Jump to content

Amaravati


Recommended Posts

భారతమాలలో అమరావతి ఓఆర్‌ఆర్‌
24-03-2018 03:00:54
 
636574572540545880.jpg
  • ఫేజ్‌-1 కిందే పనులు
  • కార్యాచరణ ప్రణాళికలో చేర్చిన ఎంఓఆర్‌టీహెచ్‌
  •  హైదరాబాద్‌-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వేతో లింక్‌
  • ఎన్‌హెచ్‌ 65లో మూడు బైపాస్ లు
అమరావతి, మార్చి 23(ఆంధ్ర జ్యోతి): నవ్యాం ధ్ర రాజధాని అమరావతి ఔటర్‌రింగ్‌రోడ్డుకు లైన్‌క్లియర్‌ అయింది. ఈ ప్రాజెక్టును జాతీయ రహదారుల పద్దులో చేపట్టేందుకు కేంద్రం అంగీకరించింది. దీన్ని ప్రతిష్ఠాత్మక భారతమాల పరియోజనలో చేర్చింది. ఫేజ్‌-1లోనే ఈ ప్రాజెక్టును చేపడతారు. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ (ఎంఓఆర్‌టీహెచ్‌) తన కార్యాచరణ ప్రణాళికలో చేర్చింది. గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవే జాబితాలోనూ చేర్చారు. నిజానికి అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవేను ఈ జాబితాలో చేరుస్తారని అంతా భావించారు. ఎంఓఆర్‌టీహెచ్‌ కూడా తొలినుంచీ ఇదే మాట చెబుతోంది. అయితే ఇప్పుడు దాని ఊసెత్తకుండా, అమరావతి ఔటర్‌రింగ్‌రోడ్డుతోపాటు, విజయవాడ-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రె్‌సవేలో మిగిలిన రహదారి పనులు అంటే బైపా్‌సలను ఇందులో చేర్చారు.
 
2017-18 నుంచి 2021-22 వరకు అమలయ్యే భారతమాల ప్రాజెక్టు వ్యయం రూ.5.35 లక్షల కోట్లు. 53వేల కిలోమీటర్ల రహదారి అభివృద్ధి, విస్తరణ, నిర్మాణం ప్రధాన లక్ష్యం. తొలిదశలో 24వేల కి.మీ. రహాదారుల విస్తరణ, అభివృద్ధి చేస్తారు. ఎక్స్‌ప్రెస్ వేలను భారీగా చేపడతారు. ఢిల్లీ-జైపూర్‌, ఢిల్లీ-అమృతసర్‌-కటారా, కాన్పూర్‌-లక్నో ఎక్స్‌ప్రె్‌సవేలను తొలిదశలో చేపట్టాలని తాజాగా నిర్ణయించారు. దక్షిణాదికి 3 ప్రాజెక్టులే దక్కాయి. హైదరాబాద్‌-విజయవాడ-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవే(హెచ్‌వీఏ), అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు(ఎక్స్‌ప్రెస్‌వే), నాగపూర్‌-హైదరాబాద్‌-బెంగళూరు ఎక్స్‌ప్రె్‌సవేలను చేర్చారు. అయితే, హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారిలో కంచికచర్ల, నందిగామల్లో బైపా్‌సల నిర్మాణంతోపాటు ఈ రహదారిని అమరావతి వరకు విస్తరించాలన్న ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపింది. అమరావతి రింగ్‌రోడ్డును ఈ ప్రాజెక్టు కిందకు తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
మరి మనకెన్ని నిధులు?
భారతమాల ఫేజ్‌1లో ఎక్స్‌ప్రె్‌సవేల నిర్మాణం కోసం రూ.50వేల కోట్లు ఖర్చుపెట్టాలని ఎంఓఆర్‌టీహెచ్‌ ప్రణాళిక రూపొందించింది. ఇందులో ఉత్తరాది ప్రాజెక్టులకే సింహభాగం ఖర్చుకానుంది. మరి అమరావతి రింగ్‌రోడ్డుకు ఏమేరకు నిధులు ఇస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. నవ్యాంధ్ర రాజధాని అవసరాలకోసం 189 కి.మీ. మేర ఆరు వరుసల రింగ్‌రోడ్డును ప్రతిపాదించారు. దీని నిర్మాణ వ్యయం రూ.17,761 కోట్ల పైమాటే. రెండు జిల్లాలు, 87 గ్రామాలను కలుపుతూ నిర్మించే అమరావతి ఔటర్‌లో 11 ప్రధాన వంతెనలు, ఏడు భారీ రైల్వే ప్లైఓవర్‌(ఆర్‌ఓబీ)లు ప్రతిపాదించారు. జి. కొండూరులో 5.5 కి.మీ. పరిధిలోని పీరెచర్లలో 800 మీటర్ల మేర టన్నెల్స్‌ను ప్రతిపాదించారు. ఫేజ్‌-1లో చేపట్టే వర్కుల్లో కృష్ణానదిపై 3.1 కి.మీ. మేర, ఫేజ్‌-2లో 4.8 కి.మీ. మేర ప్రతిష్ఠాత్మక రెండు ఐకానిక్‌ వంతెనలు ఉంటాయి.
 
భూసేకరణ?..భూసమీకరణా?
ఈ ప్రాజెక్టు కోసం 3,404 హెక్టార్లలో భూసేకరణ చేయాలి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డుతోపాటు ఔటర్‌కు కూడా భూసమీకరణకు వెళ్లేయోచనలో రాష్ట్ర సర్కారు ఉంది. దీనిపై రైతుల నుంచి కొంత వ్యతిరేకత వస్తోంది. భూసమీకరణకు వీలుకానిపక్షంలో సర్కారు భూసేకరణకే వెళ్లాలి. దీన్ని ఏదోలా ప్రభుత్వం పరిష్కరిస్తుందని, భారతమాల కింద ఔటర్‌ను చేర్చడం హర్షణీయమని అధికారవర్గాలు చెబుతున్నాయి. ముందుగా నిర్ణయించిన డిజైన్స్‌, ప్రతిపాదనల మేరకే అమరావతి ఔటర్‌రింగ్‌ రోడ్డు నిర్మిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌-విజయవాడ ఎన్‌హెచ్‌ 65లోని మిగిలిపోయిన మూడు బైపాస్ ల నిర్మాణం దీనికిందేచేపడతారు. ఇప్పటికే కంచికచర్ల, నందిగామ తదితర ప్రాంతాల్లో భూమిని సిద్ధం చేశారు.
Link to comment
Share on other sites

అమరావతికి సాయం ఏది?
25-03-2018 03:13:25
 
  • 1.7 లక్షల కోట్లకు ఇచ్చింది 1500 కోట్లే!
  • అందులో 1084కోట్లు ఖర్చు చేశాం
  • కేంద్ర కమిటీ కూడా నిర్ధారించింది
  • పరిపాలనా నగరికి 11600 కోట్లు కావాలి
  •  పనులపై మంత్రి నారాయణ వివరణ
  • మంత్రి వివరణతో క్లారిటీ వచ్చింది: విష్ణు
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాజధాని మాస్టర్‌ప్లాన్‌ అంశం టీడీపీ, బీజేపీ మధ్య అసెంబ్లీలో స్వల్ప వాగ్యుద్ధానికి దారితీసింది. మంత్రి నారాయణ అమరావతి అభివృద్ధిపై సవివరంగా చెప్పిన తర్వాత తనకు క్లారిటీ వచ్చిందని బీజేపీ పక్షనేత విష్ణుకుమార్‌ రాజు పేర్కొనడం గమనార్హం. శనివారం అసెంబ్లీలో రాజధాని అభివృద్ధిపై జరిగిన చర్చలో మాట్లాడిన విష్ణుకుమార్‌ రాజు పలు ఆరోపణలు చేశారు. తాను నిర్మాణ రంగంలోనే ఉన్నానని చెప్పారు. రూ.2 వేల కోట్లతో అద్భుతమైన పరిపాలనా భవనాలు కట్టుకోవచ్చని, 40 వేల కోట్లు, లక్ష కోట్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అత్యద్భుత రాజధాని నిర్మాణం ద్వారా సా మాన్యుడికి జరిగే మేలు ఏమిటో చెప్పాలని కోరారు.
 
తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల తీరును తప్పుపట్టారు. వీటికి సమాధానం ఇచ్చిన మంత్రి నారాయణ.. అమరావతి మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం నిర్మాణాల కు రూ.1.7లక్షల కోట్లు కావాలని, ఇందులో పరిపాలనా నగరికే రూ.11,600 కోట్లవుతుందని తెలిపారు. తాత్కలిక సచివాలయం కోసం భారీగా ఖర్చుచేశారన్న బీ జేపీ ఆరోపణలను ఖండించారు. నిబంధనలకు అనుగుణంగానే పనులు జరిగాయని, ఒక్క రూపాయి కూ డా అదనంగా ఖర్చు చేయలేదని ఆయన చెప్పారు. ప్రస్తుత సచివాలయ భవనాలపై జీ+7 నిర్మాణాలు చేపట్టవచ్చని.. 100 అడుగుల లోతు నుంచి ఫౌండేషన్‌ వే శామన్నారు. ప్రస్తుతం ఉన్న జీ+1 భవనాలను చూసి ఖర్చులను అంచనా వేయవద్దన్నారు.
 
29న పరిపాలనా నగరి డిజైన్ల ఖరారు!
‘ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అ మరావతి మాస్టర్‌ప్లాన్‌ ఉంది. తొమ్మి ది నగరాలతో అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతుంది. 900 ఎకరాల్లో పరిపాలనా నగరం, జస్టిస్‌ సిటీని 450 ఎకరాల్లో నిర్మిస్తున్నాం’ అని నారాయణ తెలిపారు. పరిపాలనా నగరి డిజైన్లు ఈనెల 29వ తేదీన ఖరారు చేసి టెండర్లు పిలుస్తామన్నారు. సక్రమంగానే నిధుల వినియోగం వుందన్నారు. తరువాత బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు ప్రభుత్వాన్ని కొనియాడారు. జీ+7 ప్లాన్‌తో సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం చేపట్టడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
 
రెండేళ్లలో సచివాలయం టవర్లు పూర్తి
సచివాలయం కోసం నిర్మిస్తున్న ఐదు టవర్ల పనులు రెండేళ్లలో పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ టవర్ల 3డి నమూనాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకొనే నిమిత్తం శనివారం అసెంబ్లీ ఆవరణలో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. సాధారణ ప్రజలను, పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఫుడ్‌ కోర్టులు, జిమ్‌, ఇండోర్‌ ప్లే ఏరియాలను, సాధారణ ప్రజలు రావడానికి భవనాల వెనుకవైపు ప్రవేశ మార్గం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక టవర్‌ నుంచి మరో టవర్‌కు వెళ్లడానికి ప్రత్యేకంగా వాకింగ్‌ ట్రాక్‌, దాని మధ్యలో పాలవాగు కనిపించేలా వ్యూ పాయింట్‌ పెడుతున్నట్లు చెప్పారు. టవర్లను డయా గ్రిడ్‌ టెక్నాలజీతో నిర్మించబోతున్నారు.
Link to comment
Share on other sites

విలక్షణంగా ఏపీ సెక్రటేరియట్‌..!
25-03-2018 08:15:20
 
636575625175384199.jpg
  • వైవిధ్యం, సృజనాత్మకతల కలయికగా సెక్రటేరియట్‌
  • సంస్కృతికి అద్దం పడుతూనే.. ఆధునిక నిర్మాణరీతుల అనుసరణ
అమరావతి: నవ్యాంధ్ర రాజధానిలో నిర్మించనున్న సచివాలయ సముదాయపు డిజైన్లు ఒకపక్క మన సంస్కృతీ సంప్రదాయాలను స్ఫురణకు తెస్తూనే మరొకపక్క ఆధునిక నిర్మాణరీతులకు అధిక ప్రాధాన్యమిచ్చేలా రూపుదిద్దుకున్నాయి. అసెంబ్లీ, హైకోర్టుల వంటి ఐకానిక్‌ భవంతుల మాదిరిగానే పరిపాలనా నగరంలోని ప్రతి కట్టడమూ దేనికదే విలక్షణంగా, అందరి మన్ననలు పొందేలా నిర్మితమవ్వాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆదేశానుసారం మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ సెక్రటేరియట్‌ డిజైన్లను తయారు చేసింది. నేత్రపర్వంగా, చూడగానే ఇట్టే ఆకట్టుకునేలా ఉన్న ఈ డిజైన్లు మన రాష్ట్రానికొక ప్రత్యేకతను ఇవ్వడమే కాకుండా యావత్తు భారతదేశానికే గర్వకారణంగా నిలుస్తాయన్న ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
 
కలంకారీ స్ఫూర్తితో 3 డిజైన్లు..
మన రాష్ట్రానికి ప్రపంచ పటంలో సముచితస్థానం దక్కేలా చేయడంలో కీలకపాత్ర పోషించిన కలంకారీ వస్త్రాలు, వాటి డిజైన్ల స్ఫూర్తితో సెక్రటేరియట్‌ సముదాయంలోని 5 టవర్ల బాహ్య రూపం (ఎలివేషన్‌)ను ఈ సంస్థ రూపొందించింది. కలంకారీ డిజైన్లలో విశేషాదరణ చూరగొంటున్న 3 ఆకృతులను ఎంపిక చేసి, వాటిని అనుసరిస్తూ 3 రకాల ఎలివేషన్లను సూచించింది. ఈ మూడూ కూడా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉన్నాయని వాటిని గత 3 రోజులుగా జరిగిన ప్రదర్శనల్లో తిలకించిన చంద్రబాబు, అసెంబ్లీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. వీటిల్లో అత్యధికులు మెచ్చిన డిజైన్‌ను త్వరలోనే ఖరారు చేయనున్నారు.
 
మధ్యలో పిల్లర్లు నివారించేందుకు డయాగ్రిడ్‌..
మనం ఇప్పటి వరకూ పాటిస్తున్న కన్‌స్ట్రక్షన్‌ డిజైన్ల కారణంగా హాళ్ల మధ్య పిల్లర్లు రావడం అనివార్యమవుతోంది. ఫలితంగా పలు ఇబ్బందులు తలెత్తుతుండడంతోపాటు ఎంతో విలువైన స్థలమూ వృథా అవుతుంటుంది. వీటిని నివారించే ఉద్దేశ్యంతో నార్మన్‌ ఫోస్టర్‌ పిల్లర్ల విధానం కాకుండా అత్యాధునికమైన డయాగ్రిడ్‌ మోడల్‌ను ఎంచుకుంది. భవంతి బరువు మొత్తాన్ని పిల్లర్ల మాదిరిగా భరించే ఈ డయాగ్రిడ్‌ వాటిలాగా ఎక్కడా హాళ్ల మధ్య అడ్డుగా రాదు. దీంతో కార్యాలయాలు సువిశాలంగానూ, ఎంతో సుందరంగానూ ఉంటాయి. ఈ విధానంలో మన సచివాలయ సముదాయమంతటి భారీ భవనాలు నిర్మితమవనుండడం భారతదేశంలోనే ఇదే ప్రథమమంటున్నారు. పైగా.. డయాగ్రిడ్‌ విధానంలో వాడే స్టీల్‌ పరిమానం సాధారణ నిర్మాణ విధానంతో పోల్చితే కనీసం 20 శాతం తగ్గనుండడం మరొక కీలకాంశం. దీనివల్ల నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గనుంది.
 
పలు ప్రత్యేకతల సమాహారంగా డిజైన్లు..
సచివాలయ డిజైన్లలో మరి కొన్ని విశేషాలూ ఉన్నాయి. మన వాతావరణ పరిస్థితులు, ఇక్కడి ఉష్ణోగ్రతలను అనుసరించి ఎండవేడిమి, ఉక్కపోతను గణనీయంగా తగ్గించేందుకు ఉపకరించేలా ఈ డిజైన్ల రూపకల్పనలో మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ సంస్థ పలు జాగ్రత్తలు తీసుకుంది. ఈ టవర్లపైకి ఎండ పడడాన్ని సాధ్యమైనంతగా తగ్గించి, ఆ స్థానంలో నీడ ఉండేలా చూడడం ద్వారా వాటిలోపల వేడిమిని కనీసం కొన్ని డిగ్రీలమేరకైనా తగ్గించడం లక్ష్యంగా విస్తృత కసరత్తు చేసింది. ఈ టవర్ల నిర్మాణం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలుగకుండా చూసేందుకుగాను వాటికి సంబంధించిన పలు భాగాలను వేరొకచోట తయారు చేయించి, నిర్మాణస్థలంలో వాటిని ‘అసెంబుల్‌’ చేసుకునే వీలునూ కల్పించింది.
 
   రీసైకిల్డ్‌ స్టీల్‌తోపాటు స్థానికంగా లభించే బిల్డింగ్‌ మెటీరియల్‌ను నిర్మాణంలో పెద్దఎత్తున వాడాలని కూడా ప్రతిపాదించారు. పైగా.. ఇలాంటి బహుళార్ధసాధక నిర్మాణ రీతులను అనుసరించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సరసన మన రాష్ట్రం చేరుతుంది. స్థానిక కార్మికులకు అంతర్జాతీయస్థాయి, అత్యధునాతన భవంతుల నిర్మాణంపై అవగాహన పెరిగి, వారి అభ్యున్నతి సాధ్యమవుతుంది. తద్వారా ఈ ప్రాంతంలో ఆర్ధిక వ్యవస్థ పురోగతికి మరింత వేగంగా బాటలు పడతాయి.
Link to comment
Share on other sites

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై పచ్చదనానికి శ్రీకారం
25-03-2018 09:13:25
 
636575660021178188.jpg
  • సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మధ్యన..
  • ప్రయోగాత్మకంగా రెండు రకాల మొక్కలు
  • అభిప్రాయ సేకరణ తర్వాత ఒకటి ఖరారు
అమరావతి: రాజధానికి జీవనాడిగా పేర్కొనదగిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును మరింత పచ్చదనంతో నింపేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఉద్యుక్తమవుతోంది. ఇప్పటికే ఈ రహదారికి ఒకపక్కన 15 మీటర్ల వెడల్పున, 3 వరుసల మొక్కలతో గ్రీన్‌ బఫర్‌ జోన్‌ను అభివృద్ధి పరచే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టి, చురుగ్గా కొనసాగిస్తున్న ఈ సంస్థ తాజాగా రోడ్డు మధ్యన ఉండే డివైడర్లపై కూడా మొక్కలను నాటడాన్ని శనివారం నుంచి ప్రారంభించింది.
 
ప్రయోగాత్మకంగా..
వెంకటపాలెం వద్ద మొదలెట్టిన ఈ ప్రయోగాత్మక కార్యక్రమంలో భాగంగా 2 రకాల మొక్కలను నాటించింది. వీటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి చూపి ఆయన అభిప్రాయం తెలుసుకోవడంతోపాటు ఆ మార్గంలో రాకపోకలు సాగించే వివిధ వర్గాల అభిప్రాయాలను కూడా తీసుకుని, ఆ 2 రకాల్లో ఒకదానిని ఖరారు చేసి, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పొడవునా ఆ మొక్కలనే నాటించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ 2 మొక్కలూ కాకుండా మరి కొన్ని రకాల మొక్కలను ప్రయత్నిం చాల్సిందిగా కనుక ముఖ్యమంత్రి ఆదేశిస్తే వెంటనే ఆ ప్రకారం చేసేందుకూ ఏడీసీ సిద్ధంగా ఉంది. ఇలా నాటే వివిధ రకాల మొక్కల్లో అత్యధికుల మన్ననలు చూరగొన్నదేమిటన్నది సుమారు వారం రోజుల్లో తేలిపోనుందని సమాచారం. ఆ వెంటనే సదరు జాతి మొక్కలను దశలవారీగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు డివైడర్లపై నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
 
   సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు మధ్యభాగాన ఉండే 2 డివైడర్లూ వెడల్పయినవే. ఒకదాని వెడల్పు 3 మీటర్లు కాగా.. 2వ దాని వెడల్పు 2.3 మీటర్లు. వీటిపై ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నాటిన మొక్కల్లో ఒక రకం కేవలం కనులకింపుగా ఉండేవి కాగా వేరొక రకం నీడనిచ్చేవి. వీటిల్లో దేనిని సీఎం, ప్రజలు మెచ్చితే ఆ రకానివే సుమారు 18 కిలోమీటర్లకుపైగా పొడవుండే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మధ్యన కొలువుదీరనున్నాయి. ఈ మొక్కలను నాటగా, డివైడర్లపై మిగలనున్న ఖాళీ స్థలాల్లో ఎత్తు తక్కువుండే ఆకర్షణీయమైన మొక్కలను పెంచనున్నారు. కాగా.. ఈ రహదారికి పక్కన ఉన్న గ్రీన్‌ బఫర్‌ జోన్‌లో వెంకటపాలెం నుంచి రాయపూడి మధ్య ఇప్పటి వరకూ సుమారు 5,000 మొక్కలను ఏడీసీ నాటించింది. అక్కడి నుంచి దొండపాడు వరకు మరొక 1500 మొక్కలను నాటబోతోంది. అయితే.. వంతెనల నిర్మాణం, కొన్ని సమస్యల కారణంగా అక్కడక్కడా రోడ్డు ఏర్పాటు జరగనందున వెంకటపాలెం- దొండపాడుల మధ్య కొన్ని ప్రదేశాల్లో మొక్కలను నాటలేకపోయారు. అవన్నీ ఒక కొలిక్కి వచ్చిన వెంటనే ఆయా ప్రదేశాల్లోనూ 3 వరుసల్లో వేర్వేరు మొక్కలను నాటేందుకు ఏడీసీ సంసిద్ధంగా ఉంది.
Link to comment
Share on other sites

అనుమానాలొద్దు.. 8 అంతస్థుల్లో నిర్మించే భవనాలవి

ఈనాడు, అమరావతి: అసెంబ్లీ, సచివాలయం భవనాలను 8 అంతస్థుల్లో నిర్మించేలా రూపకల్పన చేసి (డిజైన్‌).. జీ+1లో చేపట్టామని ఇందుకు చేపట్టే ఖర్చుపై చాలామంది అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ అసెంబ్లీలో శనివారం అన్నారు. ‘అమరావతి రాజధాని అభివృద్ధి’ అనే అంశంపై ప్రత్యేక చర్చ సందర్భంగా భాజపా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. విశాఖలాంటి మహా నగరంలో చదరపు అడుగు నిర్మాణం కోసం రూ.2,500 ఖర్చు చేస్తుంటే, అసెంబ్లీ, సచివాలయ నిర్మాణం కోసం రూ.5 వేలకుపైగా ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై మంత్రి నారాయణ సమాధానమిస్తూ.. 8 అంతస్థులు అభివృద్ధి చేసేలా పరిమితికంటే లోతులో పునాదులు తీయడంతో ఖర్చు భారీగా పెరిగిందని, ఈ భవనాలు తాత్కాలికంగా మిగిలిపోకుండా భవిష్యత్తులోనూ ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగపడాలనే ఈ విధంగా నిర్మించామని అన్నారు. దీంతో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఈ విషయం తనకు తెలియకే సందేహించానని సభలో మళ్లీ వివరణ ఇచ్చారు.

శాసనసభలో ‘సచివాలయం’ ఆకృతుల ప్రదర్శన
రాజధాని అమరావతిలో పరిపాలన నగరంలో నిర్మించే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ఆకృతుల్ని శనివారం శాసనసభ ఆవరణలో సభ్యులకు ప్రదర్శించారు. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, పలువురు మంత్రులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు వాటిని పరిశీలించారు. ఆకృతులు బాగున్నాయని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో, ఎక్కువ నాణ్యతతో వాటిని నిర్మించాలని సూచించామని స్పీకర్‌ మీడియా ప్రతినిధులకు తెలిపారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...