Jump to content

AndhraPradesh Tourism

Guest Urban Legend

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply

పర్యాటకం పట్టాలెక్కింది! 
గత భాగస్వామ్య సదస్సుల్లో 80 శాతానికి పైగా సానుకూల ఫలితాలు 
  ఇప్పుడు 50 ఒప్పందాలు.. రూ. 5 వేల కోట్ల పెట్టుబడులు 
  తాజా భాగస్వామ్య సదస్సుపై పర్యాటక అధికారుల వెల్లడి 
ఈనాడు - విశాఖపట్నం
పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను 2050 నాటికి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటివరకు నిర్వహించిన రెండు భాగస్వామ్య సదస్సుల్లో ఈ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. గతేడాది కుదిరిన ఒప్పందాల్లో దాదాపు 80 శాతం ఫలవంతం అయినట్టు పర్యాటక అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో పర్యాటక రంగం వాటా 18 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో తొలిరోజు పర్యాటక రంగానికి సంబంధించే రూ.5 వేల కోట్ల విలువైన 50 ఒప్పందాలు కుదరనున్నాయని పర్యాటక అధికారులు తెలిపారు. ఇప్పటికే అభిరామ్‌ నిర్మాణ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, అమరావతి బోటింగ్‌ క్లబ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, అడ్వంచర్‌ క్లబ్‌ ఆఫ్‌ ఏపీ, అంజలి లాజిస్టిక్‌ ప్రై. లిమిటెడ్‌, హై సీ నావెల్‌ ఆర్కెటెక్ట్స్‌, ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కాంధారి హోటల్స్‌, మహీంద్రా హాలిడేస్‌, ఎస్‌.పి.వి సంస్థ, ఎస్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్‌.వి.ఎస్‌ కనస్ట్రక్షన్స్‌, సశ్యవేద అగ్రో- ఎకో టూరిజం ప్రైవేట్‌ లిమిటెడ్‌, వండర్‌ ల్యాండ్‌ ఎమ్యూజ్‌మెంట్‌ పార్కు, హాలిస్టిక్‌ రిసార్ట్స్‌ తదితర సంస్థలు ఒప్పందాలకు ముందుకొచ్చి పేర్లు నమోదు చేసుకున్నాయి.
గత భాగస్వామ్య సదస్సుల్లో...
*  కుదిరిన పర్యాటక ఒప్పందాలు: 72 
* ఏర్పాటైన ప్రాజెక్టులు: 38 
* ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి: 4 
* నిర్మాణ దశలో ఉన్నవి: 9 
* పునాది స్థాయిలో ఉన్నవి: 13 
* అనుమతుల దశలో: 8 
* ప్రాజెక్టుల పెట్టుబడుల విలువ: రూ.3,142.40 కోట్లు 
* మొత్తం ఉపాధి అవకాశాలు: 11,111 
* ఇప్పటివరకు కల్పించిన ఉపాధి: 2,800

Link to comment
Share on other sites

పర్యాటకానికి పెట్టుబడుల కిక్‌
25-02-2018 04:51:46
విభిన్న ప్రాజెక్టులతో ముందుకొచ్చిన కంపెనీలు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూలు మార్చుకోవడానికి ముందుగా ఉదయం హోటల్‌ అంబికా సీగ్రీన్‌లో పెట్టుబడిదారులతో పర్యాటకశాఖ అధికారులు ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సమావేశానికి పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ జయరామిరెడ్డి, కార్యదర్శి ముఖే్‌షకుమార్‌ మీనా హాజరయ్యారు. ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల్లో మహీంద్ర గ్రూప్‌నకు చెందిన మహీంద్ర క్లబ్‌హౌస్‌, ఎస్సెల్‌ గ్రూప్‌, అమెరికాలోని ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తున్న సింపుల్‌ గ్రూప్‌ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా హోటళ్లు, రిసార్ట్స్‌, క్లబ్‌హౌ్‌సలు, అమ్యూజ్‌మెంటు పార్కులు, థీమ్‌పార్కులు, బీచ్‌ఫ్రంట్‌లు, హెల్త్‌స్పా వంటివి ఏర్పాటు కానున్నాయి. సాహస క్రీడలు, అగ్రి టూరిజం, ఎకో టూరిజం, కన్వెన్షన్‌ సెంటర్లు తదితర ప్రాజెక్టులపై పెట్టుబడిదారులు ఆసక్తి కనబరిచారు.
కొవ్వూరులో రివర్‌ఫ్రంట్‌ హోటల్‌
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గోదావరి రివర్‌ ఫ్రంట్‌లో రూ.23కోట్ల పెట్టుబడితో హోటల్‌ ప్రారంభిస్తున్నాం. దీనిలో 130మందికి ఉపాధి లభిస్తుంది. గోదావరి అందాలు తిలకించేందుకు ఈ హోటల్‌ అనువుగా ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన నాకు ఈ రంగంలో కొంత అనుభవం ఉంది. తండ్రి రామారావు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే. పర్యాటక శాఖ ప్రోత్సాహంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మరికొద్ది నెలల్లో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది.
- దివ్యారాణి, మహిళా పారిశ్రామికవేత్త
500కోట్లతో బీచ్‌ఫ్రంట్‌ల అభివృద్ధి
అమెరికాలో ఫ్లోరిడా కేంద్రంగా ‘సింపుల్‌’ గ్రూపు పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నాం. సాఫ్ట్‌వేర్‌, మౌలిక వసతుల రంగంలో అనుభవం ఉంది. గతేడాది విజయవాడ భవానీ ఐలాండ్స్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌ ప్రాజెక్టులు చేపట్టాం. కోస్తాలో పదిచోట్ల బీచ్‌ఫ్రంట్‌లు, ఐలాండ్‌లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. విజయవాడలో సొంతంగా బోట్లు తయారుచేస్తున్నాం. దశల వారీగా కృష్ణాజిల్లాలో పదిచోట్ల బీచ్‌ఫ్రంట్‌లు, ఐలాండ్‌ల అభివృద్ధికి రూ.500కోట్లు పెట్టుబడి పెడతాం. మా ప్రాజెక్టులతో నేరుగా 1,500మందికి ఉపాధి లభిస్తుంది.
- గుమ్మడపు పాపారావు, సింపుల్‌ గ్రూపు
500 కోట్లతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌, మల్టీప్లెక్స్‌
విజయవాడ-గుంటూరు హైవే పక్కన డీజీపీ కార్యాలయం సమీపంలో సుమారు రూ.500కోట్లతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌, మల్టీప్లెక్స్‌, మాల్‌ నిర్మాణం చేపట్టనున్నాం. 8స్ర్కీన్లతో మల్టీప్లెక్స్‌, 20లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్‌, ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ఉంటాయి. ఇందులో ఐటీ స్పేస్‌ కూడా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాం. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 5ఎకనామిక్‌ సిటీల్లో రెండింటిని (విశాఖ, విజయవాడ) మేం చేపట్టనున్నాం. ఇందులో హౌసింగ్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌, ఇండస్ర్టీస్‌ ఉంటాయి. విజయవాడలో సుమారు రూ.10వేల కోట్లతో 300ఎకరాల్లో ఎకనామిక్‌ సిటీ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాం.
- ఎస్‌డీవీ కృష్ణకుమార్‌, సీఈవో, ఎల్‌ఈపీఎల్‌
విశాఖలో 100కోట్లతో జలవిహార్‌
విశాఖలో జలవిహార్‌ ఏర్పాటు చేసేందుకు రూ.100కోట్లతో ఎంవోయూ కుదుర్చుకున్నాం. జలవిహార్‌ డెస్టినీ టూరిజం ప్రాజెక్టు పేరుతో ఆనందపురం మండలంలో దీని ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నాం. 9.5 ఎకరాల్లో నిర్మాణాన్ని చేపడతాం. ఇందులో త్రీ స్టార్‌ హోటల్‌, లీజర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆడిటోరియం, ఎగ్జిబిషన్‌ సెంటర్‌ ఉంటాయి.
- వి.మురళీమోహన్‌, జనరల్‌ మేనేజర్‌, జలవిహార్‌
50ఎకరాల్లో వినోద కేంద్రం
విశాఖలోని గీతం మెడికల్‌ కళాశాల పక్కన సుమారు 50ఎకరాల్లో ఫైవ్‌స్టార్‌ హోటల్‌తో కన్వెన్షన్‌ సెంటర్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాం. సుమారు రూ.500కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నాం. 5వేల సీట్ల సామర్థ్యంతో నిర్మించే దీనిని 2021నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం.
- ఈదర విద్యాసాగర్‌, డైరెక్టర్‌,
ఫ్రంట్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
విశాఖ పరిసరాల్లో సైన్స్‌సిటీ
విశాఖ పరిసరాల్లో సైన్స్‌సిటీ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నాం. రూ.30కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాం. విద్యార్థులకు ప్రాక్టికల్స్‌కు అనువుగా సైన్స్‌ సిటీలో వసతులు కలిస్తాం. విదేశాల్లో అనేకచోట్ల సైన్స్‌సిటీల మోడల్‌ చూసి విశాఖలో ఏర్పాటుకు ప్రతిపాదించాం.
- ముదునూరు ఎంఎస్‌ రాజు,
ముదునూరు గ్రూప్‌ చైర్మన్‌
రెండుచోట్ల వెల్‌నెస్‌ సెంటర్లు
అమరావతి, విశాఖల్లో వరల్డ్‌ క్లాస్‌ వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటుకు ఒప్పందం కుదర్చుకున్నాం. విశాఖలోని బే పార్కు స్పాలో 51శాతం వాటా కొనుగోలుకు 10మిలియన్‌ డాలర్లు వెచ్చిస్తున్నాం. అమరావతిలో వెల్‌నెస్‌ సెంటర్‌కు 50మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడతాం. నేచురోపతిలో ఏపీని కీలక కేంద్రంగా మార్చాలన్నది మా ప్రణాళిక. దీనిలో అబుదాబీ రాజు పెట్టుబడులు పెడుతున్నారు.
- పి.జయప్రద, ఇన్వె్‌స్టమెంట్‌ డైరెక్టర్‌,
ప్రిన్స్‌ ఆఫ్‌ మహ్మద్‌ బిన్‌ తహనూన్‌ అల్‌
 
రాజధానిలో కళల కేంద్రం
రూ.100కోట్ల పెట్టుబడితో అమరావతి కళల కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. 200 మందికి ఉపాధి లభించనుంది. నృత్యం, సంగీతంలో శిక్షణ ఇస్తాం. డిప్లమో, డిగ్రీ, సర్టిఫికెట్‌ కోర్సులు ప్రవేశపెడతాం. ఈ కేంద్రం ఏర్పాటుకు 15 నుంచి 25 ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతున్నాం.
- వీవీ సుందరం, చైర్మన్‌,
క్లీవ్‌లాండ్‌ త్యాగరాజు ఫెస్టివల్‌
భవానీ ద్వీపంలో అగ్రి టూరిజం
భవానీద్వీపం పరిసరాల్లో 70ఎకరాల్లో రూ.60కోట్లతో అగ్రిటూరిజం ప్రాజెక్టు నెలకొల్పుతాం. వ్యవసాయాన్ని పర్యాటకానికి అనుసంధానం చేస్తాం. రైతులు, గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పిస్తాం. దీనికోసం మూడు గ్రామాలను దత్తత తీసుకుంటాం. నగరాలు, పట్టణాల్లోని పిల్లలకు వ్యవసాయం ప్రాధాన్యం వివరించేలా పర్యాటకాన్ని విస్తరిస్తాం.
- మాధవీబిందు, ఎండీ, సస్యవేద ఆగ్రి టూరిజం

Link to comment
Share on other sites

పర్యాటకంలో 7,806 కోట్ల పెట్టుబడులు! 
56 ఎంవోయూలు.. 33 వేల మందికి ఉపాధి 

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యమిస్తున్నందున ఆ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఔత్సాహికులు  ఆసక్తి చూపుతున్నారు. విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.7,806 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వివిధ రంగాలకు చెందిన 56 సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా సమక్షంలో ఒప్పందాలపై(ఎంవోయూ) సంతకాలు చేశారు. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఎంవోయూలు కుదుర్చుకున్న ప్రతినిధులకు అందజేశారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపంలోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 33,023 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మూడో సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 47 ఎంవోయూలు ఆతిథ్య రంగానికి చెందినవే. హోటళ్లు, రిసార్టులు, వెల్‌నెస్‌ సెంటర్లు, వినోదం, విజ్ఞానానికి సంబంధించిన ప్రాజెక్టులు నెలకొల్పనున్నారు. ఒప్పందాల్లో ప్రధానమైనవి. 
* అంజలి లాజిస్టిక్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కాకినాడ, భీమవరంలలో రూ.550 కోట్లతో రిసార్టుల నిర్మాణానికి ముందుకొచ్చింది. 
* అమరావతి కళావిద్యాలయం అమరావతి ప్రాంతంలో రూ.80 కోట్లతో సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ పెర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ఏర్పాటు చేయనుంది. 
* ఫార్ట్యూన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ విశాఖపట్నంలో రూ.500 కోట్లతో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించనుంది.
* భవాని ద్వీపంలో ఎస్సెల్‌ గ్రూపు రూ.500 కోట్లతో అడ్వంచర్‌ పార్క్‌ నిర్మాణానికి ముందుకొచ్చింది. 
* విజయవాడ బాహ్యవలయ రహదారికి సమీపంలో అయిదు నక్షత్రాల హోటల్‌ నిర్మాణానికి రూ.200 కోట్లతో కాంధారి హోటల్‌ ఎంవోయూ కుదుర్చుకుంది. 
* గుంటూరు జిల్లా మంగళగిరి సమీపం.. ఆత్మకూర్‌లో రూ.40 కోట్లతో సీకే కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించనుంది. 
* పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీరామారావు రూ.24 కోట్లతో రివర్‌వ్యూ హోటల్‌ నిర్మాణానికి ఎంవోయూ కుదుర్చుకున్నారు. 
* అరకు, మోయిపాడుల్లో రూ.6.60 కోట్లతో అడ్వెంచర్‌ టూరిజం శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఏసీఏపీ అడ్వెంచర్‌ ముందుకొచ్చింది.
21 రోజుల్లోనే అనుమతులు 
పర్యాటక రంగంలోని ప్రాజెక్టులకు 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి.. మౌలిక సదుపాయాలు, సేవల కోసం వ్యూహాలు’ అంశంపై చర్చలో ఆయన మాట్లాడారు. ప్రధాన ప్రాజెక్టులకు ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. వారు అనుమతుల నుంచి యూనిట్‌ నెలకొల్పేవరకు ప్రభుత్వానికి, పెట్టుబడిదారులకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తారన్నారు. 
పర్యాటకశాఖ పరంగా వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్టులు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెస్తాయని మీనా చెప్పారు. 
* విశాఖపట్నంలో ప్రత్యేక పర్యాటక జోన్‌ ఏర్పాటు, ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను విశాఖలో ప్రదర్శనశాలగా మలచడం, అందులోనే రెస్టారెంట్‌ ఏర్పాటు, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం. 
* రాజమహేంద్రవరంలోని వందేళ్లకాలం నాటి వంతెనను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం.
వివిధ సంస్థల ప్రతినిధులు ఏమన్నారంటే..
* దేశీయంగా ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నా వాటిలో కేవలం పది శాతమే అభివృద్ధికి నోచుకున్నాయి. మిగతా 90 శాతం పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
- హాలిడేస్‌ ఐక్యూ సీఈవో హరినాయర్‌.
* రూ.15 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను ప్రత్యేకమైనవిగా పరిగణించి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలి.
- యస్‌ బ్యాంక్‌ ప్రతినిధి నికిల్‌ సాహ్ని.
* పర్యాటక ప్రాజెక్టుల్లో జాప్యం నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి.
-మహీంద్ర హ్యాలీడేస్‌ ప్రతినిధి మోనేష్‌ విజ్‌
* పర్యాటక రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహంతో పాటు రక్షణ కల్పించాలి.
- ఎస్‌ఎల్‌ గ్రూపు ప్రతినిధి రాజీవ్‌ దుగ్గల్‌
* మా సేవలు ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిల్లో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని నగరాలకు విస్తరించడానికి అవసరమైన ప్రో త్సాహం అందజేయాలి.
 - ఓయో రూమ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ హెడ్‌ తన్మయ్‌ రాజవంశి

Link to comment
Share on other sites

Tourism in Vizag to get a big push

‘INS Viraat’ project to be taken up at an estimated cost of Rs. 800 crore

INS Viraat, the pet project of Andhra Pradesh, will be kept in Visakhapatnam. It will complete the naval tourism circuit along with TU 142 museum and Kursuru Submarine museum, according to Tourism Minister Bhuma Akhila Priya.

Speaking to The Hindu on the sidelines of the panel discussion on tourism on the first day of the CII Partnership Summit, she said: “INS Viraat is the pet project of A.P. and will give a huge boost to Visakhapatnam’s tourism. An estimated cost of Rs. 800 crore is required for the project. The Detailed Project Report is ready and we will be approaching the Union government for funds. We have kept all options open which include exploring PPP mode and getting a loan since this is the most prestigious project for the State.” The State government intends to convert the Centaur-class carrier, which spent 30 years in the Indian Navy and 27 years in the Royal Navy, into a museum and a hotel in the sea.

“The State government is also planning to set up a state-of-the-art virtual reality gaming hub near the TU 142 aircraft museum. This will be one of the most interesting projects of the State. We have called for tenders to develop the gaming hub that will come up at a cost of Rs. 60 crore,” Ms. Akhila Priya said.

Marquee projects

Sharing details on the six marquee projects of A.P. Tourism, she said the Madhurawada project would include a five star hotel, convention centres and amusement park to be developed in 250 acres. “The DPR is completed and many investors have shown interest to be part of the project,” she said. The Union government has sanctioned Rs. 60 crore for Kakinada Hope Island under the Swadesh Darshan scheme for developing infrastructure and facilities for domestic and international tourists. “Work has picked up pace there and it will be completed soon,” she added. DPR has also been prepared for the Havelock “The DPR to develop the over 100-year-old bridge over the Godavari river, popularly known as Havelock bridge, for transforming it into a major tourist attraction, is also being prepared.”

“Our focus will be to weed out non-serious investors. However, 90% of investors are showing interest in Visakhapatnam and Amaravatis,” Ms. Akhila Priya said.

Link to comment
Share on other sites

పర్యాటకానికి పెట్టుబడుల కిక్‌
25-02-2018 04:51:46
విభిన్న ప్రాజెక్టులతో ముందుకొచ్చిన కంపెనీలు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూలు మార్చుకోవడానికి ముందుగా ఉదయం హోటల్‌ అంబికా సీగ్రీన్‌లో పెట్టుబడిదారులతో పర్యాటకశాఖ అధికారులు ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సమావేశానికి పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ జయరామిరెడ్డి, కార్యదర్శి ముఖే్‌షకుమార్‌ మీనా హాజరయ్యారు. ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల్లో మహీంద్ర గ్రూప్‌నకు చెందిన మహీంద్ర క్లబ్‌హౌస్‌, ఎస్సెల్‌ గ్రూప్‌, అమెరికాలోని ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తున్న సింపుల్‌ గ్రూప్‌ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా హోటళ్లు, రిసార్ట్స్‌, క్లబ్‌హౌ్‌సలు, అమ్యూజ్‌మెంటు పార్కులు, థీమ్‌పార్కులు, బీచ్‌ఫ్రంట్‌లు, హెల్త్‌స్పా వంటివి ఏర్పాటు కానున్నాయి. సాహస క్రీడలు, అగ్రి టూరిజం, ఎకో టూరిజం, కన్వెన్షన్‌ సెంటర్లు తదితర ప్రాజెక్టులపై పెట్టుబడిదారులు ఆసక్తి కనబరిచారు.
కొవ్వూరులో రివర్‌ఫ్రంట్‌ హోటల్‌
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గోదావరి రివర్‌ ఫ్రంట్‌లో రూ.23కోట్ల పెట్టుబడితో హోటల్‌ ప్రారంభిస్తున్నాం. దీనిలో 130మందికి ఉపాధి లభిస్తుంది. గోదావరి అందాలు తిలకించేందుకు ఈ హోటల్‌ అనువుగా ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన నాకు ఈ రంగంలో కొంత అనుభవం ఉంది. తండ్రి రామారావు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే. పర్యాటక శాఖ ప్రోత్సాహంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మరికొద్ది నెలల్లో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది.
- దివ్యారాణి, మహిళా పారిశ్రామికవేత్త
500కోట్లతో బీచ్‌ఫ్రంట్‌ల అభివృద్ధి
అమెరికాలో ఫ్లోరిడా కేంద్రంగా ‘సింపుల్‌’ గ్రూపు పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నాం. సాఫ్ట్‌వేర్‌, మౌలిక వసతుల రంగంలో అనుభవం ఉంది. గతేడాది విజయవాడ భవానీ ఐలాండ్స్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌ ప్రాజెక్టులు చేపట్టాం. కోస్తాలో పదిచోట్ల బీచ్‌ఫ్రంట్‌లు, ఐలాండ్‌లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. విజయవాడలో సొంతంగా బోట్లు తయారుచేస్తున్నాం. దశల వారీగా కృష్ణాజిల్లాలో పదిచోట్ల బీచ్‌ఫ్రంట్‌లు, ఐలాండ్‌ల అభివృద్ధికి రూ.500కోట్లు పెట్టుబడి పెడతాం. మా ప్రాజెక్టులతో నేరుగా 1,500మందికి ఉపాధి లభిస్తుంది.
- గుమ్మడపు పాపారావు, సింపుల్‌ గ్రూపు
500 కోట్లతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌, మల్టీప్లెక్స్‌
విజయవాడ-గుంటూరు హైవే పక్కన డీజీపీ కార్యాలయం సమీపంలో సుమారు రూ.500కోట్లతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌, మల్టీప్లెక్స్‌, మాల్‌ నిర్మాణం చేపట్టనున్నాం. 8స్ర్కీన్లతో మల్టీప్లెక్స్‌, 20లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్‌, ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ఉంటాయి. ఇందులో ఐటీ స్పేస్‌ కూడా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాం. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 5ఎకనామిక్‌ సిటీల్లో రెండింటిని (విశాఖ, విజయవాడ) మేం చేపట్టనున్నాం. ఇందులో హౌసింగ్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌, ఇండస్ర్టీస్‌ ఉంటాయి. విజయవాడలో సుమారు రూ.10వేల కోట్లతో 300ఎకరాల్లో ఎకనామిక్‌ సిటీ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాం.
- ఎస్‌డీవీ కృష్ణకుమార్‌, సీఈవో, ఎల్‌ఈపీఎల్‌
విశాఖలో 100కోట్లతో జలవిహార్‌
విశాఖలో జలవిహార్‌ ఏర్పాటు చేసేందుకు రూ.100కోట్లతో ఎంవోయూ కుదుర్చుకున్నాం. జలవిహార్‌ డెస్టినీ టూరిజం ప్రాజెక్టు పేరుతో ఆనందపురం మండలంలో దీని ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నాం. 9.5 ఎకరాల్లో నిర్మాణాన్ని చేపడతాం. ఇందులో త్రీ స్టార్‌ హోటల్‌, లీజర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆడిటోరియం, ఎగ్జిబిషన్‌ సెంటర్‌ ఉంటాయి.
- వి.మురళీమోహన్‌, జనరల్‌ మేనేజర్‌, జలవిహార్‌
50ఎకరాల్లో వినోద కేంద్రం
విశాఖలోని గీతం మెడికల్‌ కళాశాల పక్కన సుమారు 50ఎకరాల్లో ఫైవ్‌స్టార్‌ హోటల్‌తో కన్వెన్షన్‌ సెంటర్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాం. సుమారు రూ.500కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నాం. 5వేల సీట్ల సామర్థ్యంతో నిర్మించే దీనిని 2021నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం.
- ఈదర విద్యాసాగర్‌, డైరెక్టర్‌,
ఫ్రంట్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
విశాఖ పరిసరాల్లో సైన్స్‌సిటీ
విశాఖ పరిసరాల్లో సైన్స్‌సిటీ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నాం. రూ.30కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాం. విద్యార్థులకు ప్రాక్టికల్స్‌కు అనువుగా సైన్స్‌ సిటీలో వసతులు కలిస్తాం. విదేశాల్లో అనేకచోట్ల సైన్స్‌సిటీల మోడల్‌ చూసి విశాఖలో ఏర్పాటుకు ప్రతిపాదించాం.
- ముదునూరు ఎంఎస్‌ రాజు,
ముదునూరు గ్రూప్‌ చైర్మన్‌
రెండుచోట్ల వెల్‌నెస్‌ సెంటర్లు
అమరావతి, విశాఖల్లో వరల్డ్‌ క్లాస్‌ వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటుకు ఒప్పందం కుదర్చుకున్నాం. విశాఖలోని బే పార్కు స్పాలో 51శాతం వాటా కొనుగోలుకు 10మిలియన్‌ డాలర్లు వెచ్చిస్తున్నాం. అమరావతిలో వెల్‌నెస్‌ సెంటర్‌కు 50మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడతాం. నేచురోపతిలో ఏపీని కీలక కేంద్రంగా మార్చాలన్నది మా ప్రణాళిక. దీనిలో అబుదాబీ రాజు పెట్టుబడులు పెడుతున్నారు.
- పి.జయప్రద, ఇన్వె్‌స్టమెంట్‌ డైరెక్టర్‌,
ప్రిన్స్‌ ఆఫ్‌ మహ్మద్‌ బిన్‌ తహనూన్‌ అల్‌
 
రాజధానిలో కళల కేంద్రం
రూ.100కోట్ల పెట్టుబడితో అమరావతి కళల కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. 200 మందికి ఉపాధి లభించనుంది. నృత్యం, సంగీతంలో శిక్షణ ఇస్తాం. డిప్లమో, డిగ్రీ, సర్టిఫికెట్‌ కోర్సులు ప్రవేశపెడతాం. ఈ కేంద్రం ఏర్పాటుకు 15 నుంచి 25 ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతున్నాం.
- వీవీ సుందరం, చైర్మన్‌,
క్లీవ్‌లాండ్‌ త్యాగరాజు ఫెస్టివల్‌
భవానీ ద్వీపంలో అగ్రి టూరిజం
భవానీద్వీపం పరిసరాల్లో 70ఎకరాల్లో రూ.60కోట్లతో అగ్రిటూరిజం ప్రాజెక్టు నెలకొల్పుతాం. వ్యవసాయాన్ని పర్యాటకానికి అనుసంధానం చేస్తాం. రైతులు, గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పిస్తాం. దీనికోసం మూడు గ్రామాలను దత్తత తీసుకుంటాం. నగరాలు, పట్టణాల్లోని పిల్లలకు వ్యవసాయం ప్రాధాన్యం వివరించేలా పర్యాటకాన్ని విస్తరిస్తాం.
- మాధవీబిందు, ఎండీ, సస్యవేద ఆగ్రి టూరిజం

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...