Jump to content

Amaravati

Recommended Posts

జన్మభూమిని మరవొద్దు
23-06-2018 01:49:50
 
636653154045952650.jpg
  • నవ్యాంధ్రకు పెట్టుబడులతో రండి
  • ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది
  •  మీమీ ఊళ్లతో బంధం పెంచుకోండి
  •  ఇన్నోవేషన్‌ అంటే నేడు సిలికాన్‌ వ్యాలీయే
  •  భవిష్యత్‌లో అమరావతే గుర్తుకురావాలి
  •  ఇంటికో డిజిటల్‌ అక్షరాస్యుడు ఉండాలి
  •  తెలుగు జాతి సత్తా ప్రపంచానికి చాటండి
  •  ప్రవాసులకు ముఖ్యమంత్రి పిలుపు
  •  ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ భవనానికి శంకుస్థాపన
అమరావతి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ప్రపంచం మొత్తానికి తెలుగుజాతి ఆత్మగౌరవం, శక్తిసామర్ధ్యాలను చాటిచెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవాస తెలుగువారికి పిలుపిచ్చారు. జన్మభూమిని మరవొద్దని.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తిచేశారు. అదే సమయంలో వారు ఉంటున్న దేశం.. అంటే కర్మభూమిలో కూడా సేవ చేయాలని, అక్కడివారితో పాలు-నీళ్లలా కలిసిపోవాలని, రాజకీయాల్లో చేరాలని సూచించారు. ప్రపంచం మొత్తానికి సేవ చేసే జాతిగా తెలుగుజాతి గుర్తింపు సాధించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రవాస తెలుగు సమాజం (ఏపీఎన్‌ఆర్‌టీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఐకాన్‌ భవనానికి శుక్రవారమిక్కడి రాయపూడికి సమీపాన సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీఎన్‌ఆర్‌టీకి 120 దేశాల్లో సభ్యులున్నారని, ఆంధ్రులు అన్ని దేశాల్లోనూ మంచి స్థానాల్లో ఉన్నారని తెలిపారు. ‘20 ఏళ్ల క్రితం నేనో విజన్‌ రూపొందించాను. అది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు తెలుగు ఐటీ నిపుణులు వెళ్లేందుకు ఉపకరించింది. ఇప్పుడు మీకు కూడా ఒక విజన్‌ ఉండాలి. విదేశాల్లో ఉన్న మీకు నూతన టెక్నాలజీలు, ఆలోచనలు అందుబాటులో ఉంటాయి. వాటి ఆధారంగా జన్మభూమిలో పెట్టుబడులు పెట్టండి. మీ గ్రామంలో, రాష్ట్రంలో.. ఏ స్థాయిలో వీలైతే ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టి వ్యాపారవేత్తలుగా మారండి. పెట్టుబడులు పెట్టేవారందరికీ పూర్తిస్థాయిలో సహకరిస్తాం. అదే సమయంలో మీ గ్రామంతో, గ్రామంలోని వారితో బంధం పెంచుకోండి. గ్రామాలను అభివృద్ధి చేయండి’ అని కోరారు. ఒకప్పటి విజన్‌తో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని, ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఒక డిజిటల్‌ అక్షరాస్యుడు, ఒక పారిశ్రామికవేత్త ఉండేలా చేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే..
 
ప్రపంచాన్నే చూసినట్లు ఉంది..
‘ఏపీఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. వివిధ దేశాలనుంచి తరలివచ్చిన ప్రవాసులను చూస్తుంటే ప్రపంచాన్ని చూసినట్లుంది. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఆ దేశం అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి. అదేవిధంగా మీ జన్మభూమికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. ప్రపంచంలోనే సిలికాన్‌ వ్యాలీ ఐటీకి ప్రత్యేకం. ఆ సిలికాన్‌ వ్యాలీలో ఉన్న ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు తెలుగువారు. అక్కడ అందరికంటే తెలుగువారి తలసరి ఆదాయమే ఎక్కువ. ఇన్నోవేషన్‌ అంటే సిలికాన్‌ వ్యాలీ గుర్తుకొస్తుంది. ఏ కొత్త పరిజ్ఞానం వచ్చినా అక్కడే ఆవిష్కరిస్తారు. రాబోయే రోజుల్లో ఇన్నోవేషన్‌ అంటే అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ గుర్తుకురావాలి. ఇదేం అసాధ్యం కాదు.’
 
విజ్ఞాన సమాజంగా ఏపీ
‘ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞాన సమాజంగా తయారుచేయాలన్నదే నా లక్ష్యం. ఇప్పటికే పదో తరగతి గణితంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాం. అన్ని సబ్జెక్టుల ర్యాంకింగ్‌లో రెండోస్థానంలో నిలిచాం. ఒకప్పుడు 22వ స్థానంలో ఉండేవాళ్లం. ఐఐటీ, ఐఐఎంలలో 25శాతం సీట్లు మనవాళ్లే సాధిస్తున్నారు. నీట్‌లో ఉత్తీర్ణులై 600 వైద్య సీట్లను అదనంగా సాధించుకున్నారు. ఒక ఆలోచన సంపద సృష్టిస్తుంది. మరో ఆలోచన సేవ చేస్తుంది. ఇంకో ఆలోచన అద్భుతమైన ఉత్పత్తులను సృష్టిస్తుంది. విజ్ఞానం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ప్రవాసులు కూడా రాష్ట్రంలో ఎవరికి నైపుణ్యం ఉన్న రంగంలో వారు పెట్టుబడులు పెట్టాలి. విజ్ఞానానికి ఐటీని జోడిస్తే బ్రహ్మాండమైన వ్యాపారాలు చేయొచ్చు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయాం. రాజధాని కూడా లేదు. ఒక్క పిలుపుతో రైతులు భూములిచ్చారు. వారు ఇవ్వబట్టే ఈరోజు ఇక్కడున్నాం. రాబోయే రోజుల్లో అమరావతి ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటుంది.’
 
పది మందితో కలిసి సాధిస్తే..
ఐకాన్‌ ప్రాజెక్టు అందరి సమష్టి విజయమని ఏపీఎన్‌ఆర్‌టీ చైర్మన్‌ రవికుమార్‌ వేమూరి అన్నారు. ‘విజయం సాధిస్తే సంతోషంగా ఉంటుంది. అదే పదిమందితో కలిసి సాధిస్తే మరింత ఆనందంగా ఉంటుంది. 1000 మంది కోసం పనిచేస్తూ.. వారితో కలిసి ఆ విజయాన్ని సాధిస్తే అత్యంత ఉత్సాహంగా ఉంటుంది. విజయాన్ని అందరికీ పంచితే ఇంకా ఆనందం’ అని వ్యాఖ్యానించారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఈ ప్రాజెక్టుకు ఎంతగానో సహకరించారన్నారు. కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్‌బాబు, ఏపీఎన్‌ఆర్‌టీ సీఈవో కె.సాంబశివరావు, ప్రవాసులు, రైతులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అమరావతికి మణిహారం
23-06-2018 01:52:38
 
636653155725168428.jpg
  • 100 కంపెనీలకు కేంద్రం
  • 33 అంతస్తులు, 11లక్షల చ.అడుగులు
  • రూ.500 కోట్ల బడ్జెట్‌ 25 వేల మందికి ఉపాధి
  • ఐకాన్‌ ప్రత్యేకతలెన్నో..
అమరావతి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే మొదటిసారిగా.. పూర్తిగా.. ప్రవాసుల నిధులతో నిర్మాణమవుతున్న భవనం ఏపీఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ భవనం. ఇది ఐటీ కంపెనీలకు స్థానంగా, ఉద్యోగాలకు నిలయంగా, ప్రవాసులకు చిరునామాగా, అమరావతికి మణిహారంలా మెరవనుంది. 33 అంతస్తుల్లో 11లక్షల చదరపు అడుగులను ఇందులో నిర్మిస్తారు. ప్రవాసాంధ్రులు దాదాపు 100 ఐటీ కంపెనీలను ఇందులో ఏర్పాటుచేస్తారు. ఆయా కంపెనీలు, జరిగే వాణిజ్య కార్యక్రమాలతో ఐదు వేల మందికి ప్రత్యక్షంగా, 20 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఐకానిక్‌ భవనం నుంచి చూస్తే అమరావతి మొత్తం కనిపిస్తుంది. కృష్ణా నది అందాలు కనువిందు చేస్తాయి. ప్రభుత్వ భవనాల సముదాయానికి సమీపంలోనే దీనిని నిర్మించనున్నారు. 158 మీటర్ల ఎత్తులో ఉండే ఈ భవనం అమరావతిని గుర్తుకు తెచ్చేలా ఆంగ్ల అక్షరం ‘ఏ’ ఆకృతిలో ఉంటుంది. మధ్యలో గ్లోబ్‌ ఆకారం ఉంటుంది. ఈ గ్లోబ్‌ తిరుగుతూ ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎక్సో స్కెలిటెన్‌ అనే సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని నిర్మిస్తున్నారు. భవనం మధ్యలో ఎక్కడా పిల్లర్లు ఉండవు. ఈ భవనం కోసం ఖర్చుచేసే రూ.500 కోట్లు పూర్తిగా ప్రవాసుల నుంచే వచ్చేలా రూపకల్పన చేశారు. భవంతిలో 120 యూనిట్లను చ.అడుగు రూ.5500 చొప్పున ప్రవాసాంధ్రులకు విక్రయిస్తారు. వీటి కొనుగోలుకు 500 దరఖాస్తులు రావడం విశేషం.
Link to comment
Share on other sites

Grounding Works For Permanent Secretariat is going to start from July 1st... Using Twin-lift Technology (1st of its kind in India) - CM Tower (554.23 Cr) - NCC - 50 Floors - Tower 1 & 2 (932.47 Cr) - S&P - 40 Floors Each - Tower 3 & 4 (784.62 Cr) - L&T - 40 Floors Each

DgSMnDzU8AEdFDD.jpg
DgSMvbLUEAEPyE1.jpg
DgSMwREUcAAcONp.jpg
Link to comment
Share on other sites

ఆవిష్కరణలతో రండి..
అండగా ఉంటాం
  ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ టవర్‌ శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
22ap-main8a.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చిన ప్రవాసాంధ్రులకు ప్రభుత్వపరంగా అవసరమైన సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. వినూత్నమైన ఆలోచనలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసులకు పిలుపునిచ్చారు. ఐటీ రంగం ఆవిష్కరణలకు తలమానికంగా ఉన్న సిలికాన్‌ వ్యాలీ తరహాలోనే.. ఆవిష్కరణలకు కేంద్రంగా (ఇన్నోవేషన్‌ వ్యాలీ) అమరావతి మారాలని ఆకాంక్షించారు. పారిశ్రామికవేత్తలైన ప్రవాసులు రాష్ట్రానికి వచ్చి జన్మభూమి రుణం తీర్చుకోవాలని కోరారు. రాయపూడి వద్ద ఏపీ ఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ఈ ఐకాన్‌ భవనానికి శుక్రవారం ముఖ్యమంత్రి భూమి పూజ చేసి సభలో మాట్లాడారు. ‘‘తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా ఆ దేశ భవిష్యత్తు, అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. అక్కడి రాజకీయాల్లోనూ వారి ముద్ర ఉండాలి. దేశంలో ఎంతో మంది విదేశాలకు వెళ్తున్నా వారే పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. ఇది శుభ పరిణామం. సిలికాన్‌ వ్యాలీలో తలసరి ఆదాయం ఎక్కువగా వారి నుంచే రావడం గర్వకారణం. దేశంలోని ఐటీ నిపుణుల్లో నలుగురిలో ఒకరు ఉన్నారు. నాలెడ్జి ఎకానమీగా రాష్ట్రం తయారు కావాలని గత నాలుగేళ్లల్లో చదువుకు ఎంతో ప్రాధాన్యమిచ్చాం. పదోతరగతి పరీక్షలు మొదలుకొని జేఈఈ, నీట్‌ వంటి జాతీయ పరీక్షల్లోనూ సత్తా చాటుతున్నారు. సాంకేతికతను వినియోగించి రాష్ట్రంలోనూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. భూధార్‌ పరిజ్ఞానాన్ని అక్టోబరులోపు తీసుకొస్తాం. సంక్షేమపథకాలతో పాటు ఇంటింటి చెత్త సేకరణలోనూ సాంకేతికతను ప్రవేశపెట్టాం. గోబరైజేషన్‌ (గ్రామాల్లో పేడ సేకరణ) త్వరలో అమలు చేస్తాం. చెత్త నుంచి కూడా సంపద సృష్టించే విధానానికి శ్రీకారం చుట్టాం....’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

Link to comment
Share on other sites

వారంలో శాశ్వత సచివాలయ పనులు!
23-06-2018 03:16:53
 
636653206277037289.jpg
  •  వర్క్‌ ఆర్డర్లు అందజేసిన సీఆర్డీయే
  •  నేడో, రేపో హైకోర్టు భవనానికీ టెండర్లు
అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో కీలకమైన శాశ్వత సచివాలయ నిర్మాణ పనులు వారం, పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మొత్తం 70లక్షల చ.అ. విస్తీర్ణంలో, 5 టవర్లుగా, సుమారు రూ.2600 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ భారీ కాంప్లెక్స్‌ టెండర్లను 3 సుప్రసిద్ధ నిర్మాణ సంస్థలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థలకు ఏపీసీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ శుక్రవారం వర్క్‌ ఆర్డర్లను అందజేశారు. ఒక వారంలోగా ఈ కంపెనీలు సీఆర్డీయేతో అంగీకారపత్రాలను కుదుర్చుకుని వెంటనే పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 26న టెండర్లు పిలవగా ఆ సంస్థలు తక్కువ మొత్తాలను కోట్‌ చేశాయి. ఈ నెల 20న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబుకి సీఆర్డీయే అధికారులు ఈ విషయం తెలియజేయగా.. వెంటనే ఆయా సంస్థలకు వర్క్‌ ఆర్డర్లు ఇచ్చి, పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఆదేశించారు. కాగా, 2 ఐకానిక్‌ భవంతుల్లో ఒకటైన రాష్ట్ర హైకోర్టు భవన నిర్మాణానికి నేడో, రేపో టెండర్లు పిలిచేందుకు సీఆర్డీయే సన్నద్ధమవుతోంది. బౌద్ధ స్థూపాకృతిలో రూపొందనున్న ఈ భవనానికి రూ.1168 కోట్ల వ్యయం కాగలదని అంచనా. తొలిదశగా ఫౌండేషన్‌, స్ట్రక్చరల్‌ టెండర్లను రూ.700 కోట్ల అంచనా వ్యయంతో పిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ పనులు జరుగుతుండగానే అంతర్గత, ఇతర పనుల కోసం రూ.468 కోట్లతో మరొక టెండర్‌ను ఆహ్వానిస్తారని సమాచారం. మొత్తంమీద హైకోర్టు శాశ్వత భవనం పూర్తయ్యేందుకు రెండేళ్ల నుంచి రెండున్నరేళ్లు పట్టవచ్చునని సమాచారం.
Link to comment
Share on other sites

అమరావతిలో కీలక రహదారి నిర్మాణం!
24-06-2018 08:53:16
 
636654271940007641.jpg
  • గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మధ్యన రోడ్డు
  • కృష్ణానది కరకట్ట నుంచి అమరావతి సెంట్రల్‌ పార్క్‌ వరకు..
  • మొత్తం అంచనా వ్యయం రూ.21.28 కోట్లు
  • పొడవు సుమారు 7 కి.మీ., వెడల్పు 23 అడుగులు
  • పనులు వేగంగా జరిగేందుకు దోహదం
రాజధాని అమరావతిలో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో భాగంగా చేపడుతున్న వివిధ నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేందుకు ఓ కీలక రహదారిని నిర్మించాలని సీఆర్డీయే భావిస్తోంది. కృష్ణానది కరకట్ట నుంచి శాఖమూరు వద్ద అభివృద్ధి పరుస్తున్న అమరావతి సెంట్రల్‌పార్క్‌ వరకు సుమారు 7 కిలోమీటర్ల పొడవున, 23 అడుగుల వెడల్పుతో ఈ రోడ్డును నిర్మించనున్నారు. గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు మధ్యలోని సెంట్రల్‌ విస్టాకు తూర్పు వైపున వేయనున్న దీనికి రూ.21.28 కోట్ల వ్యయమవుతుందని అంచనా.
 
అమరావతి: రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో భాగంగా చేపడుతున్న వివిధ నిర్మాణాలు చురుగ్గా, నిరంతరాయంగా కొనసాగుతూ నిర్ణీత గడువుల్లోగా పూర్తయ్యేందుకు దోహదపడే ఒక కీలక రహదారి ఏర్పాటుకు సీఆర్డీయే నిర్ణయించింది. కృష్ణానది కరకట్ట నుంచి శాఖమూరు వద్ద అభివృద్ధి పరుస్తున్న అమరావతి సెంట్రల్‌పార్క్‌ వరకు సుమారు ఏడు కిలోమీటర్ల పొడవున, 23 అడుగుల వెడల్పుతో ఈ రోడ్డును నిర్మించనున్నారు. గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు మధ్యలోని సెంట్రల్‌ విస్టాకు తూర్పు వైపున వేయనున్న దీనికి రూ.21.28 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. రాజధానిలోని ఈ-1ను, ఈ-8తో అనుసంధానించనున్న ఈ రోడ్డును ప్రస్తుతావసరాల కోసం వేస్తున్నప్పటికీ భవిష్యత్తులోనూ తొలగించాల్సిన అవసరం లేకుండా, మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా దీనిని ప్రతిపాదించడం విశేషం. ఈ రోడ్డు కోసం మూడు ప్యాకేజీలుగా సీఆర్డీయే టెండర్లను పిలిచింది. వాటి దాఖలుకు వచ్చే నెల 11వ తేదీ వరకు గడువునిచ్చింది. సుమారు నెల రోజుల్లో టెండర్లను ఖరారు చేసి, ఆ వెంటనే పనులు ప్రారంభింపజేసి, అక్కడి నుంచి మూడు నెలల్లోపు దీనిని పూర్తి చేయించేందుకు సమాయత్తమవుతోంది. కేవలం రోడ్డు నిర్మాణంతోనే సరిపుచ్చకుండా రాత్రి వేళల్లోనూ దీనిపై ప్రజలు క్షేమంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా దీనిపక్కన ఎల్‌ఈడీ దీపాలనూ ఏర్పాటు చేయించనుంది.
 
పెరిగిన ఆవశ్యకత..
గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్‌ అధికారులు, గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం సీఆర్డీయే ఆధ్వర్యంలో మొత్తం 3,840 అపార్ట్‌మెంట్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్న సంగతి తెలిసిందే. మరొకపక్క శాశ్వత హైకోర్టు భవనాలు సిద్ధమయ్యేలోపు ఆ ఉన్నత న్యాయస్థానం పని చేసేందుకు వీలుగా నిర్మించబోతున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణపనులూ మొదలవుతున్నాయి. ఐదు భారీ టవర్లతో రూపొందబోతున్న సచివాలయ సముదాయానికి సంబంధించిన టెండర్లను సీఆర్డీయే కొద్ది రోజుల క్రితమే ఖరారు చేయగా, మరొక వారం రోజుల్లో వీటికి సంబంధించిన పనులూ ప్రారంభం కానున్నాయి. తాజాగా అమరావతిలోని రెండు ఐకానిక్‌ కట్టడాల్లో ఒకటైన హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం కోసం సీఆర్డీయే టెండర్లను ఆహ్వానించింది. మంత్రులు, న్యాయమూర్తుల కోసం నిర్మించదలచిన బంగళాల కోసం కూడా చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకొన్ని వారాల్లోనే రాజధానిలోని మరొక దిగ్గజ నిర్మాణమైన అసెంబ్లీ భవనానికి సంబంధించిన టెండర్లను పిలిచేందుకు సీఆర్డీయే కసరత్తు జరుపుతోంది. వీటన్నింటితోపాటు పరిపాలనా నగరంలో ప్రతిపాదించిన పలు ఇతర కట్టడాలు, ఉద్యానవనాలు, నీటి వనరుల పనులను కూడా చేపట్టేందుకు ఈ సంస్థ సిద్ధమవుతోంది.
 
అంటే.. గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో చేపడుతున్న నిర్మాణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో పైన పేర్కొన్న నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన యంత్రసామగ్రి, బిల్డింగ్‌ మెటీరియల్‌ రవాణాతోపాటు ఈ ప్రాజెక్టుల్లో పని చేసేందుకు వచ్చే కార్మికులు, అధికారులు ఇక్కడికి రాకపోకలు సాగించడం ఇకపై రోజురోజుకూ పెరగనుంది. ఫలితంగా ప్రస్తుతం గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు చేరేందుకు వినియోగిస్తున్న మార్గాలు సరిపోక జాప్యం అనివార్యమై ఆ ప్రభావం నిర్మాణాలపై పడే అవకాశముంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, సీఆర్డీయే ఈ నూతన రహదారి నిర్మాణానికి సంకల్పించింది. ఈ రోడ్డు వల్ల మరొక ప్రయోజనమూ ఉంది. ఇది పూర్తయితే గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లోని వివిధ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడం మంత్రులు, ఉన్నతాధికారులకు సులభంగా ఉంటుంది. ప్రస్తుతం వీరు పనులను పరిశీలించాలంటే అంత బాగా లేని రోడ్లపై, చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. అంతే కాకుండా.. కొత్త రోడ్డు సిద్ధమైతే వర్షాలొచ్చినప్పటికీ వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కావు కాబట్టి పనులు వేగంగా జరిగేందుకు ఆస్కారముంటుంది.
 
3 ప్యాకేజీలుగా నిర్మాణం..
ఈ నూతన రహదారి నిర్మాణం కోసం సీఆర్డీయే మూడు ప్యాకేజీలుగా టెండర్లను పిలిచింది. సెంట్రల్‌ విస్టాకు తూర్పు వైపున ఈ-1 నుంచి ఈ-4ను కలిపే భాగానికి రూ.9.98 కోట్లు, ఈ-4 నుంచి ఈ-8ను అనుసంధానించే భాగానికి రూ.9.90 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసింది. ఈ రెండు భాగాలకూ కలిపి.. అంటే ఈ-1 నుంచి ఈ-8ల మధ్య నిర్మితమయ్యే మొత్తం రోడ్డు పక్కన ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేసేందుకు రూ.1.40 కోట్లతో అంచనాలు రూపొందించింది.
Link to comment
Share on other sites

మరావతిలో కీలక రహదారి నిర్మాణం!

Tags : Amaravati, Roads, ap govt

Link to comment
Share on other sites

1,685 కోట్లతో హైకోర్టు
24-06-2018 01:47:20
 
636654074430008396.jpg
  •  తొలిదశ నిర్మాణాలకు 699 కోట్లతో టెండర్లు
  • బేస్ మెంట్ గ్రౌండ్ 7 అంతస్తుల నిర్మాణం
  • మలిదశలో రూ.986 కోట్లతో పనులు 
  • హైకోర్టు శాశ్వత భవనాలకు టెండర్లు
అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): హైకోర్టు శాశ్వత భవనానికి ఏపీసీఆర్డీయే టెండర్లు ఆహ్వానించింది. రూ.1685 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకోనున్న ఈ భవనం తొలిదశలో బేస్‌మెంట్‌, గ్రౌండ్‌, 7అంతస్తులను నిర్మించేందుకు రూ.699.10 కోట్ల అంచనాలతో బిడ్లను పిలిచింది. 6 నెలల తర్వాత ఇంటీరియర్లు, ఆర్కిటెక్చరల్‌ ఎలివేషన్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ పనులు, సీసీటీవీల అమరిక, ల్యాండ్‌స్కేపింగ్‌, పార్కింగ్‌, కోర్టు హాళ్ల ఏర్పాటు తదితర పనుల కోసం రూ.986 కోట్లతో మరో టెండర్‌ పిలుస్తారు. మొత్తంమీద అమరావతిలో ఐకానిక్‌గా నిలిచే బౌద్ధ స్థూపాకృతిలోని హైకోర్టు శాశ్వత భవనం పూర్తయ్యేందుకు 2ఏళ్లు నుంచి రెండున్నరేళ్లు పట్టవచ్చునని తెలుస్తోంది. వాస్తుకు అనుగుణంగా ఉండేలా డిజైన్లు రూపొందించారు. 5స్టార్‌ రేటింగ్‌ సర్టిఫికేషన్‌ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తారు. గడువులోగా పనులు పూర్తి చేయించడానికి సీహెచ్‌2ఎం అనే సంస్థను ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా సీఆర్డీయే నియమించుకొంది.
Link to comment
Share on other sites

హైకోర్టు భవనానికి టెండర్లు
రూ.699.10 కోట్ల అంచనా
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణానికి సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. రూ.699.10 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించింది. ప్రభుత్వ భవనాల సముదాయం బ్లాక్‌ ఎఫ్‌లో పునాది, గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు ఏడు అంతస్తుల్లో దీన్ని నిర్మించాల్సి ఉంటుంది. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా ఈ నెల 29 సాయంత్రం 4 గంటల నుంచి టెండరు దరఖాస్తులు తీసుకోవచ్చని గుత్తేదారు సంస్థలకు సూచించింది. జులై 25 సాయంత్రం 3 గంటల లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. సాంకేతిక బిడ్లను అదే రోజు సాయంత్రం 4 గంటలకు పరిశీలిస్తారు. ఆర్థిక బిడ్లను జులై 30న తెరిచి పరిశీలిస్తారు.
Edited by sonykongara
Link to comment
Share on other sites

రాజధాని కరకట్ట రహదారి కష్టాలకు ఇక చెక్‌ పెట్టాల్సిందే

0
 
రాజధాని ప్రాంతంలోని కృష్ణా కరకట్ట రహదారిని 4 లేన్లుగా విస్తరించాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. కరకట్టను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయడం వల్ల అమరావతి తదితర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకోవడమే కాకుండా రాజధాని ప్రాంతం భవిష్యత్తులో వరదల బారిన పడకుండా ఉంటుందనే ఉద్దేశంతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ (సీఆర్‌డీఏ) 2016 జనవరిలో నిర్ణయించింది. సీతానగరం పీడబ్ల్యూ వర్క్‌షాప్‌ నుంచి తాళ్లాయపాలెం, వైకుంఠపురం, అమరావతి, ధరణికోట, పొందుగల, అంబడిపూడి, తాడువాయి, మాదిపాడు అగ్రహం వరకూ కరకట్ట విస్తరించి ఉంది.

8-4253.jpg

దీనిని ఎత్తు, వెడల్పులను పెంచి పటిష్టం చేయడం వల్ల రవాణా వ్యవస్థ మెరుగవుతుందనేది అధికారుల భావన. ఇందుకు సంబంధించి రూపొందించిన ప్రతిపాదనలో రూ. 3,60కోట్ల వ్యయంతో తొలి దశలో 72 కిలోమీటర్ల రహదారిని 4 లేన్లుగా నిర్మించాలని పేర్కొంది. కరకట్ట సమీపంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఏర్పాటు చేసుకోవడంతో ప్రకాశం బ్యారేజ్‌ సమీపం నుంచి కరకట్టను కొంతమేరకు విస్తరించి తారు రోడ్డు నిర్మించారు. ఇదిలా ఉండగా సీఎం నివాసం వద్దే గ్రీవెన్స్‌ సెల్‌ను కూడా ఏర్పాటు చేయడంతో కరకట్టపై వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. నిత్యం ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం, సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తుండడంతో కరకట్ట వినియోగం బాగా పెరిగింది. అయితే ఇరుకుగా ఉండడం వల్ల మంత్రులు, ఉన్నతాధికారుల వాహనాలు మినహా మిగిలిన వాటిని ఉండవల్లి మీదుగా మళ్లించిన సందర్భాలు అనేకం. ఇక శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో అయితే ఈ మార్గం మరింత రద్దీగా తయారయ్యేది. పలు సందర్భాలలో కరకట్టపై చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగాయి.

8-432532.jpg

ఈ నేపథ్యంలో ఇటీవల అమరావతి అభివృద్ధిపై చంద్రబాబు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సీఎండీ లక్ష్మీపార్ధసారథితో నిర్వహించిన సమీక్షలో కరకట్ట అంశం ప్రస్తావనకు వచ్చింది. కరకట్టను పటిష్టపరచి 4 లేన్లుగా విస్తరిస్తే వాహనాలలో సురక్షితంగా ప్రయాణించవచ్చని సీఎం సూచన చేశారు. దీంతో రెండున్నరేళ్ల తర్వాత కరకట్ట విస్తరణ మరోసారి తెరపైకి వచ్చినట్లయింది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో సీడ్‌ యాక్సిస్‌ రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ దక్షిణం వైపున ఉన్న పాత గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్‌ నుండి కృష్ణా కుడి ప్రధాన కాలువ, కొండవీటి వాగులపై నూతనంగా 4 లేన్ల వంతెలను నిర్మించవలసి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కరకట్ట రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉన్న విజయవాడ నుంచి రాజధానికి రెండు రహదారులు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే రాజధాని ప్రాంతం, అమరావతి, సత్తెనపల్లి తదితర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునే సదుపాయం కలుగుతుందని పేర్కొంటున్నారు. కృష్ణానదికి అభిముఖంగా నీలి-హరిత శోభితంగా ఉద్యాన వనాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, జలవిహారం, వాటర్‌ స్పోర్ట్స్‌ సదుపాయాలను కల్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

4 లేన్ల రోడ్డుగా కృష్ణా కరకట్ట.. 72 కి.మీల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సియం..

Super User
24 June 2018
Hits: 75
 
karakatta-24062018-1.jpg
share.png

రాజధాని ప్రాంతంలోని కృష్ణా కరకట్ట రహదారిని 4 లేన్లుగా విస్తరించాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. కరకట్టను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయడం వల్ల అమరావతి తదితర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకోవడమే కాకుండా రాజధాని ప్రాంతం భవిష్యత్తులో వరదల బారిన పడకుండా ఉంటుందనే ఉద్దేశంతో సీఆర్‌డీఏ 2016 జనవరిలో నిర్ణయించింది. సీతానగరం పీడబ్ల్యూ వర్క్‌షాప్‌ నుంచి తాళ్లాయపాలెం, వైకుంఠపురం, అమరావతి, ధరణికోట, పొందుగల, అంబడిపూడి, తాడువాయి, మాదిపాడు అగ్రహం వరకూ కరకట్ట విస్తరించి ఉంది. దీనిని ఎత్తు, వెడల్పులను పెంచి పటిష్టం చేయడం వల్ల రవాణా వ్యవస్థ మెరుగవుతుందనేది అధికారుల భావన.

karakatta 24062018 2

ఇందుకు సంబంధించి రూపొందించిన ప్రతిపాదనలో రూ. 3,600 కోట్ల వ్యయంతో తొలి దశలో 72 కిలోమీటర్ల రహదారిని 4 లేన్లుగా నిర్మించాలని పేర్కొంది. కరకట్ట సమీపంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఏర్పాటు చేసుకోవడంతో ప్రకాశం బ్యారేజ్‌ సమీపం నుంచి కరకట్టను కొంతమేరకు విస్తరించి తారు రోడ్డు నిర్మించారు. ఇదిలా ఉండగా సీఎం నివాసం వద్దే గ్రీవెన్స్‌ సెల్‌ను కూడా ఏర్పాటు చేయడంతో కరకట్టపై వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. నిత్యం ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం, సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తుండడంతో కరకట్ట వినియోగం బాగా పెరిగింది. అయితే ఇరుకుగా ఉండడం వల్ల మంత్రులు, ఉన్నతాధికారుల వాహనాలు మినహా మిగిలిన వాటిని ఉండవల్లి మీదుగా మళ్లించిన సందర్భాలు అనేకం.

karakatta 24062018 3

ఇక శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో అయితే ఈ మార్గం మరింత రద్దీగా తయారయ్యేది. పలు సందర్భాలలో కరకట్టపై చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అమరావతి అభివృద్ధిపై చంద్రబాబు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సీఎండీ లక్ష్మీపార్ధసారథితో నిర్వహించిన సమీక్షలో కరకట్ట అంశం ప్రస్తావనకు వచ్చింది. కరకట్టను పటిష్టపరచి 4 లేన్లుగా విస్తరిస్తే వాహనాలలో సురక్షితంగా ప్రయాణించవచ్చని సీఎం సూచన చేశారు. దీంతో రెండున్నరేళ్ల తర్వాత కరకట్ట విస్తరణ మరోసారి తెరపైకి వచ్చినట్లయింది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో సీడ్‌ యాక్సిస్‌ రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ దక్షిణం వైపున ఉన్న పాత గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్‌ నుండి కృష్ణా కుడి ప్రధాన కాలువ, కొండవీటి వాగులపై నూతనంగా 4 లేన్ల వంతెలను నిర్మించవలసి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కరకట్ట రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉన్న విజయవాడ నుంచి రాజధానికి రెండు రహదారులు అందుబాటులోకి వస్తాయన్నారు.

Advertisements
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...