Jump to content

Araku MLA Kidari Sarveswar Rao Shot Dead by Maoists


koushik_k

Recommended Posts

Evariki salahaalu itche scene ledu kaani....positive attitude tho manam elaa pyki povaalani chudaalikaani..

 

achievers ki leda sympathy tho evarikanna edo isthe badha padithe upayogam ledu.

Whatsapp groups ayina..friends circles ayinaa...select positive minded people to surround yourself

 

Image result for bemmi gifi

Link to comment
Share on other sites

  • Replies 296
  • Created
  • Last Reply
1 minute ago, swarnandhra said:

Yes, I say it again. ila jobs gifts ivvatam 100% wrong. 

Naxals valla badha padindi meeru okkare kadu bro. I already mentioned (probably in the same thread) that our family is also a victim of these bastards. That does not make me support Group 1 job donations.

Group I job kooda edho alovokaga ichcheyyaru bro....they have to meet a criteria.....dhaaniki thagina credentials  undaali...lekapothe monetory compensation maatrame ichchi saripedathaaru..

as far as I remember, that MLA's eldest son was well educated and preparing for all India Civils Exam....second son was preparing for TOEFL...I am no authority to decide their eligibility for granting Group I job status....but I presume they are eligible under those guidelines...

Link to comment
Share on other sites

6 minutes ago, sonykongara said:

wrong ani miru ela chebutavu,1996 nunchi isthuaru, nenu okkade Naxals valla badha paddanu state lo evaru badha ledu ani cheppana.

check your earlier post. "oksari naxals badha anudhvisthe telusthundi."

 

My comment was in rersponse to that statement.

ayina, naxal victims ki job ivvatam tappu ante, naxals ni support chesinatlu ani enduku anukuntunnaru.

1996 nunchi istunnanta matrana adi correct ayipotunda. konni villages lo lower caste vallani upper caste valla baavullo water teesukonnivvaru. That has been the tradition for 100s of years. antha matrana adi correctai podu.

 

Link to comment
Share on other sites

11 minutes ago, swarnandhra said:

check your earlier post. "oksari naxals badha anudhvisthe telusthundi."

 

My comment was in rersponse to that statement.

ayina, naxal victims ki job ivvatam tappu ante, naxals ni support chesinatlu ani enduku anukuntunnaru.

1996 nunchi istunnanta matrana adi correct ayipotunda. konni villages lo lower caste vallani upper caste valla baavullo water teesukonnivvaru. That has been the tradition for 100s of years. antha matrana adi correctai podu.

 

miku a badha theliyadu ani cheppa theliyaduga miku, andaru anubavinchlaani kadu, a paristhi chusina anubavam kuda ledu antunna, nenu miru naxals samardinchutunnara ani nenu anala,edi ouri kattubatu kadu edi govt icchina G.O

Link to comment
Share on other sites

10 minutes ago, chsrk said:

Group I job kooda edho alovokaga ichcheyyaru bro....they have to meet a criteria.....dhaaniki thagina credentials  undaali...lekapothe monetory compensation maatrame ichchi saripedathaaru..

as far as I remember, that MLA's eldest son was well educated and preparing for all India Civils Exam....second son was preparing for TOEFL...I am no authority to decide their eligibility for granting Group I job status....but I presume they are eligible under those guidelines...

monetary compensation is justifiable and probably warranted too. but civils/grps ki eligible ayinanta matrana 'capable' ayivundalani emundi bro.

Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

miku a badha theliyadu ani cheppa theliyaduga miku, andaru anubavinchlaani kadu, a paristhi chusina anubavam kuda ledu antunna, nenu miru naxals samardinchutunnara ani nenu anala,edi ouri kattubatu kadu edi govt icchina G.O

voori kattubatu ayina, government G.O ayina, "chala kalam nunchi vastunna tradition" kabatti correct ani anatam correct kadu anedi naa point.

that is what I was contradicting. I know the pain. I can send PM if you really want.

Link to comment
Share on other sites

8 minutes ago, swarnandhra said:

voori kattubatu ayina, government G.O ayina, "chala kalam nunchi vastunna tradition" kabatti correct ani anatam correct kadu anedi naa point.

that is what I was contradicting. I know the pain. I can send PM if you really want.

valla kutumbalu, padina padutunna ibbandhululani chuse govt A  G.O tisukuvacchindi,vallu illalo okaru canipovatme kadu,valla asthulu vadili vellasina parsthilu unnayi , ouri lo bayam tho undaleni  parsthilu , unna valla ni chamaputaru ane bayam barathukutaru,asthu vadilesi ekkado bratikevallu unnaru,vala jivanopadi  pothundi,emi mana laga valla ouri lo happy brathike hakku leda valla ki,naxal thivaravadam ni anachiveyyalasina badyatha govt di, akkada govt failure ayithe nastapariharam ivvatam lo tappuledu.

Link to comment
Share on other sites

ఎమ్మెల్యే కిడారిని నమ్మకస్థులే పట్టించారా?
30-09-2018 02:26:48
 
636738974822648233.jpg
  • అదుపులో ఇద్దరు కిడారి మనుషులు?
విశాఖపట్నం, చింతూరు, (ఆంధ్రజ్యోతి) : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హతమార్చి సరిగ్గా వారం రోజులు! వారిపై తూటా పేల్చినవారి నుంచి వ్యూహరచన చేసిన వారి దాకా.. అందరిపై పోలీసులు ఒక అవగాహనకు వచ్చారు. మావోయిస్టు సానుభూతిపరులు, ఈ దాడికి ప్రత్యేకంగా సహకరించిన వ్యక్తులు, శక్తుల గురించీ ఆరా తీశారు. ఈ క్రమంలో శనివారం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారు. వీరిద్దరు కిడారికి బాగా సన్నిహితులని సమాచారం. ఎమ్మెల్యే కదలికలను ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చేరవేసి.. ఆయనను ఉచ్చులోకి దింపింది వీరేనని చెబుతున్నారు. వారి కాల్‌డేటా ఆధారంగా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. కాగా, లివిటిపుట్టులో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను చంపేసిన తరువాత.. ఆ పరిసరాల్లోనే రెండు రోజులు నక్సల్స్‌ ఉన్నారన్న సమాచారం పోలీసులకు ఉంది. ఆ తరువాత కూడా వారు తమ స్థావరాలకు చేరుకోలేదని తాజాగా తెలిసింది. ఇప్పటికీ మన్యం పరిధిలోని ఒడిసా సరిహద్దు గ్రామాల్లోనే తలదాచుకొంటున్నారని తెలుస్తోంది. ఆ గ్రామాలను ఇప్పటికే గుర్తించిన మన పోలీసులు.. ఒడిసా పోలీసులతో కలిసి దాడులకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా, గట్టి బదులివ్వాల్సిందేనన్న కసి వారిలో కనిపిస్తోంది. పైగా, తమపై డీజీపీ ఉంచిన నమ్మకాన్ని నిలుపుకోలేకపోయామన్న బాధ పోలీసు ఉన్నతాధికారుల్లో ఉంది. ఈ ఘటన డీజీపీ ఠాకూర్‌ తీవ్ర ఆవేదన చెందుతున్న విషయం శుక్రవారం నాటి భేటీలో వారు గమనించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఈ సమా వేశంలో విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మని డీజీపీ కడిగిపారేశారు. ‘అరకు’ ఘటనకు కొద్దిరోజుల ముందు తనను కలిసిన శర్మ.. మాటమాత్రం కూడా మావోయిస్టుల గురించి అప్పుడు ప్రస్తావించకపోవడాన్ని గుర్తుచేసి.. మండిపడ్డారు. డీఐజీ శ్రీకాంత్‌ పనితీరుపైనా ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. హత్యాకాండ తరువాత స్థానికులు పోలీస్‌ స్టేషన్లపై దాడి చేస్తుంటే...ఎందుకు నియంత్రించలేకపోయారని నిలదీశారు.
 
విలీన మండలాల్లో అలజడి
అరకు జంట హత్యల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాష్ట్ర సరిహద్దుల్లోని విలీన మండలాల్లో పోలీసుల గాలింపు ముమ్మరమైంది. ఈ మండలాల పరిధిలో సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఓ గ్రామం పోలీసు బూట్లచప్పుళ్ల మధ్య బిక్కుబిక్కుమంటోంది. వీరంతా ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఎప్పుడు ఏమి జరుగుతోందన్న భయం గ్రామస్థుల్లో కనిపిస్తోంది.
Link to comment
Share on other sites

మ్మెల్యే కిడారి ట్రాప్.. వలవేసి చంపారు: డీజీపీ ఠాకూర్
30-09-2018 02:31:50
 
636738897455709631.jpg
  • మమ్మల్ని ఏమీ చేయలేక నేతల హత్య
  • కిడారి చర్చలకు వెళ్లారనేది అవాస్తవం
  • సివేరిని ఎందుకు చంపారో తెలీడంలేదు
  • మైనింగ్‌ చేయడంలేదు...హెచ్చరికల్లేవు
  • ఒడిసా గోండు మహిళలతో ఆపరేషన్‌
  • సూత్రధారులు సహా అన్నీ తెలుస్తాయి
  • రెండు రోజుల్లో పూర్తి స్పష్టత.. అరెస్టులు
  • తప్పుచేశారన్న భావనతోనే ప్రకటన లేదు
  • నేతలకు రక్షణ కల్పిస్తాం: డీజీపీ ఠాకూర్‌
అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ట్రాప్‌ అయ్యారని డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ వెల్లడించారు. మావోయిస్టులతో ఆయన చర్చలకు వెళ్లారని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. నెలన్నర క్రితమే ఎమ్మెల్యే మైనింగ్‌ (కంకర మిషన్‌) ఆపేశారని, ఇటీవలి కాలంలో ఆయనకు నక్సల్స్‌ నుంచి ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేశారు. సంచలనం కోసమే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. నక్సల్స్‌ ఆపరేషన్‌లో ఒడిసాలోని గోండుజాతి మహిళలు పాల్గొన్నారని, స్థానికంగా ఎవరు సహకరించారన్నది రెండు రోజుల్లో వెల్లడిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులతోపాటు రాజకీయ పార్టీల నేతలకు, పోలీస్‌ ఇన్‌ఫార్మర్లకు, ఇంకా ఎవరికైనా ప్రమాదం పొంచిఉంటే వారికీ రక్షణ కల్పిస్తామని పోలీస్ బాస్‌ భరోసా ఇచ్చారు. అరకు జంట హత్యలు, రాష్ట్రంలో పరిస్థితులపై శనివారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
 
కిడారి, సోమ హత్యలు ఎలా జరిగాయి.?
ఎమ్మెల్యేను మావోయిస్టులు ట్రాప్‌ చేశారు. వారితో ఆయన చర్చలకు వెళ్లారన్న వార్తల్లో నిజంలేదు. సోమను ఎందుకు చంపారో తెలియడంలేదు. ఆరా తీస్తున్నాం. త్వరలో వెల్లడిస్తాం.
 
ట్రాప్‌ ఎలా జరిగింది.? ఎవరు సహకరించారు?
అది ఇప్పుడు వెల్లడించలేను. ఆధారాలు మాత్రం మా దగ్గర ఉన్నాయి. మావోయిస్టులకు ఎవరు సహకరించారో తెలిసింది. త్వరలో అరెస్టు చేస్తాం.
 
నేతల హత్యకు పాల్పడినవారు ఎక్కడి నుంచి వచ్చారు?
వారంతా ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చినవారే. ఎక్కువమంది గోండు జాతి మహిళలున్నారు. ముందుగానే వచ్చి లివిటిపుట్టులో రెక్కీ నిర్వహించారు.
 
పొరుగు రాష్ట్రం నుంచి 60మంది వచ్చినా గుర్తించలేక పోవడం నిఘా లోపం కాదా?
విశాఖ పర్యటనలో ఇదే విషయం సమీక్షించా. పోలీసులు తమ సేవా, సంక్షేమ కార్యక్రమాలతో గిరిజనుల్లో మంచిపేరు తెచ్చుకొన్నారు. ఈ ఆపరేషన్‌ పై వారు చాలా కీలక వివరాలు వెల్లడించారు.
 
రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ పొలిటికల్‌గా మాత్రమే పనిచేస్తోందన్న ఆరోపణలున్నాయి?
ఇంటెలిజెన్స్‌ అంటే ఒక్కటే చూడదు. అన్నీ చూస్తుంది. మావోయిస్టుల కార్యకలాపాలను గమనించే విభాగాన్ని ఎస్‌ఐబీ అంటారు. ఉగ్రవాదుల కోసం సీఐ సెల్‌ ఉంటుంది. ఇలా దేనికదే ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటప్పుడు ఆరోపణలకు తావులేదు.
 
పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. ఏమంటారు.?
బాధ్యత మాదే అని ఇప్పటికే చెప్పాను. కొన్నేళ్లుగా ఎలాంటి ఘటనలు జరగకపోవడంతో అటువైపు పోలీసులు వెళ్లలేదు. మావోయిస్టులు అదే అదనుగా భావించి ఉండొచ్చు.
 
అటవీ ప్రాంతాల్లో మందుపాతర్లు పేల్చి టార్గెట్లను హతమార్చే మావోయిస్టులు, గ్రామాల్లోకి వచ్చి ప్రజల ముందే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని కాసేపు ప్రశ్నించి కాల్చి చంపడం పోలీసులకు సవాలుగా అనిపించలేదా.?
కచ్చితంగా వాళ్లు సవాల్‌ విసిరారు. మా బదులేంటో కూడా త్వరలో చూస్తారు. మాపై దాడులకు చాలా ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో కేవలం సంచలనం కోసం నేతలను హత్య చేశారు.
 
బాక్సైట్‌ మైనింగ్‌ విషయంలోనే ఈ హత్యలు చేసినట్లు వార్తలొస్తున్నాయి.?
వాళ్లిద్దరూ మైనింగ్‌ చేస్తున్నారా? ఎమ్మెల్యేకి కంకర మిషన్‌ ఉండేది. అదీ నెలన్నర క్రితమే ఆపేశారు. ఇక మైనింగ్‌ ఎక్కడిది?
 
మావోయిస్టులు, ఈ హత్యలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?
తప్పు చేశామన్న భావన వారిలో ఉండొచ్చు. స్థానిక గిరిజనుల్లో వచ్చిన వ్యతిరేకతను చూసే, నక్సల్స్‌ ప్రకటన చేయడం లేదనిపిస్తోంది.
 
మహిళల్ని రంగంలోకి ఎందుకుదించారంటారు?
మావోయిస్టు పార్టీలో రిక్రూట్‌మెంట్లు బాగా తగ్గిపోయాయి. అందుకే పొరుగు రాష్ట్రాల నుంచి గోండు మహిళల్ని తీసుకొచ్చారు.
 
ఒక రోజు ముందే నక్సల్స్‌ వచ్చారని అంటున్నారు. స్థానికంగా పోలీసు ఇన్‌ఫార్మర్లు లేరా?
ఇలాంటివి బయటకు చెప్పలేం. మహిళలు ఆయుధాల్లేకుండా వచ్చారు. దానివల్ల ముఖాలు కొత్తగా కనిపించినా, నక్సల్స్‌ అని అనుమానించలేకపోయారు.
 
గన్‌మెన్లు కనీస ప్రతిఘటన లేకుండా చేతులెత్తేశారు. ఏమంటారు?
అక్కడున్న పరిస్థితులను క్షుణ్ణంగా వివరించలేను. కానీ, ఈ ఘటన తరువాత వారికోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నాం. గన్‌మెన్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తాం.
 
జంట హత్యల సంగతి పక్కనబెడితే, ఆ ఘటన తర్వాత పోలీసు స్టేషన్‌పై దాడినీ నివారించలేని స్థితిలో విశాఖ పోలీసులున్నారా?
దానిపై మేధోమథనం చేస్తున్నాం. నర్సీపట్నంలో ఓఎస్డీ కార్యాలయం లేకపోవడం కూడా కారణమే. ఒక్కోసారి ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసుల్ని ట్రాప్‌లోకి లాగుతుంటారు. మా వాళ్లు అదికూడా ఆలోచించి ఉండొచ్చు.
 
నేతల రక్షణకు తీసుకొంటున్న జాగ్రత్తలపై...
ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు, పోలీస్‌ ఇన్‌ఫార్మర్లు, సాధారణ ప్రజలకు రక్షణ కల్పించడం మా బాధ్యత. మాకున్న సమాచారం మేరకు కొందరికి భద్రతను కట్టుదిట్టం చేశాం. ఎస్పీలను అప్రమత్తం చేశాం.
 
ఈ వ్యవహారంపై మీ వ్యాఖ్య ఏమిటి?
గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రజాప్రతినిధులను హత్య చేయడం హేయమైన చర్య. దానికి రెండింతల మూల్యం మావోయిస్టులు చెల్లించక తప్పదు. అది ఎలాగనేది రాబోయే రోజుల్లో చూస్తారు.
 
 
పవన్‌ రక్షణ మా బాధ్యత: డీజీపీ
జనసేన అధ్యక్షుడు పవన్‌ కాల్యాణ్‌కు పూర్తిస్థాయి రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ స్పష్టం చేశారు. పవన్‌ హత్యకు ముగ్గురు వ్యక్తులు కుట్ర పన్నారన్న వార్తలపై డీజీపీ ‘ఆంధ్రజ్యోతి’ వద్ద స్పందించారు. రాష్ట్రంలో సీఎం నుంచి సామాన్యుని వరకూ.. ఐదు కోట్ల మంది ఆంధ్రుల రక్షణ బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌పై హత్యకు కుట్ర పన్నిన ఆ ముగ్గురి వ్యక్తుల గురించి ఆధారాలు అందజేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి నిమిషం కూడా వెనుకాడబోమని భరోసా ఇచ్చారు. పోలీసులకు ఐపీసీ, సీఆర్‌పీసీ తప్ప రాజకీయ పార్టీల గురించి అవసరం లేదన్నారు. ఈ విషయమై ఇప్పటికే పశ్చిమ గోదావరి ఎస్పీకి సమాచారం అందించామన్నారు. పవన్‌ కల్యాణ్‌ వద్ద ఆధారాలు తీసుకొని చట్టపరమైన చర్యలు చేపట్టేపనిలో ఆయన ఇప్పటికే నిమగ్నమై ఉన్నారని ఠాకూర్‌ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఎవరికి ప్రాణాపాయం ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Link to comment
Share on other sites

మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆత్మఘోష పేరుతో..
30-09-2018 10:06:35
 
636738987940098454.jpg
  • నన్నెందుకు చంపారు..జవాబు చెప్పండి
  • సివేరీ సోమ పేరుతో కరపత్రం
అరకులోయ(విశాఖ జిల్లా): మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆత్మఘోష పేరుతో కరపత్రం విడుదలయింది. ఈ కరపత్రం వాట్సాప్‌లో హల్‌చల్‌ చేస్తోంది. కరపత్రంలో... ‘నేనొక మాజీ ఎమ్మెల్యేని, ఆరుగురు పిల్లలు, భార్య కలవాడిని, ఎదిగొచ్చిన కొడుకులకు ఉద్యోగాలు కూడా లేవు, సొంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. నేనేం తప్పు చేశాను? ఒకవేళ తప్పు చేసి ఉంటే ఒక వార్నింగ్‌ అయినా ఇచ్చారా? లేదు. నన్నెందుకు చంపారు? ఇంత వరకు చెప్పలేకపోయారు? నేను ఏవర్గానికి శత్రువుని? మావోయిస్టులారా చెప్పండి? కుహనా హక్కుల సంఘలైనా మీరైనా చెప్పండి ? అంటూ పేర్కొంది. ఈ ప్రశ్నల దిగువున సివేరి సోమ అంటూ హత్యకు గురై రక్తపు మడుగుల్లో చనిపోయిన మృతదేహం ఫొటోతోపాటు పాస్‌పోర్టు ఫొటో కూడా ముద్రించి ఉంది. ఎర్రని పేపర్లో పసుపు అక్షరాలతో కరపత్రం విడుదల చేశారు. ఈ కరపత్రం వాట్సాప్‌ల్లో హల్‌చల్‌ చేస్తోంది.
Link to comment
Share on other sites

డారి హత్యలో టీడీపీ నేత?
01-10-2018 03:12:22
 
636739633165824653.jpg
  • మావోయిస్టులకు 3 సార్లు ఓ ఎంపీటీసీ ఆశ్రయం
  • సెప్టెంబరు 19నే చంపడానికి వ్యూహం
  • భార్య అనారోగ్యం కారణంగా రాని ఎమ్మెల్యే
  • పోలీసు స్టేషన్లపై దాడి వెనుక గంజాయి స్మగ్లర్‌!
అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యేను ఉచ్చులోకి లాగింది సొంత పార్టీ నాయకుడేనా..? నక్సల్స్‌కు ఆశ్రయం కల్పించింది అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీయా..? ఆశ్చర్యకరమైన ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును హత్య చేయాలనుకున్న మావోయిస్టులు.. ఆయనకు దగ్గరగా ఉండే వారినే పావులుగా ఉపయోగించుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అరకు నియోజకవర్గానికి చెందిన ఓ ఎంపీటీసీ నక్సల్స్‌కు మూడు సార్లు ఆశ్రయం కల్పించినట్లు పక్కా ఆధారాలు లభించాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. మావోయిస్టులు కిడారిని హత్య చేయాలనుకోగానే రాజకీయంగా ఆయనతో ఎవరు విభేదిస్తున్నారో ఆరా తీశారు. మన్యంలో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న ఒక వ్యక్తితో మాట్లాడి.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీని ఆగస్టులో రహస్య స్థావరానికి పిలిపించుకుని మాట్లాడారు. తర్వాత టీడీపీ మండల స్థాయి నాయకుడితో భేటీ అయి.. ఎమ్మెల్యేను రప్పించేందుకు ఒప్పించారు. ఇంకోవైపు.. సెప్టెంబరు 5న ఎంపీటీసీ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో మావోయిస్టులు, స్థానిక టీడీపీ నాయకుడు చర్చలు జరిపారని తెలిసింది. గ్రామాల్లోకి ఎమ్మెల్యే వచ్చే ముందు సమాచారం తమకు చేరవేయాలని నక్సల్స్‌ సూచించినట్లు తెలిసింది. సెప్టెంబరు 19న గ్రామదర్శినికి రావాలని ఎమ్మెల్యేను ఆ నాయకుడు ఆహ్వానించాడు. వస్తానని కిడారి చెప్పడంతో మావోయిస్టులకు చేరవేశాడు. రెండు రోజులు ముందుగానే గ్రామానికి చేరుకున్న కొందరు నక్సల్స్‌.. ఎమ్మెల్యే హత్యకు పథక రచన చేశారు. మావోయిస్టు మిలిటరీ కమిటీ విభాగానికి అనుకూలతలు, ప్రతికూలతలు వివరించారు. రంగంలోకి దిగేముందు అరుణ బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లిపోయింది. సెప్టెంబరు 19న అక్కడకు చేరుకుని కార్యాచరణకు సిద్ధమైంది. అదే సమయంలో ఎమ్మెల్యే భార్య అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చి ఆయన రాలేక పోయారు. దీంతో మావోయిస్టుల ప్లాన్‌ అప్పుడు ఫలించలేదు.
 
 
ఆదివారం కచ్చితంగా వస్తా...
భార్య అనారోగ్యం వల్ల గ్రామదర్శిని వాయిదా వేసుకున్న ఎమ్మెల్యే ఆదివారం(సెప్టెంబరు 23న) కచ్చితంగా వస్తానని స్థానిక నేతలకు ఫోనుచేసి చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో కలిసి అనుచరులతో వెళ్తుండగా లిపిటిపుట్టు వద్ద రెండు వాహనాలను మావోయిస్టులు చూశారు. ఊరి బయట ఓ 15 గిరిజన నివాసాలున్న జంక్షన్‌లో మాటు వేసి ఉన్న సాయుధ మావోయిస్టులకు ఈ సమాచారం అందించారు. అప్రమత్తమైన దళం ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగించి ఆయన్ను కిందకు దించింది. అదే సమయంలో సారాయి గూడెం వైపు నుంచి వస్తున్న వాహనాలను, పాదచారులను అక్కడున్న మరో దళం అడ్డుకుంది. గ్రామంలో ముందుగా వాహనాలను చూసి సాయుధ మావోయిస్టులకు సమాచారం అందించిన బృందం గ్రామంలోని గిరిజనులు అటువైపు వెళ్లకుండా అడ్డుకుంది. కాసేపు ఎమ్మెల్యేతో, సివేరితో మాట్లాడిన మావోయిస్టులు వారిని కాల్చిచంపారు.
 
 
సోమ అనుచరులను రెచ్చగొట్టిన స్మగ్లర్‌
కిడారి, సివేరి హత్య విషయం తెలియగానే సోమ అనుచరులను ఓ గంజాయి స్మగ్లర్‌ రెచ్చగొట్టాడు. పోలీసులు నిత్యం మనల్ని ఇబ్బంది పెడుతూ.. చివరకు మన నాయకులను కూడా మావోయిస్టుల నుంచి రక్షించలేకపోయారని దాడికి పురిగొల్పాడు. ఆగ్రహంతో ఊగిపోయిన గిరిజనులు పోలీసు స్టేషన్లపై పడి తగులబెట్టారు. కానిస్టేబుళ్లను సైతం చితగ్గొట్టారు. వీడియోలను పరిశీలించిన పోలీసులు అందులో ఉన్నవారిని అదుపులోకి తీసుకుని విచారించారు. స్మగ్లర్‌ నుంచే సంకేతాలు అందినట్లు ఎక్కువ మంది వెల్లడించారు. ఎందుకిలా చేశాడని ఆరా తీయగా మావోయిస్టులతో తనకు సంబంధాలున్నాయని, పోలీసులు పదే పదే గంజాయి కేసులు పెడుతున్నారన్న కోపంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తేలింది. సదరు టీడీపీ నేతలను, స్మగ్లర్‌ను రేపోమాపో అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Link to comment
Share on other sites

కిడారి, సోమా మా తరం హీరోలు...పాడేరులో పోస్టర్లు
01-10-2018 09:07:30
 
విశాఖపట్నం: పాడేరు అంబేద్కర్ సెంటర్‌లో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు వెలిశాయి. ప్రజలను చంపే కర్కశత్వం మావోయిస్టులదని...ప్రజా సేవే పరమావధి తమ నాయకులదంటూ పోస్టర్లలో వ్యాఖ్యలు చేశారు. ‘కిడారి, సోమా మా తరం హీరోలు...పిరికిపంద చర్యలకు పాల్పడిన మావోలు జీరోలు’ అంటూ వెలసిన పోస్టర్లను గిరిజనులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
Link to comment
Share on other sites

నమ్మించిద్రోహం!
కిడారికి విశ్వసనీయంగా ఉంటూనే  మావోయిస్టులకు సహకారం
  ఒకరు మండల, మరొకరు  గ్రామస్థాయి నాయకులు
  వేరే నేత రాజకీయ ఎదుగుదల  కోసమే మావోలతో చేతులు కలిపినట్లు సందేహాలు
ఈనాడు - అమరావతి

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన ఘటనలో మావోయిస్టులకు స్థానికంగా ఇద్దరు రాజకీయ నాయకుల నుంచి పూర్తి సహకారం అందినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. వీరిలో ఒకరు మండల స్థాయి నాయకుడు కాగా, మరొకరు గ్రామస్థాయిలో కీలకంగా వ్యవహరించే వ్యక్తని తెలిసింది. వీరిలో ఒకరు గంజాయి స్మగ్లింగ్‌, అక్రమ రవాణా కార్యకలాపాల్లో నిరంతరం మునిగి తేలుతుంటారని సమాచారం. ఈ ఇద్దరు నాయకులు కూడా ఎమ్మెల్యే కిడారికి అత్యంత విశ్వసనీయంగా వ్యవహరిస్తూనే... మావోయిస్టుల వ్యూహరచన అమలులో భాగస్వాములైనట్లు పోలీసులు గుర్తించారు. గత రెండు, మూడు రోజులుగా వీరిరువురిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలో వారి ప్రమేయంపై కీలక ఆధారాలు సేకరించారు. పోలీసు విచారణ సందర్భంగా జంట హత్యల్లో తమ పాత్ర ఉందని వారు అంగీకరించినట్లు సమాచారం.

ఒకటి రెండ్రోజుల్లో అరెస్టులు
అదుపులో ఉన్న ఈ ఇద్దరు నాయకుల నుంచి మరికొన్ని వివరాలు సేకరించి ఒకటి, రెండు రోజుల్లో అరెస్టు చేసే అవకాశముంది. ఎమ్మెల్యే లివిటిపుట్టు వైపు వచ్చేలా చేయడం, మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకునేలా చూడటంలో వీరు క్రియాశీల పాత్ర పోషించారని తేల్చారు. అయితే మావోయిస్టులకు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? ఎప్పటి నుంచి వారితో సంబంధాలు కొనసాగిస్తున్నారు? ఎమ్మెల్యేపై వారికి ఏమైనా వ్యక్తిగత కక్ష ఉందా? అరకు ప్రాంతంలో కీలకమైన కిడారి, సోమలను లేకుండా చేస్తే... రాజకీయంగా వేరే నాయకుడి ఎదుగుదలకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారా? ఈ చర్యల ద్వారా మేలు పొందగలనని భావించిన వారెవరు?...తదితర అంశాలకు సంబంధించి అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్లు తెలిసింది.

ఎవరెవరితో.. ఎప్పుడెప్పుడు మాట్లాడారు!
ఎమ్మెల్యే హత్యకు గురికావడానికి రెండు, మూడు రోజుల ముందు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు? ఆయనకు ఆ రెండు మూడు రోజుల్లో వరుసగా ఫోన్‌ చేసింది ఎవరు? సర్రాయిలో గ్రామదర్శిని కార్యక్రమానికి బయల్దేరే ముందు ఆయన ఫోన్‌కు ఎక్కడెక్కడి నుంచి కాల్స్‌ వచ్చాయనే దానిపై కాల్‌ డేటా విశ్లేషించిన పోలీసులు.. కొన్ని అనుమానిత ఫోన్‌ నెంబర్లను సేకరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసిన ఎంత సమయం తర్వాత ఆ నెంబర్ల నుంచి ఇతర నెంబర్లుకు ఫోన్లు వెళ్లాయి? అవి ఎవరివి అని ఆరా తీయగా...పైన పేర్కొన్న ఇద్దరు ప్రమేయానికి సంబంధించి పక్కా ఆధారాలు లభించినట్లు సమాచారం. లివిటిపుట్టు ఘటనకు పాల్పడటానికి ముందు ఆ ప్రాంతానికి మావోయిస్టులు రెండు, మూడు సార్లు సాధారణ దుస్తుల్లో వచ్చినట్లు ఇప్పటికే పోలీసు దర్యాప్తులో తేలింది.

Link to comment
Share on other sites

కాల్‌ డేటాయే ఆధారం!
మావోయిస్టుల చేతిలో కిడారి, సివేరి ఫోన్లు
స్థానికుల ఫోన్‌కాల్స్‌పైనా పోలీసుల నిఘా
రాజకీయ కుట్ర కోణంలోనూ దర్యాప్తు
kidari-phone23.jpg

విశాఖ మన్యంలోని డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన రోజునే సర్కారు సిట్‌ వేసింది. హత్యలకు కారణం ఏమిటి.. హత్యలో పాల్గొన్న మావోయిస్టులు ఎవరు.. వీరిని హతమార్చడానికి ఎన్ని రోజుల నుంచి ప్రణాళిక వేసుకున్నారు.. వారికి స్థానికంగా సహకరించిందెవరు..నిఘా వైఫల్యం ఇతరత్రా కోణాల్లో సిట్‌ బృందం దర్యాప్తు చేయాల్సి ఉంది. డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ కూడా జిల్లాలోనే మూడు రోజులు పాటు ఉంటూ దర్యాప్తు బృందానికి సూచనలు చేశారు.హత్య జరిగిన రెండు మూడు రోజుల వరకు మావోల నుంచి ఏమైనా లేఖ రూపంలో సమాచారం వస్తుందేమోనని వేచిచూశారు. వారం రోజులయినా మావోలు లేఖ విడుదల చేయకపోవడంతో పోలీసులు తమశైలిలో విచారణ మొదలుపెట్టారు. అసలు మావోయిస్టులు నేతలను హత్య చేయడానికి కారణం ఏమై ఉంటుందో ఓ అంచనాకు వచ్చారు. ఈ ఇద్దరు నేతలు పాల్గొనే ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల వివరాలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు మావోయిస్టులకు తెలియడంతోనే సులువుగా ఈ హత్యలు చేసి వెళ్లిపోయినట్లు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ నేతల కదలికల సమాచారాన్ని మావోయిస్టులకు చేరవేసింది ఎవరన్నదే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులను విచారించినా, మరికొందరిన అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా వారి నుంచి సరైన సమాచారం రావడం లేదు. దీంతో పోలీసులు అనుమానితుల ఫోన్‌ కాల్స్‌పై దృష్టిపెట్టి దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఫోన్లపై నిఘా.. : లివిటిపుట్టు వద్ద నేతలను తుపాకీలతో కాల్చి హతమార్చిన తరవాత వారి దగ్గరున్న ఫోన్‌లను మావోయిస్టులు వెంటపట్టుకుని పోయారు. అంతకు ముందే నేతలతో మావోయిస్టులు మాట్లాడి వారి నుంచి వ్యాపార, రాజకీయపరమైన వ్యవహారాలు, ఆర్థిక పరమైన వివరాలను తెలుసుకుని, ఎందుకు చంపుతున్నదీ మావోలు రికార్డు.

చేసినట్లు తెలిసింది. నేతలను చంపి కొద్ది దూరం వెళ్లిన తరవాత మరలా వచ్చి వారి సెల్‌ఫోన్లను తీసుకుని వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కనీసం నేతల సెల్‌ఫోన్లు ఉన్నా తదుపరి విచారణలో పోలీసులకు కొంత సమాచారం వచ్చేది. మావోలు ఆ అవకాశం కూడా పోలీసులకు ఇవ్వలేదు. దీంతో సిట్‌ అధికారులు మావోలు నేతల ఫోన్లను ఎందుకు పట్టుకువెళ్లారు అందులో ఏమైనా విలువైన సమాచారం ఏదైనా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ఫోన్‌లు లేకున్నా ఫర్వాలేదు.. వారితో తరచూ వ్యాపార, రాజకీయాలపై మాట్లాడేవారి ఫోన్లపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. అందుకే ఘటన జరిగిన మూడో రోజు నుంచి విచారణ పేరుతో అనుమానితులను తీసుకువచ్చి వారు ఉపయోగించే ఫోన్‌ నంబర్లు, ఇతర మాధ్యమాల గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు. ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీలు సేకరిస్తున్నారు. రెండు మూడు నెలలుగా ఈ ఫోన్ల నుంచి ఎమ్మెల్యేతో పాటు ఎవరెవరికి కాల్స్‌ చేసింది తెలుసుకోవాలని భావిస్తున్నారు. వాటి ఆధారంగానే మావోలకు నేతల కదలికల సమాచారం ఎలా చేరిందో తేల్చనున్నారు.

విచారణ ముమ్మరం : నేతల వ్యాపార లావాదేవీలు.. భూముల వ్యవహారాలు.. రాజకీయ మార్పులపై మావోలకు తెలిసినవారి నుంచే సమాచారం వెళ్లిందనే పూర్తి నిర్ధారణకు వచ్చారు. అందుకే మూడు రోజుల నుంచి అనుమానితుల విచారణను ముమ్మరం చేశారు. వీరిలో ఎక్కువగా కిడారితో సత్సంబంధాలున్న మండల, గ్రామస్థాయి నాయకులున్నారు. కొంతమంది బయట ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారాలు చేస్తున్నవారు ఉన్నారు. వీరందరినీ ఒక్కొక్కరిగా పిలిచి మూడు నుంచి నాలుగు గంటల పాటు స్టేషన్‌తో పాటు విశాఖపట్నానికి తరలించి విచారణ చేస్తున్నారు. డుంబ్రిగుడకు సమీపంలో అంత్రిగుడ అనే పీవీటీజీ గ్రామం నుంచి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా అందులో ఇద్దరి ఉప ఎంపీపీ పూచీకత్తుతో విడిచిపెట్టారు. అవసరమైనప్పుడు పిలుస్తాం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గెమ్మిలి శోభన్‌ అనే వ్యక్తిని మాత్రం నాలుగు రోజులుగా పోలీసులు అదుపులోనే ఉన్నాడు. అతడిని విడిచిపెట్టలేదు. శని, ఆదివారాల్లో మండలంలోని తెదేపా నేతల కొందరు, స్థానిక వ్యాపారులను విచారించారు. వీరితో పాటు ఆ రోజు ఎమ్మెల్యే వాహనం వెనుక వెళ్తున్న విలేకరులను విచారణ చేస్తున్నారు. ఫోన్లు, కెమెరాలను పరిశీలించి కుటుంబ వ్యవహారాల గురించి, ఎమ్మెల్యేతో ఉన్న సంబంధాలు.. ఘటన తరవాత ఎవరెవరికీ ఫోన్‌చేసింది తదితర సమగ్ర సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ఘటనకు సహకరించిన వారిని అరెస్టు చూపించడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

కిడారి, సోమా హత్య ఘటనలో మరోవేటు
01-10-2018 17:34:58
 
636740122834156336.jpg
విశాఖ: అరకు, డుంబ్రిగూడ పోలీస్‌స్టేషన్లపై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పక్కనే ఉన్న బెటాలియన్ పోలీసులు స్పందించపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనలో మరో అధికారిపై ప్రభుత్వం వేటు వేసింది. అరకు జంట హత్యల ఘటనలో అరకు సీఐ వెంకునాయుడుపై అధికారులు బదిలీ వేటు వేశారు. సీఐని వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. అరకు సీఐగా కొత్తకోట సీఐ కోటేశ్వరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
 
 
అయితే పోలీసులు ఎస్కార్ట్‌గా కల్పించి ఉంటే కిడారి, సోమల ప్రాణాలు దక్కేవని వారి బంధువులు పోలీసుల తీరును తప్పుబట్టారు. కిడారి ముందస్తు సమాచారం ఇచ్చినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవరించారని బంధువులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు డుంబ్రిగూడ ఎస్సై అమ్మనరావును సస్పెండ్ చేశారు. కిడారి, సోమా హత్యల అనంతరం చెలరేగిన అల్లర్లను నియంత్రించండంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి.
Link to comment
Share on other sites

జంట హత్యలపై సీఎంకు ప్రాథమిక నివేదిక ఇచ్చిన డీజీపీ
02-10-2018 13:29:03
 
636740837419919317.jpg
అమరావతి: అరకు జంట హత్యల ఘటనపై సీఎం చంద్రబాబుకు ప్రాథమిక నివేదిక అందింది. మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రిని కలసిన డీజీపీ ఠాకూర్.. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోము హత్యకు సంబంధించిన రిపోర్టును అందజేశారు. ఆ నివేదికలో 6గురు పేర్లు ఉన్నట్లు సమాచారం. వారంతా టీడీపీతోపాటు వైసీపీ, బహుజన్ సమాజ్ పార్టీ నేతలుగా పోలీసులు గుర్తించారు. ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత నెలలో మావోయిస్టులు మూడు పర్యాయాలు వచ్చిన సమయంలో వారికి ఆశ్రయం ఇచ్చినట్లు విచారణలో తేలింది. వారిని మావోయిస్టులు బెదిరించి ఆశ్రయం పొందారా? లేక ఎటువంటి పరిస్థితుల్లో వారు ఆశ్రయం ఇచ్చారన్న అంశంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అయితే కిడారి, సోమలను మావోయిస్టులు హెచ్చరించి వదిలిపెడతారని అనుకున్నామని, కాల్చి చంపుతారని తాము భావించలేదని ఆరుగురు పోలీసులకు చెప్పినట్లు తెలియవచ్చింది.
 
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో కొత్త సంగతులు బయటపడుతున్నాయి. మావోయిజం, స్థానిక రాజకీయం కలగలిసి ఆయనను బలితీసుకున్నట్లు స్పష్టమవుతోంది. మావోయిస్టులు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చి చంపడం... తర్వాత పోలీసు స్టేషన్లపై స్థానికుల దాడితో అరకు అట్టుడికిపోయింది. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కిడారి హత్యకు ఆరుగురు స్థానిక నేతలు సహకరించగా... వీరిలో ముగ్గురికి టీడీపీ, ఇద్దరికి వైసీపీ, ఒకరికి బీఎస్పీతో సంబంధాలున్నట్లు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

మావోల హిట్‌లిస్ట్‌లో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి..!
02-10-2018 15:04:39
 
636740894781046983.jpg
  • కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎమ్మెల్యే ఈశ్వరి పర్యటన
చింతపల్లి(విశాఖ జిల్లా): పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సోమవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ చింతపల్లి మండలంలో పర్యటించారు. అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపడంతో.... హిట్‌లిస్టులో వున్న ఎమ్మెల్యే ఈశ్వరికి పోలీసులు భద్రతను పెంచిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధిని అయిన తాను ప్రజల వద్దకు వెళ్లకుండా ఎలా ఉండగలనని, తాను మావోయిస్టుల టార్గెట్‌లోలేనని ఆమె పోలీసు అధికారులకు చెప్పినట్టు తెలిసింది. తనకు అసాధారణ భద్రత అవసరంలేదని చెబుతున్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం ఆమె భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
సోమవారం చింతపల్లి మండలం బైలుకించంగి గ్రామంలో పర్యటించారు. అంతకుముందు జి.మాడుగులలో కూడా పర్యటించారు. జి.మాడుగుల నుంచి చింతపల్లి చేరుకునే మార్గంలో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఐదు బాంబ్‌స్క్వాడ్‌ బృందాలు రహదారి, సభాప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. సభా ప్రాంగణానికి చుట్టూ సుమారు రెండు కిలోమీటర్ల పరిధిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సభా వేదిక పక్కనున్న వాటర్‌ ట్యాంకుపై సాయుధ పోలీసులు పహారా కాస్తూ కనిపించారు.
Link to comment
Share on other sites

గ్రేహౌండ్స్ దళాల నుంచి 3సార్లు తప్పించుకున్న మావోయిస్టులు
02-10-2018 19:03:58
 
636741038376068941.jpg
 
విశాఖ: అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి హత్య కేసులో అడవిలో కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ కూంబింగ్‌లో గ్రేహౌండ్స్‌కు మావోయిస్టులు ఎదురుపడినట్లు సమాచారం. అయితే భౌగోలిక సరిహద్దులు తెలియకపోవడంతో గ్రేహౌండ్స్ కళ్లుగప్పి మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం. ఒడిశా పోలీసుల సహకారంతో వేట కొనసాగుతోంది. మావోయిస్టులు గ్రేహౌండ్స్ దళాల నుంచి మూడుసార్లు తప్పించుకున్నారు.
 
మావోయిస్టులకు గట్టి పట్టున్న గ్రామాలపై ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు దృష్టిపెట్టాయి. రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులు తలదాచుకున్నారని తెలిసి.. గ్రేహౌండ్స్ బలగాలు గ్రామాన్ని చుట్టుముట్టాయి. అయితే గ్రామం భౌగోళిక సరిహద్దులు తెలియకపోవటంతో.. మావోయిస్టులు తప్పించుకుపోయారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని గ్రేహౌండ్స్ బలగాలు ప్రశ్నిస్తున్నాయి.
 
కాగా రేపు ఒడిశాలో ఏపీ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ పోలీసు ఉన్నతాధికారుల భేటీ కానున్నారు. యూనిఫైడ్ కమాండ్‌తో వేట కొనసాగించడంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. సరిహద్దు గ్రామాల్లో ఉమ్మడి నిఘా కోసం అధికారులు చర్చించనున్నట్లు సమాచారం. అలాగే మావోయిస్టుల సమాచారాన్నిఇచ్చిపుచ్చుకునే అంశంపై కూడా చర్చలు జరగనున్నట్లు తెలియవచ్చింది.
Link to comment
Share on other sites

వర్గ’ పోరుకు కిడారి బలి?
03-10-2018 03:25:42
 
  • తమ ఎదుగుదలకు ఎమ్మెల్యే అడ్డమని భావించిన ఓ తెగ..
  • నక్సల్స్‌లోని తనవర్గంతో దాడి
  • సూత్రధారి మాజీ ఎంపీటీసీ
  • గతంలో గిరిజన సంస్థలో పని.. నక్సల్స్‌తో బంధం
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)
సామాజిక వర్గ విభేదాలే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును పొట్టన బెట్టుకొన్నాయా? కిడారి బతికిఉంటే తమ ప్రయోజనాలకు దెబ్బ అని గిరిజనుల్లోని ఓ వర్గం భావించిందా? తమవారే మావోయిస్టుల్లో ఎక్కువగా ఉండటం ఆ వర్గానికి కలిసి వచ్చిందా? విశాఖ మన్యంలో దశాబ్దాలుగా 2 గిరిజన తెగల మధ్య పోరును దగ్గరగా చూస్తున్న వారు, ఈ ప్రశ్నలకు అవునంటున్నారు. లివిటిపుట్టులో ఎమ్మెల్యే కారును చుట్టుముట్టిన మావోయిస్టులు..ఆయన గన్‌మెన్‌ను ఉద్దేశించి ‘మీరు ఏ తెగ?’ అని ప్రశ్నించడాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ రోజు వేరే గన్‌మెన్‌ రావడం, తనది శ్రీకాకుళం అని చెప్పడంతో ఆయనను మావోయిస్టులు వదిలేశారని అంటున్నారు. ఇప్పుడు ఈ కోణం నుంచీ పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేసినట్టు సమాచారం. మన్యంలో ఒక తెగకు కిడారి నాయకుడు.
 
అభివృద్ధి పనులు, పథకాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల దాకా ప్రతి విషయంలోనూ ఆయన తన తెగ వారికే అధిక ప్రయోజనాలు చేకూరుస్తున్నారని మరో తెగ కిడారిపై గుర్రుగా ఉంది. తమ తెగనుంచి మావోయిస్టుల్లో కలిసిన వారితో వీరికి మంచి సంబంధాలు ఉన్నాయి. వారితో మాట్లాడుకొని కిడారిని ఈ తెగ నాయకులు మట్టుబెట్టించారని తెలుస్తోంది. ఈ మొత్తం పథకానికి సూత్రధారిగా భావిస్తున్న ఎంపీటీసీ మాజీ సభ్యుడి ది కిడారి వ్యతిరేక తెగే కావడం గమనార్హం. ఈయన స్వస్థలం డుంబ్రిగుడ మండలం తూటంగి. పదో తరగతి వరకు చదువుకున్నాడు. కొన్నాళ్లు గిరిజన హక్కుల పోరాట సంస్థలో పనిచేశాడు. ఆ సమయంలో నక్సల్స్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత పాడేరు, డుంబ్రిగుడలో విలేకరిగా పని చేశాడు. అనంతరం బహుజన్‌ సమాజ్‌ పార్టీలో చేరాడు. 2005లో ఆ పార్టీ తరఫున ఎంపీటీసీ సభ్యునిగా గెలిచాడు. పెదబయలుకు చెందిన పాంగి రాజారావు(ప్రస్తుతం టీడీపీ జిల్లా ఉపాధ్యక్షు డు) సారఽథ్యంలో గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరాడు.
 
పాంగి కూడా కిడారి వ్యతిరేక తెగ నేతే తమ తెగ నుంచి ఒక రు రాజకీయంగా ఎదగాలని, తమలో ఒకరు ఎమ్మెల్యే అయితే సామాజిక వర్గం బాగు పడుతుందనే ఆలోచన వీరందరిలో ఉంది. తమ వర్గంలోని ఈ ఆకాంక్షను వాడుకొని తాను ఎదిగేందుకు మాజీ ఎంపీటీసీ ఎత్తు వేశాడని, అందులోభాగంగానే కిడారి హత్యకు సహకరించి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. దాడికి సిద్ధమవుతున్న మావోయిస్టులకు ఈయన భోజన ఏర్పాట్లు చేసినట్టు పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఈయనకు ఇద్దరు భార్య కాగా, రెండో భార్య అంగన్‌వాడీ టీచరు. మావోయిస్టులకు భోజన సదుపాయం కల్పించినట్టు అభియోగాలున్నాయి. ఈమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యే కిడారిని సర్రాయిలో గ్రామదర్శిని కార్యక్రమాని కి రప్పించింది మాజీ ఎంపీటీసీయేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎవరికి అనుమానం రాకుండా ఇతర నాయకులతోపాటు ఎమ్మెల్యే కంటే ముందుగానే ఈయన సర్రాయికి చేరుకున్నాడు. ఆయన అక్కడ ఉండగానే కిడారి, సోమలను మావోయిస్టులు చంపేసినట్టు వార్త తెలిసింది. ఆ విషయం వినగానే తక్కిన టీడీపీ నాయకులు చెరో దిక్కు పరుగులు పెట్టారు. కానీ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మాత్రం ఏ జంకూ లేకుండా లివిటిపుట్టు దారిలోనే తిరిగి అరకు చేరుకొన్నాడు.
 
సోమను అందుకే చంపేశారా?
దాదాపు ఏడాది క్రితం నక్సల్స్‌ నుంచి సివేరి సోమకు పిలుపు వచ్చింది. కొన్ని విషయాలు చర్చించాలని, ఓ ప్రాంతానికి రావాలని కోరారు. సోమ ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా సీఆర్పీఎఫ్‌ బలగాలు చుట్టుముట్టాయి. ఆ ఎన్‌కౌంటర్‌ నుంచి మావోయిస్టులు త్రుటిలో తప్పించుకొన్నారు. ఈ సంఘటనను మనసులో పెట్టుకున్న నక్సల్స్‌, లివిటిపుట్టులో సివేరి సోమ తమకు దొరకగానే పగ తీర్చుకుంటున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...