Jump to content

హైదరాబాద్‌ మెట్రోలో ఎల్‌అండ్‌టీ వాటా అమ్మకం?

KING007

Recommended Posts

Posted

హైదరాబాద్‌ మెట్రోలో ఎల్‌అండ్‌టీ వాటా అమ్మకం?

నష్టాలు, ప్రభుత్వ సహకారం లేనందునే నిర్ణయం!

కీలకేతర ఆస్తులను విక్రయించే యోచనలో సంస్థ

జాబితాలో ఇతర చోట్ల ఉన్న ఆస్తులు కూడా

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) వాటాను ఆ సంస్థ విక్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. సంస్థ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (డెవల్‌పమెంట్‌ ప్రాజెక్ట్స్‌) డీకే సేన్‌ మంగళవారం ఈ మేరకు సంకేతాలిచ్చారు. ఉత్తరాఖండ్‌లో ఎల్‌అండ్‌టీకి చెందిన 99 మెగావాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టును రెన్యూ పవర్‌ కంపెనీకి విక్రయించిన విషయాన్ని వెల్లడిస్తూ విడుదల చేసిన ప్రకటనలో సేన్‌ ఈ విషయం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ మెట్రోలో ఎల్‌అండ్‌టీకి 90 శాతం వాటా ఉండగా, 10 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉంది.

అయితే ఇందులో పూర్తి వాటాను విక్రయిస్తారా? లేక కొంత వాటానా? అన్నది మాత్రం సేన్‌ వెల్లడించలేదు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుతోపాటు పంజాబ్‌లోని నభా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని కూడా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు తమ సంస్థ ఆధ్వర్యంలోని ఇతర ఆస్తులను కూడా విక్రయించాలని చూస్తున్నట్లు తెలిపారు. కొవిడ్‌ కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్లే ఎల్‌అండ్‌టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇబ్బందులు మరీ తీవ్రంగా లేకపోయినా, కీలకేతర వ్యాపారాల నుంచి తప్పుకొని.. ఆ నిధులను ఇతర కీలక  వ్యాపారాలకు వినియోగించడం మంచిదని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆదినుంచీ నష్టాలే!

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు విషయంలో ఎల్‌అండ్‌టీకి ఆదినుంచీ నష్టాలనే చవిచూస్తోంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,571 కోట్లు కాగా, వివిధ కారణాలతో ఇది రూ.18,971 కోట్లకు చేరింది. ఇందులో రూ.13,500 కోట్లను ఎల్‌అండ్‌టీ అప్పుల ద్వారా సేకరించింది. దీనికితోడు 2019-20లో రూ.383.20 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. 2020-21లో ఈ నష్టాలు ఏకంగా రూ.1,766 కోట్లకు చేరాయి. కొవిడ్‌ కారణంగా 2020 మార్చి 23 నుంచి సెప్టెంబరు 8 వరకు దాదాపు ఆరు నెలలపాటు మెట్రో రైల్‌ సేవలు పూర్తిగా నిలిచిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు సర్వీసులు నడుస్తున్నా కొవిడ్‌కు ముందు ఉన్నంత రద్దీ లేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం కూడా నష్టాలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు.

ఇలా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం, ప్రాజెక్టు వ్యయం పెరిగిపోవడంతో కంపెనీకి అసలు, వడ్డీ చెల్లింపులు భారంగా మారాయి. ఉద్యోగుల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో భవిష్యత్తులోనూ ప్రయాణికుల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ కష్టాల నుంచి బయటపడేందుకు తక్కువ వడ్డీతో రూ.5 వేల కోట్ల రుణసాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎల్‌అండ్‌టీ కోరింది. కానీ, దీనిపై ప్రభుత్వ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. మరోవైపు రూ.4 వేల కోట్ల పెట్టుబడుల కోసం నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎ్‌ఫ)తో జరుపుతున్న చర్చలు కూడా ఇంకా  కొలిక్కి రాలేదు. దీంతో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో తన వాటాను అమ్ముకోవడమే మేలని ఎల్‌అండ్‌టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Posted
19 minutes ago, krish2015 said:

Adani or ambani swaha chestharu

My home ollu vunnaru ga bro.. Vallu konestharu emo le.. Ticket price penchutaru if Metro motthanni ammesthe.. 

Posted
6 hours ago, Raaz@NBK said:

My home ollu vunnaru ga bro.. Vallu konestharu emo le.. Ticket price penchutaru if Metro motthanni ammesthe.. 

Metro cost is too high and world lo all most all metros losses lone unnai so antha cost petti konnaka next election lo TRS assam aithee Ramesawarao perminent ga chinna jiar Swamy matam lo settle aipovalsi untadi so risk cheyyadu

Posted
6 minutes ago, krish2015 said:

Metro cost is too high and world lo all most all metros losses lone unnai so antha cost petti konnaka next election lo TRS assam aithee Ramesawarao perminent ga chinna jiar Swamy matam lo settle aipovalsi untadi so risk cheyyadu

Emundhi metro ki janalu alavatu paddaru.. Ticket rates double chesthadu.. Metro ki ketayinchina stalalani ammesthadu ekkuva rate ki.. 

Posted
2 hours ago, krish2015 said:

Metro cost is too high and world lo all most all metros losses lone unnai so antha cost petti konnaka next election lo TRS assam aithee Ramesawarao perminent ga chinna jiar Swamy matam lo settle aipovalsi untadi so risk cheyyadu

L&T knows that.  They took valuable lands in center for compensation. 

In Some of the places they constructed Malls.  I heard that IKEA place first allocated to L&T later govt given some other place. Revanth reddy went to court on this.   

Posted
8 hours ago, Suresh_Ongole said:

L&T knows that.  They took valuable lands in center for compensation. 

In Some of the places they constructed Malls.  I heard that IKEA place first allocated to L&T later govt given some other place. Revanth reddy went to court on this.   

Ikea location kadu ade roadlo Myhome vadidi undi kada adi or something else in Gachibowli, vere edo ichi idi teeaesukunnaru

Posted
11 hours ago, krish2015 said:

Metro cost is too high and world lo all most all metros losses lone unnai so antha cost petti konnaka next election lo TRS assam aithee Ramesawarao perminent ga chinna jiar Swamy matam lo settle aipovalsi untadi so risk cheyyadu

hyderabad lo losses vasthe ika vijayawada , vizag lo dandaga. 

Posted
4 hours ago, ravindras said:

hyderabad lo losses vasthe ika vijayawada , vizag lo dandaga. 

Out of 180 metros in the world  only  5 metros running in profits..public transport will never make profits..ala ani mooseste inka janalu evari own transport vallu chusukovali resulting in pollution, traffic

Posted
5 hours ago, BalayyaTarak said:

Ikea location kadu ade roadlo Myhome vadidi undi kada adi or something else in Gachibowli, vere edo ichi idi teeaesukunnaru

Yes, my home place supposed to be the one, planned for malls.. Etc.. Lnt lost significantly coz of this deal... 

Posted
7 hours ago, ravindras said:

hyderabad lo losses vasthe ika vijayawada , vizag lo dandaga. 

Hyd metro 3 years late ayindhi..  Almost 60-70% cost perigindhi ani talk apatlo.. Appude expected losses lo nadusthadhi ani.. 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...