Jump to content

TDP

sonykongara

Recommended Posts

ఆ ప్లకార్డులను మోదీకీ చూపించండి: ఏపీ ఎంపీలతో ఖర్గే

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఈరోజు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని లబోదిబోమంటున్న టీడీపీ నేడు లోక్‌సభలో నిరసన వ్యక్తం చేసింది. సభ జరుగుతున్న సమయంలో టీడీపీ ఎంపీలు ప్రకార్డులు చేత పట్టుకుని కాంగ్రెస్ వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నినాదాలు చేశారు. ఇది కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఇరు పార్టీల ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. మల్లికార్జున ఖర్గే ప్రసంగం సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను అప్రతిష్ఠ పాలు చేసేందుకు బీజేపీనే ఇలా టీడీపీ ఎంపీలతో ఆందోళన చేయిస్తోందని, బీజేపీ తన తప్పును కాంగ్రెస్‌పైకి నెట్టేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్-బీజేపీ ఎంపీల మధ్య కూడా చిన్నపాటి వాగ్వాదం జరిగింది.
 
Link to comment
Share on other sites

టీడీపీ ఎంపీల అభ్యర్థనను తోసిపుచ్చిన కేంద్రం .

ఢిల్లీ: లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ఆందోళనలు ఉధృతం చేశారు. ఉదయం నుంచి పట్టువీడకుండా సభను స్తంభింపజేశారు. ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలతో సభను హోరెత్తించారు. విభజన హామీలపై సభలో ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టారు. అలాగే హామీల అమలుకు కాలపరిమితి కూడా నియమించాలని డిమాండ్ చేశారు. అయితే ఎంపీల అభ్యర్థనను కేంద్రమంత్రులు తోసిపుచ్చారు. సభలో ప్రకటన చేస్తే మిగతా పార్టీలు కూడా ఇలానే ఆందోళన చేస్తాయని దాటవేత ధోరణితో వ్యహరించారు. ఆర్థికశాఖ కార్యదర్శిని పిలిపించి మాట్లాడతామని కేంద్రమంత్రులు చెప్పుకొచ్చారు. కానీ దీనికి ఎంపీలు అంగీకరించలేదు. హామీల వారీగా ప్రకటన చేస్తేనే ప్రజలు నమ్ముతారని, టెక్నికల్ అంశాలను తెరమీదకు తెస్తే ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని ఎంపీలు కుండబద్ధలు కొట్టినట్లుగా తెగేసిచెప్పారు. ఎంపీల ఆందోళనతో గందరగోళం నెలకోవడంతో సభ మరోసారి వాయిదా పడింది.

Link to comment
Share on other sites

ఏపీకి అన్యాయం నిజమే.. మిత్రులను నట్టేట ముంచొద్దు: కేంద్రంపై కూటమి ఎంపీ ఫైర్

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న టీడీపీకి లోక్‌సభలో మరో అండ దొరికింది. ఏపీకి న్యాయం చేయాలంటూ ఒంటరిగా పోరాడుతున్న టీడీపీ ఎంపీలకు మరో పార్టీ అండగా నిలిచింది. విపక్షం నుంచి కాదు.. ఎన్డీయే కూటమి నుంచే. బీజేపీ తీరుపై ఆగ్రహంతో ఉన్న శివసేన ఇప్పటికే కటీఫ్ చెప్పేసింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కుండబద్దలు కొట్టింది. ఇప్పుడు బీజేపీ మిత్ర పక్షం శిరోమణి అకాలీదళ్ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ పార్టీ ఎంపీ నరేష్ గుజ్రాల్ టీడీపీకి అండగా నిలిచారు. టీడీపీ ఆరోపణల్లో నిజం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు పలు వరాలను ఇదే సభలో ఇచ్చారని, ఇప్పుడు వాటిని ఇదే సభలో తిరస్కరిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో తాము టీడీపీతోనే ఉంటామని స్పష్టం చేశారు. తమకు అన్యాయం జరిగిందని టీడీపీ, ఏపీ ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
 
మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి మిత్ర ధర్మాన్ని తెలుసుకోవాలని నరేష్ గుజ్రాల్ సూచించారు. కూటమిలో ఆవేశకావేషాలకు చోటు లేదన్నారు. వాజ్‌పేయి ఎలా అయితే కూటమిని నడిపారే తెలుసుకోవాలని సూచించారు. తాను ఏ ఒక్క వ్యక్తినో ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, మొత్తం బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు.
 
ఏపీ పుట్టడమే భారీ రెవెన్యూ లోటుతో పుట్టిందని, ఆ రాష్ట్రానికి ఎంతో చేయాల్సి ఉందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఉమ్మడి ఏపీలో మౌలిక వసతులు మొత్తం హైదరాబాద్‌కే పరిమితం కావడంతో తెలంగాణకు భారీ రెవెన్యూ మిగులు ఏర్పడిందని వివరించారు. ఈ కారణంగానే తాను టీడీపీకి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీల్లో సగమైనా నెరవేరిస్తే బాగుండేదని పేర్కొన్నారు. బడ్జెట్‌లో ఏపీని ఉద్దేశపూర్వకంగానే జైట్లీ విస్మరించారని తాను భావించడం లేదని, దీని వెనక చాలా జరిగి ఉంటుందని అన్నారు. కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ కూటమి నుంచి విడిపోతుందా? అన్న ప్రశ్నకు నరేష్ గుజ్రాల్ మాట్లాడుతూ.. తానలా భావించడం లేదన్నారు. అది దేశానికి, ఎన్డీయేకు, ఏపీకి కూడా మంచిది కాదన్నారు. కాబట్టి విభజన హామీలు నెరవేర్చేందుకు బీజేపీ ముందుకు రావాలని కోరారు.
Link to comment
Share on other sites

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయంపై పార్లమెంట్ దద్ధరిల్లింది. టీడీపీ ఎంపీల నిరసనలతో లోక్‌సభ మూడుసార్లు వాయిదా పడింది. సమావేశాల ప్రారంభానికి ముందు, గాంధీ విగ్రహం ఎదుట ఫ్లకార్డులతో ఆందోళన చేసిన ఎంపీలు.. ఆ తర్వాత సభ లోపల కూడా అదే స్థాయిలో నిరసనలు కొనసాగించారు. మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు నిలుచున్నప్పుడు టీడీపీ ఎంపీలు ఆందోళన మరింత ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ ఎంపీల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఖర్గేకు అవకాశం ఇవ్వని టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీ సాక్షిగా పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగించారు. అదే సమయంలో మోదీ పక్కన రాజ్‌నాథ్ సింగ్ ఉండగా అరుణ్ జైట్లీ కూడా సభకు వచ్చారు. ఇదే అంశంపై రాజ్యసభ కూడా మూడు సార్లు వాయిదా పడింది.

Good going TDP

Link to comment
Share on other sites

13 minutes ago, koushik_k said:

ఆ ప్లకార్డులను మోదీకీ చూపించండి: ఏపీ ఎంపీలతో ఖర్గే

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఈరోజు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని లబోదిబోమంటున్న టీడీపీ నేడు లోక్‌సభలో నిరసన వ్యక్తం చేసింది. సభ జరుగుతున్న సమయంలో టీడీపీ ఎంపీలు ప్రకార్డులు చేత పట్టుకుని కాంగ్రెస్ వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నినాదాలు చేశారు. ఇది కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఇరు పార్టీల ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. మల్లికార్జున ఖర్గే ప్రసంగం సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను అప్రతిష్ఠ పాలు చేసేందుకు బీజేపీనే ఇలా టీడీపీ ఎంపీలతో ఆందోళన చేయిస్తోందని, బీజేపీ తన తప్పును కాంగ్రెస్‌పైకి నెట్టేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్-బీజేపీ ఎంపీల మధ్య కూడా చిన్నపాటి వాగ్వాదం జరిగింది.
 
Akkada jarigindhi okati article lo rasindhi inko vidham ga..

Karge matladuthu Modi ee chupisthunnaru ee drama ani annadu, apudu TDP MP's tagulukunnaru Karge gadini

Link to comment
Share on other sites

4 minutes ago, mahesh1987 said:

asalu comedy enti ante kontha mandi ippatiki telangana new state vallaki problems vunnay ani anukuntunnaru north batch AP existing state ani anukuntunnaru correct matter ardam katalledu vallaki

Thats because no one cares abt other states.. Manaki em telsu north east lo em jaruguthundo ..   

Link to comment
Share on other sites

ఏదైనా ఉంటే సీఎంతో మాట్లాడండి: సుజనా చౌదరి

పార్లమెంట్‌ లాబీలో టీటీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరితో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడారు. పార్లమెంట్‌లో నిరసనలు ఆపాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను పరిష్కరించేవరకు నిరసనలు ఆపేది లేదని సుజనా స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని ఆయన జైట్లీకి తెలిపారు.
 
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఫ్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. ఏపీకి న్యాయం చేయాలని, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
Link to comment
Share on other sites

10 minutes ago, koushik_k said:

Thats because no one cares abt other states.. Manaki em telsu north east lo em jaruguthundo ..   

northeast lo em jarugutundo telsukovalsina pani ledu  aa roju paliment lo antha godava enduku jarigindo telusukunte saripotandi

Link to comment
Share on other sites

1 hour ago, nbk@myHeart said:

It's not fair to corner congress now... they are not in power... we should gight only with bjp.... main culprit is modi..... jaitley/modi/amithsha lani round cheyyaalsindi poyi kharge gaadini addukunte emosthadi boodida

Annai fair unfair lanti words manam asala use cheykudadu...Ave unte division ala ayyedi kadu ivala ila undevallam kadu...Congress is equally responsible in this

Link to comment
Share on other sites

57 minutes ago, subash.c said:

Annai fair unfair lanti words manam asala use cheykudadu...Ave unte division ala ayyedi kadu ivala ila undevallam kadu...Congress is equally responsible in this

Adanthaa gatham.... congress manaki Sachina snake... vaallu manaki potee lo ne leru state lo.... bjp ki g lo kaalaali ante manaki parliament lo congress support cheyyaali which will definitely irritate Modi....

Link to comment
Share on other sites

7 minutes ago, vinayak said:

If congress have concern of AP they should fight along with TDP

They are least bothered now as they don't have existance in AP.... we should try to get their support in house that bjp will be in trouble.... if we still continuing in fighting with congress then bjp will enjoy the popcorn show

Link to comment
Share on other sites

It is congress responsibility to fight for AP. Why Congress high command not asking BJP to support AP. Why KVP only doing acting RS?

Shameless parties both Congress & BJP.

Most Disgusting party in this whole episode is YSRCP. Good for nothing. Can't fight for AP People. Never Questions BJP/Modi in these 4 Years. 

Ilaanti YSRCP party ki vote vese vaallani chepputho kottali.

Link to comment
Share on other sites

2 hours ago, nbk@myHeart said:

It's not fair to corner congress now... they are not in power... we should gight only with bjp.... main culprit is modi..... jaitley/modi/amithsha lani round cheyyaalsindi poyi kharge gaadini addukunte emosthadi boodida

It’s not fair enti Brother - aaa thuglak gaallu divide chesthey eee piccha thuglak gaallu support chesaaru - deeni lo vaalla ki kooda bhagam vundi - will they stop claiming the advantage in TG state ?? Pakodi gaallu 

Link to comment
Share on other sites

27 minutes ago, DVSDev said:

It’s not fair enti Brother - aaa thuglak gaallu divide chesthey eee piccha thuglak gaallu support chesaaru - deeni lo vaalla ki kooda bhagam vundi - will they stop claiming the advantage in TG state ?? Pakodi gaallu 

Ipudu issues resolve chese state lo undi bjp not congress... if we still fight with congress then it's waste of time... target is modi and bjp.... rest all lite for now

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...