Jump to content

Amaravati


Recommended Posts

నిర్మాణంలో భద్రత.. నాణ్యత!
27-06-2018 02:11:25
 
636656622864253650.jpg
  • నిర్మాణ రంగంపై సింగపూర్‌, ఏపీ మధ్య ఎంవోయూ
  • ఒక మైలురాయిగా అభివర్ణించిన సీఎం
  • వైజ్ఞానిక, నవ్యావిష్కరణల నగరంగా అమరావతి
  • నిర్మాణ నగరం ఏర్పాటుకు ముందుకొచ్చిన సింగపూర్‌
అమరావతి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌ మధ్య నిర్మాణ రంగానికి సంబంధించి కుదిరిన ఒప్పందం అమరావతి నగర నిర్మాణంలో ఒక మైలురాయి వంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. అత్యంత భద్రత, నాణ్యతతో కూడిన నిర్మాణాలకు ఈ ఒప్పందం దోహద పడుతుందని అన్నారు. అధునాతన, అత్యుత్తమ విధానలు, ఆవిష్కరణలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఇది సహకరిస్తుందని చెప్పారు. సచివాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, సింగపూర్‌ జాతీయాభివృద్ధి శాఖ మంత్రి డెస్మండ్‌ లీ టీ సెంగ్‌ల సమక్షంలో ఎంవోయూపై బిల్డింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ అథారిటీ ఆఫ్‌ సింగపూర్‌ సీఈవో హ్యూగ్‌ లిమ్‌, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వల్లవన్‌ సంతకాలు చేశారు.
 
ఈ సందర్భంగా డెస్మండ్‌ లీ మాట్లాడుతూ... దార్శనికత కలిగిన సీఎం చంద్రబాబు నాయకత్వంతో అమరావతి స్మార్ట్‌, హరిత, సుందర నగరంగా రూపొందడం ఖాయమని అన్నారు. అమరావతి ప్రపంచంలోని ఇతర నగరాల కంటే విలక్షణంగా, విభిన్నంగా రూపొందుతుందని చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ... సింగపూర్‌ స్ఫూర్తితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. 165 కిలోమీటర్ల అవుటర్‌ రింగ్‌ రోడ్డు, శంషాబాద్‌ విమానాశ్రయంతో హైదరాబాద్‌ను ప్రపంచపటంలో ప్రత్యేకంగా నిలిపామన్నారు. ఆ అనుభవంతో అమరావతి నిర్మాణానికి ఉపక్రమించినట్లు చెప్పారు. ఈ కృషిలో సింగపూర్‌ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
 
 
నిర్మాణ నగరం ఏర్పాటుకు సింగపూర్‌ హామీ..
అత్యున్నత స్థాయిలో అమరావతిని నిర్మించాలన్న తమ ఆలోచనకు సహకరించాల్సిందిగా చంద్రబాబు సింగపూర్‌ ప్రతినిధి బృందాన్ని కోరారు. కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్‌ తయారీ రంగంలో ఎగుమతులకు పుష్కల అవకాశాలున్నాయని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సిరామిక్‌ టైల్స్‌, గ్రానైట్‌, మార్బుల్‌ వంటి పరిశ్రమలతోపాటు నిర్మాణరంగానికి సంబంధించిన ఇతర తయారీ యూనిట్లు అనేకం ఉన్నాయని, ఇవన్నీ ఒకేచోట ఉండేలా నిర్మాణరంగ సామగ్రి తయారీ నగరాన్ని నిర్మించాలన్నది తన లక్ష్యమని చెప్పారు.
 
వాయు, ధ్వని కాలుష్యాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం తదితర అంశాల్లో వివిధ దేశాలు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాయని, ఈ రంగాలకు సంబంధించిన పరిశోధనలకు సైతం ఈ నిర్మాణ నగరం మార్గదర్శిగా ఉండాలన్నారు. కాగా.. సీఎం ప్రతిపాదనలకు సింగపూర్‌ ప్రతినిధి బృందం ఆమోదం తెలియజేసింది. వచ్చే నెలలో చంద్రబాబు సింగపూర్‌ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో వీటిపై లోతుగా చర్చించి, తగు నిర్ణయాలు తీసుకుందామని తెలిపింది.
Link to comment
Share on other sites

అమరావతిలో సింగపూర్‌ మంత్రి పర్యటన
28-06-2018 08:21:43
 
636657709041323582.jpg
అమరావతి (ఆంధ్రజ్యోతి): సింగపూర్‌ సాంఘిక, కుటుంబ, జాతీయాభివృద్ధి మంత్రిత్వ శాఖ సెకండ్‌ మినిస్టర్‌ డెస్మండ్‌ లీ టీసెంగ్‌ నేతృత్వంలోని బృందం బుధవారం అమరావ తిలో పర్యటించింది. ఈ బృందానికి సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ అమరావతి రూపకల్పనకు సంబంధించిన విశేషాలను, రాజధాని నగరంలోని వివిధ ప్రాజెక్టుల గురించి తెలియజేశారు.
 
తొలుత ఈ బృందం రాజధానిలోని సీడ్‌ యాక్సెస్‌ రహదారిని పరిశీలించింది. అనంతరం పేదల కోసం మందడం వద్ద నిర్మిస్తున్న గృహసముదాయాన్ని చూ సింది. ఆ తర్వాత కొండమరాజుపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న సీఆర్డీయే ప్రాజెక్ట్‌ కార్యాలయ భవనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుంది. అఖిల భారత సర్వీస్‌ అధికారుల కోసం రాయపూడి వద్ద నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లను పరిశీలించింది. అనంతరం సింగపూర్‌ కన్సార్షియం ఆధ్వర్యంలో అభివృద్ధి పరచనున్న స్టార్టప్‌ ఏరియాను ఈ బృందం తిలకించింది. కార్యక్రమంలో సీఆర్డీయే ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ వై.నాగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

సింగపూర్ బిజినెస్ మిషన్ బృందంతో సీఆర్డీయే చర్చలు
28-06-2018 08:25:14
 
636657711157116966.jpg
  • ఆధునిక సాంకేతికాంశాలపై చర్చ
  • సీఆర్డీయే ఉన్నతాధికారులతో సింగపూర్‌ బిజినెస్‌ మిషన్‌ బృందం
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అనువైన ఆధునిక సాంకేతికాంశాల గురించి సింగపూర్‌ బిజినెస్‌ మిషన్‌ బృందం సీఆర్డీయే ఉన్నతాధికారులకు తెలియజేసింది. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ బృంద సభ్యులు ‘బిమ్‌’ (బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ మోడలింగ్‌) గురించి వివరించారు. 2 డి నుంచి 7 డి వరకూ సాంకేతికాంశాలను, బిమ్‌ నియమ నిబంధనలు, సవాళ్లను తెలిపారు. ప్రికాస్ట్‌ మెటీరియల్‌, ఫొటో ఓల్టాయిక్‌ గ్లాసెస్‌, వ్యాక్యూం గ్లాస్‌, స్మార్ట్‌ లిఫ్ట్‌, రీయూజబుల్‌ ప్రికాస్ట్‌ సిస్టం, ఇన్వెస్టర్స్‌ టౌన్‌షిప్‌, స్థిరాస్తి ప్రాజెక్టులు, వాయుకాలుష్య నియంత్రణ, పర్యావరణ అనుకూల అంతర్గత డిజైన్లు, విద్యుత్‌ ఆధారిత వాహనాల ఛార్జింగ్‌కు అవసరమైన నెట్‌వర్క్‌, ఆర్గానిక్‌ ఫొటో ఓల్టాయిక్‌ సొల్యూషన్స్‌, స్కైఫై టెక్నాలజీ, జీపీఎస్‌ తదితరాంశాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌లో భాగంగా గ్రీన్‌ టెక్నాలజీస్‌, ప్రాజెక్ట్‌ డిజైన్‌, అమలు, విశ్లేషణ గురించి కూడా వివరించారు.
 
 
కార్యక్రమంలో సీఆర్డీయే అదనపు కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌, సీఈలు ఎం. వెంకటేశ్వరరావు, ఎం..జక్రయ్య, టి.ఆంజనేయులు, జక్కా శ్రీనివాసులు, డైరెక్టర్లు జి.నాగేశ్వరరావు (ప్లానింగ్‌), కె.నాగసుందరి (డెవలప్‌మెంట్‌ ప్రమోషన్‌), ఏపీడీఆర్‌ఐ అడ్వైజర్‌ ఆర్‌.రామకృష్ణారావు, ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రిన్సిపల్‌ ప్లానర్‌ ఎన్‌.ఆర్‌.అరవింద్‌, మౌలిక వసతుల విభాగం అదనపు డైరెక్టర్‌ ఎన్‌.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

On 6/24/2018 at 12:47 PM, sonykongara said:

TDP 24x7 @TDP24x7 16m16 minutes ago

 
 

Commissioner of #CRDA, Cherukuri Sreedhar informed #CM Naidu that central park would be developed in 800 acres near the #Amaravati Government Complex. This park should not be confused with the Amaravati Central Park coming up in #Sakhamuru village. #TDP #ncbn #NaraLokesh

DgYu4nAV4AEn__k.jpg

:Terrific: full ga trees pettesi walking and cycling tracks pedithe adhiripothundhi 

Edited by Dravidict
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...