Jump to content

Overkonda latest look


HelloNTR

Recommended Posts

శోభన్‌బాబుగా విజయ్‌ దేవరకొండ..?

శోభన్‌బాబుగా విజయ్‌ దేవరకొండ..?

చెన్నై: టాలీవుడ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ విజయ్‌ దేవరకొండ అలనాటి సోగ్గాడు శోభన్‌ బాబు పాత్రలో కనిపించనున్నారట. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రంపై ప్రేక్షకుల ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘అమ్మ’గా కంగనా రనౌత్‌ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని కీలకపాత్రలు పోషిస్తున్న వారి వివరాలను చిత్రబృందం ప్రకటించింది. అయితే జయలలిత జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరైన శోభన్‌బాబు పాత్రలో విజయ్‌ దేవరకొండ నటించనున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ‘తలైవి’ చిత్రబృందం విజయ్‌ను సంప్రదించినట్లు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో జయలలిత ఇష్టసఖిగా ప్రియమణి నటించనున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు లభించాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...