Jump to content

Lokesh


Eswar09

Recommended Posts

Posted

సాక్షి: ఇప్పటంలో జనసేనకు 2019లో 14 ఓట్లు... వీళ్లకు 53 కుటుంబాలలో అభిమానులు ఉన్నారట

Truth: ఇప్పటం మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గంలో జనసేన పోటీలో లేదు. మిత్రపక్షం సిపిఐకి కేటాయించింది....

  • Replies 69
  • Created
  • Last Reply
Posted

రేపు వచ్చేది నేనే..✌️✌️
నేనే కట్టిస్తా జలగ్ కూల్చిన మీ ఇళ్ళు💕
నాది జేసీబీ కాదు...
సైకిల్...🔥

నారా లోకేష్🔥🔥🔥✌️✌️

Posted
53 minutes ago, Siddhugwotham said:

రేపు వచ్చేది నేనే..✌️✌️
నేనే కట్టిస్తా జలగ్ కూల్చిన మీ ఇళ్ళు💕
నాది జేసీబీ కాదు...
సైకిల్...🔥

నారా లోకేష్🔥🔥🔥✌️✌️

 

 

Posted

Nara Lokesh Ipptam Tour: జగన్మోహన్‌రెడ్డిది జేసీబీ ప్రభుత్వమని.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అధికార వాహనంగా జేసీబీ మారిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో పర్యటించిన లోకేశ్.. రోడ్డు విస్తరణలో భాగంగా ధ్వంసం చేసిన ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శించారు. బాధితుల నుంచి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తే విస్తరణ లేకుండగా చూస్తానని హామీ ఇచ్చినప్పటికీ.. హఠాత్తుగా వచ్చి ఇళ్లు కూల్చారని బాధితులు లోకేశ్‌కు తెలిపారు. వారికి అండగా ఉంటామని లోకేశ్ భరోసానిచ్చారు. తరాల తరబడి ఇక్కడే నివాసం ఉంటున్న మా ఇళ్లను అధికారులు కూల్చివేశారని బాధితులు వాపోయారు. ఇళ్ల కూల్చివేతపై జరిగిన తీరును వారు లోకేశ్కు వివరించారు. అధికారులను వేడుకున్నా.. సమయం ఇవ్వకుండా కూల్చివేశారని బాధితులు వివరించారు. కేవలం రాజకీయం కక్షతోనే ఈ చర్యకు పూనుకున్నారని బాధితులు అవేదన వ్యక్తం చేశారు. 

ఈ ఘటనపై స్పందించిన లోకేశ్.. వైకపాపై విమర్శల వర్షం కురిపించారు. జగన్మోహన్‌రెడ్డిది జేసీబీ ప్రభుత్వమని మండిపడ్డారు. జగన్‌ సీఎం అయిన తర్వాత రాష్ట్ర అధికార వాహనంగా జేసీబీ మారిందని విమర్శించారు. గుంతలు పూడ్చలేనివారు.. 120 అడుగుల రోడ్డు వేస్తామంటే నమ్మాలా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో ఉన్న పెద్ద సైకో జగన్ మోహన్ రెడ్డి, మంగళగిరిలో చిన్న సైకో ఆళ్ల రామకృష్ణ రెడ్డి అని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డికి ధీటుగా ఆళ్ల రామకృష్ణ రెడ్డి పేదల కన్నీరు చూడటమే లక్ష్యంగా పని చేస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకో విమానాశ్రయం అని పెద్ద సైకో జగన్‌ అంటే.. ఇప్పటం గ్రామానికి విమానాశ్రయం తెస్తానంటూ చిన్న సైకో ఇళ్లు కూల్చాడని విమర్శించారు. రాష్ట్రంలో సైకో ప్రభుత్వం పోయి.. సైకిల్ ప్రభుత్వం వస్తుందని స్పష్టం చేశారు. దశాబ్దాల నుంచి ఎలాంటి గొడవలు లేని ఇప్పటంలో ఇళ్లను కూల్చివేసి అలజడి సృష్టించారని ఆరోపించారు. ప్రజలు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే ఇంత కక్ష చూపిస్తారా అని నిలదీశారు. తెదేపాకు మెజారిటీ వచ్చిందని,.. జనసేన సభకు భూములిచ్చారనే రాజకీయ కక్షతో చిన్న సైకో ఇళ్లు కూలగొట్టించారని ధ్వజమెత్తారు. 

ఇప్పటం గ్రామానికి వందల కోట్లు ఖర్చు పెట్టామంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లపై సవాల్కు సిద్ధమని లోకేశ్ తేల్చిచెప్పారు. రోడ్లు, డ్రైనేజీలకు వైకాపా ఖర్చు చేసామని బ్యానర్లలో తెలిపింది. మరీ బ్యానర్లలో రాసినట్లు రోడ్లు, డ్రైనేజీలు ఎక్కడ అని ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వం వేసిన డ్రైన్లకు తమ పేర్లు వేసుకోవటానికి సిగ్గుండాలని లోకేశ్ మండిపడ్డారు. అయితే గ్రామంలో మొత్తం 50కి పైగా ఇళ్లు ధ్వంసం అయితే వాటిలో 8ఇళ్లకు.. వైకాపా నేతలు తమకు ఎవరి సానుభూతి అవసరం లేదంటూ బ్యానర్లు కట్టారు. డబ్బులిచ్చి అబద్దాలను నిజం చేయకండని ఆ బ్యానర్లలో రాసి ఉంది. లోకేశ్ ఇప్పటం రావటంతో పోలీసులు భారీగా మోహరించారు

Posted

ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేశ్‌ పాదయాత్ర

 
  • పాదయాత్రపై నేతలకు స్పష్టత ఇచ్చిన నారా లోకేశ్‌
  • 2023 జనవరి 27న పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటన
  • చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభం కానున్న లోకేశ్‌ పాదయాత్ర
  • కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేశ్‌ పాదయాత్ర
  • ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేశ్‌ పాదయాత్ర
Posted
2 hours ago, Nfan from 1982 said:

ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేశ్‌ పాదయాత్ర

 
  • పాదయాత్రపై నేతలకు స్పష్టత ఇచ్చిన నారా లోకేశ్‌
  • 2023 జనవరి 27న పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటన
  • చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభం కానున్న లోకేశ్‌ పాదయాత్ర
  • కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేశ్‌ పాదయాత్ర
  • ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేశ్‌ పాదయాత్ర

All the best 🚲

Posted

గ్రామంలో మొత్తం 50కి పైగా ఇళ్లు ధ్వంసం అయితే వాటిలో 8ఇళ్లకు.. వైకాపా నేతలు తమకు ఎవరి సానుభూతి అవసరం లేదంటూ బ్యానర్లు కట్టారు. డబ్బులిచ్చి అబద్దాలను నిజం చేయకండని ఆ బ్యానర్లలో రాసి ఉంది

 

ippudu cheppandi. Lokesh pavan kalyan kante mundhe velli undala aa ooriki?

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...