Jump to content

వైఎస్‌కు ముచ్చెమటలు పట్టించిన ఎన్నిక


Recommended Posts

వైఎస్‌కు ముచ్చెమటలు పట్టించిన ఎన్నిక

3election7a.jpg1996 సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, తెదేపా తరఫున కందుల రాజమోహన్‌రెడ్డి పోటీ పడ్డారు. మే 30న లెక్కింపు జరిగింది. చివర రౌండు పూర్తయ్యే సమయానికి రాజమోహన్‌రెడ్డి(తెదేపా)కే ఆధిక్యత ఉంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా..రాజశేఖర్‌రెడ్డిపై కందుల రాజమోహన్‌రెడ్డి గెలుపొందారంటూ తెదేపా శ్రేణులు సంబరాలు జరుపుకొన్నాయి. సోదరుడు ఓటమి పాలవుతుండటాన్ని జీర్ణించుకోలేక పులివెందుల శాసనసభ ఓట్ల లెక్కింపులో ఉన్న వైఎస్‌ వివేకానందరెడ్డి కన్నీరు పెట్టారు. కడప ఆర్ట్స్‌ కళాశాలలో జరిగిన లెక్కింపు కేంద్రం వద్ద రాజశేఖర్‌రెడ్డి హావభావాలు మారిపోయాయి. ఓటమి బాటలో వైఎస్‌ అని టీవీ వార్తల్లోనూ చెప్పేశారు. కడప జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా దానిపైనే చర్చ నడిచింది.

తర్వాత ఏమైంది..
పులివెందుల శాసన సభ పరిధిలో 90 శాతం పైగా పోలింగ్‌ నమోదైన 11 కేంద్రాల్లోని బ్యాలెట్‌ పెట్టెల్ని కౌటింగ్‌ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. ‘రిగ్గింగ్‌ జరిగిందని, ఆ ఓట్లను లెక్కించవద్దని తెదేపా వర్గాలు ఎన్నికల అధికారులకు’ ఫిర్యాదు చేసిన మీదట కౌంటింగ్‌ అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ పెట్టెల్లోని ఓట్లను లెక్కించాల్సిందేనని వైఎస్‌ పట్టుపట్టారు. వివాదం జిల్లా ఎన్నికల అధికారి వీణాఈష్‌ వరకు వెళ్లింది. తర్జనభర్జనల అనంతరం ఆ పెట్టెలోని ఓట్లను లెక్కించాలని ఆమె నిర్ణయించారు. ఓ ఓట్లను లెక్కించిన మీదట 5,445 ఓట్ల మెజార్టీతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గెలుపొందారు. ఆ రోజు పొద్దుపోయాక ఫలితాన్ని ప్రకటించారు.

- న్యూస్‌టుడే, రాయచోటి గ్రామీణ
Link to comment
Share on other sites

umesh chandra odipoyadu prakatichmani gattigane force chesadu,election officer adi ammudupoyindi,law and order issue vasthundi annadi, adi nenu chusukuta annadu umesh chandra, adi ys win ani prakatinchi, kanpadakundapoyindi, taruvtha tdp kuda lite tisukunnadi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...