Jump to content

Chandranna pelli kanuka


Saichandra

Recommended Posts

చంద్రన్న పెళ్లికానుక’కు దరఖాస్తు చేసుకోండిలా..!

పేద కుటుంబాల్లో యువతుల వివాహం తల్లిదండ్రులకు భారంగా మారింది. తల్లిదండ్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. పేద కుటుంబాల్లో పెళ్లికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రత్యేకంగా పథకాన్ని రూపొందించింది. 2018, ఫిబ్రవరి 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిద్వారా బీసీలకు రూ.35 వేలు, ఎస్సీలకు రూ.50 వేలు, కాపులకు రూ.30 వేలు, మైనార్టీలకు రూ.35 వేలు అందిస్తుంది.
 
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే...
జిల్లా, మండల సమాఖ్య కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల్లో కాల్‌సెంటర్లను ఏర్పాటు చేశారు. 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్‌ చేసి ఆధార్‌ వివరాలతో పేరు నమోదు చేసుకోవచ్చు. యువతులకు పెళ్లి సంబంధం కుదుర్చుకున్న వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
 
నిబంధనలు ఇలా..
దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్‌ పౌరులై ఉండాలి.
ప్రజాసాధికార సర్వేలో వివరాలు నమోదై ఉండాలి.
వధువు బ్యాంక్‌ అకౌంట్‌కు ఆధార్‌ నంబర్‌కు అనుసంధానం చేసుకోవాలి.
వివాహం నాటికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు ఉండాలి.
తెల్లరేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డులతో పాటు కుల, జనన, నివాస ధ్రువపత్రాలు సమర్పించాలి. దివ్యాంగులకు సదరు ద్రువపత్రం తప్పనిసరి. వధూవరులు ద్రువపత

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • Replies 158
  • Created
  • Last Reply
పెళ్లి కానుకలో భారీ నజరానా
19-04-2018 04:39:43
 
636597095841717280.jpg
అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): చంద్రన్న పెళ్లి కానుకలో భారీ నజరానాలు ప్రకటించారు. దివ్యాంగుల పెళ్లికి ఏకంగా రూ.లక్ష కానుకగా ఇవ్వాలని ఖరారు చేశారు. షెడ్యూల్డ్‌ కులాలు, తెగలవారిని కులాంతర వివాహలు చేసుకునేవారికి రూ.75వేలు, మైనారిటీలకు రూ.50వేలు ఇచ్చేలా పథకాన్ని రూపకల్పన చేశారు. చంద్రన్న పెళ్లికానుక అమలు, పర్యవేక్షణ బాధ్యతలను సాంఘిక సంక్షేమశాఖకు అప్పగించారు.
 
పెళ్లికానుక ఇలా..!
  • నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు, కార్మిక బోర్డులో పేర్లు నమోదుచేసుకున్న కార్మికులు, మైనారిటీల వివాహల కోసమే చంద్రన్నపెళ్లికానుక పథకం అమలు కానుంది.
  • దివ్యాంగుల పెళ్లికి రూ.లక్ష కానుకగా ఇస్తారు. దివ్యాంగురాలిని లేదా దివ్యాంగుడిని ఇతరులు పెళ్లిచేసుకున్నా ప్రోత్సాహకం కింద రూ.లక్ష ఇస్తారు.
  •  ఎస్సీ, ఎస్టీల వారిని ఇతర కులాల వారు వివాహమాడితే రూ.75వేలు ఇస్తారు. ఎస్సీల్లో ఒక ఉపకులం, మరో ఉపకులం, గిరిజన తెగల్లో ఒక తెగవారు మరో తెగ వారిని పెళ్లి చేసుకున్నా కులాంతర వివాహాలుగానే గుర్తిస్తారు. వెనుకబడిన కులాల వారిని ఇతర కులాల వారు పెళ్లిచేసుకుంటే రూ.50వేలు ఇస్తారు.
  •  పెళ్లి ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం భారీగానే పెంచింది. ఎస్సీల వివాహానికి రూ.40వేలు, గిరిజనులకు రూ.50వేలు, బీసీలకు రూ.35వేలు, మైనారిటీలకు రూ.50వేలు అందిస్తారు. భవన నిర్మాణ కార్మికులు, కార్మిక బోర్డులో పేర్లు నమోదు చేసుకున్న వారికి రూ.20వేల చొప్పున కానుకగా ఇస్తారు.
 
వీరికి కూడా లబ్ధి!
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేస్తారు. భర్తతో విడిపోయిన లేదా భర్తను కోల్పోయిన వారికి కూడా ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. అయితే, భార్యను కోల్పోయిన లేదా విడాకులు తీసుకొని కొత్తగా పెళ్లికి సిద్ధమయ్యే మగవారికి మాత్రం ఈ పథకం వర్తించదు. 2020 తర్వాత ఈ పథకం 10వ తరగతి ఉత్తీర్ణులైన వారికే వర్తింపచేసేలా మార్గదర్శకాల్లో పొందుపర్చారు. పెళ్లికి 15 రోజుల ముందుగానే పెళ్లికూతురు, పెళ్లికుమారుడు జంటగా ఆన్‌లైన్‌లో లేదా మీసేవా కేంద్రం నుంచి దరఖాస్తు చేసుకోవాలి. ఆండ్రాయిడ్‌ పోన్ల నుంచి దరఖాస్తు చేసుకునేలా చంద్రన్నపెళ్లికానుక పథ కం పేరిట మొబైల్‌ అప్లికేషన్‌నూ అభివృద్ధి చేశారు. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబరు ఆధారంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇదిలా ఉంటే, ఏప్రిల్‌ 20 నుంచి మే 4 వరకు జరిగే పెళ్లిళ్లకు 15 రోజుల్లోనే దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన ఇబ్బందికరంగా మారడంతో.. ప్రత్యేక వెసులుబాటు కల్పించనున్నారు.
 
ఇవి తప్పనిసరి
దరఖాస్తుదారులు పేదలై ఉండాలి. తెల్లరేషన్‌కార్డు, కుల ధృవీకరణ, పుట్టిన తేదీ, విద్యార్హతల సర్టిఫికెట్లు విధిగా ఉండాలి. దివ్యాంగులైతే ప్రభుత్వం జారీచేసిన సర్టిఫికెట్‌ను సమర్పించాలి. వితంతువులైతే ప్రభు త్వం ఇచ్చే వితంతు పింఛన్‌ పత్రం, లేదా స్వీయ ఽధృవీకరణ పత్రం సమర్పించాలి. భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికులైతే ప్రభుత్వం నుంచి పొందిన గుర్తింపుకార్డులను దరఖాస్తు ఫారంతో జత చేయాలి. మొబైల్‌ నంబరు, ఇతర సదుపాయాలు లేనివారికోసం పేర్ల నమోదు చేసుకోవడానికి ప్రత్యేకంగా 1100 టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారు. కాగా, దరఖాస్తుల పరిష్కారంలో ముందొచ్చిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
 
అర్హతలివే!
చంద్రన్న పెళ్లికానుక మొదటి పెళ్లికే వర్తిస్తుంది(వితంతువులకు మినహా). వధూవరులిద్దరూ ఆంధ్రప్రదేశ్‌ వారై ఉండాలి. పెళ్లికూతురికి 18, పెళ్లి కుమారుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి. పెళ్లికానుకను వధువు బ్యాంకు ఖాతాలోనే జమచేస్తారు. కాబట్టి ఆ ఖాతాకు వధువు మొబైల్‌ నంబరు అనుసంధానించి ఉండాలి. వధూవరులిద్దరి వివరాలు ప్రజాసాధికారిక సర్వేలో నమోదై ఉండాలి.
Link to comment
Share on other sites

26 minutes ago, Siddhugwotham said:

Roja edupu..

Why the scheme was delayed in four years? CBN plan for SC/St votes.

Haha ide kavali, publicity.. Yes tdp wants to win lower castes support.. Entanta aithe. Future lo kuda untadi ani happy feel avtaru.

4 yrs delay ani evadu anukodu, btw was this part of manifesto 2014

 

 

 

 

Link to comment
Share on other sites

Repati Good Morning tweet...Social media lo :)

లోకేష్ బాబు నాన్నగారికి చెప్పండి...మొదటి పెళ్లికి వర్తించే టట్లు చెయ్యటం పెద్ద కుట్ర... వధువుకి 18 అనటం కూడా నా మీద వచ్చిన ఆరోపణలు దృష్టిలో పెట్టుకునే .....ఇది నన్ను అవమానించటమే ........ వధూ వరులిద్దరు ఆంధ్ర వాళ్ళై ఉండాలి అనటం మీద జనసేన “వీరమహిళా”విభాగం పోరాటం చేస్తుంది  ....ఇది (గాలి ) (పెళ్లిళ్లు) చేసుకునే వాళ్ళని అవమానించటమే........లీగల్ నోటీసు పంపిస్తాను

:roflmao: :roflmao::roflmao:

200.gif

DbjxP15XUAUmEM6.jpg

Link to comment
Share on other sites

4 hours ago, AnnaGaru said:

Repati Good Morning tweet...Social media lo :)

లోకేష్ బాబు నాన్నగారికి చెప్పండి...మొదటి పెళ్లికి వర్తించే టట్లు చెయ్యటం పెద్ద కుట్ర... వధువుకి 18 అనటం కూడా నా మీద వచ్చిన ఆరోపణలు దృష్టిలో పెట్టుకునే .....ఇది నన్ను అవమానించటమే ........ వధూ వరులిద్దరు ఆంధ్ర వాళ్ళై ఉండాలి అనటం మీద జనసేన “వీరమహిళా”విభాగం పోరాటం చేస్తుంది  ....ఇది (గాలి ) (పెళ్లిళ్లు) చేసుకునే వాళ్ళని అవమానించటమే........లీగల్ నోటీసు పంపిస్తాను

:roflmao: :roflmao::roflmao:

200.gif

DbjxP15XUAUmEM6.jpg

:rofl::rofl:

Link to comment
Share on other sites

విస్తృత స్థాయిలో ‘చంద్రన్న పెళ్లికానుక’ అమలు.

క్షేత్రస్థాయిలో పథకాన్ని పర్యవేక్షించే కళ్యాణమిత్రలకు జోరుగా శిక్షణ సాగుతోంది.

20శాతం వివాహానికి ముందే విడుదల చేస్తారు. మిగిలిన నగదును పెళ్లిరోజున వధువు ఖాతాలో జమచేస్తారు.

 

Register at http://www.chpk.ap.gov.in/CPkDashboard/index.html or #ChandrannaPelliKanuka app or call 1100

Link to comment
Share on other sites

Guest Urban Legend

పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్ట మొదటి చంద్రన్న పెళ్లి కానుక ఉండ్రాజవరం మండలం, వెలగదుర్రు గ్రామానికి చెందిన విప్పర్తి వీర్రాజు ,శిరీష దంపతులు శాసనసభ్యుడు బూరుగుపల్లి శేషారావు గారి చేతులా మీదుగా రూ.40,000 నగదు మరియు పట్టు వస్త్రాలు అందుకున్నారు

Dbs1a3aV4AAFKJd.jpg

Link to comment
Share on other sites

On 4/26/2018 at 9:00 AM, Urban Legend said:

పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్ట మొదటి చంద్రన్న పెళ్లి కానుక ఉండ్రాజవరం మండలం, వెలగదుర్రు గ్రామానికి చెందిన విప్పర్తి వీర్రాజు ,శిరీష దంపతులు శాసనసభ్యుడు బూరుగుపల్లి శేషారావు గారి చేతులా మీదుగా రూ.40,000 నగదు మరియు పట్టు వస్త్రాలు అందుకున్నారు

Dbs1a3aV4AAFKJd.jpg

 

3 hours ago, Yaswanth526 said:

https://pbs.twimg.com/media/DbybOqUVwAAey_R.jpg

veella perlemo hinduvulu gaa...pelli padhthi emo christian laagaa..:sleep:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...