Jump to content

Mahanadi-Godavari-Penna-Palar


sonykongara

Recommended Posts

Eppatiki South Indian river linking projects take up chesthaaru BJP vaallu?

 

Godavari-Krishna CBN already complete chesadu last 3 years lo. 

 

Krishna (Godavari)-Penna ni ventane CBN initiate chesthe center might be forced to release funds early.

 

It will have huge impact in Rayalaseema-Palnadu-Prakasam-Nellore & Tamil Nadu state. Even some parts of Karnataka will also get benefited.

 

Mahanadi lo 400TMC ee samudram lo kalusthundi anedi correct kaadu, safer side orissa ala chepthundi. Inka chaala retlu water discharge vundi to sea.

Link to comment
Share on other sites

నాలుగు నదుల సంధానం!

మహానది, గోదారి, పెన్నా , పాలార్‌ అనుసంధానానికి అవకాశం

ఇప్పటికే కేంద్రానికి నివేదించిన ఆంధ్రప్రదేశ్‌

అందులో ఓ భాగమే గోదావరి పెన్నా నదుల అనుసంధానం

ఒకేలా ఉన్న కేంద్ర, రాష్ట్ర దృక్పథాలు

నిధుల సమీకరణకు కేంద్రం ఆసరాపై ఏపీ దృష్టి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, మధ్య కోస్తా జిల్లాలతో పాటు తమిళనాడులోనూ తీవ్ర కరవు పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాగునీటికీ తిప్పలు తప్పని దుస్థితి కనిపిస్తోంది. మరోవంక, ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రాలోన్లు వరదలు ముంచెత్తుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి ప్రాధాన్యమిస్తూ వీలైనంత త్వరగా చేపట్టాలని యోచిస్తుండగా.. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఈ మహత్తర ప్రణాళికను సుమారు రూ.5లక్షల కోట్ల అంచనా వ్యయంతో భుజాలకు ఎత్తుకోబోతున్నారు. ఈ క్రమంలో తొలుత ఉత్తరాదిన నదుల అనుసంధానం చేపట్టేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. గోదావరి-పెన్నా అనుసంధానం జాతీయ స్థాయిలో వివిధ ప్రతిపాదనల ఆధారంగా సిద్ధంచేసిన ఒక కొత్త సంధాన ప్రతిపాదనలో కలిసి ఉంది. మహానది -గోదావరి-పెన్నా- పాలార్‌లో భాగంగా ఇదొక అంతర్గత ప్రతిపాదనగా నిలవబోతోంది. ఏపీ ప్రభుత్వమూ అనుసంధాన ఫలాలపై పట్టుదలగా ఉన్నందున కేంద్ర విధానమూ కీలకమై...ఆర్థిక ఆసరా పొందగలిగితే ఇది వీలైనంత త్వరగా చేపట్టే అవకాశం ఉంది. గతం నుంచే రాష్ట్రం కేంద్ర సహకారం కోసం ప్రయత్నిస్తూ వస్తోంది.

ద్వీపకల్ప నదుల అనుసంధానానికి కేంద్రం వద్ద 8 ప్రతిపాదనలు ఉన్నాయి. జాతీయ జల అభివృద్ధి సంస్థ వీటిపై అధ్యయనం చేస్తోంది. గత మూడేళ్లుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నదుల అనుసంధానంపై జాతీయ జల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతూ వస్తున్నాయి.

ఆ ప్రతిపాదనలు ఇలా..

1 మహానది-గోదావరి సంధానం

2 గోదావరి(ఇచ్చంపల్లి)-కృష్ణా(నాగార్జునసాగర్‌) లింకు

3 గోదావరి(ఇచ్చంపల్లి)-కృష్ణా(పులిచింతల)సంధానం

4 గోదావరి(పోలవరం)-కృష్ణా(విజయవాడ) సంధానం

5 కృష్ణా(ఆలమట్టి)- పెన్నార్‌ అనుసంధానం

6 కృష్ణా(శ్రీశైలం)-పెన్నార్‌(ప్రొద్దుటూరు) సంధానం

7 కృష్ణా(నా.సాగర్‌)-పెన్నార్‌(సోమశిల) సంధానం

8 సోమశిల-గ్రాండ్‌ఆనికట్‌(తమిళనాడు) సంధానం.

* వీటిలో పట్టిసీమ ఎత్తిపోతల(పోలవరం పూర్తయ్యేలోపు) ద్వారా గోదావరి కృష్ణా అనుసంధానం చేపట్టారు. ఇప్పటికే 100టీఎంసీలకు పైగా నీటిని గోదావరి నుంచి కృష్ణమ్మకు తరలించారు. దిగువ కృష్ణాకు నీరే రాని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అనుసంధానం ఎంత ప్రయోజనకరమో కళ్లముందు అందరికీ కనిపిస్తోంది. కృష్ణా డెల్టాలో సాగు, తాగునీటి అవసరాలకు ఇదెంతో ఉపయోగకరంగా ఉంది.

కొత్త అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్‌ ఆసక్తి

వివాదరహిత నదుల అనుసంధాన యోచనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. తెలంగాణకు అభ్యంతరాలున్న వాటిని వదిలేసి తొలుత అంతర్గత అనుసంధానానికి పెద్దపీట వేయాలని యోచిస్తోంది. అదే సమయంలో పక్క రాష్ట్రాల అభ్యంతరాలు లేని మహానది-గోదావరి-పెన్నా- గ్రాండ్‌ ఆనకట్ట అనుసంధానంపై దృష్టి సారించాలని భావిస్తోంది. ఈ మేరకు గతేడాది కేంద్రానికి ఆంధ్రపదేశ్‌ లేఖ కూడా రాసింది.

* మహానది నుంచి గోదావరికి అక్కడి నుంచి కృష్ణా మీదుగా పెన్నాకు.. అక్కడి నుంచి తమిళనాడులోని పాలార్‌ నదికి నీటిని తీసుకువెళ్లాలని ప్రతిపాదించింది. దీనికి ఒడిశా, తమిళనాడులకు కూడా అభ్యంతరం లేదని- త్వరగా దీనిపై కసరత్తు చేసి ఆమోదం తెలిపి ఆర్థికంగా ఆసరా కల్పిస్తే మూడు రాష్ట్రాలు కలిపి చేపట్టడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందనే యోచనతో ఏపీ జలవనరులశాఖ అధికారులు కేంద్రానికి లేఖ రాశారు. లేని పక్షంలో గోదావరి పెన్నా అనుసంధానానికి అంతర్గతంగా తాము చేపట్టేందుకు అనుమతివ్వాలని- నదుల అనుసంధాన ప్రాజెక్టు నుంచి సాయమూ అందించాలనే దృక్పథంతో కొంత ప్రయత్నం సాగించారు.

మహానదిలో ఎన్‌ఐహెచ్‌ సర్వే..

మహానదిలో తగినంత నీరు లేదని, ఆ నీరు గోదావరికి మళ్లించేందుకు వీలుపడదని గతంలో ఒడిశా అభ్యంతరాలు చెప్పింది. దీంతో జాతీయ జల అభివృద్ధి సంస్థ మహానదిలో ఎన్ని మిగులు జలాలు ఉంటాయనేది లెక్కగట్టాలని రౌర్కెలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ(ఎన్‌ఐహెచ్‌)కి బాధ్యతలు అప్పగించింది. ఈ సంస్థ అధ్యయనం తర్వాత మహానదిలో 400టీఎంసీల కన్నా ఎక్కువే మిగులు జలాలున్నట్లు ఆ సంస్థ తేల్చింది. ఈ నేపథ్యంలోనే ఒడిశాలో 305, ఏపీ 1000 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వి ఈ నాలుగు నదుల అనుసంధానం చేపట్టవలసి ఉంటుంది. ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు ఇందుకు సుముఖమేనని ఏపీ అధికారులు కేంద్రానికి స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...