Jump to content

40 ఏళ్ల నారాజకీయం

Ramesh39

Recommended Posts

40 ఏళ్ల నారాజకీయం
27-02-2018 05:02:33
 
636553045520279833.jpg
  • తిరుపతి నుంచి అమరావతి దాకా
  • అలుపెరుగని ప్రయాణం ఆయన రాజకీయం
  • ఆటుపోట్లకు వెరవని మొండిఘటం
  • వ్యూహ చతురతలో ఎదురులేని చాణక్యం
  • పాలనాదక్షుడిగా అపార అనుభవం
  • ఆ నమ్మకంతోనే పట్టంకట్టిన ఏపీ ప్రజానీకం
  • అంచనాలను బాబు అందుకున్నారా?
  • ఆంధ్రప్రదేశ్‌ ఆశలను ఏ మేరకు నెరవేర్చారు?
  • కేంద్రంలో మిత్రపక్షంగా సాధించింది ఎంత?
  • తేడాలొస్తే తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమా?
 
ఫార్టీ ఇయర్స్‌ పాలిటిక్స్‌ చంద్రబాబుతో ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ ముఖాముఖి ముచ్చట్లు
Link to comment
Share on other sites

మాటకు ‘ముందు చూపు’ 
27-02-2018 04:33:28
 
636553028068578410.jpg
1994 ఎన్నికలకు కొంతకాలం ముందు! తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉంది. రాజకీయంగా వేధిస్తున్న అధికారపక్షం! ఇలాంటి సమయంలో చంద్రబాబు తిరుపతిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అధికారులు తమపై కక్ష సాధిస్తున్నారని, పరిస్థితి దారుణంగా ఉందని సహచర నేతలు చెప్పారు. దీంతో, ‘‘అధికారుల ఆగడాలు ఇలాగే ఉంటే ఊరుకోం. మేం అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తాం’’ అని చంద్రబాబు హెచ్చరించారు. కానీ... ఆ వెంటనే ఆయన ఆ భావోద్వేగాల నుంచి బయటపడి అసలు విషయం ఆలోచించారు. ‘చిన్న సవరణ’ అంటూ అప్పటికప్పుడు స్పందించారు. ‘‘ఉద్యోగుల్ని నిందించడం సరికాదు. ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు చెప్పినట్లుగా అధికారులు వింటారు. వారిదేం తప్పులేదు. ఆ అధికారుల్ని మాపైకి ఉసిగొల్పుతున్న నాయకుల పని మేం అధికారంలోకి వచ్చాక చూస్తాం!’’ అన్నారు.
 
 చిన్నవారినీ పెద్దగానే చూస్తారు!images8754asf.jpg
‘ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయొద్దు’... ఇది చంద్రబాబు అనుసరించే రాజకీయ సూత్రం. ఆయన పోటీచేసే కుప్పం రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతం. అక్కడ పెద్దగా బలమైన రాజకీయ నాయకులు కూడా లేరు. అయినప్పటికీ... తనపై పోటీచేసే ప్రత్యర్థులను చంద్రబాబు ఎప్పుడూ చిన్నగా చూడరు. పైగా వారినీ పార్టీలోకి ఆహ్వానించేస్తారు. మొదట్లో తనపై పోటీచేసే దొరస్వామి నాయుడిని తెలుగుదేశంలో చేర్చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో తనపై పోటీచేసిన వైసీపీ అభ్యర్థి సుబ్రమణ్యంరెడ్డి కూడా ఇటీవల టీడీపీలో చేరారు. దీంతో విపక్ష పార్టీలు కుప్పంలో ఎప్పటికప్పుడు కొత్త అభ్యర్థులను వెతుక్కుంటుంటాయి. రాష్ట్రస్థాయి వరకు చంద్రబాబు అనుసరించే వ్యూహం ఇదే!
 
 థింక్‌ బిగ్‌...
‘థింక్‌ గ్లోబల్లీ... యాక్ట్‌ లోకల్లీ’ అనేది ఆంగ్లంలో ఒక నానుడి. పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని... అందుబాటులో ఉన్న వనరులతో వాటిని సాకారం చేసుకోవాలన్నది దీని అంతఃసూత్రం! చంద్రబాబు దీనినే పాటిస్తారు. ఒకప్పుడు విజన్‌ 2020అంటే అంతా నవ్వారు. రాష్ట్ర బడ్జెట్‌ లక్షకోట్లు అవుతుందని విజన్‌ డాక్యుమెంట్‌లో చెప్పినప్పుడు... అసెంబ్లీలో విపక్షనేతలు హేళనగా మాట్లాడారు. కానీ కొన్నేళ్లకే బడ్జెట్‌ లక్షకోట్లు దాటింది.
 
 ‘హైటెక్‌ సిటీ’పైనా...
అప్పట్లో హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతం నిర్జన ప్రదేశం. కొండలు, గుట్టలతో నిండిన చోటు! ‘ఇక్కడ హైటెక్‌ సిటీ నిర్మిస్తాం. ఈ ప్రాంతం దశ తిరుగుతుంది’ అని చంద్రబాబు చెప్పినప్పుడు ‘ఇదంతా అయ్యేదా... పొయ్యేదా’ అని అందరూ అనుకున్నారు. కానీ... చివరికి ఆయన చెప్పిందే జరిగింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ అనే జంట నగరాలకు ‘సైబరాబాద్‌’ అనే కొత్త నగరం తోడయింది. ‘‘గత అనుభవాలను బట్టి చూస్తే... పోలవరం, అమరావతిలోనూ ఆయన చెప్పింది చేసి చూపించడం ఖాయం!’’ అని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు అన్నారు.
 
 మొబైల్‌ విప్లవం...asdlkfjasdfsdf5.jpg
దేశంలో టెలికాం విప్లవం వస్తుందని... ఆ రంగంలోకి అడుగుపెట్టాలని 1990లలోనే రిలయన్స్‌ అధినేత ధీరూబాయ్‌ అంబానీకి చంద్రబాబు సూచించారు. ‘‘చంద్రబాబు సలహా రిలయన్స్‌ను, దేశ సమాచార వ్యవస్థను మలుపు తిప్పింది’’ అని ముఖేశ్‌ అంబానీ ఇటీవల స్వయంగా చెప్పారు.
Link to comment
Share on other sites

దేశం ఇచ్చిన నేత 
27-02-2018 03:58:33

40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఘనతలు
సుదీర్ఘ కాలం సీఎం, విపక్ష నేతగా చరిత్ర
నవ్యాంధ్ర తొలి సీఎంగా కొత్త చరిత
ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చెరగని ముద్ర
తెలుగు నాట ఎగరేసిన ఐటీ బావుటా
విద్యా సంస్థలతో చదువులు-కొలువులు
సంస్కరణల పథంలో నడిచే సాహసం
వ్యతిరేకత వస్తుందని తెలిసినా వెరవని వైనం
ప్రజలను ఒప్పించే కఠిన నిర్ణయాలు
‘దేశానికి ఏ విదేశీ రాజకీయ ప్రముఖుడు వచ్చినా... ఢిల్లీ తర్వాత నేరుగా హైదరాబాద్‌ వచ్చి చంద్రబాబును కలుస్తారు’ అని ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయనను కలవాలనే తన భారత పర్యటనలో హైదరాబాద్‌ను చేర్చానని బిల్‌ గేట్స్‌ బహిరంగంగా చెప్పారు.
 
వాజపేయి ప్రభుత్వ హయాంలో జరిగిన అణు పరీక్షలపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ప్రపంచ దేశాలు భారతదేశంపై అనేక ఆంక్షలు విధించాయి. ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి దేశానికి ఇవ్వాల్సిన రుణాలు, గ్రాంట్లు కూడా నిలిపివేశాయి. కానీ, చంద్రబాబుపై సానుకూలతతో కొంతకాలం తర్వాత ఆ సంస్థలు దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు ఆ ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తూ రుణాలు విడుదల చేశాయి. ఆ తర్వాత మరికొంత కాలానికి మొత్తం దేశంపై ఆ ఆంక్షలు ఎత్తివేశారు.
 
హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ పెడుతున్నామన్న మైక్రోసాఫ్ట్‌ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలా అంతర్జాతీయ సంస్థలు ఈ నగరం ఎక్కడ ఉందని అప్పట్లో మ్యాపుల్లో వెతికాయి. మైక్రోసాఫ్ట్‌ తర్వాత ఒరాకిల్‌, సన్‌ మైక్రో సిస్టమ్స్‌ వంటి ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయి. ‘సైబరాబాద్‌’కు ప్రాణం పోశాయి.
 
రోడ్లు వెడల్పు చేయడానికి ఇళ్లు కూల్చితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమోనని అందరూ భయపడే రోజులవి. మంచి పరిహారం ఇస్తే ఏ ఇబ్బందీ రాదంటూ చంద్రబాబు అడుగు ముందుకు వేశారు. హైదరాబాద్‌ నగరం సహా అనేక నగరాలు, పట్టణాల్లో రోడ్ల విస్తరణ చేపట్టి వాటి రూపురేఖలు మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ కూడా అప్పుడే జరిగింది.
 
పనిలో రాక్షసుడు!
లక్ష్యాల విషయంలో అందరికీ ‘అందని వాడు’
రాజకీయ ప్రత్యర్థులకు ఆయన ‘కొరకరాని కొయ్య’!
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ‘బిరుదు’లు ఇవి! ఆయన వయసు 66 ఏళ్లు! అందులో అచ్చంగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం! 1978 ఫిబ్రవరి 27న చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలుపును నిర్ధారిస్తూ అధికారిక ఫలితం వెలువడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా... కాలం గడిచేకొద్దీ ఆయన ఖాతాలో చెరిగిపోని ఘనతలు నమోదవుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన ముఖ్యమంత్రి! పదేళ్లు ప్రతిపక్ష నేతగా పని చేసిన ఏకైక నాయకుడు! నవ్యాంధ్రకు తొలి సీఎం! ఒక ప్రాంతీయ పార్టీని 23ఏళ్లుగా విజయవంతంగా నడిపిస్తున్న నాయకుడు! మూస రాజకీయ ఆలోచనలకు భిన్నం! పాతకాలపు రాజకీయాలకూ విభిన్నం. అందుకే ఏపీ అనే బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారారు!
 
సంస్కరణలకు సై
ఆర్థిక సంస్కరణల అవసరాన్ని, అనివార్యత గురించి బహిరంగంగా మాట్లాడటానికి జంకుతున్న రోజుల్లో... చంద్రబాబు ఆ నిశ్శబ్దాన్ని ఛేదించారు. వాటి గురించి పదేపదే మాట్లాడి ప్రజల్లో సానుకూలత పెంచడానికి ప్రయత్నించారు. దేశంలో సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహరావు. అయితే.. సంస్కరణల గురించి బయట మాట్లాడితే ప్రజల్లో చెడ్డ అయ్యే పరిస్థితి ఉందని ఆయనే ఒక సందర్భంలో చంద్రబాబుతో చెప్పారు. అయినా చంద్రబాబు ఈ సంప్రదాయ ఆలోచనలకు భిన్నమైన దారిలో నడిచారు. ఐటీ కొలువులకు సమాంతరంగా రాష్ట్రంలో సాంకేతిక విద్యావకాశాలు విస్తృతంగా పెరగడానికి కూడా కృషి చేశారు. దిగువ మధ్య తరగతి కుటుంబాల వారు కూడా ఇంజనీరింగ్‌ చదవగలిగే అవకాశం ఏర్పడింది. తెలుగువారు నలు దిక్కులా ఐటీ బావుటా ఎగరేయడానికి అప్పుడే పునాది పడింది. ఇప్పుడు నవ్యాంధ్ర తొలి సీఎంగా చంద్రబాబు నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని అందుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, సెన్సర్‌ టెక్నాలజీస్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి నూతన సాంకేతిక ఆవిష్కరణలతో ఈ నాలుగో విప్లవం వస్తోంది.
 
ఐటీ... మేటి!
1997లో బిల్‌గేట్స్‌ ఢిల్లీకి వచ్చారు. అప్పటికి ఆయనను కలిసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. ‘‘ఒక రాజకీయ నాయకుడికి నాతో ఏం పని’ అని బిల్‌గేట్స్‌ నాడు ఆశ్చర్యపోయారు. ఆయనతో తొలి భేటీలోనే హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ పెట్టడానికి చంద్రబాబు ఒప్పించారు. అనేకసార్లు ఆయన వెంటపడి అది సాకారమయ్యేలా చేశారు. ఆ సంస్థ అమెరికా బయట మొట్టమొదట హైదరాబాద్‌లోనే తన డెవల్‌పమెంట్‌ సెంటర్‌ నెలకొల్పింది. ఆ వెనుకనే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రావడంతో అతికొద్ది వ్యవధిలోనే హైదరాబాద్‌ ఐటీ శిఖరంగా మారిపోయింది. పెద్ద సంఖ్యలో తెలుగు యువతకు ఐటీ కొలువులు వచ్చాయి. అనేక మంది తెలుగువారు అమెరికా చేరి అక్కడ కూడా ఐటీ రంగంలో నిలదొక్కుకొన్నారు. వ్యవసాయాధారిత రాష్ట్రంలో, ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప మరేమీ దొరకని రోజుల్లో ఒక తరం కొత్త దారిలో వెళ్లడానికి చంద్రబాబు ముందు చూపు ఉపయోగపడింది. - అమరావతి - ఆంధ్రజ్యోతి
 
Link to comment
Share on other sites

అరవైలో ఇరవై.. 
27-02-2018 03:41:45

 మైమరిపించే మాట లేదు
 సమ్మోహన రూపం కాదు
 పని ఒక్కటే తారక మంత్రం
 వ్యూహ రచన, ఆచరణే బాటలు
‘‘అమెరికా పర్యటనలో సమావేశాలు అయ్యేసరికి రాత్రి పన్నెండు దాటిపోయేది. హోటల్‌కు తిరిగొచ్చాక ఆయన మర్నాడు చేయాల్సిన పనేమిటో మాతో చర్చించాకే విశ్రాంతి తీసుకునేవారు. మళ్లీ మర్నాడు సిద్ధమై ఉండేవారు. ఆయన నిజంగా పని రాక్షసుడు’’ ..ఇటీవల బాబుతో పర్యటనలో పాల్గొన్న ఒక ఐఏఎస్‌ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇవి!
 
ఎన్టీఆర్‌లాగా సమ్మోహన రూపం కాదు! వాక్పటిమ లేదు. నాలుగు దశాబ్దాల్లో ఎన్నో ఆటుపోట్లు! అయినా... చంద్రబాబు ముందుకు సాగుతూనే ఉన్నారు. ప్రణాళికాబద్ధమైన కృషి, వ్యూహాత్మక అడుగులు, ఘనమైన లక్ష్యాలు, వాటిని సాకారం చేసే దిశగా సాగే చర్యలు! ఇవే... ఆయన విజయానికి కారణాలు! ఆరు పదులు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ రోజుకు 18 గంటలు ఏకబిగిన పని చేస్తారు. కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన యువకులు కూడా ఆయన మాదిరిగా పనిచేయడం తమ వల్ల కాదని చేతులెత్తేస్తుంటారు. అర్ధరాత్రి 12 గంటల వరకు సమావేశాలు నిర్వహించినా మొహంలో అలసట, గొంతులో నీరసం కనిపించనీయరు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు సతీమణి భువనేశ్వరి రాత్రి తొమ్మిది గంటలకు ఆయనకు ఫోన్‌ చేసి సమయం గుర్తు చేసి త్వరగా ముగించాలని ఒత్తిడి చేసేవారు. ఆమె ఒత్తిడితో ఆ సమయానికి పని ముగించడానికి ప్రయత్నించేవారు. ఆయన విజయవాడ వచ్చాక ఒక్కరే ఉంటున్నారు. దీంతో రాత్రి 11, 12 గంటల వరకూ సమావేశాలు, ఫోన్లు నడిపిస్తున్నారు. ఎన్టీఆర్‌ సాహచర్యంలో చంద్రబాబుకు తెల్లవారుజామున లేవడం అలవాటైంది. కానీ, రాత్రి పొద్దుపోయేవరకూ పనిలో గడపడం ఆయన లక్షణం. అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా ఆయన దినచర్యలో మార్పు లేదు. ఆయన అరవైలో ఉన్న ఇరవై ఏళ్ల యువకుడని టీడీపీ నేతలు సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు.

Link to comment
Share on other sites

మాటకు ‘ముందు చూపు’ 
27-02-2018 04:33:28

1994 ఎన్నికలకు కొంతకాలం ముందు! తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉంది. రాజకీయంగా వేధిస్తున్న అధికారపక్షం! ఇలాంటి సమయంలో చంద్రబాబు తిరుపతిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అధికారులు తమపై కక్ష సాధిస్తున్నారని, పరిస్థితి దారుణంగా ఉందని సహచర నేతలు చెప్పారు. దీంతో, ‘‘అధికారుల ఆగడాలు ఇలాగే ఉంటే ఊరుకోం. మేం అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తాం’’ అని చంద్రబాబు హెచ్చరించారు. కానీ... ఆ వెంటనే ఆయన ఆ భావోద్వేగాల నుంచి బయటపడి అసలు విషయం ఆలోచించారు. ‘చిన్న సవరణ’ అంటూ అప్పటికప్పుడు స్పందించారు. ‘‘ఉద్యోగుల్ని నిందించడం సరికాదు. ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు చెప్పినట్లుగా అధికారులు వింటారు. వారిదేం తప్పులేదు. ఆ అధికారుల్ని మాపైకి ఉసిగొల్పుతున్న నాయకుల పని మేం అధికారంలోకి వచ్చాక చూస్తాం!’’ అన్నారు.
 
 చిన్నవారినీ పెద్దగానే చూస్తారు!
‘ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయొద్దు’... ఇది చంద్రబాబు అనుసరించే రాజకీయ సూత్రం. ఆయన పోటీచేసే కుప్పం రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతం. అక్కడ పెద్దగా బలమైన రాజకీయ నాయకులు కూడా లేరు. అయినప్పటికీ... తనపై పోటీచేసే ప్రత్యర్థులను చంద్రబాబు ఎప్పుడూ చిన్నగా చూడరు. పైగా వారినీ పార్టీలోకి ఆహ్వానించేస్తారు. మొదట్లో తనపై పోటీచేసే దొరస్వామి నాయుడిని తెలుగుదేశంలో చేర్చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో తనపై పోటీచేసిన వైసీపీ అభ్యర్థి సుబ్రమణ్యంరెడ్డి కూడా ఇటీవల టీడీపీలో చేరారు. దీంతో విపక్ష పార్టీలు కుప్పంలో ఎప్పటికప్పుడు కొత్త అభ్యర్థులను వెతుక్కుంటుంటాయి. రాష్ట్రస్థాయి వరకు చంద్రబాబు అనుసరించే వ్యూహం ఇదే!
 
 థింక్‌ బిగ్‌...
‘థింక్‌ గ్లోబల్లీ... యాక్ట్‌ లోకల్లీ’ అనేది ఆంగ్లంలో ఒక నానుడి. పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని... అందుబాటులో ఉన్న వనరులతో వాటిని సాకారం చేసుకోవాలన్నది దీని అంతఃసూత్రం! చంద్రబాబు దీనినే పాటిస్తారు. ఒకప్పుడు విజన్‌ 2020అంటే అంతా నవ్వారు. రాష్ట్ర బడ్జెట్‌ లక్షకోట్లు అవుతుందని విజన్‌ డాక్యుమెంట్‌లో చెప్పినప్పుడు... అసెంబ్లీలో విపక్షనేతలు హేళనగా మాట్లాడారు. కానీ కొన్నేళ్లకే బడ్జెట్‌ లక్షకోట్లు దాటింది.
 
 ‘హైటెక్‌ సిటీ’పైనా...
అప్పట్లో హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతం నిర్జన ప్రదేశం. కొండలు, గుట్టలతో నిండిన చోటు! ‘ఇక్కడ హైటెక్‌ సిటీ నిర్మిస్తాం. ఈ ప్రాంతం దశ తిరుగుతుంది’ అని చంద్రబాబు చెప్పినప్పుడు ‘ఇదంతా అయ్యేదా... పొయ్యేదా’ అని అందరూ అనుకున్నారు. కానీ... చివరికి ఆయన చెప్పిందే జరిగింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ అనే జంట నగరాలకు ‘సైబరాబాద్‌’ అనే కొత్త నగరం తోడయింది. ‘‘గత అనుభవాలను బట్టి చూస్తే... పోలవరం, అమరావతిలోనూ ఆయన చెప్పింది చేసి చూపించడం ఖాయం!’’ అని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు అన్నారు.
 
 మొబైల్‌ విప్లవం...
దేశంలో టెలికాం విప్లవం వస్తుందని... ఆ రంగంలోకి అడుగుపెట్టాలని 1990లలోనే రిలయన్స్‌ అధినేత ధీరూబాయ్‌ అంబానీకి చంద్రబాబు సూచించారు. ‘‘చంద్రబాబు సలహా రిలయన్స్‌ను, దేశ సమాచార వ్యవస్థను మలుపు తిప్పింది’’ అని ముఖేశ్‌ అంబానీ ఇటీవల స్వయంగా చెప్పారు.

Link to comment
Share on other sites

Vastly underappreciated man, always; Deserves more recognition & accolades from people than offered so far....

(Annaay Ntr was gifted & passionate person in many fields, may be similar to majestic Krishnadevaraaya, where as Cbn is cut differently in temperament & conduct, one of the most even keeled & gritty leader in AP modern politics, perhaps in current Indian context also...If you want to take some sport & pleasure identifying with a historical figure of telugus to tag, go ahead, said few times before - the stoic Brahma Naidu)

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...