Jump to content

NTR Anna canteens


sonykongara

Recommended Posts

  • Replies 559
  • Created
  • Last Reply
Guest Urban Legend

Development of Anna Canteens:

The Cabinet has approved the construction of 203 Anna Canteens in 71 Urban Local Modies and one canteen at Undavalli under CRDA region which will have an estimated cost of ₹80 crores.

The respective collectors will have the responsibility of handing over the sites to the Urban Local Modies (ULBs) in their districts. The Cabinet also approved on procuring catering services from reputed NGOs, trusts and societies.

This will be facilitated with the help of a government subsidy of ₹131 crores out of a total estimated cost of ₹164 crores for all the 203 SLBs. The Cabinet decided to fix the beneficiary contribution at ₹5 each for breakfast, lunch and dinner totalling to Rs.15 each day as the beneficiary contribution.
 

Link to comment
Share on other sites

Guest Urban Legend

చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి పట్టణంలో ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో పేదలకోసం ప్రభుత్వం నిర్మించనున్న అన్న క్యాంటీన్ భవన నిర్మాణ పనులకు శాసన సభ్యులు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి భూమి పూజ చేసారు. ఈ కార్యక్రమంలోపురపాలక సంఘం చైర్మన్ పార్థసారధి, కమిషనర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Ddipk4CVMAAxEke.jpg

Link to comment
Share on other sites

రూ.3కు అల్పాహారం.. రూ.5కే భోజనం
కడప, రాయచోటి, రాజంపేటలో అన్న క్యాంటీన్లు!
ప్రొద్దుటూరులో స్థల సమస్య
kdp-gen5a.jpg

ప్రకాష్‌నగర్‌ (జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే : జిల్లాలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ప్రస్తుతానికి కడప, రాయచోటి, ప్రొద్దుటూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లో వీటిని  ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సుమారు అన్ని మున్సిపాలిటీల్లో ఈ నెలలో ప్రారంభించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో సుమారు రూ.200 కోట్లు అన్న క్యాంటీన్ల నిర్వహణకు కేటాయించారు. జిల్లా యంత్రాంగం ఈ నెల మొదటి వారంలోనే ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. తెదేపా ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రూ.5కే రుచికరమైన భోజనం అందించేందుకు రంగం సిద్ధం చేసింది.
* కడపలో నాలుగు ప్రాంతాల్లో.. నగరంలో కూలీలు, వివిధ పనులపై నగరానికి వచ్చే జనాలు, నిరుద్యోగులు, చిరుద్యోగులకు తక్కువ ధరతో నాణ్యమైన భోజనం, అల్పాహారం అందించేందుకు కడప నగరంలో ఏకంగా నాలుగు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. పాత మున్సిపల్‌ కార్యాలయం, పాత   బస్టాండ్‌, నగరపాలక సంస్థ కార్యాలయ సమీపం, జిల్లా పరిషత్‌ కార్యాలయ ప్రాంగణాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటికి అనుసంధానంగా పాత రిమ్స్‌ ఆవరణలో వంటశాలను నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచే వంట తయారు చేసి ఈ నాలుగు ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. ఎప్పుడు ప్రారంభిస్తారనేది సంశయంగా మారింది. నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా సీఎం కడప జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో వీటిని ప్రారంభిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
* కడప నగరానికి నిత్యం వేలాది మంది జిల్లా నలుమూలల నుంచి వివిధ పనులపై  తరలివస్తుంటారు. మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి హోటళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ కూడా రూ.40 నుంచి రూ.60 వరకు భోజనానికి చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్లు పేదలకు వరంగా మారనున్నాయి. రూ.5కే భోజనం అందిస్తారు. అందులో పప్పు, సాంబారు, మజ్జిగ ఉంటాయి. అల్పాహారంగా కేవలం రూ.3కే ఉప్మా, ఇడ్లీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని వడ్డిస్తారు.
* రాజంపేటలో క్యాంటీన్ల ఏర్పాటు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంకా భవనం ఎంపిక కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాయచోటిలో రెండు క్యాంటీన్ల ఏర్పాటుకు  ప్రతిపాదనలున్నా ప్రస్తుతం ఒక్కదానికే అనుమతి ఉంది. అది కూడా భవనం నిర్మాణ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు పట్టణంలో మాత్రం స్థలం ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఇక్కడ స్థల ఎంపిక, నిర్మాణం పరంగా అభ్యంతరాలు వస్తున్నాయి. పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద కడప జిల్లా వ్యాప్తంగా మరో త్వరలో క్యాంటీన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

Guest Urban Legend
8 minutes ago, Bezawadabullo said:

emanna antey annam antaaru... ee thread DEC lo.... inka poorthi avvaledhu ee project ani prajalaki cheppadanikaaa :kngt:

dabbu yedhi state ki ...

veetiki kuda el manage chestunnaro kaani hatsoff 

Link to comment
Share on other sites

365 రోజులూ అన్న క్యాంటీన్లు
రూ.15కే మూడు పూటలా ఆహారం
ఏటా ఖర్చు రూ.131 కోట్లు
పనితీరు పరిశీలనకు వాస్తవిక సమీక్ష వ్యవస్థ
వారం రోజుల్లో 40 చోట్ల ప్రాథమికంగా ప్రారంభం
మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
6ap-main3a.jpg

ఈనాడు, అమరావతి: పేదల క్షుద్బాధను తీర్చేందుకు త్వరలో ప్రారంభించే అన్న క్యాంటీన్లు ఏడాదిలో 365 రోజులూ పని చేసేలా ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. పూటకు కనీసం 350 మందికి అల్పాహారం/ఆహారం అందించేలా రూపొందిస్తున్న వీటి నిర్వహణ పరిశీలనకు వాస్తవిక సమీక్ష వ్యవస్థ (రియల్‌ టైం మోనిటరింగ్‌ సిస్టం)ను ప్రవేశపెడుతున్నారు. 50వేల జనాభా పైబడిన 71 పట్టణాల్లో వీటిని 203చోట్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.  మొదటి విడతగా 40 క్యాంటీన్లను వారంరోజుల్లో ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకటి, రెండు నెలల్లో మొత్తం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో తమిళనాడు, కర్ణాటక తర్వాత పేదలకు ప్రత్యేకంగా వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపి రూ.15కే అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.131 కోట్లు ఖర్చు చేయనుంది. తగిన సదుపాయాలతో ఒక్కో క్యాంటీన్‌ నిర్మాణానికి రూ.36 లక్షలు చొప్పున మరో రూ.80 కోట్లు వెచ్చిస్తున్నారు. 750 చదరపు అడుగుల విస్తీర్ణం (ఎస్‌ఎఫ్‌టీ)లో చేపట్టే భవనాల్లో తాగునీటి సదుపాయం, విద్యుత్తు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాటు, అంతర్జాలం (ఇంటర్నెట్‌), ఎల్‌సీడీలు, సీసీ టీవీలు, చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయనున్నారు. ఆధార్‌ అనుసంధానించి ప్రజల నుంచి బయోమెట్రిక్‌ తీసుకొని ఎలక్ట్రానిక్‌ విధానంలో టోకెన్లు జారీ చేస్తారు. ఆహారం తయారీ, పంపిణీ టెండర్‌ను అక్షయపాత్ర దక్కించుకుంది. వాస్తవిక సమీక్ష వ్యవస్థ(ఆర్టీఎం)తో వీటి పనితీరును సచివాలయం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు గమనించవచ్చు. ఆహార పదార్థాల నాణ్యత నుంచి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేలా ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సచివాలయం సమీపంలోని మందడం గ్రామంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీను విజయవంతంగా కొనసాగుతుంది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...