Jump to content

Chandranna pelli kanuka


Saichandra

Recommended Posts

  • Replies 158
  • Created
  • Last Reply
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
పెళ్లి కానుక ఈ నెలలోనే

 

29,385 జంటలు అర్హులుగా గుర్తింపు
నియోజకవర్గ కేంద్రాల్లో పంపిణీ
ఈనాడు డిజిటల్‌ - అమరావతి

13ap-main12a_1.jpg

కొత్త జంటలకు పెళ్లి కానుకలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌ 20 నుంచి అక్టోబర్‌ 30 మధ్య వివాహం చేసుకొని ‘చంద్రన్న పెళ్లికానుక’ సాయం పొందని వారికి అతిథుల సమక్షంలో కానుక ఇవ్వాలని నిర్ణయించింది. లబ్ధిదారులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరుతో ప్రత్యేక ఆహ్వానాన్ని పంపనున్నారు. జనవరి చివరి వారంలో కానుకను అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

నిర్దేశిత కాలంలో వివాహం చేసుకొని పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోక లబ్ధిపొందలేని వారికి నవంబర్‌ 1 నుంచి 31వ తేదీ వరకు ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. మండల వెలుగు కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించింది. ఇలా 30 వేల దరఖాస్తులు అందాయి. వీటిని వివిధ శాఖల మండల వసతి గృహ అధికారులతో తనిఖీ చేయించిన ప్రభుత్వం 29,385 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించింది. వీరందరికీ ఒకేసారి సాయం అందించనుంది. ఇందుకు రూ.120 కోట్లు వ్యయం కానుంది. పెళ్లి కానుక పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వేడుకగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. లబ్ధిదారులందరినీ నియోజకవర్గ కేంద్రానికి పిలిచి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా సాయాన్ని అందిస్తారు. కొత్త జంటలకు భోజనాన్ని పెట్టించనున్నారు.

* దివ్యాంగులకు రూ.లక్ష ఎస్టీలు, మైనారిటీలకు రూ.50 వేలు
* ఎస్సీలకు రూ.40 వేలు
* బీసీలకు రూ.35 వేల చొప్పున పెళ్లికానుక అందజేస్తారు
13ap-main12b.jpg
Link to comment
Share on other sites

  • 2 weeks later...
చంద్రన్న పెళ్లి కానుక దరఖాస్తుదారులకు శుభవార్త
03-02-2019 13:23:35
 
636847970137973243.jpg
  • చంద్రన్న పెళ్లి కానుకలకు ఇవ్వాల్సిన పెండింగ్‌ సొమ్ము రూ.8.98 కోట్లు విడుదల
  • 2107 జంటలకు కానుక సొమ్ము
  • బ్యాంకు ఖాతాల్లో జమ
ఏలూరు: చంద్రన్న పెళ్లి కానుకలు వచ్చేశాయ్‌.. ఎన్నాళ్ళ నుంచో కానుకల కోసం ఎదురుచూస్తున్న పేద పెళ్లి జంటలకు ఊరట కలిగింది. జిల్లాలో చంద్రన్న పెళ్లి కానుకలకు సంబంధించిన పెండింగ్‌ సొమ్ములను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో 2107 మంది జంటలకు లబ్ధి చేకూరింది. జిల్లాలో ఇప్పటి వరకు పెళ్లి కానుకల కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారిలో పరిశీలన పూర్తి అయిన వారందరికీ కానుకలు అందినట్టేనని డీఆర్‌డీఏ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతేగాక చంద్రన్న పెళ్లి కానుకలు అందించిన వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ గ్రీటింగ్‌ కార్డులు నేరుగా వారికి పంపిస్తున్నారు.
 
‘‘ మీ వివాహం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ వివాహ జీవితం పరిపూర్ణంగా సఫలం కావాలని, మీరు ఆనందమయ జీవితం పొందాలని కోరుకుంటున్నాను.. మీ నారాచంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి’’.. అంటూ పేర్కొంటూ గ్రీటింగ్‌ కార్డులను పెళ్లి కానుకలు పొందిన వధూవరులకు పంపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా చంద్రన్నపెళ్లి కానుకలు పొందిన లబ్ధిదారులందరికీ ఈ కార్డులు పోస్టు ద్వారా పంపిస్తున్నట్టు డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.
 
కానుకల్లో పెండింగ్‌ లేదు..
చంద్రన్న పెళ్లి కానుకలు పంపిణీ తొలి విడతలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా ప్రస్తుతం పెళ్లి కానుకల కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారందరికీ కానుకలు అందజేసినట్టు డీఆర్‌డీఏ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఐదు రోజులుగా పెళ్లి జంటల నుంచి దరఖాస్తులు వస్తున్నా యని వాటి పరిశీలన కూడా పూర్తయితే వారికి కూడా కానుకలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
 
5200 మందికి పెళ్లి కానుకలు..
జిల్లాలో మొత్తం 5,200 మందికి పెళ్లి కానుకలు అందజేశారు. గతంలోనే 3,093 మందికి చంద్రన్న పెళ్లి కానుకలు అందజేయగా ప్రస్తుతం 2,107 మందికి పెళ్లి కానుకల సొమ్ము విడుదల అయింది. ఇప్పుడు పెళ్లి కానుకలు అందిన లబ్ధిదారులు ఆలస్యంగా రిజిస్రేషన్‌ చేయించుకున్నవారేనని అధి కారులు చెబుతున్నారు. మొత్తం మీద పెళ్లి కానుకలకు సంబంధించి జిల్లాలో రూ.25 కోట్లు వరకు అందజేసినట్టు డీఆర్‌డీఏ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
 
పేదలకు చేయూత.. చంద్రన్న పెళ్లికానుక
ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అంటే లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. అన్ని ధరలు పెరిగిపోవడంతో పెళ్లి చేయాలంటేనే సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారికి పెనుభారంగా తయారైంది. అందుకే వీరందరికీ ఆర్థికంగా పెళ్లిళ్ల సమయంలో చేయూత అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘చంద్రన్న పెళ్లి కానుక’ అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, భవన నిర్మాణ కార్మికులకు పెళ్లి సమయంలో కానుకలు అందించాలని నిర్ణయిం చారు. 2018 సంవత్సరం ఏప్రిల్‌ 20 వతేదీన అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. పెళ్లిళ్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారిలో పెళ్లిళ్లు పూర్తయిన వారికి 48 గంటల్లో కానుకలు అందిస్తున్నామని డీఆర్‌డీఏ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
 
పెళ్లి కానుకల సొమ్మును లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.50 వేలు, వారు కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.75 వేలు, బీసీ, మైనార్టీలకు రూ.35 వేలు, భవన కార్మికులకు రూ.25 వేలు, వికలాంగులకు రూ.75 వేలు, వికలాంగులు ఇతరులను పెళ్ళి చేసుకుంటే వారికి రూ లక్ష, ఇతరులలో కూడా భవన కార్మికులకు రూ.25వేలు పెళ్లి కానుకలుగా అందిస్తారు. అయితే పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న తర్వాత అధికారుల పరిశీలన అనంతరం వివాహ సర్టిఫికేట్‌ అందజేస్తారు. వారందరికీ పెళ్లికానుక సొమ్ములో 20 శాతం సొమ్మును అందజేస్తారు. అనంతరం మిగిలిన సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు.
 
 
పెళ్ళికానుకల సొమ్ము విడుదల: కె.శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ
చంద్రన్న పెళ్ళికానుకల సొమ్ము విడుదల అయింది. 2107 మంది లబ్ధిదారులకు సంబంధించి రూ.8.98 కోట్లు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కానుకల సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. ముఖ్యంగా ఈసారి చంద్రన్న పెళ్ళి కానుకలు అందించిన వారికి సీఎం గ్రీటింగ్‌ కార్డులను పంపిస్తున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ పూర్తయి పరిశీలన చేసిన వారందరికీ కానుకలు అందినట్లే.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలును ప్రత్యేక వాహనాలు ద్వారా ప్రచారం చేస్తున్నారు.

https://pbs.twimg.com/media/D0aFMv7UcAE3Rat.jpg

https://pbs.twimg.com/media/D0aFPO_VsAAXI6d.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...