Jump to content

Chandranna pelli kanuka


Saichandra

Recommended Posts

  • 2 weeks later...
  • Replies 158
  • Created
  • Last Reply
ద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఏపీ ప్రభుత్వ పథకం
27-08-2018 10:36:41
 
636709630018333594.jpg
  • తల్లిదండ్రులకు, వధూవరులకు ఆసరా
  • 700 మందికి అందజేత
  • దరఖాస్తుల పరిష్కారంలో జిల్లా ప్రథమ స్థానం
 
పేద, మధ్యతరగతి ప్రజల మోముల్లో ‘చంద్రన్న పెళ్లికానుక‘ వెలుగు నింపుతోంది. ఆడపిల్లల తల్లిదండ్రులకు, నూతన వధూవరులకు ఇది ఒక గొప్ప వరంలా మారింది. పెళ్లికానుక కింద నగదు అందిస్తుండటం, అవి పెళ్లి ఖర్చులకు, ఇతర వ్యయాలకు వెచ్చిస్తుండటంతో తల్లిదండ్రులపై భారం తగ్గుతోంది. జిల్లాలో ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 2300 జంటలు నమోదు అయ్యారు. 700 మంది లబ్థిపొందారు. మిగిలిన వారివి వివిధ దశల్లో ఉన్నాయి. శ్రావణమాసం భారీగా దరఖాస్తులు నమోదవుతున్నాయి.
 
 
మచిలీపట్నం: ఈ ఏడాది ఏప్రిల్‌లో సీఎం చంద్రబాబు పెళ్లికానుక పథకానికి అంకురార్పణ చేశారు. ఏప్రిల్‌ 18న జీవో ఎంఎస్‌ నెం. 45ను విడుదల చేసి, విధి, విధానాలు రూపొందించారు. అప్పటి వరకు ముస్లింలకు అందిస్తున్న దుల్హన్‌ పథకాన్ని, కులాంతర వివాహ పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుక కిందకు తీసుకొచ్చి, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌, వెబ్‌సైట్‌ రూపొందించారు.
 
దరఖాస్తుల వివరాలు
జిల్లాలో పెళ్లికానుక పథకానికి వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. ముస్లింలు (దుల్హన్‌)- 104 జంటలు, ఎస్‌టీ (గిరిపుత్రిక)- 74 , బీసీలు -595, ఎస్‌సీలు -1055 జంటలు, ఎస్‌సీ కులాంతర- -147, ఎస్‌టీ కులాంతర -03, విభిన్న ప్రతిభావంతులు -44 జంటలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నాయి.
 
ఈ శ్రావణ మాసంలో మరో 220 వరకు దరఖాస్తులు ఈ పెళ్లికానుకకు అందాయి. ఈ నెల 24వ తేదీనే అత్యధికంగా 120 దరఖాస్తులు వచ్చాయి. అన్ని దరఖాస్తుల్ల్లో దాదాపు 700 మందికి, సుమారు రూ. రెండు కోట్ల 20 లక్షల నగదు అందించినట్లు డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.
 
  • బీసీల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన వధువు, బీసీల్లోని అదే సామాజిక వర్గానికి చెందిన వరుడును వివాహమాడితే రూ. 35 వేలు అందజేస్తారు.
  • బీసీల్లోని ఒక సామాజిక వర్గానికి చెందిన వధువు తన సామాజిక వర్గం కాకుండా బీసీల్లోని ఇతర ఉపకులాలకు చెందిన వారిని వివాహామాడితే రూ. 50 వేలు అందిస్తారు.
  • బీసీ వధువు ఇతర (ఓసీ, ఎస్‌సీ, ఎస్టీ, ఇతర మతాలు)వర్గాలకు చెందిన వారిని వివాహామాడితే రూ. 50 వేలు పెళ్లికానుక ఇస్తారు.
  • ఎస్సీ వధువు అదే సామాజిక వర్గానికి చెందిన వారిని వివాహామాడితే రూ.40 వేలు ఇస్తారు..
  • ఎస్సీ తన సామాజిక వర్గం కాకుండా, ఎస్సీల్లోనే ఉపకులాలకు చెందిన వారిని వివాహమాడితే రూ. 75 వేలను అందిస్తారు.
  • ఎస్సీ వర్గానికి చెందిన వధువు ఎస్సీలకు చెందిన వారిని కాకుండా ఇతర బీసీ, ఓసీ, వర్గాలకు చెందిన వారిని వివాహమాడినా రూ. 75 వేలు అందిస్తారు.
  • ఎస్టీ వర్గానికి చెందిన వధువు తన సామాజిక వర్గానికి చెందిన వారిని వివాహమాడితే రూ. 50 వేలను అందజేస్తారు.
  • ఎస్టీ వర్గానికి చెందిన వధువు ఎస్టీల్లోనే ఉప కులాలకు చెందిన వారిని వివాహామాడితే రూ. 75 వేలను ఇస్తారు.
  • ఎస్టీ వర్గానికి చెందిన వధువు ఎస్టీ వర్గాలకు చెందిన వారిని కాకుండా ఎస్‌సీ, బీసీ, ఓసీ వర్గాల వారిని వివాహామాడినా రూ. 75వేలుు అందిస్తారు.
  • మైనార్టీలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు (దుల్హాన్‌) రూ. 50 వేలను ప్రభుత్వం అందిస్తున్నారు.
  • విభిన్న ప్రతిభావంతులు వివాహం చేసుకుంటే రూ. లక్షను పెళ్లికానుక కింద అందిస్తున్నారు.
 
రూ. లక్ష వరకు చంద్రన్న పెళ్లి కానుక
రూ. 35వేల నుంచి రూ. లక్ష వరకు చంద్రన్న పెళ్లికానుక కింద వివిధ వర్గాల వారికి వివిధ రూపాల్లో నిబంధనల ప్రకారం కానుక అందిస్తున్నారు. మొత్తం ఎనిమిది కేటగిరీలుగా కానుకను అందిస్తున్నారు. బీసీలకు, ముస్లింలకు(దుల్హన్‌), ఎస్సీలకు, ఎస్టీ(గిరిపుత్రిక), ఎస్సీ కులాంతర, ఎస్టీ కులాంతర, బీసీ కులాంతర, విభిన్న ప్రతిభావంతులకు ఈ పెళ్లికానుక అందిస్తున్నారు.
 
 
భారీగా దరఖాస్తులు
చంద్రన్న పెళ్లికానుక ప్రజలకు నిజంగా బహుమతి. భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తుల అప్‌లోడ్‌, పరిష్కారంలో జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 52 పెళ్లిళ్లకు మ్యారేజ్‌ సర్టిఫికెట్స్‌ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలాంటే వధువుకు 18 సంవత్సరాలు, వరుడుకు 21 నిండాలి. పెళ్లి జరిగే సమయం, ఏ తారీఖున, ఎక్కడ జరుగుతుందో కచ్చింతా దరఖాస్తులో తెలపాలి. విద్యార్హత పేర్కొనాలి. కనీసం పదో తరగతి పాసవ్వాలి. 2020వరకు విద్యార్హతలతో పనిలేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. పెళ్లికుమార్తె బ్యాంక్‌ ఖాతా ఆధార్‌తో అనుసంధానం అవ్వాలి. వధూవరులిద్దరూ ప్రజాసాధికార సర్వేలో, తెల్లకార్డులో నమోదై ఉండాలి.
- చంద్రశేఖర్‌రాజు, డీఆర్‌డీఏ పీడీ
Link to comment
Share on other sites

  • 2 weeks later...
పెళ్లికానుకకు పెరిగిన విస్తృతి
పొరుగు రాష్ట్రాల వారిని వివాహం చేసుకున్నా వర్తింపు
వధువు ఆర్థికస్థితి ఆధారంగానే
సమీక్షలో సీఎం నిర్ణయం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: చంద్రన్నపెళ్లికానుక పథకాన్ని మరింత విస్తృతం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న వరుడిని పెళ్లి చేసుకుంటేనే పథకం వర్తిస్తుండగా తాజాగా పొరుగు రాష్ట్రాల వారిని వివాహం చేసుకున్న వధువులకు కూడా కానుక అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన వరుడిని పెళ్లి చేసుకున్న వారికి  మాత్రమే ఈ మినహాయింపు ఇవ్వాలని సూచించారు. వరుడు దారిద్య్రరేఖకు ఎగువున ఉన్నా.. వధువు దారిద్య్రరేఖకు దిగువున ఉంటే పథకాన్ని వర్తింప చేయాలని చెప్పారు. దుల్హన్‌, గిరిపుత్రిక కల్యాణం పథకాల పేర్లు ‘దుల్హన్‌-చంద్రన్న పెళ్లికానుక’, ‘గిరిపుత్రిక-చంద్రన్న పెళ్లికానుక’గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం చంద్రన్న పెళ్లికానుకపై సమీక్ష నిర్వహించారు. పథకం అమలులో తలెత్తుతున్న సాంకేతిక ఇబ్బందులపై చర్చించారు. చంద్రన్న పెళ్లికానుక పథకానికి ఇప్పటివరకు 29,479 మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని వీటిలో 26,009 దరఖాస్తుల ధ్రువీకరణ పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. వీటిలో 25,315 దరఖాస్తులు ఆమోదం పొందాయని, 9,670 మందికి కానుక అందించినట్లు తెలిపారు. 9,604 జంటలకు వివాహ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 10వ తేదీలోగా అన్ని సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించి సాయాన్ని అందించాలని ఆధికారులను సీఎం ఆదేశించారు.

ఆంధ్ర వైద్య కళాశాల సెంటినరీ బ్లాక్‌కు రూ.25 కోట్లు
2023లో వందేళ్లు పూర్తిచేసుకోనున్న ఆంధ్ర వైద్య కళాశాలకు సీఎం చంద్రబాబు రూ.25 కోట్లు ప్రకటించారు. కళాశాల ప్రాంగణంలో నిర్మించనున్న ‘సెంటినరీ అకడమిక్‌ బ్లాక్‌’కు వీటిని మ్యాచింగ్‌ గ్రాంటుగా అందించాలని నిర్ణయించారు. మంగళవారం తనను కలిసిన బ్లాక్‌ ఛైర్మన్‌, మాజీ వీసీ రవిరాజ, తదితరులకు సీఎం ఈ హామీ ఇచ్చారు.

Link to comment
Share on other sites

ఇకపై ‘దుల్హన్‌-చంద్రన్న పెళ్లికానుక’
05-09-2018 03:16:51
 
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): వరుడు దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నప్పటికీ, వధువు దారిద్య్రరేఖకు దిగువున ఉంటే ‘చంద్రన్న పెళ్లి కానుక’కు అర్హులుగా గుర్తించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చంద్రన్న పెళ్లికానుకపై మంగళవారం ఉండవల్లిలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. దుల్హన్‌ పథకం పేరును ‘దుల్హన్‌-చంద్రన్న పెళ్లి కానుక’గా, గిరిపుత్రిక కల్యాణం పథకం పేరును ‘గిరిపుత్రిక-చంద్రన్న పెళ్లికానుక’గా మార్పులు చేశారు. చంద్రన్న పెళ్లి కానుకలో తలెత్తే అన్ని సాంకేతిక ఇబ్బందులను ఈ నెల 10వ తేదీలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల వారిని పెళ్లి చేసుకునే వధువుకూ పెళ్లి కానుక వర్తింపచేయాలని సూచించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల వరుడి విషయంలోనే ఈ మినహాయింపు ఇవ్వాలని చెప్పారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 4 weeks later...

నంద్యాలలోని 12వ వార్డు చాంద్ బాడకు చెందిన పెళ్లికూతురు కుర్షీద్ కు చంద్రన్న పెళ్లికానుక కింద చంద్రన్న బాండును వార్డు కౌన్సిలర్ ఎస్.ఎండి హనీఫ్ అందచేశారు.

https://pbs.twimg.com/media/DmOtX4iVsAAg3du.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...