Jump to content

Amaravati


Recommended Posts

AP Infrastructure Official @APINFRA 31m31 minutes ago

 
 

To tackle the heatwave during summers in Amaravati, ‘cool spots’ will be set up in every 440 metres. Singapore Power will take up works related to District Cooling System which will ensure lower temperatures in the buildings. #INCAP #Amaravati #AndhraPradesh

De70E2XVQAABGUc.jpg
Link to comment
Share on other sites

అమరావతిలో స్టార్‌ హోటళ్లు!
06-06-2018 02:24:36
 
636638486844011148.jpg
  • అంతర్జాతీయస్థాయిలో ఆతిథ్యరంగం
  • నోవాటెల్‌ వంటి ప్రఖ్యాత గ్రూపుల ఎంపిక
  • 3నెలల్లో పనులు.. మూడేళ్లలో సిద్ధం
మరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని కీలక ప్రాంతాల్లో స్టార్‌ హోటళ్లు కొలువుదీరనున్నాయి. వివిధ పనులపై రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. దేశవిదేశాల నుంచి అమరావతికి వచ్చే వారి సంఖ్య అంతకంతకూ పెరగనున్న దృష్ట్యా ఇక్కడ ఆతిథ్యరంగం అంతర్జాతీయస్థాయిలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సంకల్పించింది. ఈ మేరకు.. పేరున్న హోటల్‌ గ్రూపులను రప్పించడంలో ఏపీసీఆర్డీయే సఫలీకృతమైంది!.
 
 
భూమి కేటాయింపు ఇలా...
అమరావతిలో తొలి విడతలో నాలుగేసి చొప్పున 5, 4 స్టార్‌ హోటళ్ల స్థాపనకు సీఆర్డీయే పచ్చజెండా ఊపింది. 5 స్టార్‌ హోటళ్లకు ఒక్కొక్కదానికి 4 ఎకరాలు, ఫోర్‌స్టార్‌ హోటళ్లకు రెండేసి ఎకరాల చొప్పున ఎకరం.. రూ.1.50 కోట్ల లెక్కన ప్రోత్సాహక ధరకే విక్రయిస్తోంది.
 
 
విస్తృత కసరత్తు అనంతరం...
ఉన్నతాధికారులు, నిపుణులతో అధ్యయనాలు, పరిశీలనలు, సమావేశాలు, వివిధ దశల్లో వడపోతలు ఇత్యాది కార్యక్రమాల అనంతరం నియమ నిబంధనల ప్రకారం వాటికి అవసరమైన భూకేటాయింపులు జరగనున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 3 నెలల్లోగా నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశాలుండగా, మూడేళ్లలో వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పటికి.. రాజధానికి సందర్శకుల సంఖ్య బాగా పెరిగి, హోటల్‌ గదులకు మంచి గిరాకీ వస్తుందని అంచనా.
 
 
ఇవీ.. ఆ హోటల్‌ గ్రూపులు
అమరావతిలో 5 స్టార్‌ కేటగిరిలో హోటళ్లను నెలకొల్పే అవకాశాన్ని నోవాటెల్‌, హిల్టన్‌, క్రౌన్‌ ప్లాజా, డబుల్‌ ట్రీ అనే ప్రఖ్యాత గ్రూపులు దక్కించుకున్నాయి. ఒక్కో హోటల్‌లో 200 గదులుంటాయి. ఇవి కాకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలున్న రెస్టారెంట్లు, లాంజ్‌లు, బాంక్వెట్‌ హాళ్లు, పార్కింగ్‌ వసతులు కొలువు దీరతాయి. ఇక.. 4 స్టార్‌ హోటళ్లను స్థాపించేందుకు హాలిడే ఇన్‌, గ్రీన్‌ పార్క్‌, జీఆర్‌టీ, దసపల్లా గ్రూపులు ఎంపికయ్యాయి. ఇప్పటికే వీటి ఏర్పాటుకు సంబంధించిన ఎల్‌ఓఐ (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌- అంగీకారపత్రాలు)లను ఆయా హోటల్‌ గ్రూపులకు జారీ చేసిన సీఆర్డీయే.. మిగిలిన అధికారిక లాంఛనాలను కూడా త్వరలోనే పూర్తి చేయనుంది.
Link to comment
Share on other sites

రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు
06-06-2018 08:48:03
 
636638716919801235.jpg
  • రూ.13 కోట్ల అంచనా వ్యయంతో పిలిచిన సీఆర్డీయే
అమరావతి(ఆంధ్రజ్యోతి): రాజధాని పరిధిలోని కొన్ని గ్రామాల్లో సీసీ రహదారులు, మురుగుకాల్వల నిర్మాణానికి సీఆర్డీయే టెండర్లను ఆహ్వానించింది. వీటి మొత్తం విలువ రూ.13 కోట్లు. పనుల వివరాలిలా ఉన్నాయి. రూ.9.30 కోట్లతో తుళ్లూరులోని అయ్యప్పస్వామి గుడి నుంచి బాలయేసు కాలనీ వరకు ఉన్న ఆర్‌ అండ్‌ బి ప్రధాన రహదారి విస్తరణ, బలోపేతంతోపాటు సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టనున్నారు. రూ.1.95 కోట్లతో వెలగపూడి ఎస్‌.సి. కాలనీలో, దొండపాడులోని అంబేద్కర్‌ కాలనీలో రూ.65 లక్షలతో, లింగాయపాలెం, అబ్బరాజుపాలెంలలో ఒక్కొక్క గ్రామంలో రూ.55 లక్షలతో సీసీ రహదారులు, సీసీ మురుగుకాల్వలను నిర్మించనున్నారు. ఈ పనులను చేపట్టాలన్న ఆసక్తి ఉన్న వారు తమ బిడ్లను సమర్పించేందుకు సీఆర్డీయే ఈ నెల 20వ తేదీ వరకు గడువునిచ్చింది. అదే రోజు సాయంత్రం వాటిని తెరుస్తారు.
Link to comment
Share on other sites

ఓపెన్‌ ఫోరంలో 10 దరఖాస్తులకు అనుమతులు
06-06-2018 08:46:37
 
అమరావతి(ఆంధ్రజ్యోతి): రాజధాని గ్రామాల ప్రజల కోసం ప్రతి మంగళవారం ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఓపెన్‌ ఫోరంలో భాగంగా నవులూరులో జరిపిన కార్యక్రమంలో 10 దరఖాస్తులకు ప్రాథమిక అనుమతి మంజూరు చేసినట్లు సీఆర్డీయే డెవల్‌పమెంట్‌ ప్రమోషన్‌ విభాగం డైరెక్టర్‌ కె.నాగసుందరి తెలిపారు. మొత్తం 13 దరఖాస్తులు రాగా, వాటిల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న పదింటిని అప్పటికప్పుడే ఆమోదించినట్లు పేర్కొన్నారు. మిగిలిన వాటిల్లో ఒక దరఖాస్తుకు సంబంధించి అదనపు సమాచారం కోరగా, మరో రెండింటిని తిరస్కరించినట్లు తెలిపారు. నవులూరు ఓపెన్‌ ఫోరంలో సీఆర్డీయే ప్లానింగ్‌ డైరెక్టర్‌ జి.నాగేశ్వరరావు, జోనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కె.హిమబిందు, జోనల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్లు సీహెచ్‌ మధుసూదనరావు, టి.నరేంద్రనాథ్‌రెడ్డి, ఎన్‌.సుకీర్తి, అసిస్టెంట్‌ ప్లానర్‌ ఆర్‌.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారన్నారు.
Link to comment
Share on other sites

ప్లాట్లు.. పాట్లు!
06-06-2018 08:52:18
 
636638719469950772.jpg
  • ఎంత అవసరమొచ్చినా అమ్ముకోలేక రాజధాని రైతుల కడగండ్లు
  • తమ పరిస్థితిని గమనించి, ప్లాట్లను పూడ్చాల్సిందిగా వినతులు
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాజధాని కోసం సమీకరణ పద్ధతిలో ఇచ్చిన తాము భూములకు బదులుగా ఆన్‌లైన్‌ లాటరీ ద్వారా కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లు వాగుల్లో వచ్చిన రైతుల్లో పలువురు వాటి దుస్థితిని చూసి ఆందోళనకు గురవుతున్నారు. ఎంతకీ వాటిని పూడ్చి, మెరక చేయకపోవడం, కొన్ని చోట్ల పూడ్చినప్పటికీ వాటిపై రోలర్లను సరిగ్గా తిప్పకుండా సరిపుచ్చడం ఇందుకు కారణాలు. ఇలాంటి ప్లాట్లలో రాబోయే రోజుల్లో ఏమైనా నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఇబ్బందులు తప్పవని, ఒకవేళ వాటి యజమానులెవరన్నా వాటిని అమ్ముకోదలిస్తే కొనుగోలు చేసేందుకు బయ్యర్లు వెనుకా ముందాడుతున్నారని వాపోతున్నారు. పరిస్థితిని సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఆర్డీయే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తున్నప్పటికీ సరైన స్పందన లేకపోవడం వారిని అసహనానికి గురి చేస్తోంది.
 
 
వివిధ గ్రామాల్లో ఇదే పరిస్థితి..
రాజధాని గ్రామాల పరిధిలో గతంలో పలు పెద్దాచిన్నా వాగులుండేవి. అమరావతికి వరద ముప్పు బెడద నివారణతోపాటు రాజధానిలో జలవనరులు, జలమార్గాల అభివృద్ధి దృష్ట్యా కొండవీటి వాగు వంటి పెద్ద వాగుల విస్తరణకు ఏడీసీ, సీఆర్డీయే చర్యలు తీసుకున్నాయి. చిన్నా చితకా వాగులను మాత్రం (వాటి వల్ల భవిష్యత్తులో ఎటువంటి ప్రయోజనం ఉండదన్న ఉద్దేశ్యంతో) చాలా చోట్ల రిటర్నబుల్‌ ప్లాట్లుగా కేటాయించారు. పరిస్థితిని అర్ధం చేసుకున్న రాజధాని రైతులు దానిని స్వాగతించారు. వాగుల్లో కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లను వాగులకు ఇరువైపులా ఉన్న ప్రదేశాలకు సమాన ఎత్తు వరకూ పకడ్బందీగా మెరక చేస్తామని, దీంతో ఎటువంటి ఇబ్బందులు రాబోవని అధికారులు అప్పట్లో హామీ ఇవ్వడం కూడా ఇందుకు తోడ్పడింది.
 
 
అయితే లింగాయపాలెం, కొండమరాజుపాలెం తదితర గ్రామాల్లో ఒకప్పటి వాగుల్లో వేసిన రిటర్నబుల్‌ ప్లాట్లలో కొన్నింటిని ముందుగా ప్రకటించిన విధంగా మెరక చేయడం లేదని వాటిని పొందిన వారు వాపోతున్నారు. దీంతో తమ స్థలాలు వాగుల ఒడ్డున ఉన్న వాటితో పోల్చితే బాగా పల్లంలో ఉన్నాయంటున్నారు. కొన్ని ప్లాట్లను మెరక చేసినప్పటికీ వాటిపై రోలర్లను తిప్పకపోవడంతో వర్షాలకు ఆ మట్టి లోపలకు కుంగిపోయి, మళ్లీ ఆయా స్థలాలు పల్లమయ్యే ప్రమాదం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు.
 
ఇది భవిష్యత్తులో అంటే వాటిల్లో నిర్మాణాలను జరిపేటప్పుడు పలు ఇబ్బందులకు దారి తీస్తుందని భయపడుతున్నారు. దీంతో ఈ తరహా ప్లాట్లను కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదని, ఒకవేళ కొనేందుకు ముందుకు వచ్చినా ఇతర ప్లాట్లతో పోల్చితే తక్కువ ధరలకు అడుగుతున్నారని వాపోతున్నారు. ఇకనైనా సీఆర్డీయే ఉన్నతాధికారులు స్పందించి, వాగుల్లో కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లను పకడ్బందీగా మెరక చేయించి, తమను ఒడ్డున పడేయాలని రాజధాని రైతులు కోరుతున్నారు.
Link to comment
Share on other sites

అంతర్జాతీయ స్థాయి ఆర్థిక కేంద్రంగా అమరావతి
07-06-2018 07:50:38
 
636639546471518421.jpg
  • రాజధాని ప్రగతికి చుక్కాని
  • నేడు స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిపై సింగపూర్‌ కన్సార్షియంతో ఎంవోయూ
  • చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ల సమక్షంలో సంతకాలు
  • సమష్టి కృషితో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ఆర్థిక కేంద్రంగా అమరావతి
అమరావతి: అమరావతిని ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక, వ్యాపార కేంద్రాల్లో ఒకటిగా చేయనున్న స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి సంబంధించి సింగపూర్‌ కన్సార్షియంతో ఏపీ సీఆర్డీయే గురువారం కుదుర్చుకోబోతున్న అవగాహన ఒప్పందం ఆ దిశగా పడనున్న పెద్ద ముందడుగుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివర్ణించారు. విజయవాడలోని ఒక హోటల్‌లో సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ల సారధ్యంలో జరగనున్న జేఐఎస్‌సీ (సంయుక్త కార్యాచరణ సారధ్య కమిటీ) 3వ సమావేశం దీనికి వేదిక కానుంది. అమరావతిలోని 6.84చదరపు కిలోమీటర్ల (1691 ఎకరాలు)లో ప్రతిపాదించిన స్టార్టప్‌ ఏరియాను మూడు దశల్లో అభివృద్ధి పరచాలనేది లక్ష్యమన్న సంగతి తెలిసిందే. కృష్ణానదీ తీరాన, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు తూర్పు వైపున, సీడ్‌ యాక్సెస్‌ రహదారికి చేరువలో రానున్న స్టార్టప్‌ ఏరియాతో రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు అంతకంతకూ అధికమవడమే కాకుండా పెద్దసంఖ్యలో ఉద్యోగ, వ్యాపార అవకాశాలు లభించనున్నాయి.
 
ఇంతటి ప్రాధాన్యమున్న స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి అవగాహన ఒప్పందం కుదరబోతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఏపీ సీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిని అగ్రశ్రేణి ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా మలచాలన్న రాష్ట్రప్రభుత్వ లక్ష్యానికి స్టార్టప్‌ ఏరియా ఇతోధికంగా తోడ్పడుతుందన్నారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు, వ్యక్తులు అమరావతిలో భారీఎత్తున పెట్టుబడులను పెట్టేందుకు అనువైన పరిస్థితులు దీంతో నెలకొంటాయని, ఫలితంగా రాష్ట్రానికి ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
 
ఇప్పటికే అమరావతి మదుపుదారుల విశ్వాసాన్ని చూరగొందని, 2017, 2018లలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుల్లో రూ.1.53లక్షల కోట్ల విలువైన 98 ఎంవోయూలు కుదరడమే అందుకు తార్కాణమన్నారు. రాజధాని నిర్మాణ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపడుతుండడం ఇందుకు దోహదపడిందని పేర్కొన్నారు. స్టార్టప్‌ ఏరియాతో అమరావతికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ సంస్థల సంఖ్య మరింత పెరుగుతుందని, రాష్ట్రప్రభుత్వ విధానాలతో ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారందరికీ కచ్చితంగా తగిన ప్రతిఫలాలు దక్కుతాయని చెప్పారు.
 
జేఐఎస్‌సీ 3వ భేటీలో స్టార్టప్‌ ఏరియాతోపాటు అమరావతి అభివృద్ధికి ఎంతో దోహదపడనున్న విజయవాడ - సింగపూర్‌ల మధ్య విమాన సర్వీసులు, సంస్థాగతమైన పురోగతికి చేపట్టాల్సిన చర్యలు, సింగపూర్‌లో మాదిరిగా ఇక్కడా ఏర్పాటు చేయదలచిన డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ మెకానిజం ఇత్యాది అంశాలపై కూలంకషంగా చర్చిస్తామన్నారు. జేఐఎస్‌సీ గత భేటీల్లో కుదిరిన నిర్ణయాల అమలుకు ఏపీవో (అమరావతి పార్ట్‌నర్‌షిప్‌ ఆఫీస్‌), అమరావతి ప్లానింగ్‌ డిజైన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఏపీడీఆర్‌ఐ) ప్రశంసార్హమైన కృషి చేశాయని సీఎం కితాబిచ్చారు. అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో అమరావతి అభివృద్ధి ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఏపీ సీఆర్డీయేను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
 
ఎట్టకేలకు పట్టాలెక్కనున్న స్టార్టప్‌ ఏరియా పనులు..
కాగా.. సుమారు 9, 10 నెలల క్రితమే ప్రారంభం కావాల్సిన స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ పనులు గురువారం కుదరనున్న ఎంవోయూతో త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి సంబంధించి గతేడాది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ల సమక్షంలో కుదిరిన ఒప్పందం మేరకు సింగపూర్‌ కన్సార్షియం (ఆ దేశానికే చెందిన అసెండాస్‌- సింగ్‌బ్రిడ్జ్‌, సెంబ్‌కార్ప్‌ సంస్థలు ఇందులో భాగస్వాములు), ఏడీసీ (అమరావతి అభివృద్ధి సంస్థ) సంయుక్తంగా ఈ పనులను చేపట్టాల్సివుంది. ఇందుకోసం ఇవి ‘ఏడీపీపీఎల్‌ (అమరావతి డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌)’ అనే ఎస్‌.పి.వి. (స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌)ని ఏర్పాటు చేశాయి కూడా. ఇది జరిగి కొన్ని నెలలైనా సింగపూర్‌ కన్సార్షియం పనులను మొదలు పెట్టలేదు. తొలుత నిర్ణయించిన ప్రకారం సీఆర్డీయేతో ఒప్పందానికి అది నిరాకరిస్తుండడం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సింగపూర్‌ కన్సార్షియం కోరుతున్నట్లుగానే అది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఎస్‌.ఎ.ఐ.హెచ్‌. (సింగపూర్‌ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌)’తో ఎంవోయూ చేసుకునేందుకు సీఆర్డీయే అంగీకరించడంతో ప్రతిష్ఠంభన తొలగింది.
Link to comment
Share on other sites

ఎల్‌ఎస్‌ఈ నిపుణులతో అమరావతి టాస్క్‌ ఫోర్స్‌!
07-06-2018 08:17:58
 
636639562863387775.jpg
  • లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లోని పరిశోధకులతో ఏపీ సీఆర్డీయే విస్తృత చర్చలు
అమరావతి: అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూచించేందుకు ప్రఖ్యాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ (ఎల్‌ఎస్‌ఈ) నగరీకరణ పరిశోధనా విభాగపు నిపుణులు 10 మందితో కూడిన ‘అమరావతి టాస్క్‌ ఫోర్స్‌’ను ఏర్పాటుచేసింది. వీరిలో నగరీకరణ అంశాల్లో సుదీర్ఘ అనుభవమున్న కొలంబియా, దక్షిణాఫ్రికా, దుబాయ్‌ తదితర దేశాలకు చెందిన నిపుణులు ఉన్నారు. ఈ టాస్క్‌ ఫోర్స్‌ తన నివేదికను ఈ ఏడాది ఆగస్టులోగా సమర్పించనుంది.
 
ఏపీ సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ సారధ్యం లో కొద్దిరోజుల క్రితం లండన్‌కు వెళ్లిన అధికారుల బృందం ప్ర ధానంగా ఫైనాన్సింగ్‌, అందరికీ అందుబాటు ధరల్లో గృహ నిర్మాణం, రవాణ రంగాలపై ఎల్‌ఎస్‌ఈ నిపుణులతో చర్చించిం ది. తొలుత వీరికి శ్రీధర్‌ అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ సహా వివిధ అంశాలపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్లు ఇచ్చారు. వచ్చే 5, 10 సంవత్సరాలకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికల గురించి, ఆదాయ సృష్టి గురించి వివరించారు. చౌక గృహాల లబ్ధిదారుల ఎంపిక, ప్రోత్సాహకాలు, స్థలం ఎంపికతో పాటు అమరావతి రవాణా ప్రణాళిక గు రించి తెలియజెప్పారు. పైన పేర్కొన్న అంశాలన్నింటిపైనా ఎల్‌ఎస్‌ఈ నిపుణు లు సలహాలు, సూచనలు ఇచ్చారు.
 
కాగా.. ఎల్‌ఎస్‌ఈ టాస్క్‌ ఫోర్స్‌ ఇవ్వనున్న స్ట్రాటజీ పేపర్‌ (నివేదిక) అమరావతిలో మెరుగైన నగరీకరణ విధానాలను అమలు పరచడంలో ఎంతైనా తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని సీఆర్డీయే బృందం వ్యక్తం చేసింది. ఈ బృందంలో సీఆర్డీయే డైరెక్టర్లు ఆర్‌.రామకృష్ణారావు (ప్లానింగ్‌), ఎన్‌.ఆర్‌.అరవింద్‌ (ట్రాన్స్‌పోర్టేషన్‌), మృణ్మయి, సిద్ధార్ధ గణేష్‌ ఉన్నారు.
Link to comment
Share on other sites

జయవాడ చేరుకున్న సింగపూర్‌ మంత్రి
eswanran.jpg

అమరావతి: అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా సింగపూర్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య జరగనున్న మూడో అత్యున్నత సమావేశాల్లో పాల్గొనేందుకు సింగపూర్ సమాచార శాఖ మంత్రి ఈశ్వరన్ గురువారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. సింగపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి ఈశ్వరన్‌కు పురపాలకశాఖ మంత్రి నారాయణ స్వాగతం పలికారు. అనంతరం విజయవాడకు తీసుకొని వచ్చారు. ఈరోజు సింగపూర్ మంత్రి ఈశ్వరన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుల మధ్య జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ మూడో సన్నహాక సమావేశం జరగనుంది.

Link to comment
Share on other sites

http://nri.andhrajyothy.com/latestnews/trump-and-kim-meeting--24489

కపెల్లా రిసార్టు కత..
కిమ్‌, ట్రంప్‌ భేటీ అయ్యే కపెల్లా రిసార్ట్‌ 30 ఎకరాల్లో నిర్మితమైంది. దీంట్లో మొత్తం 112 గదులున్నాయి. ప్రముఖ బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ దీన్ని డిజైన్‌ చేశారు. ‘విలాసంలో పాతకొత్తల మేలుకలయిక’గా ప్రముఖులు ఈ రిసార్ట్‌ను అభివర్ణిస్తారు. ఈ రిసార్టులో ఉండాలంటే ఒక రాత్రికి దాదాపు 35 వేలు చెల్లించాలి. అదే ప్రీమియర్‌ గార్డెన్‌ కింగ్‌ రూమ్‌లో ఉండాలంటే.. రూ.5 లక్షలు చెల్లించాల్సిందే. రేట్ల సంగతి పక్కన పెడితే.. జూన్‌ 10 నుంచి 14 దాకా ఈ రిసార్ట్‌ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
గూర్ఖాల భద్రత..
కిమ్‌, ట్రంప్‌ స్థాయి వ్యక్తులు వస్తున్నారంటే భద్రత కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా. అందుకే.. ప్రపంచంలోనే అత్యంత బలవంతులైన యోధుల తెగగా పేరొందిన నేపాలీ గూర్ఖాలను రంగంలోకి దించుతున్నారు. ఇద్దరు నేతలూ తమ వ్యక్తిగత భద్రతా బృందాలను తెచ్చుకున్నప్పటికీ.. సింగపూర్‌ పోలీసు విభాగంలోని గూర్ఖా దళాన్ని వారి రక్షణ నిమిత్తం నియోగించారు.
Link to comment
Share on other sites

సింగపూర్‌-ఏపీ ప్రభుత్వాల ఉమ్మడి స్టీరింగ్‌ కమిటీ భేటీ
07-06-2018 10:25:05
 
636639664184642003.jpg
విజయవాడ: సింగపూర్ మంత్రి ఈశ్వరన్ విజయవాడలో పర్యటిస్తున్నారు. ఈశ్వరన్‌తో పాటు సింగపూర్‌ కన్సార్షియం బృందం విజయవాడకు విచ్చేసింది. గురువారం ఉదయం సింగపూర్‌-ఏపీ ప్రభుత్వాల ఉమ్మడి స్టీరింగ్‌ కమిటీ సమావేశమైంది. ఏపీ సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి స్టార్టప్‌ ప్రాంతం 'ఫేజ్‌ జీరో' అభివృద్ధిపై ఒప్పందాలు కుదరనున్నాయి. అనంతరం ఈశ్వరన్‌-చంద్రబాబు మధ్య అత్యున్నత స్థాయి జేఐఎస్‌సీ సమావేశం జరుగనుంది. ఆపై లింగాయపాలెంలో ఫేజ్‌జీరో ప్రాంతాన్ని సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ సందర్శించనున్నారు.
Link to comment
Share on other sites

చంద్రబాబుతో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ భేటీ
07-06-2018 12:12:45
 
636639703733385410.jpg
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ గురువారం ఉదయం భేటీ అయ్యారు. స్నేహపూరిత సంబంధాలు, భాగస్వామ్యాలు, ఒప్పందాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సింగపూర్‌లో రైతుల పర్యటనకు సంబంధించిన లఘుచిత్రాన్ని సింగపూర్‌ ప్రతినిధులు ప్రదర్శించారు. ఏపీలో పర్యాటక ఆకర్షణీయమైన చారిత్రక కట్టడాలు, సహజ సిద్ధమైన ప్రకతి వనరులు ఎన్నో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. పర్యాటక రంగంలో ఏపీకి సహకరించేందుకు ముందుకు రావాలని
సింగపూర్‌ ప్రతినిధులను ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.
Link to comment
Share on other sites

నదీ తీరాన నిర్మించే అద్భుత నగరం అమరావతి: చంద్రబాబు
07-06-2018 13:05:59
 
636639735680137458.jpg
విజయవాడ: నదీ తీరాన నిర్మించే అద్భుత నగరం అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సింగపూర్‌ లాంటి సిటీ కడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అది నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సింగపూర్‌ ప్రభుత్వం రాజధానికి మాస్టర్‌ ప్లాన్‌ అందజేసిందని, పరస్పర సంప్రదింపులతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. మూడు విడతలుగా ఈ ప్రాజెక్టును చేపడతామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధిపై ఎంవోయూలు చేసుకున్నామన్నారు. నెల రోజుల్లో సింగపూర్‌- విజయవాడ మధ్య నేరుగా విమాన సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రాజెక్టుపై ఎంతో శ్రద్ధ చూపుతున్నారంటూ ఈశ్వరన్‌కు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...