Jump to content

Appu


surendra.g

Recommended Posts

Emadyekadaa appulu taggayi annaru, malli idi anti overdraft daati 14 days ayyindi antunnaru

 

రుణమే శరణ్యం

 

మరో రూ.3000 కోట్లు అత్యవసరం
 జలవనరుల కార్పొరేషన్‌ ద్వారా ప్రయత్నం
మంత్రిమండలి ముందుకు రేపు ప్రతిపాదన
 14 రోజులుగా ఓవర్‌ డ్రాఫ్టులో రాష్ట్రం
 నేడు కేంద్ర వాటా పన్నుల సర్దుబాటు
 సూచనలు చేసిన రిజర్వుబ్యాంకు

19ap-main6a_1.jpg

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం ఊపిరాడని ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడేందుకు అప్పులు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. వివిధ బ్యాంకుల ద్వారా మరింత రుణం తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్పొరేషన్ల ద్వారా వివిధ ప్రాజెక్టులను తనఖా పెట్టి అదనపు మొత్తాలు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆర్థికశాఖ, సంబంధిత కార్పొరేషన్ల ఎండీలు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.  కార్పొరేషన్ల రుణ పరిమితిని పెంచేందుకు అనువుగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా గాడిలో పడలేదు. రిజర్వుబ్యాంకు వద్ద చేబదుళ్లు, ట్రెజరీ అడ్వాన్సులు పోను మన నిల్వలకు మించి దాదాపు రూ.350కోట్ల వరకు అదనంగా వాడుకున్నాం. 14 రోజుల పాటు ఈ ఓవర్‌ డ్రాఫ్టు(ఓడీ) పరిస్థితి ఉండకూడదు. ఈ మొత్తానికి అదనంగా వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ 14 రోజుల ఓడీ గడువు ముగిసిపోవడంతో రిజర్వుబ్యాంకు ఆ విషయాన్ని ప్రస్తావించి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కేంద్ర పన్నుల్లో సర్దుబాటు ఇలా
ప్రతి నెలా 20న కేంద్ర పన్నుల్లో వాటా రాష్ట్రానికి సర్దుబాటు అవుతుంటుంది. అలా గురువారం దాదాపు రూ.2000కోట్ల వరకు నిధులు రాష్ట్రానికి అందాల్సి ఉంది. ఈ నిధుల్లో ప్రస్తుత ఓడీ మొత్తం, వడ్డీ సహా మినహాయించుకుని మిగిలిన చెల్లింపులు జరుపుతారు. వచ్చే మొత్తం రూ.1500కోట్ల వరకు ఉండొచ్చు. అదే సమయంలో ప్రస్తుతం ప్రభుత్వం వద్ద రూ.8000 కోట్ల వరకు చెల్లింపులు పెండింగులో ఉన్నాయి. ప్రాధాన్య బిల్లులకు దాదాపు రూ.1000కోట్ల వరకు గురువారం చెల్లింపులు జరిపే ఆస్కారముంది. అదే సమయంలో మళ్లీ జనవరి ఒకటికల్లా జీతాలకు, పింఛన్లకు నగదు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. జలవనరులశాఖ బిల్లులూ భారీగా పెండింగులో పడ్డాయి. మరోవైపు పెథాయ్‌ తుపాను పరిహారాలు 20లోగా చెల్లింపులు జరపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పంట పరిహారం, ఇతరత్రా మొత్తాలు చెల్లించాల్సి ఉంటుంది.

మరో రూ.3000కోట్ల అప్పు
ప్రస్తుతం జలవనరుల కార్పొరేషన్‌ ద్వారా రూ.3000కోట్లు అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్‌ ద్వారా రూ.4000కోట్లు రుణం తీసుకువచ్చి వివిధ అవసరాలకు సర్దుబాటు చేశారు. గతంలో రుణాలు తీసుకునేందుకు ఈ కార్పొరేషన్‌పై ఉన్న పరిమితినీ ఎత్తివేశారు. ఇప్పుడు అదనంగా రూ.3000 కోట్లు బ్యాంకుల నుంచి జలవనరుల కార్పొరేషన్‌ సమీకరించనుందని సమాచారం. ఇందుకోసం ప్రభుత్వం బ్యాంకులకు గ్యారంటీ ఇవ్వనుంది. ఈ అంశంపై ఆమోదం పొందేందుకు శుక్రవారం రాష్ట్ర మంత్రిమండలి ముందు దాన్ని చర్చకు పెడుతున్నారు.

Link to comment
Share on other sites

కేంద్రం నుంచి రూ.2,300 కోట్లు విడుదల
21-12-2018 06:05:10
 
అమరావతి: కేంద్ర పన్నుల్లో వాటాగా కేంద్రం నుంచి ప్రతి నెలా రాష్ట్రానికి అందే రూ.2,300 కోట్ల మొత్తం గురువారం విడుదలైంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రాష్ట్రాలు వాటి పరిమితుల మేర రుణాలు తీసుకునేందుకు మూడు త్రైమాసికాలకు రుణ ప్రణాళిక ఉంటుంది. ఈ దశలో 20వ తేదీన అందే పన్నుల్లో వాటాతో రాష్ట్రాలు కొంత ఊపిరి పీల్చుకుంటాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...