సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వీఆర్‌ఏలు రానున్న దృష్ట్యా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన అన్నిచర్యలు తీసుకుందని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆదివారం సాయంత్రం ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా విజయ్‌కృష్ణన్‌ మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ సోమవారం గ్రామ రెవెన్యూ సహాయకుల ఆత్మీయ అభినందన సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారని ఆమె తెలిపారు. సభకు దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు, పురుషులకు విడివిడిగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చే మహిళా వీఆర్‌ఏలకు లబ్బీపేటలోని లీలావతి విజ్ఞాన మందిర కళ్యాణ మండపంలో వసతి ఏర్పాటు చేశామని, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చే మహిళా వీఆర్‌ఏలకు పడమటలోని నల్లూరివారి కల్యాణ మండపంలో వసతి ఏర్పాటు చేశామని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ తెలిపారు. మిగిలిన వారికి అనంతపురం జిల్లా నుంచి వచ్చేవారికి తుమ్మలపల్లి కళాక్షేత్రం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వారికి ఏ-కన్వెన్షన్‌ సెంటర్‌, విశాఖ జిల్లా నుంచి వచ్చే వారికి కేజిగుప్తా ఫౌండేషన్‌ హాల్‌, కర్నూలు జిల్లా నుంచి వచ్చేవారికి ఆటోనగర్‌లోని ది ఆటోమొబైల్‌ టెక్నిషియన్‌ హాల్‌, కడప జిల్లా నుంచి వచ్చేవారికి అశోక్‌నగర్‌లోని ఆహ్వానం కళ్యాణమండపం, చిత్తూరుజిల్లా నుంచి వచ్చే వారికి అశోక్‌నగర్‌లోని ధనేకుల కల్యాణ మం డపం, నెల్లూరు జిల్లా నుంచి వచ్చే వారికి గాంధీనగర్‌లోని కృష్ణాజిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ హాల్స్‌లో వసతి సౌకర్యం ఏర్పాటు చేశామని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సభకు హాజరయ్యేవారికి సంబంధించి జిల్లాలవారీగా గ్యాలరీలను ఏర్పాటుచేసి ప్రతిగ్యాలరీకి అధికారులను ఇన్‌చార్జ్‌గా నియమించినట్టు తెలిపారు.
 
విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తాగునీటికి సంబంధించి 50 వేల బాటిల్స్‌ను సిద్ధం చేయాలని, సభాస్థలిలో శానిటేషన్‌ కార్మికులను షిప్టుల వారీగా 50 మందిని నియమించాలని, పురుషులకు 20, మహిళలకు 20 చొప్పున టెంపరరీ టాయిలెట్స్‌ను ఏర్పాటుచేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు సంబంధించి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పార్కింగ్‌ స్ధలాల్లో నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వశాఖల అధికారులు వారికి కేటాయించిన విధులను నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజయ్‌కృష్ణన్‌ ఆదేశించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
వీఆర్‌ఏల అంత్యక్రియలకు రూ.15వేలు
01-08-2018 02:58:07
 
అమరావతి, జూలై 31(ఆంధ్ర జ్యోతి): విధి నిర్వహణలో ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులు మరణిస్తే, వారి అంత్యక్రియలు జరిపించడానికి ప్రభుత్వం రూ.15 వేలు అందించనుంది. ఇప్పటి వరకు రూ.10వేలు ఇస్తుండగా, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ సొమ్మును పెంచాలంటూ భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) అనిల్‌చంద్ర పునేఠా ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో రూ.15వేలకు పెంచుతూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...