Jump to content

చంద్రబాబుకు ఓటేయొద్దంటూ అగ్రిగోల్డ్‌ బాధితుల ప్రచారం


Amaravati

Recommended Posts

  • Replies 68
  • Created
  • Last Reply
అగ్రిగోల్డ్ కేసుపై సీఎం చంద్రబాబు సమీక్ష
16-12-2018 13:41:50
 
636805645085042084.jpg
అమరావతి: అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీనిపై అడ్వకేట్ జనరల్‌ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పరిహారం అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఏజీకి ఆయన సూచించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకం వేగవంతం చేసి... బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
Link to comment
Share on other sites

అగ్రిగోల్డ్‌ బాధితులకు సత్వర న్యాయం
17-12-2018 02:54:19
 
636806120573557921.jpg
  • పరిహారం వీలువెంబడి అందేలా చర్యలు
  • విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
  • అడ్వకేట్‌ జనరల్‌కు సీఎం సూచన
అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘‘అగ్రిగోల్డ్‌ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఈ కేసులో వాస్తవ స్థితి నివేదికను న్యాయస్థానానికి సమర్పించడమే కాకుండా నష్టపోయిన ప్రతి ఒక్కరికీ త్వరతగతిన పరిహారం అందేలా చూడాలి. బాధితుల సమస్యలను వెంటనే న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలి’’ అని సీఎం చంద్రబాబు అడ్వకేట్‌ జనరల్‌కు సూచించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులపై ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ కేసు పురోగతిని అడ్వకేట్‌ జనరల్‌ను అడిగి తెలుసుకున్నారు.
 
‘‘ఆస్తుల విక్రయాన్ని వేగవంతం చేసి, పరిహారం అందించే ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. కోర్టు ఇచ్చిన ఆదేశాలను తూ.చ. తప్పకుండా అమలు చేయాలి. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. న్యాయస్థానం ఆదేశాలకు వేరే ఉద్దేశాలు ఆపాదించే విధంగా మాట్లాడి బాధితుల్ని రెచ్చగొడుతున్న వారి గురించి కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలి. కోర్టు పర్యవేక్షణలో సజావుగా సాగాల్సిన ప్రక్రియకు రాజకీయ దురుద్దేశాలు కల్పించి, బాధితుల్ని రెచ్చగొట్టేలా ప్రయత్నించడం దురదృష్టకరం. కొన్ని శక్తులు దీనిని అడ్డం పెట్టుకుని, రాజకీయం చేయాలని చూస్తున్నాయి. బాధితుల్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో అలజడి లేవదీయడానికి కుటిల యత్నాలు చేస్తున్నాయి. రెచ్చగొట్టే శక్తుల దుష్ట పన్నాగాలతో సహా వాస్తవ పరిస్థితుల్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలి’’ అని అడ్వకేట్‌ జనరల్‌కు సీఎం చంద్రబాబు సూచించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...