Jump to content
Sign in to follow this  
sonykongara

Amaravati | Heritage City

Recommended Posts

అమరావతిలో కాకతిదేవి శిల్పం
17-08-2017 03:51:21
 
636385386823293746.jpg
 • నవ్యాంధ్ర రాజధానిలో లభ్యమైన విగ్రహం
 
హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కాకతీయుల కాలంనాటి విగ్రహం లభ్యమైంది. అది కాకతీయులు తమ ఆరాధ్య దైవంగా కొలిచిన కాకతిదేవి విగ్రహంగా పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని ధరణికోటలో ఈ విగ్రహం లభ్యమైంది. శ్రీధాన్యకటకం పేరుతో ఆంధ్రుల తొలి రాజధానిగా నేటి ధరణికోట గ్రామం విలసిల్లింది. ధాన్యకటకానికి దక్షిణాన ఉన్న బలుసులమ్మ దేవాలయాన్ని పురావస్తుశాఖలోని టెంపుల్‌ సర్వే ఇన్‌చార్జి ఆఫీసర్‌ కన్నబాబు నేతృత్వంలోని బృందం అధ్యయనం చేస్తున్న క్రమంలో కాకతిదేవి విగ్రహం లభ్యమైంది. దేవాలయ ప్రాంగణంలోని మందిరంలో ఈ విగ్రహాన్ని గుర్తించారు. ఇప్పటివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి విగ్రహం బయల్పడలేదని తెలుస్తోంది.
 
సున్నపురాతితో చెక్కిన కాకతిదేవి విగ్రహం చక్కని ముఖవర్చస్సును కలిగి ఉంది. గుంటూరు, కృష్ణా నదీతీరంలో వెలసి ఉన్న ప్రాచీన దేవాలయాలపై ఈ సర్వేలో భాగంగా అధ్యయనం చేయాలని పురావస్తుశాఖ నిర్ణయించింది. కాకతీయుల కాలంనాటి దేవాలయాలు, కట్టడాలు, శిల్పకళా సంపదపై సమగ్ర సర్వే నిర్వహించాలని భారతీయ పురాతత్వ సర్వేక్షణ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆ సర్వే ప్రణాళిక రూపొందించేందుకు దాని అనుబంధ విభాగమైన దేవాలయ సర్వేక్షణ (దక్షిణాది విభాగం)కు బాధ్యతలు అప్పగించింది. పంచారామాల్లో మొదటిదైన అమరావతి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలపై కన్నబాబు ఆధ్వర్యంలోని బృందం ఈ అధ్యయనాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో కాకతీయ సామ్యాజ్యం విస్తరించి ఉండేది. తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో మరుగున పడి ఉన్న కళాఖండాల ఉనికి, నిర్మాణ కౌశల్యం శిల్ప కళారీతులను సమగ్రంగా అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయడమే ఈ సర్వే ఉద్ధేశం.

Share this post


Link to post
Share on other sites
రూ.1.5 కోట్లతో బౌద్ధ ప్రాజెక్ట్‌
20-08-2017 09:35:55
 
636388185574368619.jpg
విజయవాడ: బౌద్ధ కేత్రమైన ఘంటసాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా రూ.1.5 కోట్ల నిధులతో రాష్ట్ర ప్రభుత్వం మహాపరినిర్యాణ బౌద్ధ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. బౌద్ధ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నమూనా పోస్టర్‌ ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తు గల శయన బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసి ఘటశాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు. బుద్ధుని ప్రతిమను రెండు అంతస్థుల భవనంపై నిర్మిస్తామన్నారు. బౌద్ధక్షేత్రానికి వచ్చే భక్తులు, బిక్షవులు ప్రార్థనలు, ధ్యానాలు చేసుకునేందుకు వీలుగా గదులు నిర్మించనున్నామన్నారు. రానున్న బుద్ధ జయంతి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో జేసి2 మార్కండేయులు, డీఆర్వో ఎం.వేణుగోపాల్‌ రెడ్డి, ఆర్డీవోలు ఎస్‌.హరీష్‌, పి.సాయిబాబు, సీహెచ్‌ రంగయ్య ఉన్నారు.

Share this post


Link to post
Share on other sites

అంతర్జాతీయ బౌద్ధ ప్రదర్శనలో ‘అమరావతి’

2020లో న్యూయార్క్‌లో నిర్వహణ

వివిధ మ్యూజియంల నుంచి బౌద్ధ విశేషాల సేకరణ

ఈనాడు అమరావతి: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో 2020లో అంతర్జాతీయ బౌద్ధ చారిత్రక విశేషాల ప్రదర్శన జరగనుంది. ఈ ప్రదర్శనలో ఉంచేందుకు ప్రపంచంలోని ప్రసిద్ధ మ్యూజియాల్లో ఉన్న అమరావతి, అంధ్ర దేశపు బౌద్ధ విశేషాలను నిర్వాహకులు సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు లండన్‌, చెన్నై, కోల్‌కతా, ముంబయి, దిల్లీల్లోని ప్రసిద్ధ మ్యూజియంల నుంచి వీటిని సేకరించి న్యూయార్క్‌ తరలిస్తున్నామని, ప్రదర్శనల అనంతరం అంతే సురక్షితంగా వాటిని ఆయా స్థానాలకు తిరిగి పంపిస్తామని న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌ (మెట్‌) దక్షిణ, ఆగ్నేయాసియా విభాగాల ఆర్ట్‌ క్యూరేటర్‌ జాన్‌గయ్‌ తెలిపారు. ఆయన గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. న్యూయార్క్‌తో పాటు ఐరోపా దేశాల్లో జరిగే అంతర్జాతీయ బౌద్ధ విశేషాల ప్రదర్శనలోను ‘అమరావతి’, ‘ఆంధ్ర దేశం’ అంశాలపై ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయనున్నారు. జాన్‌గయ్‌ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి పరకాలతోను, ఇతర ప్రభుత్వ ముఖ్యులతోను చర్చించి వెళ్లారు. నవంబరులో మరోసారి అమరావతికి వస్తానని, బౌద్ధ విశేషాల ప్రదర్శనకు రావలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుని, ఇతర ప్రముఖుల్ని ఆహ్వానిస్తామని జాన్‌ గయ్‌ తెలిపారు. ‘మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌’ ఏర్పడి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ప్రదర్శన 9 మాసాలు జరుగుతుందని, మొదట న్యూయార్క్‌తో మొదలు పెట్టి, ఆ తర్వాత ఐరోపాలోను ప్రదర్శన నిర్వహిస్తారు. ఐరోపాలో ఎక్కడ నిర్వహించేది త్వరలో నిర్ణయిస్తామని జాన్‌గయ్‌ తెలిపారు. ఇక్కడి బౌద్ధ విశేషాలను అంతర్జాతీయ ప్రదర్శనల్లో ఉంచేందుకు సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంతో మెట్‌ ఒక అవగాహన కుదుర్చుకుంటోంది. చారిత్రక విశేషాలు, పురాతన శాసనాలు, ప్రాచీన వారసత్వాన్ని పరిరక్షించేందుకు తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు, ఉద్యోగులకు నైపుణ్య శిక్షణను మెట్‌ అందజేస్తుంది.

Share this post


Link to post
Share on other sites
కేంద్రం నిధులతో బౌద్ధ వలయం
09-10-2017 08:38:44
 
636431351255532985.jpg
 • రూ.8 కోట్లు నిధుల విడుదల!
 • నాగార్జునకొండ, అమరావతి, భట్టిప్రోలు, గుంటుపల్లి, జగ్గయ్యపేటలో అభివృద్ధి పనులు
 • బౌద్ధ పర్యాటకులను ఆకట్టుకునేలా..
ఆంధ్రజ్యోతి, గుంటూరు: గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బౌద్ధ వలయం అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేసినట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. అమరావతి, గుంటుపల్లి, జగ్గయ్య పేట, నాగార్జునకొండ, భట్టిప్రో లులోని బౌద్ధ స్థూపాలన్నింటిని కలిపి ఒక వలయంగా అభివృద్ధి చేసేందుకు తొలి విడతగా రూ.8 కోట్లు నిధులు మంజూరయ్యాయి. గతంలోనే ఈ సర్క్యూట్‌ అభివృద్ధికి పర్యాటక శాఖ ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయించి కేంద్రానికి నివేదించింది. ఆ డీపీ ఆర్‌ ఆధారంగా నేడు కేంద్రం తొలి విడతగా నిధులు మంజూరు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. అయితే ఏ పనులకు ఆ నిధులు మంజూరయ్యాయనేది వారం, పది రోజుల్లో తెలుస్తుందని పర్యాటక శాఖ డైరెక్టర్‌ మల్లికార్జునరావు తెలిపారు.
 
ఒకప్పుడు ప్రస్తుత అమరావతి రాజధాని బౌద్ధారామంగా విరాజిల్లింది. నాగార్జునుడు తొలి కాలచక్ర మహాసభలు అమరావతి పుణ్యక్షేత్రం నుంచే నిర్వహించారు. ఈ కార ణంగా ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు అమరావతి అంటే పరమ పవిత్రంగా భావిస్తారు. చైనా, జపాన్‌, కొరియా, టిబెట్‌, ఇండోనేషియా వంటి దేశాల్లోని బౌద్ధులు కూడా అమ రా వతి సం దర్శనకు ఇష్ట పడుతుంటారు. బౌద్ధ మతగురువు దలైలామ కూడా ఒక పర్యాయం కాలచక్ర మహాసభలు నిర్వహించారు. అమరావతి ధ్యానబుద్ధ ప్రాజె క్టు వద్ద స్థలం కేటాయిస్తే బౌద్ధ కేంద్రాన్ని నిర్మిం చేందుకు ఆయన శిష్యులు ఏడాది క్రితం ముందుకొచ్చి ప్రతిపాదనలను అందజేశారు. సాగర్‌ డ్యాం నడిబొ డ్డున ఉన్న నాగార్జున కొండకు కూడా ఎంతో విశిష్టత ఉన్నది. భట్టిప్రోలులో బౌద్ధస్థూపం ఉన్నది. ఏటా ఈ మూడు క్షేత్రాల్లో బుద్ధపూర్ణిమని ఘనంగా నిర్వహిస్తారు. అలానే కృష్ణా జిల్లా గుంటుపల్లి, జగ్గయ్యపేటలోనూ చారిత్రక బౌద్ధ స్థూపాలు, శిల్పాలు ఉన్నాయి. బౌద్ధ క్షేత్రాలన్ని ఒక వలయంగా ఉండటంతో సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ప్రతిపాదించింది. ప్రధానంగా బౌద్ధులు ప్రార్థనలు నిర్వహించుకొనేందుకు సువిశాలమైన మందిరాలు ప్రతిపాదించారు.
 
లైబ్రరీ, ధ్యాన మందిరం, అమరావతిలో రివర్‌ఫ్రంట్‌, మ్యూజియం, పర్యాటకులను ఆకర్షించేందుకు తాగునీరు, హోటళ్లు, విడిదిగృ హాలు, కాలిబాటలు, పార్కింగ్‌ ప్రదేశాలు, పచ్చదనం సోయగాలు వంటి పనులతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించారు. వీటికి దశలవారీగా నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొన్నది. తొలి విడతగా రూ.8 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులు ఖర్చు పెట్టిన తర్వాత మిగతా పనులకు ప్రతిపాదనలను పంపించాలని ఆదేశించింది. బౌద్ధ వలయం అభివృద్ధితో ఆయా చారిత్రక ప్రదేశాలకు సందర్శకుల తాకిడి పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

Share this post


Link to post
Share on other sites
అమరావతికి ఢిల్లీ ప్రతినిధుల బృందం
15-12-2017 07:00:28
 
636489180337438907.jpg
(గుంటూరు): వారసత్వ నగరంగా ఎంపికైన అమరావతిలోని అమరేశ్వరాలయంలో ప్రసాద్‌ పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను డిల్లీకి చెందిన ప్రతినిధుల బృందం గురువారం పరిశీలించింది. బృందంలో ఎంవోటీ అండర్‌ సెక్రటరీ ఎస్‌ఎస్‌ వర్మ, కేపీఎంజీ కన్సల్టెంట్‌ నిరాబాన్‌ మహాజన్‌, తన్వీర్‌ సిన్హాతో పాటు టూరిజం డీఈ గోవిందరెడ్డి, ఈవో ఎన్‌.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో సుమారు రూ.నాలుగు కోట్లతో చేపట్టిన పనులను పరిశీలించారు.

Share this post


Link to post
Share on other sites
గుణదలలో బయల్పడిన బౌద్ధ గుహ
శాతవాహన కాలం నాటిదిగా గుర్తింపు
11ap-state2a.jpg

మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: విజయవాడ నగరంలోని గుణదలలో క్రీస్తు శకం ఒకటో శతాబ్దానికి చెందిన బౌద్ధ గుహ బయటపడిందని అమరావతి సాంస్కృతిక కేంద్రం (కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ అమరావతి), విజయవాడ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. గడప గడపకు తెదేపా కార్యక్రమంలో భాగంగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ గుణదలలో పర్యటించారు. గబ్బిలాల గుహగా పిలిచే ప్రాచీన గుహను పరిశీలించారు. ఈ విషయాన్ని ఆయన శివనాగిరెడ్డికి తెలియజేయగా బుధవారం ఎమ్మెల్యేతో కలిసి శివనాగిరెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దాన్ని 20 అడుగుల వెడల్పు, 2 అడుగుల పొడవు గల వసార, 15 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుగల మండపం, 4 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉన్న దేరవాద బౌద్ధ భిక్షువులు గుహావాసం అని నిర్ధారించారు. క్రీస్తు శకం ఒకటో శతాబ్దానికి చెందిన శాతవాహన కాలం నాటిదని వెల్లడించారు. ఒక బౌద్ధాచార్యుడు, 10 మంది బౌద్ధ భిక్షువులు వర్షాకాలంలో ఉండడానికి ఉద్దేశించిందన్నారు. ఈ గుహను వేంగీ చాళుక్యల కాలంలో వైదిక బ్రహ్మణమత గుహగా మార్చిన ఆనవాళ్లు దొరికాయన్నారు. బౌద్ధాచార్యుని గదిలో మెట్లు, దేవతా పీఠం ఏర్పాటు, గుహలోని స్తంభాలను ఎనిమిది పలకలుగా తీర్చిదిద్దడం ఇందుకు ఆధారాలుగా చెప్పవచ్చన్నారు. ప్రస్తుతం ఈ బౌద్ధ గుహాలయంలో కనకదుర్గమ్మ ప్రతిమను పెట్టి అరాధిస్తున్నారన్నారు. స్థానిక ప్రజలు ఈ గుహను చీకటి, గబ్బిలాల, సొరంగ, కనకదుర్గ గుహగా పిలుస్తున్నారన్నారు. గుహ ఎడమ వైపు ఉన్న పెద్ద రావిచెట్టు పెరిగి, గుహ ఉనికికి ప్రమాదం ఏర్పడిందని శివనాగిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ రెండు వేల ఏళ్ల చరిత్రగల ఈ బౌద్ధ గుహను రక్షిత కట్టడంగా గుర్తించి పరిరక్షించనున్నట్లు తెలిపారు.

Share this post


Link to post
Share on other sites
అమరావతి.. అపురూపం
18-04-2018 09:54:44
 
636596420860002110.jpg
 • హెరిటేజ్‌ సిటీగా చారిత్రక అమరావతి 
 • కోట్లాది రూపాయలతో పనులు
 • మూడున్నరేళ్లలో అభివృద్ధి సొబగులు
 • కొండవీటి కోట అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు
 • కొండపైకి 5 కి.మీ ఘాట్‌ రోడ్డు
 • ఇస్కాన్‌ ద్వారా 108 మందిరాల నిర్మాణం
అమరావతి, ఏప్రిల్‌17: దేశ వారసత్వ నగరంగా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడిన నగరాల్లో అమరావతి ఒకటి. సుమారు రెండున్నర వేల సంవత్సరాల చరిత్ర కలిగి, శాతవాహనుల రాజధానిగా విరాజిల్లిన అప్పటి ధాన్యకటకం ఇప్పటి ధరణికోట-అమరావతిలో క్రీ.పూ3 వశతాబ్దంలో నిర్మించిన మహాచైత్యం, పంచారామ పుణ్యక్షే త్రాల్లో ఒకటైన అమరేశ్వరుని ఆలయం అమరావతి వారసత్వ నగరంగా గుర్తింపు పొందటానికి ప్రధాన భుమికలు అయ్యాయి. ఇక్కడి భారత పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రదర్శ నశాలలో భద్రపరిచిన శిల్పసంపద అమరావతి చారిత్రక ఘట్టాలను, ఆచార వ్యవహారాలను కళ్లముందు ఉంచుతుంది. భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి అమరావతిని తన రాజధానిగా చేసుకుని పాలించిన ఘనచరిత్ర అమరావతికి ఉంది. ఇలాంటి వారసత్వ ప్రదేశాన్ని అభివృద్ధి చేసి భావితరాలకు అందించేందుకు కేంద్రప్రభుత్వం హృదయ్‌, ప్రసాద్‌ పథకాల ద్వారా కోట్లాది రూపాయలు నిధులు కేటాయించింది.
 
రూ.20 కోట్లతో హృదయ్‌ పనులు
వారసత్వ నగరంగా ఎంపికైన అమరావతికి తొలివిడతగా రూ.20కోట్లు మంజూరయ్యాయి. అందులో రూ.8కోట్లతో అంతర్గత రహదారులు నిర్మించగా, రూ.4 కోట్లతో కాలచక్ర మ్యూజి యం, రాజాగారి బంగ్లా, అమరేశ్వరాలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు, మహాచైత్యం, నూనెగుండం చెరువు, కోటకట్ట ప్రాంతాలను కలుపుతూ హెరిటేజ్‌ వాక్‌ పేరుతో పాత్‌వే నిర్మించారు. మిగిలిన రూ.8 కోట్లతో పార్కు నిర్మించనున్నారు. చారిత్రక ప్రాధాన్యతను బట్టి నూతన రాజధానికి అమరావతి పేరు పెట్టడం కూడా చారిత్రక అమరావతి పేరు ప్రపంచ స్థాయిలో మర్మోగింది. 2005లో జరిగిన కాలచక్ర మహాసభలతో సుమారు 70దేశాల నుంచి బౌద్ధులు అమరావతి తరలివచ్చారు. కాలచక్ర మహాసభలు జరిగిన సమయంలో టూరిజం శాఖ బస్టాండ్‌ ఎదురుగా నిర్మించిన కాల చక్ర మ్యూజియం నేడు వారసత్వకేంద్రంగా రూపుదిద్దుకుంది. అమరావతి వారసత్వ నగరంగా అభివృద్ధి చేసేందుకు నియమించబడిన ప్రభుత్వ సలహాదారు గల్లా అమరేశ్వర్‌ నేతృత్వంలో వారసత్వ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
 
వచ్చే ఏడాదికి సంపూర్ణ అభివృద్ధి..
వారసత్వ నగరంగా గుర్తింపు పొంది కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాల సహకారంతో అమరావతి త్వరలో అభివృద్ధి పనులు పూర్తి చేసుకుని ఆదర్శ నగరంగా అమరావతి నిలుస్తుంది. ఎన్నడూ లేని విధంగా గడచిన మూడున్నర సంవత్సరాల్లో అమరావతిలో అభివృద్ధి జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు సహకారంతో రాజధాని అమరావతితో పాటు చారిత్రక అమరావతి కూడా అభివృద్ది చెందుతాయి.
- డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌, ఎమ్మెల్యే
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

 • Recently Browsing   0 members

  No registered users viewing this page.

×