Jump to content

Guntur politics


Recommended Posts

  • Replies 131
  • Created
  • Last Reply

Mangalagiri MLA - Panchumarthi Anuradha (Ex. Mayor)

Bapatla MP (SC) - Varla Ramaiah/Dokka Manikya varaprasad

Bapatla MLA - Gade Venkata Reddy son

Prathipadu MLA (SC) - Dokka Manikya varaprasad

Macherla MLA - Modugula Venugopal Reddy

Tadikonda MLA (SC) - Tenali Sravan Kumar

Repalle MLA - Anagani Satyaprasad

Tenali MLA - Alapati Raja

Vinukonda MLA - Anjaneyulu

Vemuru MLA (SC) - Nakka Ananda Babu

Guntur East - Ziauddin

Guntur West - Tulasi R Prabhu

Sattenapalli - New candidate??

Gurajala - Yerapathaneni Srinivasa Rao

Narsarao peta - Kodela Sivaprasad

Ponnuru - Dhulipala Narendra

Pedakurapadu - Kommalapati Sridhar

Link to comment
Share on other sites

పొలిటికల్‌ మిర్చి
14-05-2018 02:29:04
 
636618617448547359.jpg
 
  • గుంటూరులో రాజకీయ ఘాటు
  • పలువురు సిట్టింగ్‌ల ‘పక్క’ చూపు
  • తెరపైకి వస్తున్న వారసులు
  • పోటీకి రాయపాటి విముఖత
  • స్పీకర్‌ కోడెల ఎంపికపై సస్పెన్స్‌
(గుంటూరు - ఆంధ్రజ్యోతి)
గుంటూరు పేరు వినగానే గుర్తుకొచ్చేది పొగాకు ఘాటు... మిర్చి కారం! ఇప్పుడు జిల్లాలో రాజకీయ పరిణామాలు కూడా అదేస్థాయిలో ఘాటెక్కుతున్నాయి. గత ఎన్నికల్లో సాధించిన పట్టును ఈసారీ నిలబెట్టుకునేందుకు టీడీపీ... బలం పుంజుకోవాలన్న లక్ష్యంతో వైసీపీ ‘అభ్యర్థి వ్యూహాలను’ రచిస్తున్నాయి. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు రాజకీయంగా పట్టు సాధించి ఉండటం ఆ పార్టీకి కలిసి వస్తోంది. ఆ స్థాయిలో దీటైన నేతలు వైసీపీకి లేరు. దీనితో మంచి అభ్యర్థుల కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. సిటింగ్‌ ఎమ్మెల్యేలు కొందరిపై వస్తున్న ఆరోపణలను ఆసరాగా వారిని దెబ్బతీయాలన్న ప్రయత్నంలో వైసీపీ ఉంది.
 
 
గుంటూరు ఎంపీ...
గుంటూరు లోక్‌సభ స్థానానికి సంబంధించి రెండు ప్రధాన పార్టీల్లోనూ స్పష్టత ఉన్నట్లే కనిపిస్తోంది. సిటింగ్‌ ఎంపీ గల్లా జయదేవ్‌ మళ్లీ ఇక్కడ పోటీ చేయడం ఖాయమేనని చెబుతున్నారు. సినీ హీరో మహేశ్‌ బాబుకు స్వయానా బావ అయిన ఆయన ఇటీవల లోక్‌సభ సమావేశాల్లో కేంద్రంపై బలంగా ధ్వజమెత్తి ఆకర్షణ పెంచుకున్నారు. విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు శ్రీకృష్ణ దేవరాయలు ఈ లోక్‌సభ స్థానానికి వైసీపీ అభ్యర్థ్ధిగా ఖరారయ్యారని చెబుతున్నారు. ఇటీవల ఈ జిల్లాలో జగన్‌ పాదయాత్రలో శ్రీకృష్ణదేవ రాయలు చురుగ్గా పాల్గొనడంతోపాటు అన్ని విధాలుగా అండదండలు అందించారు.
 
బాపట్ల బరిలో...
ఎస్సీ రిజర్వుడు స్థానమైన బాపట్లకు ప్రస్తుతం టీడీపీ సిటింగ్‌ ఎంపీగా శ్రీరాం మాల్యాద్రి ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఆయన సన్నిహితుడు. అనూహ్య పరిణామాలేవైనా చోటు చేసుకొంటే తప్ప మళ్లీ మాల్యాద్రికే అవకాశం రావచ్చునని అంటున్నారు. వైసీపీ తరపున పోయినసారి అమృతపాణి పోటీ చేశారు. ఒకరిద్దరు రిటైర్డ్‌ అధికారుల పేర్లు ఈ సీటుకు వైసీపీ తరపున ప్రచారంలోకి వస్తున్నాయి. ఆర్థికంగా శక్తి ఉన్న అభ్యర్థుల కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది.
 
అసెంబ్లీ సమీకరణాలు...
గుంటూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల కొత్త సమీకరణాలు చోటు చేసుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. గుంటూరు నగరంలో రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. గుంటూరు-2 టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఈసారి అక్కడ నుంచి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీకి అవకాశం ఇస్తే నర్సరావుపేట వెళ్తానని, లేని పక్షంలో మాచర్ల లేదా సత్తెనపల్లికి మారడానికి సిద్ధమేనని ఆయన సంకేతాలు పంపుతున్నారు. ఆయనను మాచర్ల అభ్యర్థ్థిగా ఎంపీక చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మోదుగుల మారితే ఈ సీట్లో ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రాయపాటి సాంబశివరావు రిటైరైతే ఆయన కుమారుడు రంగారావు పేరు ఈ సీటుకు ప్రతిపాదనకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీ అభ్యర్థి కూడా ఇంకా తేలలేదు. పోయినసారి ఇక్కడ పోటీ చేసిన కార్మిక నేత లేళ్ల అప్పిరెడ్డి మళ్లీ టికెట్‌ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల వైసీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్‌ సైతం గుంటూరు-2పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అయితతే... ఆ పార్టీ నాయకత్వం ఆయనను కృష్ణా జిల్లా మైలవరం అభ్యర్థిగా ప్రతిపాదిస్తోంది. పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్య కూడా ఈ సీటు టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.
 
గుంటూరు-1కు వైసీపీ సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మహ్మద్‌ ముస్తఫా మళ్లీ ఇదే సీట్లో పోటీ చేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ముస్లిం మైనారిటీల సంఖ్యాబలం ఈ నియోజకవర్గంలో గణనీయంగా ఉంది. పోయినసారి ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేసిన మద్దాళి గిరిధర్‌ మళ్లీ పోటీ చేసే లక్ష్యంతో చురుగ్గా తిరుగుతున్నారు. కానీ, ముస్లిం మైనారిటీల నుంచి ఎవరైనా మంచి అభ్యర్థి దొరికితే పెట్టాలన్న యోచనలో టీడీపీ ఉందని ప్రచారం జరుగుతోంది. దివంగత టీడీపీ నేత లాల్‌ జాన్‌ బాషా కుమారుడి పేరు కొందరు ప్రతిపాదిస్తున్నా దానిపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదు.
 
 
మంగళగిరి బరిలో...
రాజధాని ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న మంగళగిరి నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు సన్నిహితుడు కావడంతో ఆయనకు ఏ ఇబ్బందీ లేదని అంటున్నారు. చేనేత కార్మికుల సంఖ్య అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో తమకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కోండ్రు కమల కుటుంబం ఒత్తిడి తెస్తున్నా ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. టీడీపీకి ఈ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న గంజి చిరంజీవి మళ్లీ పోటీ చేసే ప్రయత్నంలో ఉన్నా ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. పార్టీ నేతలు పోతినేని శ్రీనివాసరావు, మురుగుడు హనుమంతరావు తదితరులు ఇక్కడ రేసులో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలని స్థానిక నేతలు కొందరు ఇటీవల ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ, ఆయన ఏ స్పందనా వ్యక్తం చేయలేదు. చేనేత వర్గానికి చెందిన విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనురాధ పేరును కొందరు ప్రతిపాదించారు. ప్రవాసాంధ్రుడు, అమరావతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఉపాధ్యక్షుడు మొక్కపాటి చంద్రశేఖర్‌ కూడా తాజాగా రంగంలోకి దిగారు.
ఎస్సీ రిజర్వుడు సీటు పత్తిపాడుపై కూడా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు ఈ సీటుకు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన వైఖరి సందేహాలకు తావిచ్చింది. దీంతో ఆయనకు టికెట్‌ రావడం అనుమానమేనన్న ప్రచారం వ్యాపించింది. కానీ, కొంతకాలంగా ఆయన క్రమం తప్పకుండా పార్టీ సమావేశాలకు హాజరై మచ్చను తుడుచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు ప్రత్యమ్నాయంగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్‌, కందుకూరి వీరయ్య పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. వైసీపీ నుంచి పోయినసారి పోటీ చేసిన మేకతోటి సుచరిత ఈసారి కూడా పోటీ చేయడం ఖాయమేనని చెబుతున్నారు.
 
 
సత్తెనపల్లి, నర్సరావుపేట లంకె
సత్తెనపల్లి, నర్సరావుపేట సీట్ల వ్యవహారం కూడా ఆసక్తికరంగా మారింది. స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివ ప్రసాదరావు ప్రస్తుతం సత్తెనపల్లికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సరావుపేట అసెంబ్లీ సీటు వ్యవహారాలు కూడా టీడీపీ నుంచి ఆయనే చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు సీట్లలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నర్సరావుపేట వైపే ఆయన మొగ్గు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం ఇంతవరకూ దీనిపై పెదవి విప్పలేదు. ఆయన నర్సరావుపేటకు మారితే సత్తెనపల్లిలో ఆయన ఆశీస్సులు ఉన్నవారికే సీటు లభించే అవకాశం ఉందని అంటున్నారు. చలపతి విద్యా సంస్ధల అధినేత, మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు ఇక్కడ టీడీపీ నుంచి తెరపైకి రావచ్చునని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ కోడెల సత్తెనపల్లిలోనే కొనసాగితే నర్సరావుపేటలో కొత్త అభ్యర్థి రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. పోయినసారి నర్సరావుపేటలో బీజేపీ తరఫున పోటీ చేసిన వెంకట్రావు టీడీపీలోకి వచ్చి టికెట్‌ కోసం ప్రయత్నం చేయవచ్చునని అంటున్నారు. సత్తెనపల్లిలో వైసీపీ తరఫున గతంలో అంబటి రాంబాబు పోటీ చేశారు. ఈసారి కూడా ఆయనే పోటీ చేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. నర్సరావుపేటలో వైసీపీ తరఫున సిటింగ్‌ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన కు కాసు కుటుంబం నుంచి పోటీ ఎదురవుతోంది. మాజీ మం త్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు మహేష్‌ రెడ్డిని గురజాల ఇన్‌చార్జిగా నియమించినా నర్సరావుపేటపైనే ఆసక్తితో ఉన్నారు.
 
 
లోక్‌సభ చిత్రం...
పెద్ద జిల్లా అయిన గుంటూరులో మూడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. మూడుచోట్లా టీడీపీ ఎంపీలే ఉన్నారు. నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు వయో భారంతో ఈసారి పోటీ చేయకపోవచ్చునని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ, ప్రస్తుతం గుంటూరు -2 ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డి తాను ఈసారి అక్కడ పోటీ చేయాలనుకొంటున్నానని అందరితో చెబుతున్నారు. కానీ, ఇతర ప్రత్యమ్నాయాల కోసం కూడా టీడీపీ అధిష్ఠానం అన్వేషిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ వస్తే ఆయనకు ఈ స్థానాన్ని కేటాయించాలని భావించినప్పటికీ... ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖరారు కావడంతో అన్ని రకాల ఊహాగానాలకు తెరపడింది. వైసీపీ నుంచి ఈ సీటు కోసం మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరు కూడా ప్రచారంలో ఉంది.
 
 
సీనియర్ల సీట్లలో అధికార పార్టీలో స్పష్టత
 
టీడీపీ సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లలో అధికార పార్టీలో స్పష్టత వ్యక్తమవుతోంది. మంత్రి పత్తిపాటి పుల్లారావు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు. ఆయనపై పోయినసారి వైసీపీ నుంచి మర్రి రాజశేఖర్‌ పోటీ చేశారు. ఇంకా మెరుగైన అభ్యర్థి కోసం ఆ పార్టీ అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు. ఎస్సీ రిజర్వుడు సీటు వేమూరు నుంచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచే మళ్లీ పోటీ చేయనున్నారు. ఆయనపై పోయినసారి వైసీపీ నుంచి మేరుగ నాగార్జున పోటీ చేశారు. ఈసారి కూడా తానే పోటీ చేయాలని ఆయన చురుగ్గా తిరుగుతున్నా ఆ పార్టీలో టికెట్‌ కోసం పోటీ పెరిగింది.
 
పొన్నూరు టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర మరోసారి అదే సీటు నుంచి పోటీ చేయనున్నారు. ఆయనపై పోయిన ఎన్నికల్లో వైసీపీ నుంచి రావి వెంకట రమణ పోటీ చేశారు. ఆయనే మళ్లీ పోటీకి గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.
 
తెనాలి నుంచి టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ మరోసారి పోటీ చేయడం ఖాయమేనని అంటున్నారు. ఆయనపై పోయినసారి వైసీపీ నుంచి అన్నాబత్తుని శివ కుమార్‌ పోటీ చేశారు. ఈసారి కూడా ఆయన అదే పార్టీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. తెనాలికి చెందిన మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భవిష్యత్‌ వైఖరి ఆసక్తి కలిగిస్తోంది. ఆయన ప్రస్తుతం కాంగ్రె్‌సలో ఉన్నారు. ఆయన అదే పార్టీలో కొనసాగుతారా లేక మరేదైనా పార్టీలో చేరతారా అన్నదానిపై భిన్న ప్రచారాలు వినిపిస్తున్నాయి. ఆయన ఏదైనా పార్టీలో చేరితే ఆ ప్రభావం ఆ పార్టీ అభ్యర్థి ఎంపికపై పడే అవకాశం ఉంది. గురజాల నియోజకవర్గంలో సిటింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మరోసారి పోటీ చేయనున్నారు. ఆయనపై పోటీకి వైసీపీ నాయకత్వం కాసు మహేశ్‌ రెడ్డిని ఎంపిక చేసింది. ఈ నియోజకవర్గంలో తిరుగుతూనే మహేశ్‌ అటు నర్సరావుపేటలో కూడా ఒక కాలు పెట్టి ప్రయత్నం చేసుకొంటున్నారని ప్రచారం జరుగుతోంది.
 
పెదకూరపాడులో టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ మళ్లీ పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి ఈ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కావేటి మనోహర్‌ నాయుడు ఉన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలోకి వస్తే ఈ సీటు ఇస్తామని ఆ పార్టీ నాయకత్వం ఆఫర్‌ ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా నియమితులయ్యారు. ఆయన రాక కుదరదు కాబట్టి... ఇంకా మెరుగైన అభ్యర్థి ఎవరైనా దొరుకుతారా అని వైసీపీ నాయకత్వం అన్వేషిస్తోంది. వినుకొండలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, సిటింగ్‌ ఎమ్మె ల్యే జీవీ ఆంజనేయులు మళ్లీ పోటీ చేయనున్నారు. వైసీపీ తరఫున బొల్లా బ్రహ్మనాయుడు పోటీ చేసే అవకాశం ఉంది. ఆయనే నియోజకవర్గ పార్టీ వ్యవహారాలు చూసుకొంటున్నారు. రేపల్లెలో టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మళ్లీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనపై వైసీపీ నుంచి మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయన ఇటీవల చురుగ్గా తిరుగుతున్నారు. రాజధాని నియోజకవర్గం తాడికొండ (ఎస్సీ రిజర్వుడు)కు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ నుంచి ఆయనే మళ్లీ పోటీ చేయనున్నారు.
 
 
బాపట్లకు ఎవరు?
బాపట్ల అసెంబ్లీ సీటు అభ్యర్థి విషయంలో కూడా టీడీపీలో స్పష్టత రాలేదు. ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ఇక్కడ నుంచి పోటీ చేయాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఆయన కుమారునికి సీటు అడుగుతున్నారు. కుమారుని బదులు ఆయనకే ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని నేతలు అంటున్నారు. తాజాగా నరేంద్ర వర్మ రంగంలోకి వచ్చి టికెట్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారు. వైసీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే కోన రఘుపతి మళ్లీ ఇక్కడ పోటీ చేయడం ఖాయం. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల సీటుపై కూడా టీడీపీ స్పష్టతకు రాలేదు. అక్కడ స్థానిక నేతలు మధు, చలమారెడ్డి ఇద్దరూ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరూ గతంలో పోటీ చేశారు. గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఇక్కడకు వస్తే బలమైన అభ్యర్థి అవుతారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
 
gn.gif 
Link to comment
Share on other sites

కన్నా వైసీపీలోకి వచ్చుంటే పరిస్థితి ఇదీ..!
14-05-2018 09:59:00
 
636618887401964089.jpg
గుంటూరు: ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలోకి వస్తారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ పుకార్లు కాస్త దాదాపు నిజమయ్యాయి కూడా. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్న సమయంలో ఢిల్లీ నుంచి ఫోన్లు రావడంతో క్షణాల్లో మొత్తం కథ మారిపోయింది.! పార్టీలో తగిన గుర్తింపుతో పాటు పదవి ఇస్తామని బీజేపీ అధిష్ఠానం హామీ మేరకు కన్నా బీజేపీలోనే ఉండిపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన్ను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి వరించింది.
 
 
ఇవన్నీ అటుంచితే.. ఒక వేళ కన్నా లక్ష్మీ నారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకోనుంటే పరిస్థితేంటి..? ఆయన్ను ఎక్కడ్నుంచి బరిలోకి దింపేవారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
 
 
పెదకూరపాడులో టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ మళ్లీ పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి ఈ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కావేటి మనోహర్‌ నాయుడు ఉన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలోకి వస్తే ఈ సీటు ఇస్తామని ఆ పార్టీ నాయకత్వం ఆఫర్‌ ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా నియమితులయ్యారు. ఆయన రాక కుదరదు కాబట్టి... ఇంకా మెరుగైన అభ్యర్థి ఎవరైనా దొరుకుతారా అని వైసీపీ నాయకత్వం అన్వేషిస్తోంది. వినుకొండలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, సిటింగ్‌ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మళ్లీ పోటీ చేయనున్నారు.
 
వైసీపీ తరఫున బొల్లా బ్రహ్మనాయుడు పోటీ చేసే అవకాశం ఉంది. ఆయనే నియోజకవర్గ పార్టీ వ్యవహారాలు చూసుకొంటున్నారు. రేపల్లెలో టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మళ్లీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనపై వైసీపీ నుంచి మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయన ఇటీవల చురుగ్గా తిరుగుతున్నారు. రాజధాని నియోజకవర్గం తాడికొండ (ఎస్సీ రిజర్వుడు)కు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ నుంచి ఆయనే మళ్లీ పోటీ చేయనున్నారు.
 
కాగా.. గత ఎన్నికల్లో సాధించిన పట్టును ఈసారీ నిలబెట్టుకునేందుకు టీడీపీ... బలం పుంజుకోవాలన్న లక్ష్యంతో వైసీపీ ‘అభ్యర్థి వ్యూహాలను’ రచిస్తున్నాయి. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు రాజకీయంగా పట్టు సాధించి ఉండటం ఆ పార్టీకి కలిసి వస్తోంది. ఆ స్థాయిలో దీటైన నేతలు వైసీపీకి లేరు. దీనితో మంచి అభ్యర్థుల కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. సిటింగ్‌ ఎమ్మెల్యేలు కొందరిపై వస్తున్న ఆరోపణలను ఆసరాగా వారిని దెబ్బతీయాలన్న ప్రయత్నంలో వైసీపీ ఉంది
Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

Guntur West - Tulasi R Prabhu  jana sena o unnaru vallu ippuduu

Already jumped, ufff... 

PRP lo munigina veellaku telisi raada?

What they can do with single community party JS? Kaps lo 10% tappisthe no one else will vote to PK/Janasena.

Link to comment
Share on other sites

39 minutes ago, RKumar said:

Already jumped, ufff... 

PRP lo munigina veellaku telisi raada?

What they can do with single community party JS? Kaps lo 10% tappisthe no one else will vote to PK/Janasena.

seat ivvaleduga appude rala

Link to comment
Share on other sites

7 minutes ago, koushik_k said:

emti problem rayapati ki.. evadanna m.p seat oddu antada.. next probable candidates evaru..   personal ga modugula ki ivvatam naku istam ledu. 

7 minutes ago, koushik_k said:

emti problem rayapati ki.. evadanna m.p seat oddu antada.. next probable candidates evaru..   personal ga modugula ki ivvatam naku istam ledu. 

rayapati age tho tiragalekapothunadu,koduku antha gattivadu kadu Sattenapalli seat leda guntur mla istharu emo

Link to comment
Share on other sites

41 minutes ago, Saichandra said:

Chandu sambasiva rao vestaru ani talk bro city nundi edaina seat??

He can't spend any money against Lella Appi Reddy (YSRCP) & Tulasi (JSP) telipothadu.

Link to comment
Share on other sites

3 minutes ago, Gunner said:

Bapatla - Annam Satish ki waste... Kaps votes aelanu JS ki pothai.... 

బాపట్లకు ఎవరు?
బాపట్ల అసెంబ్లీ సీటు అభ్యర్థి విషయంలో కూడా టీడీపీలో స్పష్టత రాలేదు. ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ఇక్కడ నుంచి పోటీ చేయాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఆయన కుమారునికి సీటు అడుగుతున్నారు. కుమారుని బదులు ఆయనకే ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని నేతలు అంటున్నారు. తాజాగా నరేంద్ర వర్మ రంగంలోకి వచ్చి టికెట్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారు. వైసీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే కోన రఘుపతి మళ్లీ ఇక్కడ పోటీ చేయడం ఖాయం. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల సీటుపై కూడా టీడీపీ స్పష్టతకు రాలేదు. అక్కడ స్థానిక నేతలు మధు, చలమారెడ్డి ఇద్దరూ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరూ గతంలో పోటీ చేశారు. గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఇక్కడకు వస్తే బలమైన అభ్యర్థి అవుతారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
 
Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

rayapati age tho tiragalekapothunadu,koduku antha gattivadu kadu Sattenapalli seat leda guntur mla istharu emo

damn it ..  NRI kams evarokallu untaruga VIJ seat expect chesina vallu. vallaki ivvatam better.  NRT/Nellore/Araku/Ongole candidates review cheyali.. Rest all seats bagane unnaru manollu. 

Link to comment
Share on other sites

Just now, koushik_k said:

damn it ..  NRI kams evarokallu untaruga VIJ seat expect chesina vallu. vallaki ivvatam better.  NRT/Nellore/Araku/Ongole candidates review cheyali.. Rest all seats bagane unnaru manollu. 

NRT MP easy seat

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:
బాపట్లకు ఎవరు?
బాపట్ల అసెంబ్లీ సీటు అభ్యర్థి విషయంలో కూడా టీడీపీలో స్పష్టత రాలేదు. ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ఇక్కడ నుంచి పోటీ చేయాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఆయన కుమారునికి సీటు అడుగుతున్నారు. కుమారుని బదులు ఆయనకే ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని నేతలు అంటున్నారు. తాజాగా నరేంద్ర వర్మ రంగంలోకి వచ్చి టికెట్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారు. వైసీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే కోన రఘుపతి మళ్లీ ఇక్కడ పోటీ చేయడం ఖాయం. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల సీటుపై కూడా టీడీపీ స్పష్టతకు రాలేదు. అక్కడ స్థానిక నేతలు మధు, చలమారెడ్డి ఇద్దరూ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరూ గతంలో పోటీ చేశారు. గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఇక్కడకు వస్తే బలమైన అభ్యర్థి అవుతారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
 

Bapatla lo Kapu/Reddy votes manaku Padavu aelanu... BC best...

Guntur-2 Brahmin, Guntur-1 vysya best.. dist wide impact vuntundi...

Link to comment
Share on other sites

Guest Urban Legend

any political discussion is incomplete without caste,

inka caste chusey vote vestunnaru ga candidates ki unless there is some wave 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...