Jump to content

Araku MLA Kidari Sarveswar Rao Shot Dead by Maoists


koushik_k

Recommended Posts

  • Replies 296
  • Created
  • Last Reply
మైనో.. మల్లేష్‌
లివిటిపుట్టు దాడి ఘటనలో పాల్గొన్న మరో ఇద్దరి గుర్తింపు
అంపబల్లి, యేపలపాడు ప్రాంతాలకు బాధ్యుడిగా మల్లేష్‌
నందపూర్‌ ప్రాంతీయ కమిటీలో కీలకంగా మైనో
26ap-main4a.jpg

ఈనాడు, అమరావతి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన ఘటనలో పాల్గొన్న వారిలో మరో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. నందపూర్‌ ప్రాంతీయ కమిటీ సభ్యుడైన మైనో అలియాస్‌ శంభు, అంపబల్లి, యేపలపాడు ప్రాంతాలకు బాధ్యుడైన మల్లేష్‌   అలియాస్‌ సునీల్‌ అలియాస్‌ మల్లా ఈ దాడిలో పాల్గొన్నట్లు ఆధారాలను సేకరించారు. వీరిరువురూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే. ఘటనకు సంబంధించి సేకరించిన చిత్రాలు, స్థానికుల నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా వీరు పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మల్లేష్‌ అలియాస్‌ సునీల్‌ది దంతెవాడ జిల్లా గంగ్లూరు గ్రామం. ఆ రాష్ట్రంలోని రాయపూర్‌ వద్ద మొదలై ఒడిశా మీదుగా సాగి విజయనగరం జిల్లాలోని నాతవలస వద్ద ముగిసే 26వ నెంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అంపబల్లి, యేపలపాడు తదితర ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు ఇతడు బాధ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. మైనో అలియాస్‌ శంభు నందపూర్‌ ప్రాంతంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరి వయసు 29 ఏళ్లేనని పోలీసులు గుర్తించారు. ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీ సభ్యురాలైన వెంకట చైతన్య అలియాస్‌ అరుణ నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో సుమారు 60 మందికి పైగా మావోయిస్టులు పాల్గొనగా... వారిలో అరుణతో పాటు కామేశ్వరి అలియాస్‌ స్వరూప, శ్రీనుబాబు అలియాస్‌ రైనో అలియాస్‌ సునీల్‌లను ఇదివరకే పోలీసులు గుర్తించారు. తొలి ముగ్గురు తెలుగువారు.

అచ్చం అదే తరహాలో దాడి
ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మడ్‌ ప్రాంతంలో పోలీసు ఇన్‌ఫార్మర్లతోపాటు తమకు వ్యతిరేకంగా వ్యవహరించేవారిని మట్టుబెట్టేందుకు మావోయిస్టులు ఓ ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారని పోలీసు వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముందుగా ఎవరిని చంపాలో వారిని ఉచ్చులోకి లాగుతారు. తర్వాత దాడికి నేతృత్వం వహించే ముఖ్యమైన మావోయిస్టు నేతలు వారితో నేరుగా మాట్లాడతారు. వారు చేసిన తప్పులను వివరించడంతోపాటు, మావోయిస్టు సిద్ధాంతం గురించి చెబుతారు. ఈ ప్రక్రియనంతటినీ పూర్తి చేసిన తర్వాత వారిని హతమారుస్తారు. దాడిలో పాల్గొనే మిగతా సభ్యులు ఆ సమయంలో అక్కడ ప్రజా కోర్టు నిర్వహిస్తుంటారు. తాజాగా లివిటిపుట్టి వద్ద జరిగిన ఘటన అచ్చం ఇదే తరహాలో జరిగిందని పోలీసువర్గాలు పేర్కొంటున్నాయి. ఈ దాడికి నేతృత్వం వహించిన అరుణ నందపూర్‌, నారాయణపూర్‌ ప్రాంతీయ కమిటీల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. వీటిలో నందపూర్‌ ఒడిశా రాష్ట్రంలో ఉండగా, నారాయణపూర్‌ ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. అందుకే ఈ దాడికి ఆ ప్రాంతాల వారినే ఎక్కువగా సమీకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను ఆదివారం లివిటిపుట్టులో కాల్చిచంపిన మావోయిస్టులు, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా ఇది ప్రతీకార చర్యనో, గిరిజన విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు చంపామనో వారు ప్రకటిస్తుంటారు. ఇప్పుడు హత్యలు జరిగి 5 రోజులవుతున్నా ఇంతవరకు అలాంటి ప్రకటన జారీచేయలేదు. ఇది వ్యూహాత్మక జాప్యమా, లేక మరేదైనా కారణం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మావోయిస్టులు ఎవరినైనా హతమారిస్తే.. అది తమ పనేనని సంఘటనా స్థలంలోనే లేఖ పెట్టి, నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోతారు.

 

maoist 27092018

కొన్ని సందర్భాల్లో మరుసటి రోజో, రెండు రోజులు ఆగాకో లేఖ పంపుతారు. ఇన్‌ఫార్మర్ల ద్వారా లేఖలు అందజేస్తారు. విలేకరులకు పోస్టులో పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ లివిటిపుట్టు ఘటనపై మావోయిస్టులు ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. ఇద్దరు గిరిజన నాయకుల్ని కాల్చి చంపడంపై ఎటువంటి వివరణ ఇవ్వాలనే దానిపై వారు తర్జనభర్జన పడుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలోనూ వారు రాజకీయ నాయకుల్ని చంపారు. మణికుమారి గిరిజన సంక్షేమ మంత్రిగా ఉండగా ఆమె భర్త వెంకటరాజును హత్య చేశారు. హుకుంపేటలో సమిడ రవిశంకర్‌ను చంపారు. అయితే కిడారి, సోమలను హత్య చేయడంపై గిరిజనుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.

maoist 27092018

అధికార దాహం కోసం ప్రతిపక్ష నేతలు మావోలతో చేతులు కలపటం చూసాం.. ఆనాడు చంద్రబాబు పై దాడి చేసింది కూడా అప్పటి రాజశేఖర్ రెడ్డి అనుచురుడు గంగి రెడ్డి. నాడు చత్తీస్‌ఘర్‌ లో కాంగ్రెస్ కు చెందిన విసి శుక్లా, పిసిసి ప్రేసిడెంట్ నడకుమార్ పాటిల్, సీఎం రేస్ లో ఉన్న మహేంద్ర ఖర్మతో పటు 27 మందిని ఒకే స్పాట్ లో మావో లు కాల్చి చంపడం లో దాగి ఉన్న రాజకీయా కోణం ఏంటి ? యావత్ దేశం లోని మావోలకు అడ్డాగా మారిన చత్తీస్‌ఘర్‌ లో బిజేపీ 3 సార్లు పవర్ లోకి రావడం, మావోలతో కొందరు నేతలు చేతులు కలిపి చేస్తున్న రాజకీయం, అరకు ఘటన ఫై మావో పార్టి ఏమి చెప్పనుఉంది ? చంపాల్సినంత తప్పులు వారు ఏమి చేశారంటూ గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టుల చర్యను ఎవరూ హర్షించడంలేదు.

Link to comment
Share on other sites

కిడారి, సోమ ప్రతికూల అంశాలపై మావోల ఆరా?
28-09-2018 12:15:57
 
636737337589534229.jpg
  • కిడారి, సోమ ప్రతికూల అంశాలపై మావోల ఆరా?
  • వాటి ఆధారంగా లేఖ విడుదలకు యత్నం
విశాఖపట్నం: అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన మావోయిస్టులు అందుకు గల కారణాలను నేటికీ వెల్లడించలేదు. తాము హత్య చేయడానికి బలమైన కారణాలున్నాయని చెప్పే ఉద్దేశంతో వారిద్దరికీ సంబంధించిన ప్రతికూల అంశాలను సేకరించే పనిలో ఉన్నారని తెలిసింది. వాస్తవానికి ఏదైనా సంఘటన చేసే ముందే మావోయిస్టులు లేఖను సిద్ధం చేస్తారు. కానీ వీరిద్దరి విషయంలో అందుకు భిన్నంగా జరగడంతో పోలీసులు సైతం ఎందుకు ఇలా చేసి ఉంటారోననని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కిడారి, సోమకు సంబంధించి మైనింగ్‌, ఇతర వ్యవహారాలను సేకరించి, హత్యలకు ప్రధాన కారణంగా వాటిని పేర్కొంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేస్తారని తెలుస్తున్నది.
Link to comment
Share on other sites

Just now, sonykongara said:
కిడారి, సోమ ప్రతికూల అంశాలపై మావోల ఆరా?
28-09-2018 12:15:57
 
636737337589534229.jpg
  • కిడారి, సోమ ప్రతికూల అంశాలపై మావోల ఆరా?
  • వాటి ఆధారంగా లేఖ విడుదలకు యత్నం
విశాఖపట్నం: అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన మావోయిస్టులు అందుకు గల కారణాలను నేటికీ వెల్లడించలేదు. తాము హత్య చేయడానికి బలమైన కారణాలున్నాయని చెప్పే ఉద్దేశంతో వారిద్దరికీ సంబంధించిన ప్రతికూల అంశాలను సేకరించే పనిలో ఉన్నారని తెలిసింది. వాస్తవానికి ఏదైనా సంఘటన చేసే ముందే మావోయిస్టులు లేఖను సిద్ధం చేస్తారు. కానీ వీరిద్దరి విషయంలో అందుకు భిన్నంగా జరగడంతో పోలీసులు సైతం ఎందుకు ఇలా చేసి ఉంటారోననని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కిడారి, సోమకు సంబంధించి మైనింగ్‌, ఇతర వ్యవహారాలను సేకరించి, హత్యలకు ప్రధాన కారణంగా వాటిని పేర్కొంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేస్తారని తెలుస్తున్నది.

siggu leni lanjakodulu villu, champi ippudu karanalu kosam chusthunaru thu..

Link to comment
Share on other sites

అరకులోయలో మళ్లీ అలజడి.. మరొకరికి స్పాట్ పెట్టిన మావోలు
28-09-2018 11:43:35
 
636737318177833071.jpg
  • అరకులోయలో మళ్లీ అలజడి
  • పాడుబడిన ఈ బస్‌షెల్టర్‌ వద్దకే మావోయిస్టులు వచ్చినట్టు చెబుతున్నారు
అరకులోయ(ఆంధ్రజ్యోతి): అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన మావోయిస్టులు మరికొందరిపై దాడుల కోసం వేచి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అరకు, డుంబ్రిగుడ పరిసర ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్‌ జరుగుతున్నా లెక్క చేయకుండా ముగ్గురు మావోయిస్టులు గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అరకులోయకు నాలుగు కిలోమీటర్ల దూరానున్న బెంజిపూర్‌కు వెళ్లారు. అక్కడ రోడ్డు పక్కనున్న బస్‌షెల్టర్‌ వద్ద ఒక యువకుడు నిల్చొని వుండగా, ముగ్గురు వెళ్లి...అరకు ఎంపీపీ, టీడీపీ నాయకుడు అప్పాలు ఇల్లు ఎక్కడో తెలుసా? అంటూ ప్రశ్నించారు. వారి చేతిలో వాటర్‌ బాటిల్‌, వీపునకు బ్యాగులు, చేతిలో ఆయుధాలు వంటివి వుండడంతో భయపడిన ఆ యువకుడు తనకు ఇక్కడ ఎవరూ తెలియదని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. వెంటనే ఊళ్లోకి వెళ్లి ఎంపీపీ అరుణకుమారికి, ఆమె భర్త అప్పాలుకు విషయం తెలియజేశాడు.
 
చెమటలు కక్కుతూ ఆందోళనగా వచ్చిన ఆ యువకుడిని చూసి ఏమైందని వారు ప్రశ్నించగా, మీ కోసం మావోయిస్టులు వచ్చారని, తప్పించుకొని పారిపోవాలని సూచించాడు. వచ్చిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు వున్నారని వివరించాడు. దీంతో భయపడిన ఎంపీపీ అరుణకుమారి వెంటనే పోలీసులకు ఫోన్‌ చేశారు. దీనికి స్పందించిన అరకు సీఐ వెంకునాయుడు, ఏఎస్పీ రస్తోగి హుటాహుటిన బెంజిపూర్‌లోని ఎంపీపీ ఇంటికి వెళ్లారు. జరిగిందేమిటో తెలుసుకొని, ఆమె భర్త అప్పాలును, విషయం అందజేసిన యువకుడిని అరకు తీసుకువెళ్లారు. ఈ సంగతి తెలిసి ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’ బెంజిపూర్‌ వెళ్లి ఎంపీపీ అరుణకుమారిని కలిసి మాట్లాడగా, ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మొన్న ఆదివారం ఎమ్మెల్యే కిడారిని చంపినప్పుడు కూడా మావోయిస్టులు తమ గురించి అక్కడ ఆరా తీశారని, భయంగా వుందని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కోరారు.
Link to comment
Share on other sites

కిడారి కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు
28-09-2018 13:18:47
 
636737375292534880.jpg
 
విశాఖ: పాడేరులో కిడారి సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. కిడారి చిత్రపటానికి పూలు జల్లి సీఎం నివాళులర్పించారు. అనంతరం కిడారి కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, గిడ్డి ఈశ్వరి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాడేరు నుంచి అరకు చేరుకుని మావోల కాల్పుల్లో కిడారితో పాటు చనిపోయిన సోమ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
 
 
గత ఆదివారం విశాఖ జిల్లా లివిటిపుట్టలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సోమను అతిదారుణంగా మావోయిస్టులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

కిడారి కుటుంబానికి రూ.కోటి సాయం ప్రకటించిన చంద్రబాబు
28-09-2018 14:23:53
 
636737414350174587.jpg
విశాఖ: కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు చంపారన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.పాడేరులో కిడారి కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించి ఓదార్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఏజెన్సీ అభివృద్ధికి తపనపడిన వ్యక్తి కిడారి సర్వేశ్వరరావు అని కొనియాడారు. అలాంటి వ్యక్తి హత్యకు గురికావడం చాలా దారుణం అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మావోయిస్టులు ఏ విధంగా వచ్చారో దర్యాప్తులో తేలుతుందని వెల్లడించారు. బాక్సైట్‌కు, కిడారి హత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని లక్ష మంది ఉన్న సభలో చెప్పానన్నారు.
 
 
అభివృద్ధి కోసం పాటు పడేవారిని చంపేస్తే.. గిరిజన ప్రాంతాలు ఎలా అభివృద్ధి జరుగుతాయి? అని ప్రశ్నించారు. కిడారి ఆశయసాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మావోయిస్టు కాల్పుల్లో చనిపోయిన రెండు కుటుంబాలకు రూ.కోటి ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. అలాగే కిడారి రెండో కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తామన్నారు. అంతేకాకుండా పార్టీ పరంగా కిడారి కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని వెల్లడించారు. విశాఖపట్నంలో ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ టికెట్ గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
Link to comment
Share on other sites

కిడారి కుటుంబానికి రూ.కోటి సాయం
రెండో కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తాం
పెద్ద కుమారుడికి ఏం చేయాలన్నది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
కిడారి కుటుంబానికి చంద్రబాబు పరామర్శ
01422928BRK83A.JPG

పాడేరు: మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించారు. అమరావతి నుంచి విమానంలో విశాఖ చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పాడేరు చేరుకున్నారు. కిడారి నివాసానికి చేరుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. సర్వేశ్వరరావు కుమారులను అక్కున చేర్చుకున్న చంద్రబాబు.. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘గిరిజనులకు ఎనలేని సేవలందించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడం బాధాకరం. ఆయన చనిపోయారన్న విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నా. కిడారి ఆశయాల సాధనకు తెదేపా కృషి చేస్తుంది. గిరిజనుల్లో ఇంతటి బలమైన రాజకీయ నేత ఉండటం చాలా అరుదు. కిడారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.కోటి సాయం అందిస్తాం. కుటుంబసభ్యుల్లో నలుగురికి రూ.5లక్షల చొప్పున పార్టీ తరపున ఇస్తాం. చిన్న కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం కల్పిస్తాం. మొదటి కుమారుడికి ఏం చేయాలన్న దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆయనకు పార్టీ టిక్కెట్‌ ఇవ్వాలా? వద్దా? అన్నది పార్టీ నిర్ణయిస్తుంది. కిడారి కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. కాబట్టి విశాఖ నగరంలో వారికి స్థలం కేటాయిస్తాం. ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తాం. బాక్సైట్‌ గనులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా ఈ ఘటన జరగడం బాధాకరం. వైఎస్‌ హయాంలో కేటాయించిన గనులను మా ప్రభుత్వం రద్దు చేయించింది. ఈ విషయం తెలియని కొందరు అనసవర విమర్శలు చేస్తున్నారు.’

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అరకులోయలోని తన అతిథి గృహం నుంచి ఆదివారం ఉదయం 11.30 గంటలకు గ్రామదర్శినిలో పాల్గొనడం కోసం మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో కలిసి సరాయి గ్రామానికి బయలుదేరారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో డుంబ్రిగుడ మండల కేంద్రాన్ని దాటి లివిటిపుట్టు చేరుకుంటున్న సమయంలో మావోయిస్టులు వారిని అడ్డగించారు. క్వారీ విషయంలో కొద్దిసేపు చర్చించి అనంతరం ఇద్దరినీ కాల్చి చంపారు. ఘటన జరిగిన సమయంలో చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్నారు.

Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:

siggu leni lanjakodulu villu, champi ippudu karanalu kosam chusthunaru thu..

This is looking as a perfect political murder with naxals back ground... If they would have hired some professionals political ga heat perigedi  & doubt ycp meedaki vachedi ..ade dabbulu naxals ki ichi chepiste naxals kata lo kalispotundi evari meeda doubt rakunda potundi... 

Link to comment
Share on other sites

10 minutes ago, MVS said:

This is looking as a perfect political murder with naxals back ground... If they would have hired some professionals political ga heat perigedi  & doubt ycp meedaki vachedi ..ade dabbulu naxals ki ichi chepiste naxals kata lo kalispotundi evari meeda doubt rakunda potundi... 

valla uniki kosam, rajakiyam kalasi unatayi,araku area lo TDP nayakula meda endoko naxals ki kopam,last time TDP govt unnappudu  minister mani kumari valla husband  ni champeru, ame ippatiki kuda tdp lo untundi, e sabha ki ayina vasthundi,poyi polam pani chesukuntundi nayakulu edugutunnaru ante tattukoleru vedva lanjakodulu..

Link to comment
Share on other sites

డారి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి!
28-09-2018 17:55:05
 
636737541078072906.jpg
 
విశాఖ: ఏవోబీలో ఎన్‌కౌంటర్ అయినా... రాజకీయ నాయకులు, పోలీసులపై మావోలు దాడి చేసినా మొదటగా వినిపించే పేరు చలపతి. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలకు సంబంధించి చలపతి పేరే మొదటగా వినిపించింది. చలపతి పక్కా ప్లాన్ రచిస్తారని, మెరికలాంటి వ్యక్తులను తన టీంలో చేర్చుకుని ఆపరేషన్‌ను సక్సెస్ చేస్తారని అనేక వార్తలు వస్తున్నాయి. అరకు జంట హత్యల కేసులో మొదటగా చలపతి, ఆయన భార్య అరుణ ప్లాన్ చేశారని పోలీసులు అనుమానించారు. అయితే పోలీసుల విచారణలో అదే నిజమైంది. ఈ కేసులో పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
 
మావోయిస్ట్ పార్టీ నేత చలపతి డైరెక్షన్‌లోనే టీడీపీ నేతలపై దాడి జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మావోలు వాకీటాకీలు వాడినట్లు పోలీసులు గుర్తించారు. బెజ్జంగి ప్రాంతం నుంచి ఆపరేషన్‌ కిడారికి సంబంధించి మవోలకు చలపతి సూచనలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. హత్య  అనంతరం సహచరుల ఆదేశాలతో ఆయన అక్కడి సురక్షిత ప్రాంతానికి వెళ్లారని చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో  కిడారి, సివేరి సోమ హత్యలో పాల్గొన్న మావోయిస్టులలో నలుగురిని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. జునుమూరి శ్రీనుబాబు అలియాస్‌ సునీల్‌, రైనో, మహిళా మావోయిస్టు కామేశ్వరి అలియాస్‌ స్వరూప, సింద్రి చంద్రి, మరో మహిళా మావోయిస్టు వెంకట రవిచైతన్య అలియాస్‌ అరుణగా గుర్తించారు.
 
 
ఏవోబీలో మావోల వైపు నుంచి ఎలాంటి ఘటన జరిగినా చలపతే తెరపైకి వస్తుంటాడు. గెరిల్లా దాడి వ్యూహ రచనలో చలపతికి మంచి పేరుంది. 2003లో చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన హత్యాయత్నం కేసులోనూ చలపతి నిందితుడు. ఆయనపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. చలపతి అసలు పేరు ప్రతాప్‌ రెడ్డి. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని ముత్యంపైపల్లె. ఆయన ఎమ్మెస్సీ వరకు చదువుకున్నాడు. మొదట ఈయనకు పట్టుపరిశ్రమల శాఖలో ఉద్యోగం వచ్చింది. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం క్లస్టరులో సుమారు రెండున్నర సంవత్సరాలు పనిచేశాక మదనపల్లెకు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేసే సమయంలోనే నక్సలైట్లతో సంబంధాలు ఏర్పడ్డాయి.
Link to comment
Share on other sites

సోమ కుటుంబానికి సాయం ప్రకటించిన చంద్రబాబు
28-09-2018 18:03:54
 
636737546365681223.jpg
విశాఖ: మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన మాజీ ఎమ్మెల్యే సోమ కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. సివేరి సోమ చిత్రపటానికి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి.. సివేరి సోమ కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించారు. ఏడుగురు కుటుంబ సభ్యులకు రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామన్నారు. అలాగే పార్టీ తరపున ఒక్కొక్కరికి రూ.5లక్షలు సహాయం అందజేస్తామని తెలిపారు. సోమ రెండో కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు. విశాఖలో ఇంటి స్థలంతో పాటు అరకులో నిర్మాణంలో ఉన్న ఇంటికి పట్టా ఇప్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...