Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో ఫ్లాట్‌ అదిరింది!
09-01-2019 03:31:33
 
636826014939514156.jpg
 
 
 
 
 
 
 
 
 
 
 
  • సందర్శించి సంబరపడ్డ ఉద్యోగులు
తుళ్లూరు, జనవరి 8: రాజధాని అమరావతిలో నిర్మితమవుతున్న ఎన్జీవోస్‌, గ్రూపు డీ ఇళ్లను మంగళవారం వెలగపూడి సచివాలయం ఉద్యోగులు సందర్శించారు. తాము ఉండబోయే ఫ్లాట్లను చూసి మురిసిపోయారు. అద్భుతంగా నిర్మిస్తున్నారని కితాబిచ్చారు. సంవత్సరంలోపు ఇళ్ల ఫ్లాట్‌లు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, మహిళా సంఘం అధ్యక్షురాలు సులోచన ఆధ్వర్యంలో ఐదు బస్సుల్లో 250 మంది ఉద్యోగులు ఫ్లాట్లను సందర్శించారు. అనంతరం హైకోర్టు, ఎమ్మెల్యే, ఏఐఎస్ ల కోసం నిర్మిస్తున్న ఫ్లాట్లను కూడా వారు సందర్శించారు
Link to comment
Share on other sites

12న ఐకానిక్‌ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన!?
09-01-2019 03:25:01
 
636826011018264577.jpg
  • అమరావతిని, సంగమ ప్రదేశాన్ని కలపనున్న 6 వరుసల వంతెన
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పవిత్ర సంగమ ప్రదేశానికి అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్‌ బ్రిడ్జ్‌కు సీఎం చంద్రబాబు ఈ నెల 12న శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పవిత్ర సంగమం దగ్గర శంకుస్థాపన ఫలకాన్ని ఆ రోజు ఉదయం 10 గంటలకు సీఎం ఆవిష్కరించనున్నారు. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో నిర్మితమయ్యే ఈ వంతెన అమరావతిలోని ఉద్ధండరాయునిపాలెం నుంచి సంగమ ప్రదేశం వరకూ 3.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ వంతెన నిర్మాణ వ్యయం సుమారు రూ.1387 కోట్లు.
 
 
కేబుల్‌పై అరకిలోమీటరు!
రాజధాని శోభను మరింత ఇనుమడింపజేయగల ఈ ఐకానిక్‌ బ్రిడ్జ్‌కు అనేక విశిష్ఠతలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమై, ఈ ప్రాంతంలోనే పురుడుపోసుకున్న కూచిపూడి నృత్యంలోని అభివాదముద్రను తలపించేలా డిజైన్‌ రూపొందించడం విశేషం. దీంతోపాటు రాష్ట్రంలోనే తొలిసారిగా కేబుల్‌ ఆధారంగా నదిపై నిర్మితమవుతున్న వంతెనగా సైతం ఇది నిలవనుంది. నది మధ్యభాగంలో సుమారు 480 మీటర్ల పొడవునా ఈ వంతెన కేబుల్‌పై ఆధారపడి ఉంటుంది.
Link to comment
Share on other sites

హరిత వనం..  అందాల తోరణం!

 

300 ఎకరాల్లో ఏర్పాటవుతున్న శాఖమూరు పార్కు
గాంధీజీ, అంబేడ్కర్‌ల స్మృతివనాలు సహా వివిధ నిర్మాణాలు
రాజధానికే ప్రత్యేక ఆకర్షణ
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో పలు ప్రాజెక్టులు

8ap-story3a_2.jpg

జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌లను నిత్యం స్మరించుకునేలా రెండు స్మృతివనాలు..! మధ్యలో పెద్ద జలాశయం! ఎటుచూసినా రంగురంగుల ఫౌంటెయిన్లు.. భారతీయ హస్త కళాకృతులకు నిలయంగా క్రాఫ్ట్స్‌బజార్‌.. గ్రామీణ వృత్తుల్ని, జీవన విధానాన్ని కళ్లకు కట్టే క్రాఫ్ట్స్‌ విలేజ్‌. మరోపక్క ఐదు నక్షత్రాల హోటళ్లు, వెల్‌నెస్‌ సెంటర్‌, పట్టాల్లేకుండా నడిచే మ్యాగ్నెటిక్‌ ట్రైన్‌, స్నోవరల్డ్‌, వాటర్‌స్పోర్ట్స్‌... ఇలా పిల్లలనుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునేలా, విశేషాల సమాహారంగా రాజధాని అమరావతిలో 300 ఎకరాల్లో రీజినల్‌ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. పరిపాలన నగరం ఉత్తరాన కృష్ణా తీరం నుంచి మొదలైతే, దీనికి కొనసాగింపుగా నిర్మిస్తున్న న్యాయనగరానికి చివర్లో దక్షిణాన శాఖమూరు పార్కు ఏర్పాటవుతోంది. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో పార్కు అభివృద్ధి చేపట్టారు. పార్కులో ఏర్పాటుచేసే వివిధ సదుపాయాలను వేర్వేరు ప్రాజెక్టులుగా విభజించారు. కొన్ని ఏడీసీ స్వయంగా చేపడుతుండగా.. మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం సివిల్‌ పనులు జరుగుతున్నాయి.

నాలుగు రోడ్ల మధ్యలో..
పార్కు వైశాల్యం 300 ఎకరాలు. పార్కుకు నాలుగువైపులా ఇ8, ఇ9, ఎన్‌11, ఎన్‌12 రహదారులు వెళుతున్నాయి. పార్కు చుట్టుకొలత 4.4 కి.మీ.లు. పార్కు చుట్టూ చెట్లుంటాయి. జాగింగ్‌ట్రాక్‌ ఏర్పాటుచేస్తున్నారు. పార్కు మధ్యలో 50 ఎకరాల్లో జలాశయాన్ని అభివృద్ధి చేస్తారు. జలాశయంలో బోటింగ్‌, ఎత్తైన ఫౌంటెయిన్‌, లేజర్‌షో వంటివి ఏర్పాటుచేస్తారు. జలాశయం చుట్టూ నడక మార్గాన్ని అభివృద్ధి చేస్తారు. ప్రపంచబ్యాంకు నిధులతో జలాశయం అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

8ap-story3b.jpg

గాంధీ, అంబేడ్కర్‌ స్మృతివనాలు
పార్కులో 19 ఎకరాల్లో గాంధీ స్మృతివనాన్ని అభివృద్ధి చేస్తారు. దీని ప్రణాళికలు, ఆకృతులను సిద్ధం చేస్తున్నారు. 20 ఎకరాల్లో అంబేడ్కర్‌ స్మృతివనం ఏర్పాటుచేస్తారు. దీన్ని సాంఘిక సంక్షేమశాఖ అభివృద్ధి చేయనుంది. 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం, స్మారక గ్యాలరీ, బౌద్ధ ధ్యాన కేంద్రం, గ్రంథాలయం వంటివి ఏర్పాటుచేస్తారు.

మొత్తం పూర్తయ్యేసరికి రెండేళ్లు
పార్కును ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి తెలిపారు. ‘ఈ పార్కు రాజధానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పార్కును మేమే అభివృద్ధి చేయాలని మొదట అనుకున్నాం. పార్కు నిర్మాణానికయ్యే వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చాం. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయి. మరోపక్క ప్రగతి రిసార్ట్స్‌, రివర్‌బే వంటి సంస్థలూ పనులు ప్రారంభించాయి. త్వరలో కొన్ని వసతులైనా కల్పిస్తాం. పూర్తి స్థాయిలో పార్కును అభివృద్ధి చేయాలంటే రెండేళ్లు పడుతుంది’ అని లక్ష్మీపార్థసారథి వెల్లడించారు.

- ఈనాడు, అమరావతి

 

8ap-story3c.jpg

 

 
 
Link to comment
Share on other sites

అమరావతి ఆలయానికి 31న భూకర్షణ

 

8ap-state11a_1.jpg

తిరుమల, న్యూస్‌టుడే: అమరావతిలో శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిని అనుసంధానిస్తూ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ(భూకర్షణ)లో భాగంగా ఈనెల 31న ఉదయం ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించాలని తితిదే ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ క్రతువు చేపట్టాలని సంకల్పించింది. రూ.150కోట్లతో చేపట్టనున్న ఆలయానికి ఫిబ్రవరి 10న శంకుస్థాపన చేయాలని తీర్మానించింది. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే నాలుగు దశల్లో పిలిచిన టెండర్లకు ఆమోదముద్ర వేసింది. తిరుమలలో మంగళవారం ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అధ్యక్షతన తితిదే పాలకమండలి సమావేశం జరిగింది. తీర్మానాలు, నిర్ణయాలను అధ్యక్షుడితో పాటు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కలిసి ప్రసార మాధ్యమాలకు వెల్లడించారు.

Link to comment
Share on other sites

మకుటాయమాన వంతెన

 

12న శంకుస్థాపన

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిని విజయవాడ-హైదరాబాద్‌ మార్గంతో అనుసంధానిస్తూ కృష్ణా నదిపై ఇబ్రహీంపట్నం వద్ద నిర్మించనున్న ఐకానిక్‌ బ్రిడ్జికి ఈ నెల 12న ఉదయం పదింటికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఐకానిక్‌ బ్రిడ్జిని తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా కూచిపూడి నాట్య ముద్రను పోలిన ఆకృతిలో నిర్మించనున్నారు. రూ.1,387 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనులను ఎల్‌ అండ్‌ టీ సంస్థ దక్కించుకుంది. 3.2 కి.మీ. పొడవైన ఈ వంతెనను ఆరు వరుసలుగా రెండేళ్లలో నిర్మించాలన్నది లక్ష్యం.  శంకుస్థాపన చేసిన వెంటనే పనులు ప్రారంభించనున్నారు.

 

 
Link to comment
Share on other sites

ద్యోగుల ఫ్లాట్ల నిర్మాణాలు.. అద్భుతం
09-01-2019 13:01:05
 
636826356663273222.jpg
  • సంతృప్తి వ్యక్తం చేసిన సంఘ నేతలు
  • సందర్శించిన సచివాలయ ఉద్యోగులు
  • 27 ఎకరాల్లో నిర్మాణాలు
తుళ్లూరు: రాజధాని అమరావతిలో నిర్మితమవుతున్న ఎన్జీవోస్‌, గ్రూపు డీ ఇళ్ల ఫ్లాట్‌లను మంగళవారం వెలగపూడి సచివాలయం ఉద్యోగులు సందర్శించారు. తాము ఉండబోయే ఫ్లాట్‌లను చూసి మురిసిపోయారు. ఎంతో అద్భుతంగా నిర్మించారని కితాబిచ్చారు. సంవత్సరంలోపు ఇళ్ల ఫ్లాట్‌లు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉద్యోగులకు వివరించారు. ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, మహిళా సంఘం అధ్యక్షురాలు సులోచన ఆధ్వర్యంలో ఐదు బస్సుల్లో 250 మంది సచివాలయం ఉద్యోగులు ఫ్లాట్లను సందర్శించారు. నేలపాడు రెవెన్యూలో 27. 47 ఎకరాల్లో 22 టవర్లను 13 అతంస్థులతో నిర్మిస్తున్నారు. ఒక్కో ఫ్లాట్‌ 1,200 చదరపు అడుగులలో నిర్మితమైంది. ఎన్జీవో, గ్రూపు డి, ఉద్యోగస్థుల ఇళ్ల నిర్మాణ టవర్లను పరిశీలించారు. తూర్పు, పడమర ముఖాలతో పక్కా వాస్తుతో ఫ్లాట్ల నిర్మాణం జరగటంతో ఉద్యోగులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం హైకోర్టు, ఎమ్మెల్యే, ఏఐఎస్‌ ఇళ్ల ఫ్లాట్‌లను సందర్శించారు.
 
ఎంతో సంతోషంగా ఉంది..
werwerw.jpgఇంత తొందరగా పూర్తి చేస్తారని మేము ఊహించలేదు. పూర్తిగా తయారైన ఫ్లాట్‌ చూశాక ఎప్పుడు వచ్చి ఉందమా.. అనిపిస్తోంది. అంతా పూర్తి కావాలంటే కొంత సమయం పడుతుందని చెపుతున్నారు. చాలా అద్భుతంగా నిర్మించారు. రాజధానిలో ఉండి ఉద్యోగం చేయటం ఎంతో ఆనందాన్నిస్తుంది.
- విజయలక్ష్మి, సచివాలయ సెక్ష్షన్‌ ఆఫీసర్‌
 
అభినందించాల్సిందే..
rbawrr.jpgఎంతో వేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అభినందించాలి. ఎంతో దూరదృష్టి తో నిర్మాణాలు చేస్తున్నారు. మాకు కేటాయించిన ఇళ్లు ఫ్లాట్లు ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయి. ఊహించిన దాని కాన్న వేగంగా నిర్మాణాలు జరుగడం సంతోషం. ఫ్లాట్లు చాలా బాగున్నాయి.
- సత్య సులోచన, మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు
 
హ్యాపీగా ఉండవచ్చు..
awerbaw.jpgఉద్యోగులకు ఇప్పుడు నిర్మిస్తున్న ఫ్లాట్లు అద్భుతం గా ఉన్నాయి. చాలావరకు నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించారు. మా అభిరుచికి తగ్గట్టుగా ఇళ్ళ ఫ్లాట్లు ఉన్నాయి. అందరం సంతృప్తిగా ఉన్నాం. అన్నీ ఫ్లాట్‌లు పూర్తి చేస్తే వెంటనే వచ్చేస్తాం.
- కె.రామకృష్ణ, హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌, సెక్ష్షన్‌ ఆఫీసర్‌
 
శరవేగంగా పనులు..
awrwrb.jpgమా ఉద్యోగులు ఉండబోయే ఫ్లాట్లను సందర్శించాం. ఎంతో అద్భుతంగా నిర్మించారని ఉద్యోగులందరూ చెపుతున్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను. చాలా బాగా నిర్మించారు. ఇంత త్వరగా నిర్మాణం అవుతాయని ఊహించలేదు. ఇతర నిర్మాణాలు చూసాం. శరవేగంగా పనులు జరుగతున్నాయి.
- మురళీకృష్ణ, సచివాలయం ఉద్యోగస్థుల సంఘం అధ్యక్షుడు
Link to comment
Share on other sites

నేడే వెల్‌కమ్‌ గ్యాలరీకి శంకుస్థాపన
10-01-2019 03:30:54
 
636826878553871116.jpg
  • అమరావతి స్టార్టప్‌ ఏరియాలో కీలక నిర్మాణం
  •  పాల్గొననున్న సీఎం, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌
  •  5 ఎకరాల్లో 75వేల చ.అ. విస్తీర్ణంతో గ్యాలరీ
అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి సత్వరాభివృద్ధికి ఉద్దేశించిన స్టార్టప్‌ ఏరియాలో ‘వెల్‌కమ్‌ గ్యాలరీ’కి సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. లింగాయపాలెం వద్ద ఉదయం 9.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌, ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి కూడా పాల్గొననున్నారు. కృష్ణానదీ తీరాన 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ఏరియాను సింగపూర్‌ కన్సార్షియం, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) భాగస్వాములుగా ఏర్పాటైన ఏడీపీ (అమరావతి డెవల్‌పమెంట్‌ పార్ట్‌నర్స్‌) 3 దశల్లో అభివృద్ధి చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో అమరావతి సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ ద్వారా.. రాజధాని ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన వాతావరణాన్ని సిద్ధం చేయనున్నారు. ఇందులో కనీసం 8 లక్షల చదరపుటడుగుల మేర వాణిజ్య స్థలాన్ని అభివృద్ధి చేయాలని భావించారు. 20 నెలల క్రితమే ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం వెల్‌కమ్‌ గ్యాలరీ నిర్మాణానికి ఏడీపీ సంకల్పించడంతో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రక్రియ కొద్దినెలల్లో పట్టాలెక్కే అవకాశాలున్నాయి.
 
ఘన చరిత్ర చాటేలా!
కొన్ని శతాబ్దాల క్రితమే ప్రపంచంలో ప్రముఖ ఆధ్యాత్మిక, విద్యా, వ్యాపార, సాంస్కృతిక, రాజకీయ అంశాల్లో ఒకటిగా అమరావతి పేరొందింది. ఆ తర్వాత ప్రాభవం కోల్పోయినప్పటికీ నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ప్రకటించిన తర్వాత దశ మారింది. ప్రపంచస్థాయిలో అమరావతిని మళ్లీ అగ్రగామి నగరాల్లో ఒకటిగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో అమరావతి ఘన చరిత్రను, వర్తమానాన్ని, భావి స్వరూపాన్ని ఇక్కడికి విచ్చేసే దేశ విదేశాలకు చెందిన సందర్శకుల కళ్లకు కట్టేలా చూపేందుకు ‘వెల్‌కమ్‌ గ్యాలరీ’ని నిర్మించబోతున్నారు. స్టార్టప్‌ ఏరియాలో క్యాటలిటిక్‌ డెవల్‌పమెంట్‌ జోన్‌ (సత్వరాభివృద్ధికి చోదకశక్తిగా ఉపకరించే ప్రదేశం) ఉన్న 50 ఎకరాల్లోని 5 ఎకరాల్లో ఈ వెల్‌కమ్‌ గ్యాలరీ వస్తుంది. దీని విస్తీర్ణం 75,000 చదరపుటడుగులు.
 
కూచిపూడి, వాస్తుకళ మేళవింపు!
ఈ ప్రాంతంలో జన్మించి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కూచిపూడి నృత్యాన్ని తలపించేలా, వాస్తుకళారీతులకు అద్దం పట్టేలా వెల్‌కమ్‌ గ్యాలరీ నమూనాకు రూపకల్పన చేశారు. సందర్శకులకు ఇది ఒక స్వాగతస్థలిలా ఉండబోతుంది. రాజధాని అభివృద్ధికి దోహదపడే వ్యాపార, సాంస్కృతిక, సామాజిక భాగస్వామ్యాలు కుదిరేందుకు నెలవు కానుంది. ఇందులోని సిటీ గ్యాలరీ, బిజినెస్‌ జోన్‌లో బిజినెస్‌ ఎగ్జిబిషన్‌ ఏరియా, కన్వెన్షన్‌ హాల్‌, కో-వర్కింగ్‌ స్పేస్‌, కమ్యూనిటీ జోన్‌లో మెయిన్‌ కమ్యూనిటీ ప్లాజా, కమ్యూనిటీ యాక్టివేషన్‌ ఏరియా, కమ్యూనిటీ యాక్టివిటీస్‌ హబ్‌ ఉంటాయి. వీటి నిర్మాణంలో పలు ప్రసిద్ధ సంస్థలు పాలుపంచుకోనున్నాయి.
Link to comment
Share on other sites

అమరావతిలో ‘వెల్‌కం గ్యాలరీ’ 

 

అంకుర ప్రాంతంలో ఏడీపీ ప్రాజెక్టు 
రూ.44 కోట్లతో 50 ఎకరాల్లో నిర్మాణం 
నేడు శంకుస్థాపన చేయనున్న  సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌

9ap-main5a_1.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలోని అంకుర ప్రాంతం (స్టార్టప్‌ ఏరియా)లో ‘వెల్‌కం గ్యాలరీ’ రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టును ఐదు ఎకరాల విస్తీర్ణంలో అమరావతి డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ (ఏడీపీ) చేపడుతోంది. దీనికి గురువారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. రాజధానిలోని లింగాయపాలెం గ్రామం సమీపంలో ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. సుమారు రూ.44 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఆరు నెలల్లో దీని నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం.

ఏంటీ ప్రాజెక్టు? 
అమరావతిలో 1,691 ఎకరాల్ని స్టార్టప్‌ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్టియంను రాష్ట్ర ప్రభుత్వం స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపిక చేసింది. సింగపూర్‌ సంస్థల కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) కలసి స్టార్టప్‌ ఏరియాని అభివృద్ధి చేయనున్నాయి. ఈ రెండూ కలసి ఏర్పాటు చేసిన సంయుక్త భాగస్వామ్య సంస్థే ఏడీపీ. 1,691 ఎకరాల్ని మూడు దశల్లో అభివృద్ధి చేయాలన్నది ప్రతిపాదన. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం... ఉత్ప్రేరకాభివృద్ధిగా 50 ఎకరాల్ని మొదట ఏడీపీ అభివృద్ధి చేయాలి. దానిలో భాగంగానే ‘వెల్‌కం గ్యాలరీ’ ప్రాజెక్టుని ఏడీపీ చేపట్టింది. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి కోసం మొదట ఒప్పందం చేసుకున్నప్పుడు వెల్‌కం గ్యాలరీ ప్రాజెక్టు ప్రతిపాదన లేదు. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో... మొదట ఐదు ఎకరాల్లో ‘ఫేజ్‌ జీరో’ పేరుతో ఒక ప్రాజెక్టు చేపడతామని సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదించింది. దీన్ని ‘వెల్‌కం గ్యాలరీ’గా మార్చారు. భవిష్యత్‌ అవసరాల కోసం 75 వేల చ.అడుగుల నిర్మిత ప్రాంతం గల భవనాన్ని ఇక్కడ నిర్మిస్తారు.

ఏమేం ఉంటాయి? 
‘వెల్‌కం గ్యాలరీ’ అమరావతి గత వైభవానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు అద్దం పట్టేలా ఉంటుందని ఏడీపీ చెబుతోంది. దీనిలో ఓ సిటీ గ్యాలరీ, వాణిజ్య ప్రదర్శన కేంద్రం, కన్వెన్షన్‌ హాల్‌, కో-వర్కింగ్‌ ప్లేస్‌ ఉంటాయి.

నేడు జేఐఎస్‌సీ సమావేశం 
ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ సమాచార, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ సారథ్యంలోని జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ (జేఐఎస్‌సీ) నాలుగో సమావేశం గురువారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌ ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

 

Link to comment
Share on other sites

 

 
 

Most Awaited Bridge Construction on River Krishna will have Foundation ceremony on Jan 12 Bridge Connects Pavitra Sangamam (Ibrahimpatnam) to N10 Road (Amaravati) Designs have been changed (Pic 1 to 2) to accommodate Ships beneath the Bridge as it comes under National Waterways

DwhWSmzV4AAAzUh.jpg
DwhWVSFUwAAuqQX.jpg
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...