Jump to content

Amaravati


Recommended Posts

మరో 14 వేల ఎకరాలు

రాజధాని కోసం రెండోదశలో సమీకరణ

మూడు గ్రామాల రైతుల విజ్ఞప్తి పరిశీలనకు నిర్ణయం

29 గ్రామాల రైతులకు స్థలాలిచ్చిన తర్వాతే

సచివాలయం, హెచ్‌ఓడీ భవనాల ఆర్కిటెక్ట్‌గా నార్మన్‌ ఫోస్టర్‌

హోటళ్లు, ఆస్పత్రులు, స్కూళ్లకు బిడ్డింగ్‌ విధానానికి స్వస్తి

చౌక ధరలకు భూములు కేటాయించాలని నిర్ణయం

జులై మొదటి వారంలో అన్ని రహదారులకు టెండర్లు

సీఎం నేతృత్వంలో సీఆర్‌డీఏ అథారిటీ చర్చ

ఈనాడు - అమరావతి

16ap-main1a.jpg

శని, ఆదివారాల్లో కూడా మనవడిని చూసేందుకు హైదరాబాద్‌ వెళ్లకుండా అమరావతి బ్రాండింగ్‌ కోసం ఇక్కడే ఉంటున్నా. పెరుగుతున్న అమరావతి బ్రాండ్‌కి అనుగుణంగా 7 స్టార్‌, 5 స్టార్‌ హోటళ్లు వస్తే విదేశాల నుంచి రాకపోకలు పెరుగుతాయి.

పోలవరం ప్రాజెక్టు పనులు కళ్లముందు కనిపిస్తున్నాయి. ప్రజా రాజధాని నిర్మాణం కూడా కంటిముందు కనిపించేలా అధికారులు పనుల్లో జోరు పెంచాలి.

ప్రపంచంలో ఎలాంటి సాంకేతిక ఆవిష్కరణైనా మొదట సింగపూర్‌లో జరుగుతుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్‌కి పోటీగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నా.
- ముఖ్యమంత్రి చంద్రబాబు

రాజధాని అమరావతి కోసం తమ భూముల్ని కూడా భూసమీకరణలో తీసుకోవాలని మూడు సమీప గ్రామాల రైతులు చేస్తున్న విజ్ఞప్తిని పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మూడు గ్రామాలు రాజధానిని ఆనుకుని ఉంటాయి. అవన్నీ మెట్టభూములు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన 29 గ్రామాల రైతులకు, స్థలాలు తిరిగి ఇచ్చే ప్రక్రియ పూర్తయిన తర్వాత.... ఆ మూడు గ్రామాల్లో భూసమీకరణ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. రెండోదశ సమీకరణ కింద ఆ గ్రామాల నుంచి సుమారు 14 వేల ఎకరాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలోని ఆయన కార్యాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పదో అథారిటీ సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. రాజధానిలోని పరిపాలనా నగరంలో నిర్మించే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ఆకృతుల రూపకల్పన బాధ్యతను కూడా లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థకే అప్పగించారు. రాజధానిలో స్టార్‌ హోటళ్లు, ఆస్పత్రులు, జాతీయ, అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటుకి టెండరు విధానంలో పెద్దగా స్పందన రానందున, భూమి కేటాయింపు విధానంలో... ప్రముఖ సంస్థలకు చౌక ధరలకు భూములు కేటాయించాలని నిర్ణయించారు. కేంద్ర రాజధాని ప్రాంతంలో 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్న సింగపూర్‌ సంస్థల కన్సార్టియం ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ)తో కలసి

అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) పేరుతో ప్రత్యేక వాహక సంస్థ (ఎస్‌పీవీ) ఏర్పాటు, స్టార్టప్‌ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టాలి? ఏ కంపెనీలను తీసుకురావాలి? సుస్థిరాభివృద్ధి ఎలా సాధించాలి? అన్న అంశంపై కూలంకషంగా చర్చించారు. సింగపూర్‌ కన్సార్టియం ప్రతినిధులు ఆగస్టు నెలాఖరులో మరోసారి వస్తారు. సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరికొన్ని కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

నిర్ణయాలు... నిర్దేశాలు...

* హోటళ్లు, ఆస్పత్రులు, పాఠశాలల ఏర్పాటుకి బిడ్డింగ్‌ విధానం పక్కన పెట్టి, ప్రపంచ ప్రసిద్ధి చెందిన 50 సంస్థలతో సంప్రదింపులు జరపాలి. వారు అమరావతికి వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలి. అగ్రశ్రేణి సంస్థలకు విట్‌, ఎస్‌ఆర్‌ఎం వంటి యూనివర్సిటీలకు ఇచ్చినట్టుగానే... ఇంత ధరని నిర్ణయించి, భూములు కేటాయిస్తారు. ఈ సంస్థల నుంచి వచ్చే ప్రతిపాదనలు సీఆర్‌డీఏ ద్వారా మంత్రుల కమిటీకి వెళతాయి. మంత్రుల కమిటీ సిఫారసు మేరకు, దాన్ని రాష్ట్ర మంత్రివర్గానికి పంపించి, అక్కడ నిర్ణయం తీసుకుంటారు.

* అంతర వలయ రహదారి నిర్మాణం కోసం జులై తర్వాత భూసమీకరణకు సిద్ధమవ్వాలని ముఖ్యమంత్రి సూచన. రాజధానిలోని ప్రధాన రహదారులన్నిటికీ ఈ నెలాఖరులోపు టెండర్లు పిలవాలని ఆదేశం. కొన్ని రహదారులు ప్రపంచబ్యాంకు నిధులతో చేపడుతున్నందున, ఆ సంస్థకు డీపీఆర్‌లు పంపించామని, 15 రోజుల్లో అనుమతులు వస్తాయని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. జులై మొదటివారంలో అన్ని రహదారులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు.

16ap-main1b.jpg

* పరిపాలనా నగరంలో సచివాలయంకోసం 9,22,594 చదరపు అడుగులు, విభాగాధిపతుల కార్యాలయాల కోసం 38,89,222 చదరపు అడుగుల భవనాల నిర్మాణం. వీటికి వివరణాత్మక ఆకృతుల రూపకల్పనకు ఆర్కిటెక్ట్‌గా నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ ఎంపిక. హైదరాబాద్‌లోని చంద్రశేఖర్‌ అండ్‌ కంపెనీతోకలసి డిజైన్లు రూపొందించనున్న నార్మన్‌ఫోస్టర్‌. బిడ్డింగ్‌లో మూడు సంస్థలు పోటీ పడగా ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ ఎంపికైంది.

* అమరావతిని హరిత భవనాలు, సుస్థిర పర్యావరణానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ‘ద ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌(తెరి)ని కన్సల్టెంట్‌గానియమిస్తూ నిర్ణయం.

* రాజధాని గ్రామాల ప్రజలకు స్వచ్ఛమైన నీరందించేందుకు వెంకటపాలెం వద్ద ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకానికి పరిపాలన అనుమతులు.

* జపాన్‌ సంస్థ జైకా అందించే సాంకేతిక శిక్షణ కోసం కొంత మంది అధికారులను ఆ దేశానికి పంపించాలని నిర్ణయం.

* 900 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా నగరంతో పాటు, దానికి కొనసాగింపుగా 454 ఎకరాల్లో నిర్మించే జస్టిస్‌ సిటీకి కూడా నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ నుంచే ప్ర¾ణాళిక, ఆకృతులు తీసుకోవాలన్న ప్రతిపాదనకు సమావేశం ఆమోదముద్ర. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే హడ్కో నుంచి రూ200 కోట్ల రుణం తీసుకున్నట్టు ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారధి సమావేశంలో వెల్లడించారు.

* విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో జరుగుతున్న పనులకు వర్తించే 40 శాతం లేబర్‌ కాంపొనెంట్‌ ఏరియా అలవెన్స్‌ని అమరావతిలోని పరిపాలనా నగరంలో జరిగే పనులకు వర్తింపజేయాలని నిర్ణయం.

విజయవాడ మెట్రోపై...

ముఖ్యమంత్రి సూచన మేరకు విజయవాడలో మెట్రో రైలుకి బదులుగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేశామని, కానీ ఈ సమావేశంలో దానిపై ఎలాంటి నిర్ణయం జరగలేదని అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి విలేఖరులకు తెలిపారు. విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకి రూ.7 వేల కోట్లు ఖర్చవుతుందని, అదే ఎలివేటెడ్‌ కారిడార్‌పై బస్సులు నడిపే ప్రాజెక్టు అయితే రూ.2500 కోట్లతో పూర్తి చేయవచ్చునని అన్నారు.

అమరావతి ఇక ఆవిష్కరణల కేంద్రం

తక్కువ ఖర్చుతో గృహ నిర్మాణం, పర్యాటకాభివృద్ధి, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సామర్థ్యం పెంపు తదితర అంశాల్లో సింగపూర్‌ సహకారం ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్‌ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ చాంగ్‌ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఏపీని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న తన లక్ష్యానికి సహకరించాలని ఫ్రాన్సిస్‌ను కోరారు.

Link to comment
Share on other sites

మరో మూడు గ్రామాల్లో భూసమీకరణ ప్రతిపాదనలు:చంద్రబాబు
 
 
636332892630526810.jpg
అమరావతి: రాజధానిలోని మరో మూడు గ్రామాల్లో భూసమీకరణ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రింగ్ రోడ్డుకు భూసేకరణ చేస్తుండంతో తమ గ్రామాల్లోని భూములనూ కూడా భూసమీకరణలోకి తీసుకోవాలని గ్రామస్థులు కోరినట్లు చెప్పారు. 14వేల ఎకరాలను భూసమీకరణలోకి తీసుకునే విధంగా ప్రతిపాదనలు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం రాజధానిలో ఉన్న 29 గ్రామాల రైతులకు ప్లాట్లు ఇచ్చిన తరువాత భూసమీకరణకు వెళ్లే అంశాన్ని పరిశీలించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Link to comment
Share on other sites

అమరావతిలో విద్యావికాసం
 
 
636333710611775098.jpg
  • అమరావతిలో విద్యావికాసం
  • ప్రారంభానికి సిద్ధమవుతున్న వర్సిటీలు
  • సకల హంగులతో తీర్చిదిద్దుతున్న నిర్వాహకులు
  • వేలమంది భవితే లక్ష్యంగా దేశ, విదేశీ ఉపాధ్యాయులతో బోధన

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాజధాని అమరావతి విశ్వవిద్యాలయాల వాడగా రూపుదిద్దుకుంటోంది. జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న వెల్లూర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(విట్‌), శ్రీ రామస్వామి మెమోరియల్‌ (ఎస్‌ఆర్‌ఎం) విశ్వవిద్యాలయాలు అమరావతిలో కొద్ది రోజుల్లో తరగతులను ప్రారంభించనున్నాయి. ఇంజనీరింగ్‌, ఎంబీఏ కోర్సులతో నెల తేడాతో రెండు యూనివర్సిటీల్లో క్లాసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో రెండు యూనివర్సిటీలు ప్రారంభంకాబోతుండగా, రాబోయే విద్యా సంవత్సరంలో అమృతసాయి విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. మంత్రుల పర్యవేక్షణ ద్వారా ఎప్పటికపుడు నివేదికలను సేకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఆర్‌డీఏ అధికారులకు సలహాలిస్తూ, కావలసిన సదుపాయాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. జూలై 19 నుంచి విట్‌లో, ఆగస్టు 7 నుంచి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో తరగతులు ప్రారంభిస్తున్నారు. రూ.1200 కోట్లతో నిర్మితమవుతున్న విట్‌ మొదటి దశ పనులు 2022 నాటికి పూర్తి చేయాలని విశ్వవిద్యాలయ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. 60లక్షల చ దరపు అడుగుల్లో నిర్మిస్తున్న ఈ వర్సిటీలో ప్రస్తుత అవసరాల మేరకు పూర్తిసౌకర్యాలతో కూడిన భవనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అలాగే రూ.3వేలకోట్లతో నిర్మిస్తోన్న ఎస్‌ఆర్‌ఎంని మొదటి దశలో 10లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు.

వేల సంఖ్యలో విద్యార్థులు
ఒక్క విట్‌లోనే సుమారు 12వేలమంది చదువుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుత సంవత్సరంలో యూజీలో 660, పీజీలో 120, పీహెచ్‌డీలో 50 మంది వెరసి 830 మందికి ఈ సంవత్సరం అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో ప్రస్తుత సంవత్సరం 240మందికి అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం అన్నీ యూజీ కోర్సులనే అందుబాటులో ఉంచారు. ఎస్‌ఆర్‌ఎంలోని విద్యార్థులకు ఉన్నతస్థాయి బోధనల నిమిత్తం దేశ, విదేశాల్లో పనిచేసిన 27మంది ప్రొఫెసర్లతోపాటు నలుగురు విదేశీ ప్రొఫెసర్లతో బోధనను అందించనున్నారు.

నూతన హంగులతో సదుపాయాలు
ప్రస్తుత సంవత్సరం జి+2 అంతస్తులతో నిర్మితమవుతున్న విట్‌ వర్శిటీలో మొత్తం 13 క్లాస్‌రూంలు, 3 కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ఫిజిక్‌ ల్యాబ్‌, ఎలక్ర్టానిక్‌ ల్యాబ్‌, మెకానికల్‌ ల్యాబ్‌, వర్క్‌షాప్‌, లైబ్రరీ అందుబాటులో ఉంటాయి. అలాగే రూ.3వేల కోట్లతో ప్రస్తుత సంవత్సరంలో 6లక్షల చదరపు అడుగుల అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం చక్కటి సౌకర్యాలతో రాబోయే విద్యార్థులకు స్వాగతం పలుకుతోంది. అండర్‌గ్రాడ్యుయేట్‌లోని నాలుగు కోర్సులతో ప్రారంభమవుతన్న వర్సిటీలో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సుమారు 11క్లాసు రూములతో నిర్మితమవుతున్న వర్సిటీలో 12 ల్యాబ్‌లు, అత్యాధునిక డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటుచేయబోతున్నారు. రాబోయే రెండేళ్లలో 4 శాటిలైట్స్‌ తయారీ, హైడ్రోజన్‌ పవర్డ్‌ ట్రెయిన్‌ రూపకల్పనే లక్ష్యంగా ప్రారంభిస్తున్నట్టుగా నిర్వాహకులు స్పష్టం చేస్తున్న ఈ వర్శిటీ ’’బ్లూ ఎకానమీ సెంటర్‌’’తో దేశంలోనే మొదటిసారి ప్రారంభమవుతున్న వర్శిటీగా ఘనతగాంచింది.

మంచినీటి సరఫరాపై దృష్టి
ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని ప్రాంతంలో నీరు, విద్యుత్తు, రోడ్లు, రవాణా, యూజీడీ వంటి పలు సౌకర్యాలను వేగంగా అందించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేస్తున్నారు. హుటాహుటిన మంచినీటి సదుపాయాలను అందించే విధంగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్‌ 26కల్లా మంచినీటి సౌకర్యాలకు సంబంధించిన పనులన్నీ పూర్తయి, వర్సిటీకి మంచినీరు అందాలని సీఆర్‌డీఏ అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. రహదారుల అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్నట్టుగా నారాయణ తెలియజేశారు. డిసెంబరుకల్లా మొదటి దశ లేయర్‌ పనులను పూర్తి చేస్తామని అన్నారు. ఎస్‌ఆర్‌ఎమ్‌కు హాస్టల్‌ వసతి ఉన్నందున రవాణా ద్వారా ఇబ్బంది కలిగే అవకాశంలేదని, విట్‌కు ఉదయం 8 గంటలకే క్లాసులు ప్రారంభమవుతాయని, వారికి బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

రాజధాని పేదలకు 5,024 గృహాలు

జీ+3 విధానంలో మూడు విభాగాలుగా నిర్మాణం

పది ప్రాంతాలు ఎంపిక చేసిన సీఆర్‌డీఏ

ఒక్కో చోట 500 ఇళ్ల నిర్మాణం

ఈనాడు - అమరావతి

రాజధాని గ్రామాల్లో సొంత ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం 5,024 గృహాలు నిర్మించనుంది. రాజధాని పరిధిలో పది చోట్ల వీటిని నిర్మిస్తారు. ఒక్కో చోట ఐదెకరాల చొప్పున మొత్తం 50 ఎకరాల్ని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కేటాయించింది. ఒక్కో చోట 500 ఇళ్ల చొప్పున నిర్మిస్తారు. నిర్మాణ బాధ్యతను ఏపీటిడ్కో చేపడుతుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద మొత్తం మూడు విభాగాల్లో, జీ+3 విధానంలో ఇళ్లు నిర్మిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.లక్షన్నర చొప్పున మొత్తం రూ.3 లక్షలు రాయితీగా ఇస్తాయి. మిగతా మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా అందజేస్తారు. బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాలి. ఇళ్ల నిర్మాణానికి రూ.344.97 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

ప్రాంతాల ఎంపిక..!

రాజధాని గ్రామాల్లో ఇళ్లులేని పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని రాజధాని భూసమీకరణ సమయంలో ప్రభుత్వం హామీనిచ్చింది. సీఆర్‌డీఏ నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వేలో రాజధాని గ్రామాల్లో సొంత ఇళ్లులేని పేద కుటుంబాలు ఏడు వేల వరకు ఉన్నట్టు అంచనా వేశారు. వీరిలో చాలా మంది ఆక్రమించిన స్థలాల్లోని తాత్కాలిక నిర్మాణాల్లోను, అద్దె ఇళ్లలోను ఉంటున్నారు. తొలి దశలో 5,024 మందికి ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. బోరుపాలెం, అనంతవరం, శాఖమూరు, ఉండవల్లి, పెనుమాక, ఐనవోలు, నిడమర్రు, నవులూరు, నేలపాడు, మందడం గ్రామాల పరిధిలో ఇళ్లను నిర్మిస్తారు.

త్వరలోనే టెండర్లు

పేదల కోసం 300 చ.అడుగుల ఇళ్లు 992, 365 చ.అడుగుల ఇళ్లు 1536, 430 చ.అడుగుల ఇళ్లు్ల 2496 నిర్మిస్తారు. యూనిట్‌ వ్యయాన్ని 300 చ.అడుగుల ఇంటికి రూ.5.74 లక్షలు, 365 అడుగుల ఇంటికి రూ.6.60 లక్షలు, 430 అడుగుల ఇంటికి రూ.7.48 లక్షలుగా నిర్ణయించారు. లబ్ధిదారు తనకు నచ్చిన విభాగం ఇంటిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ మూడు విభాగాల ఇళ్లల్లో దేనికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.మూడు లక్షల రాయితీ మాత్రమే లభిస్తుంది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారే భరించాలి. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని.. ఇంటి నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం తనకు అప్పగించిన తర్వాత నెలవారీ వాయిదాల రూపంలో చెల్లించాలి. 15 నెలల్లో ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.

Link to comment
Share on other sites

ఆర్థికాభివృద్ధి కేంద్రంగా అమరావతి

పురపాలక మంత్రి నారాయణ

ఈనాడు, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలకు నిలయంగా అమరావతిని తీర్చిదిద్దనున్నట్లు పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిని ఆర్థికాభివృద్ధి కేంద్రం (ఎకనమిక్‌ గ్రోత్‌ సెంటర్‌)గా మార్చాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని, వచ్చే ఏడాది చివరినాటికి మరిన్ని సంస్థలను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌తో కలిసి అమరావతిలో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన విట్‌, ఎస్‌ఆర్‌ఎంలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే నెల 19నుంచి విట్‌ తరగతులు ప్రారంభం కానుండగా, ఎస్‌ఆర్‌ఎం ఆగస్టు 7న తరగతులు ఆరంభించనుందని వివరించారు. ఎస్‌ఆర్‌ఎం రాబోయే నాలుగేళ్లలో నాలుగు ఉపగ్రహాల తయారీ, హైడ్రోజన్‌ శక్తితో నడిచే రైలు, బ్లూఎకనమిక్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనుందని వివరించారు. విట్‌ సంస్థలో ఈ విద్యా సంవత్సరంలో పట్టభద్రులకు 660, స్నాతకోత్తర పట్టభద్రులకు 120, పరిశోధనలో 50మంది విద్యార్థులను తీసుకుంటారని వెల్లడించారు. వసతిగృహాలను విట్‌ గుంటూరులో ఏర్పాటుచేసిందని, అక్కడినుంచి విద్యార్థులను బస్సుల్లో తీసుకువస్తారని తెలిపారు. ఎస్‌ఆర్‌ఎం స్థానికంగానే వసతిగృహాలు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. అమరావతిలో ఏర్పాటుచేస్తున్న విద్యా సంస్థలు ప్రభుత్వం విధించిన లక్ష్యాలను చేరుకుంటున్నాయని వివరించారు. రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న రోడ్లపై నవంబరు, డిసెంబరు నెలల్లోపు ఒక పొర (లేయర్‌) పూర్తి చేస్తామని తెలిపారు.

Link to comment
Share on other sites

అమరావతిలో డిజైన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌!
 
 
636333519223231822.jpg
  • భూములిచ్చిన రైతుల వారసులకు నైపుణ్య శిక్షణ
  • టౌన్‌షిప్‌ల అభివృద్ధికీ సమగ్ర నివేదిక.. సింగపూర్‌ ప్రభుత్వ సంసిద్ధత
హైదరాబాద్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ‘ఏపీ డిజైన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ను ఏర్పాటు చేస్తామని సింగపూర్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది. రాజధాని ప్రాంతంలో టౌన్‌షి్‌పల అభివృద్ధిపైనా సమగ్ర నివేదికను అందిస్తామని.. ఇందుకు సంబంధించి సీఆర్‌డీఏకు సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొంది. ఇదే సమయంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతు కుటుంబాల వారసులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను అందజేస్తామని వెల్లడించింది.
 
వీటితో పాటు రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు అనువైన 28 ప్రతిపాదనలతో త్వరలోనే సింగపూర్‌ ప్రతినిధులు సీఆర్‌డీఏతో సమావేశం కానున్నారు. అమరావతి నగర సమగ్రాభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు 28 మంది సభ్యులతో కూడి బృందాన్ని సొంత ఖర్చులతో విజయవాడకు పంపిన సింగపూర్‌.. రాజధాని నిర్మాణంలో సీఆర్‌డీఏకు అందుబాటులో ఉంటూ.. సలహాలు, సూచనలు ఇచ్చేందుకు నలుగురు సీనియర్‌ అధికారులను కేటాయించింది.
 
ఈ నలుగురూ సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌తో నిత్యం సంప్రదింపులు జరుపుతూ.. సాంకేతిక సలహాలను ఇస్తారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి, పరిశ్రమల శాఖ సహాయ సహకారాలను తీసుకుంటున్న సీఆర్‌డీఏ అధికారులు ఇప్పుడు.. సింగపూర్‌ అధికారుల నుంచి సహకారం తీసుకోనున్నారు. ఇప్పటికే సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, కమిషనర్‌ శ్రీధర్‌తో సింగపూర్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. మాస్టర్‌ ప్లాన్‌, ఏడీబీ సహకారంతో పెట్టుబడుల గురించి చర్చించి.. డిజైన్‌ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ ప్రతిపాదనను వారి ముందుంచారు. సింగపూర్‌కు చెందిన వివిధ మంత్రిత్వ శాఖల అధికారులే నేరుగా రాజధాని అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు రావడం .. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఉన్న విశ్వసనీయతకు నిదర్శనమని అధికారులు పేర్కొంటున్నారు
Link to comment
Share on other sites

ఉండవల్లిలో సీఎం ఇంటి విస్తరణ
 
 
636333523030480611.jpg
  • అర ఎకరం కేటాయింపు.. చర్యలు చేపట్టిన సీఆర్డీఏ
  •  గ్రీవెన్స్‌ సెల్‌, భారీ సమావేశ మందిరం ఏర్పాటు
అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ఉండవల్లిలో కృష్ణానది కరకట్ట పక్కన ఉన్న సీఎం చంద్రబాబు నివాసగృహాన్ని భారీగా విస్తరించేందుకు ఏపీసీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆ ఇంటికి పక్కనే ఉన్న సుమారు అర ఎకరంపైగా భూమిని కేటాయించింది. వాస్తవానికి ఈ విస్తరణ యోచన చాలా రోజుల నుంచే ఉన్నప్పటికీ ఇందుకు అవసరమైన భూమిని పూలింగ్‌ ప్రాతిపదికన ఇచ్చేందుకు దాని యజమాని ఇప్పటి వరకు అంగీకరించకపోవడంతో జాప్యమైంది.
 
అయితే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీఏ ఉపాధ్యక్షుడైన పి.నారాయణ, సీఆర్డీయే అధికారులు పట్టు విడవకుండా కృషి చేయడంతో ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితమే భూమిని ఇచ్చేందుకు యజమాని అంగీకరించారు. దీంతో శనివారం సాయంత్రం నారాయణ, సీఆర్డీఏ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌, వాస్తు పండితులు తదితరులు సదరు భూమిని పరిశీలించి, అందులో చేపట్టనున్న వివిధ నిర్మాణాల గురించి చర్చించుకున్నారు. సీఎం ఇంటి వద్ద ఉన్న పార్కింగ్‌ ప్రదేశానికి, కరకట్ట రోడ్డుకు మధ్య ఉన్న ఈ ప్రదేశంలో ప్రతిపాదిత నిర్మాణాలను వెంటనే చేపట్టి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
 
ప్రజల కోసమే విస్తరణ
సీఎం ఇంటి విస్తరణ వ్యక్తిగత సౌకర్యం కోసం ఉద్దేశించింది కాదు. రాష్ట్ర ప్రజలు తమ బాధలు, ఫిర్యాదుల గురించి ముఖ్యమంత్రి దృష్టికి నేరుగా తీసుకుపోయేందుకు ఉపకరించే గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహణకు అవసరమైన భవనాన్ని ఇందులో నిర్మించనున్నారు. ప్రస్తుతం సీఎం ఇంటి వద్ద స్థలాభావంతో గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహించనందున ప్రజలు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలవాల్సి వస్తోంది. అయితే ముఖ్యమైన అధికారిక కార్యక్రమాలను ముగించుకుని ముఖ్యమంత్రి వెలగపూడి వెళ్లేసరికి ఉదయం 9, 10 గంటలు అవుతోంది.
 
దీంతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం జాప్యమై, దూరప్రాంతాల వారు ఇబ్బందులు పడుతున్నారు. అదే సీఎం ఇంటి వద్దే ఉదయాన్నే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే వీలుంటే వారు వెలగపూడి వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఉదయమే సీఎంకు తమ కష్టాలు చెప్పుకుని, అక్కడి నుంచే తిరుగుముఖం పడతారు. ఈ ఉద్దేశంతో సీఎం ఇంటికి చేరువలో గ్రీవెన్స్‌ సెల్‌కు భవనం నిర్మించాలని నిర్ణయించారు.
 
 2AP-CM-HOUSE.jpg
పెద్ద సమావేశ మందిరం
చంద్రబాబు నివసిస్తున్న గృహం గతంలో ఒక ప్రైవేట్‌ గెస్ట్‌హౌస్‌ అయినందున అందులో సమావేశాల నిర్వహణకు ఏమాత్రం వీలుండడం లేదు. 40,50 మందితో మీటింగ్‌ జరపాలన్నా కష్టమవుతోంది. దీంతో ఒక పెద్ద సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ల నిర్వహణకు అవసరమైన మీటింగ్‌ హాలు నిర్మించనున్నారు.
Link to comment
Share on other sites

A house pooling ki ippincharu....Adi CBN nijayati capital vishayam lo....okka media kuda danni cheppadu.....

CBN tappa e CM unna a house pooling lo govt ki radu.....

 

To be frank enudku ivvali already house unna land ni pooling ki asalu?

 

 

Jaffa gallu sollu kaburlu,shit ratalu rasaru kani CBN capital vishyam lo evadiki longatla.....He is going with dedication&honesty

Link to comment
Share on other sites

ప్రధాన అనుసంధాన రహదారి వెంబడి గ్రీన్‌ బఫర్‌

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ప్రధాన అనుసంధాన రహదారి వెంబడి ల్యాండ్‌ స్కేప్‌ (గ్రీన్‌ బఫర్‌) ఏర్పాటుకి వీలుగా నేలను ఎత్తు చేసేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) టెండర్లు పిలిచింది. ప్రధాన అనుసంధాన రహదారికి కుడిపక్కన మొక్కలు పెంచి గ్రీన్‌బెల్ట్‌గా అభివృద్ధి చేస్తారు.ఈ పనుల అంచనా విలువను రూ.40.30లక్షలుగా నిర్ణయించారు. టెండర్లు దాఖలు చేయడానికి ఈ నెల 27 వరకు గడువిచ్చారు.

Link to comment
Share on other sites

మకుటాయమాన వారథులు!
కృష్ణా నదిపై నిర్మించే వంతెనల కోసం ఆరు రకాల ఆకృతులు సిద్ధం
విస్తృత చర్చల అనంతరం తుది నిర్ణయం
amarr1.jpg

ఈనాడు, అమరావతి: అమరావతి బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌)పై కృష్ణా నదిపై నిర్మించే వంతెనల కోసం ఆరు రకాల ఆకృతులు(డిజైన్లు) సిద్ధమయ్యాయి. ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన ఒక్కో భారీ దిగ్గజ వంతెన నిర్మించాల్సి ఉంటుంది. సవివర నివేదిక తయారీ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు కోసం రెండుచోట్ల నిర్మించే భారీ వంతెనల నిర్మాణం ఆకట్టుకునేలా ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు ఈ డిజైన్లు రూపొందాయి. ఇవి వేటికవే భిన్నంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన దిగ్గజ వంతెనలకు ధీటుగా ఉండేలా వీటిని తయారుచేశారు. విస్తృత చర్చల అనంతరం తుదినిర్ణయం తీసుకోనున్నారు. ఆరు డిజైన్ల వివరాలు...

1. నెమలి పింఛం ఆకృతి వంతెన (పీకాక్‌ ఫెదర్‌): నెమలి పింఛం మాదిరిగా నిర్మాణం ఉంటుంది. కేబుళ్లతో కూడిన దీని గరిష్ఠ ఎత్తు 120మీటర్లు. ప్రధాన భాగం పొడవు 320మీ. కృష్ణా నదికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పర్యాటకుల కోసం గ్యాలరీ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు.

amarr2.jpg

2. కాళీయ మర్ధన రూప వంతెన: కాళీయ మర్ధనం చేస్తున్న కృష్ణుని రూపంలో ఉంటుంది. కేబుళ్లుంటాయి. ప్రధాన భాగం 160మీ. ఎత్తు 75మీ.

19ap-main2f.jpg

3. నాగలి ఆకృతి వంతెన : భూమిని దున్నటానికి రైతులు వాడే నాగలి ఆకారంలో ఉంటుంది. ఒక వైపు మాత్రమే కేబుళ్లుండటం దీని ప్రత్యేకత. ప్రధాన భాగం 160మీటర్లు. ఎత్తు 70మీ.

amrr3.jpgamar4.jpg

4. వేలాడే తీగల వంతెన (సెల్ఫ్‌ యాంకర్డ్‌): కేబుళ్లు, హైబ్రీడ్‌ సస్పెన్షన్‌తో కూడి ఉంటుంది. రెండు రహదారి మార్గాలకీ కలిపి ఒకే పైలాన్‌ ఉంటుంది. ప్రధాన భాగం 180మీ.. ఎత్తు 120మీ.

amar5.jpg

5. తిరగబడిన ‘యు’ ఆకృతి వంతెన (ఇన్‌వర్టెడ్‌ యు): అమెరికాలోని టెక్సాస్‌లో మార్గరెట్‌ హంట్‌ హిల్‌ బ్రిడ్జ్‌ ఇలాగే ఉంటుంది. కేబుళ్లతో కూడిన దీని ప్రధాన భాగం 360మీ.. ఎత్తు 120మీ.

6. అసౌస్టవ వంపుల వంతెన (అన్‌సిమ్మిట్రికల్‌ యార్క్‌): వేర్వేరు పొడవులతో కూడిన వంపులుంటాయి. ప్రతిదీ వేర్వేరు రూపాల్లో ఉంటుంది. ప్రధాన భాగం 120మీ.. ఎత్తు 45మీ.

amar6.jpg

* వంతెనకి బదులుగా కృష్ణా నది దిగువన భూగర్భంలో నుంచి ప్రయాణ మార్గాల్ని నిర్మించేందుకున్న అవకాశాల్నీ పరిశీలించగా... ఇక్కడి పరిస్థితులకు కుదరదని తేలింది.
* భూకంపాలొచ్చే జోన్‌ 3 లో ఈప్రాంతం ఉన్నందున వాటిని తట్టుకునేలా నిర్మాణాలుంటాయి..
* తక్కువ సమయంలో వంతెన నిర్మాణం పూర్తయ్యేలా చూసేందుకు ప్రీకాస్ట్‌ సెగ్మెంటల్‌ కన్‌స్ట్రక్షన్‌, స్టీల్‌ ఎక్కువగా వినియోగించేలా డిజైన్లు రూపొందించారు.
* ఆంగ్ల అక్షరం తిరగేసినట్లుండే వంతెన డిజైన్‌ తప్ప మిగలినవన్నీ ప్రపంచంలో ఎక్కడా లేనివి. కృష్ణ భగవానుడు, నాగలి ఆకారంలో ఉన్న డిజైన్లు వినూత్నమైనవి.
* ప్రకాశం బ్యారేజీకి ఎగువున నిర్మించే వంతెన మూడు కిలోమీటర్లు, దిగువన నిర్మించే వంతెన 4.6కి.మీ. పొడవున ఉంటుంది.

Link to comment
Share on other sites

ప్రధాన అనుసంధాన రహదారి వెంబడి గ్రీన్‌ బఫర్‌

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ప్రధాన అనుసంధాన రహదారి వెంబడి ల్యాండ్‌ స్కేప్‌ (గ్రీన్‌ బఫర్‌) ఏర్పాటుకి వీలుగా నేలను ఎత్తు చేసేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) టెండర్లు పిలిచింది. ప్రధాన అనుసంధాన రహదారికి కుడిపక్కన మొక్కలు పెంచి గ్రీన్‌బెల్ట్‌గా అభివృద్ధి చేస్తారు.ఈ పనుల అంచనా విలువను రూ.40.30లక్షలుగా నిర్ణయించారు. టెండర్లు దాఖలు చేయడానికి ఈ నెల 27 వరకు గడువిచ్చారు.

 

em green belt oo ento shade iche trees vesthe baguntadi

Link to comment
Share on other sites

ఆకృతుల రూపకర్తలకు రూ.190 కోట్లు
రాజ్‌భవన్‌, ఇతర భవనాల ఆకృతుల కోసం పిలవాల్సిన టెండర్లు

ఈనాడు, అమరావతి: అమరావతిలో పరిపాలన, న్యాయ నగరాల ప్రణాళిక, వాటిలో నిర్మించే భవనాల ఆకృతుల రూపకల్పనకే ప్రభుత్వం రూ.కోట్లలో వెచ్చిస్తోంది. 1365 ఎకరాల్లో నిర్మించే పరిపాలన, న్యాయ నగరాల ప్రణాళిక, ఐకానిక్‌ భవనాలుగా నిర్మించే శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతులు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ఆకృతులు, ప్రముఖుల నివాసగృహాల ఆకృతుల రూపకల్పనకే భవన నిర్మాణ శిల్పులకు (ఆర్కిటెక్ట్‌లు) రూ.189.94 కోట్లు చెల్లిస్తోంది. రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాస భవనాలు, ఇతర భవనాల ఆకృతుల రూపకల్పన కోసం ఆర్కిటెక్ట్‌ల ఎంపికకు టెండర్లు పిలవాల్సి ఉంది. పరిపాలన నగర తుది ప్రణాళిక, శాసనసభ భవన తుది ఆకృతిని నార్మన్‌ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ త్వరలోనే అందజేయనుంది. వాటిలో ప్రభుత్వం ఒకటి ఎంపిక చేస్తే ఆ తర్వాత దాని తుది ఆకృతిని సంస్థ సిద్ధం చేస్తుంది.

సచివాలయం, విభాగాధిపతుల భవనాల ఆకృతులకు రూ.114 కోట్లు: 900 ఎకరాల్లో నిర్మించే పరిపాలన నగరం, దానికి కొనసాగింపుగా 465 ఎకరాల్లో నిర్మించే న్యాయనగర ప్రణాళిక రూపకల్పన, ఐకానిక్‌ భవనాలుగా నిర్మించే శాసనసభ, హైకోర్టు భవనాల వివరణాత్మక ఆకృతుల రూపకల్పనకు లండన్‌కు చెందిన నార్మన్‌ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) రూ.64 కోట్లు చెల్లిస్తోంది. సచివాలయం, విభాగాధిపతుల భవనాల ఆర్కిటెక్ట్‌గా కూడా తాజాగా నార్మన్‌ఫోస్టర్‌ సంస్థే ఎంపికైంది. ఈ రెండు భవనాల ఆకృతుల రూపకల్పనకు ఆ సంస్థకు సీఆర్‌డీఏ రూ.114 కోట్లు చెల్లించనుంది. పరిపాలన న్యాయ నగరాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ఇతర ముఖ్య అధికారుల గృహాల నిర్మాణానికి ఆకృతుల రూపకల్పనకు ఆర్‌కాప్‌ సంస్థ ఎంపికైంది. ఆ సంస్థ రూ.11.94 కోట్లకు పనులు దక్కించుకుంది.

image.jpg

Link to comment
Share on other sites

హరిత అమరావతిగా మార్చాలి.. ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారథి
 
 
  • అనంతవరం నర్సరీ సందర్శన
(ఆంధ్రజ్యోతి, అమరావతి) : రాజధానిలో సకల ప్రదేశాలు అన్ని కాలాల్లోనూ హరితంతో విలసిల్లేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సీఎండీ డి.లక్ష్మీపార్థసారథి అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఏడీసీ నిర్మిస్తున్న వివిధ రహదారుల వెంట అభివృద్ధి చేయనున్న ఉద్యానవనాల్లో మొక్కలు, వృక్షాలను పెంచాలని సూచించారు. ఆమె బుధవారం ఏడీసీ, అటవీ శాఖాధికారులతో కలసి రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో ఉన్న సామాజిక వన విభాగం నర్సరీ సందర్శించారు. అందులో అటవీ శాఖ ఆధ్వర్యంలో పెరుగ
 
ుతున్న వివిధ రకాల పువ్వులు, నీడనిచ్చే మొక్కలను పరిశీలించారు.
 
రాజధానిలో సీడ్‌ యాక్సెస్‌, ఏడు ప్రాధాన్య రహదారుల వెంట పెద్దసంఖ్యలో మొక్కలను నాటాలని, ఇందుకోసం నర్సరీలోని ఏపుగా పెరిగిన వాటిని ఎంచుకోవాలని సూచించారు. శాఖమూరులో 250 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించనున్న ప్రాంతీయ ఉద్యానవనంలో కూడా పూలమొక్కలు, వృక్షాలను పెంచేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు. ఆమెతోపాటు ఇన్‌చార్జి డీఎ్‌ఫవో భీమయ్య, ఏడీసీ అటవీ విభాగాధిపతి బి.మురళీకృష్ణ, డిప్యూటీ కన్జర్వేటర్‌ వై.రమేష్‌, అటవీ రేంజ్‌ అధికారులు ఎం.ఓబుల్‌రెడ్డి, జె.సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.

 

 

రాజధాని కేంద్రంగా విద్యుత్‌ పంపిణీ సంస్థ?
22-06-2017 08:05:21
 
  • సెంట్రల్‌ డిస్కంగా పేరు పెట్టే ఆలోచన
  • గుంటూరు, కృష్ణా జిల్లాలు దీని పరిధిలోకే
  • తుళ్ళూరు ప్రాంతంలో స్థలాన్వేషణ
నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధానిగా గుంటూరు జిల్లా ఎంపికైన నాటి నుంచి అనేక హంగులు, సదుపాయాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలను గుర్తించి కొత్తగా విద్యుత్‌ పంపిణీ కంపెనీ ఏర్పాటు చేసేందుకు విద్యుత్‌శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. తుళ్ళూరు మండలమే అనువైన ప్రాంతంగా భావిస్తున్నారు.
 
(ఆంధ్రజ్యోతి - గుంటూరు) : రాజధాని ప్రాంత విద్యుత్‌ వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాజధాని ప్రాంతంలో జంట నగరాలుగా రూపుదిద్దుకుంటున్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలను గుర్తించి ఈ రెండు జిల్లాలో కొత్తగా విద్యుత్‌ పంపిణీ కంపెనీ ఏర్పాటు చేసేందుకు విద్యుత్‌శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు జిల్లాలు సదరన్‌ డిస్కం పరిధిలో ఉన్నాయి. సదరన్‌ డిస్కం ప్రధాన కేంద్రం తిరుపతిలో ఉంది. దీని పరిధిలో ఈ రెండు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసే పంపిణీ సంస్థకు సెంట్రల్‌ డిస్కంగా నామకరణం చేసే అవకాశం ఉంది. పంపిణీ వ్యవస్థతో పాటు ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు సుమారుగా ఐదు ఎకరాల అవసరం ఉంటుందని భావిస్తున్న అధికారులు ఇందుకోసం స్థలాన్వేషణ చేస్తున్నారు. తుళ్ళూరు మండలమే ఇందుకు అనువైన ప్రాంతంగా భావిస్తున్నారు.
సదరన్‌ డిస్కంకు పెరిగిన తాకిడి..
సదరన్‌ డిస్కం 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. 2015 నాటికి లక్షా 18వేల 119 చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించి 442 మండలాలకు సేవలందిస్తోంది. గృహ వినియోగ కనెక్షన్‌లు 69,27, 853 ఉన్నాయి.
 
వ్యవసాయ కనెక్షన్‌లు 11, 27, 853 ఉన్నాయి. ఎల్‌టీ సెక్షన్‌లు 89, 42, 935 ఉండగా, హెచ్‌టీ సెక్షన్‌లు 529 ఉన్నాయి. 220 కేవీ సబ్‌ స్టేషన్‌లు 36 ఉండగా, 132 కెవీ సబ్‌ స్టేషన్‌లు 114 ఉన్నాయి.
గుంటూరు జిల్లాలో......
గృహ విద్యుత్‌ వినియోగదారులు 12 లక్షల 12వేల 798, కమర్షియల్‌ వినియోగదారులు లక్షా 20వేల 993, వ్యవసాయ సర్వీసులు 77వేల 909
డివిజన్‌ లు - 7, సబ్‌ డివిజన్‌లు 24 ఉన్నాయి.
కృష్ణా జిల్లాలో ..........
గృహ విద్యుత్‌ వినియోగదారులు 11లక్షల 45వేల 49, కమర్షియల్‌ వినియోగదారులు లక్షా 29వేల 939, వ్యవసాయ కనెక్షన్‌లు 84వేల 513 డివిజన్‌లు - 7, సబ్‌ డివిజన్‌లు - 23 ఉన్నాయి.
దీంతో ఈ రెండు జిల్లాల్లో ఇప్పటికే విద్యుత్‌ అవసరాలు ఎక్కువయ్యాయి. శాశ్విత రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయితే విద్యుత్‌ అవసరాలు మరింత ఎక్కువగా ఉంటాయి. పైగా అదే సమయానికి కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు కూడా విద్యుత్‌ అవసరాలు ఉంటాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో కొత్తగా విద్యా, వైద్య సంస్థలు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొత్త డిస్కం ఏర్పాటుకు చర్యలు త్వరగా ప్రారంభమయితే భవిష్యత్‌ అవసరాలకు ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు.
ప్రత్యేక డిస్కం ఆవశ్యకత ఉంది : సీఈ
వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు ప్రధానంగా జంట నగరాల పరిధిలో ప్రత్యేక విద్యుత్‌ డిస్కం ఆవశ్యకత ఉందని విజయవాడ జోన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కె.రాజబాపయ్య తెలిపారు. రాజధాని నిర్మాణం ప్రారంభమయ్యే నాటికి విద్యుత్‌ అవసరాలు ఎక్కువ అవుతాయన్నారు. రాజధాని నిర్మాణంతో కొత్తగా అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. వాటికి కూడా మెరుగైన విద్యుత్‌ అందించాల్సి ఉంటుందని తెలిపారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...