Jump to content

చంద్రబాబు టార్గెట్ గా, ఢిల్లీ నుంచి "ఆపరేషన్ గరుడా"....


Recommended Posts

చంద్రబాబు టార్గెట్ గా, ఢిల్లీ నుంచి "ఆపరేషన్ గరుడా"....

   
cbn-17032018.jpg
share.png

ఢిల్లీని ఎదురిస్తున్న చంద్రబాబు పై, ఢిల్లీ నాయకులు "ఆపరేషన్ గరుడా" మొదలు పెట్టింది... ఇప్పటికే మొదలై, మొన్నటి దాక స్లో గా ఉన్న ఆపరేషన్, చంద్రబాబు ఎదురు తిరగిన దగ్గర నుంచి, ఢిల్లీ పెద్దలు మరింత దూకుడుగా వెళ్తున్నారు... ఇన్నాళ్ళు ఈ దేశంలో తమ జైత్ర యాత్రకు, తాము బలమైన నేతలం అనే ఇమేజ్ చంద్రబాబు నాశనం చేసాడు అని, అందుకే మేము చంద్రబాబుని నాశనం చేస్తాం అని, ఢిల్లీ నాయకులు నిర్ణయించారు... అయితే, జూన్ నెలలో ఈ ఆపరేషన్ పై దూకూడుగా వెళ్లి, ఈ ఆపరేషన్ ముగించాలని నిర్ణయించారు.. అందులో భాగంగా, రెండు నెలలు నుంచి దీని పై సన్నాహాలు చేసారు... కొన్ని రోజుల క్రిందట, ఈ ఆపరేషన్ మొదలు పెట్టారు కూడా.. అయితే, అనూహ్యంగా చంద్రబాబు ఎదురు తిరగటంతో, ఈ ఆపరేషన్ పై ఇక దూకుడుగా వెళ్ళాలని, ఏప్రిల్ చివరి వారంలో కాని, మే మొదటి వారంలో కాని, ఈ ఆపరేషన్ పై దూకుడుగా వెళ్లి, పూర్తి చెయ్యాలని డిసైడ్ అయ్యారు... ఇందులో దారుణమైనది ఏంటి అంటే, మన వేలుతో మనల్నే పొడవటం.... మన రాష్ట్ర నాయకులతో, మన రాష్ట్రం నాశనం చెయ్యటం...

 

cbn 17032018 2

అసలు ఏంటి ఈ ఆపరేషన్ గరుడ ? దీని మెయిన్ టార్గెట్ చంద్రబాబు పతనం... తద్వారా, రాష్ట్ర నాశనం... తమిళనాడు తరహాలో రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థుతులు నెలకొల్పటం... దీని కోసం ఇప్పటికే కేసులు భయంతో జగన్ ని లొంగదీసుకున్నారు... జగన్ పై, ప్రజల్లో నమ్మకం అంతగా ఉండదు అని తెలుసుకుని, పవన్ ని, ఐటి రైడ్స్ లో దొరికిన కొన్ని ఇబ్బందికర మెటీరియల్ తో లొంగదీసుకున్నారు.. పవన్ తో గత రెండు నెలల నుంచి, అత్యంత పెద్ద రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వ్యక్తి, రాయబారం జరిపి, బీజేపీతో డీల్ సెట్ చేసారని ఇప్పటికే మెయిన్ స్ట్రీం మీడియాలో వార్తలు కూడా వచ్చాయి... మరో పక్క, రాయలసీమ డిక్లరేషన్ అంటూ ఇప్పటికే ఉసుగొలిపారు.. సోషల్ ఇంజనీరింగ్ అంటూ ఇప్పటికే, పెద్ద ఎత్తున నెగటివ్ ప్రచారం మొదలు పెట్టారు... ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ ప్రకటన, రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ గా రామ్ మాధవ్... వీటన్నటితో పాటు, అటు జగన్ కేసులు నీరుగార్చటం... ఇప్పటికే ఇది మొదలైన సంగతి తెలిసిందే... ఈ విధంగా అన్ని వైపుల నుంచి, సెట్ చేశారు...

cbn 17032018 3

దీని కోసం మొదటిగా చేసేది, చంద్రబాబు పై కాకుండా, లోకేష్ పై ఎదో ఒక కేసులో ఇరికించటం.... చంద్రబాబు పై కేసు పెడితే, దేశంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలిసి, లోకేష్ ని టార్గెట్ చేసుకున్నారు... అందులో భాగంగానే, పవన్ పదే పదే లోకేష్ పై రెండు రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్నారు... ఎప్పుడు లేనిది, నేషనల్ మీడియాకు ఎక్కి, ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఎక్కువైంది అని, లోకేష్ అతి పెద్ద కరప్షన్ లీడర్ అంటూ చెప్పటం... ముందుగా ఇలా సెట్ చేస్తున్నారు... ఇలా చేసి, రాష్ట్రంలో అనిశ్చితి తీసుకువచ్చి, రాష్ట్ర ఇమేజ్ దెబ్బతియ్యటం.... ఆపరేషన్ గరుడ నెక్స్ట్ స్టెప్, ఏప్రిల్ చివరి వారంలో, మే మొదటి వారంలో పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహారదీక్ష... తద్వారా అల్లర్లు సృష్టించడం... విజయవాడ రంగా హత్య జరిగిన సమయంలో జరిగిన అల్లర్ల తరహాలో అల్లర్లు సృష్టించడం... తద్వారా చంద్రబాబు పాలన వైఫల్యం వలనే ఇలా జరిగింది అని ప్రచారం చెయ్యడం... మరో పక్క జగన్ చేత విమర్శలు చేపిస్తూ, ప్రభుత్వ వైఫల్యం పేరుతో వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామాలు...

జగన్ పార్టీ రాజీనామాలు, పవన్ దీక్షకు స్పందనగా రాష్ట్రానికి మేలు చేసినట్టు బీజేపీ ఎన్నికల ముందు ప్రకటనలు చేస్తుంది... ప్రత్యెక హోదా అంటూ, వివిధ విభజన హామీల పై ప్రకటనలు చేస్తారు... దీంతో ఆపరేషన్ గరుడు సంపూర్ణం అవుతుంది... ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో పవన్,వైకాపా కూటమి ఏర్పాటు చేసి, ఎన్నికలకు వెళ్లి, దక్షణాది రాష్ట్రాల్లో ఉనికిని చాటుకొనే దిశగా బీజేపీ ఆపరేషన్ గరుడా ప్రధానంగా సాగనుంది... ఈ క్రమంలో, మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అనే దాని పై, ఢిల్లీ కుట్రలను ఎలా తిప్పి కొడతారో, చంద్రబాబు లాంటి నాయకుడుని ఎలా కాపాడుకుంటారో అనే దాని పై, ఈ ఆపరేషన్ రెజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది...

Link to post
Share on other sites
  • Replies 163
  • Created
  • Last Reply

Top Posters In This Topic

8 minutes ago, Nandamuri Rulz said:

Social Media lo baaga thippaali ee matter... :typing:

Agreed ee weekend baga active ga vundali mana fans andaru. need to spread this a lot in the social media. Awareness create cheyyali baga. Guys let's please do it. Tell me a time if you want I can do tweeting and retweeting so that we can trend this

Link to post
Share on other sites
2 minutes ago, Hello26 said:

Agreed ee weekend baga active ga vundali mana fans andaru. need to spread this a lot in the social media. Awareness create cheyyali baga. Guys let's please do it. Tell me a time if you want I can do tweeting and retweeting so that we can trend this

Dont worry brother.. Twitter lo TDP Sena chaala active ga vuntundi.. ithadi ayipothundi opposition ki... Anduke sagam kaalinattundi ee modi & co ki bemmi.finish.gif

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.


×
×
  • Create New...