sonykongara Posted November 1, 2018 Share Posted November 1, 2018 కర్ణాటక ఉపఎన్నికలు: భాజపాకు షాక్ బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఉప ఎన్నికల్లో మరో ఎదురుదెబ్బ తగిలింది. రామనగర అసెంబ్లీ ఉప ఎన్నికకు భాజపా తరఫున బరిలోకి దిగిన అభ్యర్థి ఎల్.చంద్రశేఖర్ అనూహ్యంగా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకొన్నారు. అంతేగాక పార్టీ కూడా మారారు. తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు గురువారం ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర, చెన్నపట్న నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. అయితే ఫలితాల తర్వాత ఆయన రామనగర స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో జేడీఎస్ పార్టీ నుంచి సీఎం కుమారుస్వామి సతీమణి అనిత కుమారస్వామి బరిలోకి దిగారు. ఇక సంకీర్ణ ప్రభుత్వంలో జేడీఎస్‌కు మద్దతుగా ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. అనితకు వ్యతిరేకంగా భాజపా చంద్రశేఖర్‌ను బరిలో నిలిపింది. అయితే కాంగ్రెస్ నేత అయిన చంద్రశేఖర్ ఇటీవలే భాజపాలో చేరారు. దీంతో రామనగర ఉపఎన్నికలో అనిత, చంద్రశేఖర్ మధ్య హోరాహోరీ పోటీ తప్పదని అంతా భావించారు. దీంతో రామనగర ఉపఎన్నిక అటు భాజపా, ఇటు జేడీఎస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో ఎన్నిక జరగాల్సి ఉండగా.. చంద్రశేఖర్ చివరి నిమిషంలో తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో భాజపాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అంతేగాక.. తాను మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చంద్రశేఖర్ ప్రకటించారు. భాజపాలో ఐకమత్యం లేదని, పార్టీలో తనకు ఎవరూ మద్దతుగా లేరని చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు. అందుకే తాను తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు చెప్పారు. కాగా.. చంద్రశేఖర్ తప్పుకోవడంతో అనిత కుమారస్వామి గెలుపు దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. రామనగరలో నవంబరు 3న ఉపఎన్నిక జరగనుంది. Link to comment Share on other sites More sharing options...
Godavari Posted November 1, 2018 Share Posted November 1, 2018 Ballari mp bielection also not easy for BJP to retain.... shivakumar made incharge for Ballari mp election Link to comment Share on other sites More sharing options...
RamaSiddhu J Posted November 1, 2018 Share Posted November 1, 2018 Candidate partty change endira nayana Lollest of all kind Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted November 1, 2018 Share Posted November 1, 2018 3 minutes ago, RamaSiddhu J said: Candidate partty change endira nayana Lollest of all kind Link to comment Share on other sites More sharing options...
niceguy Posted November 1, 2018 Share Posted November 1, 2018 Party maarudu endhiraa... Link to comment Share on other sites More sharing options...
hari2999 Posted November 1, 2018 Share Posted November 1, 2018 Link to comment Share on other sites More sharing options...
King Of Masses Posted November 1, 2018 Share Posted November 1, 2018 43 minutes ago, niceguy said: Party maarudu endhiraa... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.