Jump to content

Ramayapatnam Port


sonykongara

Recommended Posts

పోర్టుపైనా కపట నాటకం!
28-09-2018 03:36:43
 
636737026049427370.jpg
 • రామాయపట్నానికి గండి కొట్టేందుకే లేఖ..
 • దుగరాజపట్నం ఊసే ఎత్తని గడ్కరీ
 • రామాయపట్నానికీ కేంద్రం అడ్డుపుల్ల!
 • అంతా సిద్ధమయ్యాక అడ్డుకునే యత్నం
 • వాడరేవులో మేజర్‌పోర్టు నిర్మాణానికి ప్రతిపాదన
 • ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి గడ్కరీ లేఖ
 • రాష్ట్రంతో కలసి జాయింట్‌ వెంచర్‌ పెడతారట!
 • అక్కడ ముంగిస జాతికి ముప్పని..
 • అటవీ పర్యావరణ శాఖ అభ్యంతరం
 • అలాంటి చోట పోర్టుకు అనుమతి వస్తుందా?
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
విభజన హామీలు నెరవేర్చకుండా.. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. నిధులు విడుదల చేయకుండా.. మొండిచేయి చూపుతున్న మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు మరో కపట నాటకానికి తెరలేపింది. నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నంలో పోర్టు నిర్మించాలని విభజన చట్టంలో ఉన్నా.. నాలుగేళ్లుగా దాని ఊసే ఎత్తలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రప్రభుత్వం దీనిపై ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదు. అక్కడ కుదరకపోతే ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లా రామాయపట్నంలో ఏర్పాటుచేయాలని మొత్తుకున్నా వినిపించుకోలేదు. దీంతో రాష్ట్రప్రభుత్వమే సొంతగా అక్కడ పోర్టు అభివృద్ధికి సమాయత్తమైంది. నిర్మాణ వ్యయం మొత్తం తానే భరిస్తానంటూ కేంద్రం ఆమోదానికి లేఖ కూడా రాసింది.
 
ఈ పరిస్థితుల్లో ఇదే జిల్లా చీరాల వద్ద వాడరేవులో కేంద్ర రాష్ట్రాల జాయింట్‌ వెంచర్‌లో మేజర్‌ పోర్టు నిర్మిద్దామని కేంద్ర నౌకాయాన, జలవనరుల శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ నెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సొంత ఖర్చుతో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అనుమతి కోసం లేఖ రాస్తే.. కేంద్ర నౌకాయాన శాఖ దానిపై స్పందించకుండా.. రామాయపట్నానికీ అడ్డుపడే రీతిలో సీఎంకు లేఖ రాయడాన్ని ఆక్షేపిస్తున్నాయి. 2015కి ముందు ముఖ్యమంత్రి కేంద్రంతో జరిపిన చర్చలు.. అదే ఏడాది అక్టోబరు 13న కేంద్ర నౌకాయాన కార్యదర్శి వాడరేవుపై రాష్ట్రానికి రాసిన లేఖను గడ్కరీ తన లేఖలో ఉటంకించారు. మూడేళ్ల కింద సీఎంతో జరిగిన చర్చలూ.. ఆ తర్వాత నౌకాయాన శాఖ రాసిన లేఖలను మాత్రమే ఉదహరించిన గడ్కరీ..
 
దుగరాజపట్నంలో పోర్టు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు.. నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరిగిందో ప్రస్తావించనేలేదు. పైగా వాడరేవు వద్ద నౌకాశ్రయం నిర్మాణంపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఎప్పటి నుంచో అభ్యంతరాలు చెబుతోంది. అక్కడ అధికంగా తిరుగాడే ముంగిస జాతి మనుగడకు ప్రమాదమని వాన్‌పిక్‌ ప్రాజెక్టు తలపెట్టినప్పుడే పేర్కొంది. ఇప్పుడు అదే ప్రాంతంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మేజర్‌ పోర్టును నిర్మిద్దామని ప్రతిపాదించడం చూస్తుంటే.. పరుగు పందెంలో ముందున్న క్రీడాకారుడి కాళ్ల మధ్య కర్ర పెట్టడంలాంటిదేనని నిపుణులు అంటున్నారు. కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్రం సమ్మతిస్తే.. వాడరేవుకు అటవీ పర్యావరణ శాఖ అనుమతులు వస్తాయో రావో తెలియని పరిస్థితి. పైగా.
 
రామాయపట్నం నిర్మాణం కార్యాచరణను అటకెక్కించాల్సి వస్తుంది. రాజకీయంగా టీడీపీని ఇరకాటంలో పడవేసేందుకే కేంద్రం వాడరేవు ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందన్న అనుమానం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పోర్టును నిర్మించాలని కేంద్రం నిజంగా భావిస్తే.. విభజన చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం పోర్టును గడ్కరీ తన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదన్న ప్రశ్న వస్తోంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వేజోన్‌, కాకినాడ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుపైనా దాటేస్తున్న కేంద్రం.. వాడరేవు విషయంలో మూడేళ్ల కిందటి ఫైలును ఎందుకు బయటకు తెచ్చిందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గత ఆగస్టు 11న పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సీఎం చంద్రబాబు సమక్షంలో గడ్కరీ ఇచ్చిన హామీలు ఇంతవరకు ఎందుకు అమలు కాలేదని నిలదీస్తున్నారు.
Link to comment
Share on other sites

 • 4 weeks later...
 • 2 weeks later...
ఏపీ నౌకాయాన అభివృద్ధి కార్పొరేషన్‌ 
ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 
రామాయపట్నం పోర్టు అభివృద్ధి 
మౌలిక వసతుల కల్పనలో కీలక పాత్ర పోషించనున్న సంస్థ

ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నౌకాయాన మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన ప్రయత్నాలు చేయడంతో పాటు నీలి ఆర్థికాభివృద్ధికి అవసరమైన నౌకాయాన వసతులు, ఇతర అనుబంధ సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఈ బోర్డు పనిచేస్తుంది. కాకినాడ పోర్టు కార్యాలయం నిధులను దీనికి బదలాయించేందుకు కాకినాడ పోర్టు సంచాలకుడు ఆమోదం తెలిపారు. పదేళ్ల పాటు ఎలాంటి వడ్డీ లేని సాధారణ రుణంగా దీన్ని పరిగణిస్తారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ కంపెనీగా ఉంటుంది. రూ.కోటి వాటా ధనంగా ఏర్పాటవుతుంది. రూ.10 చొప్పున 10 లక్షల షేర్లుగా విభజిస్తారు. దశలవారీగా ఈ పెట్టుబడిని రూ.100 కోట్లకు పెంచుకోవాల్సి ఉంటుంది. ఇంధన మౌలిక సౌకర్యాల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కంపెనీ ఛైర్మన్‌గా ఉంటారు. పోర్టుల సంచాలకుడు ఎండీగా, సీఈవోగా వ్యవహరిస్తారు.

మౌలిక ఉద్దేశాలు ప్రధానంగా.. 
* రామాయపట్నం పోర్టుతో పాటు రాష్ట్రంలో ఇతర పోర్టుల అభివృద్ధిలో కీలక భూమిక పోషించడం. 
* షిప్‌యార్డుల నిర్మాణం, నిర్వహణ వ్యవహారాల్లో దృష్టి సారిస్తుంది. 
* పోర్టులను రహదారులు, రైల్వేలతో అనుసంధానించే ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రత్యేక వాహక నౌకగా వ్యవహరించడం. 
* చిన్న పోర్టుల అభివృద్ధికి పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టులు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒప్పందాలు కుదుర్చుకొని అమలు చేయడం. 
* కాకినాడ పోర్టులోని లీజేతర ఆస్తుల అభివృద్ధికి బాధ్యత వహించడం. 
* మేరిటైన్‌ కన్సల్టెన్సీ సర్వీసులు కూడా ఈ బోర్డు అందించాల్సి ఉంటుంది. ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు తయారు చేయడం, సాధ్యాసాధ్యాల నివేదికలు రూపొందించడంతో పాటు పర్యాటకంలో ప్రధాన పాత్ర పోషించడం. 
* నౌకాయాన కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోని ప్రాజెక్టులను ప్రోత్సహించడం.

Link to comment
Share on other sites

 • 4 weeks later...
‘రామాయపట్నం’పైనా ముందుకే!
31-12-2018 03:16:03
 
 • ఓడరేవుకూ 9నే శంకుస్థాపన
 • సీఎం చంద్రబాబు నిర్ణయం
 • కేంద్రంపై పోరులో మరో ముందడుగు
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టం హామీల అమలులో కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై ఒత్తిడి పెంచుతూ వచ్చిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు సొంతగానే రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారు. ఈ క్రమంలో మరో కీలక ముందడుగు వేశారు. ప్రకాశం జిల్లాలో నిర్మించాలని భావిస్తున్న రామాయపట్నం ఓడరేవుకు కేంద్రం సహకరించకపోయినా.. స్వశక్తితోనే ఈ పోర్టును నిర్మించాలని నిర్ణయించి జనవరి 9న శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. ఇప్పటికే, పోలవరం సాగు నీటి ప్రాజెక్టు అంచనాలను ఆమోదించకుండా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కొర్రీలు వేస్తుంటే.. రాష్ట్రం సొంత నిధులతోనే లక్ష్యాన్ని అధిగమించేందుకు సన్నద్ధమైంది. కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయంలోనూ కేం ద్రం ఇదే వైఖరి ప్రదర్శించింది. దీంతో ఇటీవల ఈ స్టీల్‌ ప్లాం ట్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
 
రామాయపట్నం పోర్టు లాభనష్టాలపై మెసర్స్‌ రైట్స్‌ సంస్థ అధ్యయనం చేసి లాభదాయకమేనని నివేదిక ఇచ్చింది. దీనిని కేంద్రానికి పంపింది. నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి పలు దఫాలు రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. రామాయపట్నం పోర్టు డీపీఆర్‌ తయారీని ప్రభుత్వం కాకినాడ పోర్టు డైరెక్టరేట్‌కు అప్పగించింది. అదేసమయంలో పోర్టుకు అవసరమైన వనరులు, నిఽధులు సమకూర్చే బాధ్యత ను ఏపీ మారిటైమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఎంఐడీసీఎల్‌)కు అప్పగించారు. ఏపీఎంఐడీసీఎల్‌ నిర్వహణ కోసం రూ.100 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
Link to comment
Share on other sites

రామాయపట్నానికి కాకినాడ ఆదాయం

 

పదేళ్లపాటు వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయం
  రూ.4,500 కోట్లతో రామాయపట్నం రేవు
  నేడు ముఖ్యమంత్రి శంకుస్థాపన

8ap-main10a_1.jpg

ఈనాడు, అమరావతి: ప్రకాశం జిల్లా రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి కాకినాడ పోర్టు గ్రూపు పరిధిలో వచ్చే ఆదాయాన్ని పదేళ్లపాటు వెచ్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాకినాడ పరిధిలోని మూడు పోర్టులనుంచి ప్రస్తుతం ఏటా దాదాపు రూ.150 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ మొత్తాలను బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోడానికి పూచీకత్తుగా, ఇతర అవసరాలకు వినియోగించనున్నారు. 2020లో పనులు ప్రారంభించి 2022లో కార్యకలాపాలు చేపట్టే పోర్టు నిర్మాణానికి రూ.4,240 కోట్లకుపైగా అవసరమవుతుందని అంచనా. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోర్టులను కాకినాడ, మచిలీపట్నం పేరుతో రెండు గ్రూపులుగా విభజించారు. కాకినాడ గ్రూపు పరిధిలోని కాకినాడ, గంగవరం, రవ్వ ఓడరేవుల నుంచి వచ్చే ఆదాయాన్ని రామాయపట్నం పోర్టు నిర్మాణ బాధ్యతలు చూసే ‘ఏపీ మారిటైం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ’కు జమ చేస్తారు. 3,092 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే పోర్టు 2020-21 నాటికి 20.26 మిలియన్‌ మె.టన్నుల సరకు రవాణా సామర్థ్యం కలిగి ఉంటుంది. 2040-41 నాటికి 138.54 మి.మెట్రిక్‌ టన్నులకు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఓడరేవు నుంచి గ్రానైట్‌ బ్లాకులు, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఎరువులు, ఎడిబుల్‌ ఆయిల్‌, సిమెంట్‌ ఎగుమతులకు అవకాశం ఉంది.

మొదటి విడతలో ఎనిమిది బెర్త్‌లు
పోర్టులో మొదటి విడత ఎనిమిది బెర్త్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇది 4.9 కిలోమీటర్ల అత్యంత పొడవైన బ్యాక్‌వాటర్‌ కలిగిన పోర్టు అని రాష్ట్ర ఓడరేవుల సంచాలకులు కోయ ప్రవీణ్‌ మంగళవారం విజయవాడలో విలేకరులకు తెలిపారు. తమిళనాడులోని ట్యూటికోరిన్‌ పోర్టు ఇప్పటివరకు 3.8 కిలోమీటర్ల బ్యాక్‌వాటర్‌ కలిగి ఉందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిర్మించే పోర్టుల మధ్య వ్యత్యాసం ఉండదని, రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో చేపట్టేది మైనర్‌, కేంద్ర ప్రభుత్వం నిర్మించేది మేజర్‌ పోర్టుగా మాత్రమే పిలుస్తారని సంచాలకులు వివరించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి నెలాఖరులో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని, భావనపాడు పోర్టు నిర్వాసితుల కోసం ఈనెల 11న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

8ap-main10b.jpg

Link to comment
Share on other sites

ప్రపంచంలోనే అతిపెద్ద బ్రేక్ వాటర్ పోర్టుగా రామాయపట్నం
09-01-2019 12:11:44
 
636826327049353857.jpg
విజయవాడ: వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ప్రపంచంలోనే అతి పెద్ద బ్రేక్ వాటర్ పోర్టుకు ఏపీ ప్రభుత్వం పునాదిరాయి వేస్తోంది. ఎన్నోమలుపులు తిరిగిన రామాయపట్నం పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. పోర్టుతో పాటు పలు అనుబంధ సంస్థలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.
 
విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హ‌మీల కేంద్రం నెర‌వేర్చక‌పోయినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క హామీని అమలు చేసేందుకు అన్ని అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తోంది. ఇప్పటికే క‌డ‌ప‌లో ఉక్కు క‌ర్మాగారానికి శంఖుస్ధాప‌న చేసిన చంద్రబాబు విభ‌జ‌న చ‌ట్టంలో మ‌రో ప్రధాన హ‌ామీ దుగరాజ‌ప‌ట్నం పోర్టు విష‌యంలో కేంద్రం విముఖంగా ఉండ‌డంతో రాష్ట్రప్రభుత్వమే వెనుకబ‌డిన ప్రకాశం జిల్లాల్లో రామాయంప‌ట్నం పోర్టుకు శ్రీకారం చుడుతోంది. సుమారు 5వేల కోట్లరూపాయ‌లు పెట్టుబ‌డితో ప్రపంచంలోనే అతి పెద్ద బ్రేక్ వాట‌ర్ పోర్టుగా రామాయపట్నం పోర్టు నిల‌వ‌నుంద‌ని అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యమంత్రి చేతులు మీదుగా భూమి పూజ జ‌ర‌గనున్న ఈ పోర్టు ఈశాన్య ఆసియాదేశాలు, ఆగ్నేయ ఆసియా దేశాల వ‌ర్తకానికి స‌రికొత్త మ‌జిలీ కానుంది.
 
రామాయప‌ట్నం పోర్టు శంకుస్ధాప‌న‌తో ప‌రిస‌ర ప్రాంతాల అభివృద్దితో పాటు ప్రజ‌ల‌కు పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. రామాయ‌ప‌ట్నం పోర్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ మారిటైం ఇన్ప్రాస్ట్రక్చర్ డెవ‌లెప్ మెంట్ కార్పోరేష‌న్ లిమిటెడ్ ద్వారా నిధులు స‌మీక‌రించాల‌ని నిర్ణయించిన ప్రభుత్వం దీనికోసం కాకినాడ రీజియ‌న్ పోర్టులు, మ‌చిలిప‌ట్నం రీజియ‌న్ పోర్టులు నుండే వ‌చ్చే ఆదాయాన్ని రామ‌ాయప‌ట్నం పోర్టు నిర్మాణానికి పదేళ్ళపాటు ఉప‌యోగించాల‌ని నిర్ణయించామ‌ని పోర్టు అధికారులు తెలిపారు.
 
ఈపోర్టు ప్రపంచంలోనే అతి పెద్ద బ్రేక్ వాట‌ర్ పోర్టుగా పేర్కోన్నవారు వివిధ ప‌రిశ్రమ‌లు సైతం పోర్టుతో పాటు అక్కడ నెల‌కోల్పేంద‌కు ముందుకు వ‌చ్చాయంటున్నారు.. టెండ‌ర్లు పిలిచి 2023 నాటికి పోర్టు వినియోగంలోకి తీసుకువ‌స్తామ‌న్నారు. ఈ పోర్టు కోసం 3500 ఎక‌రాలు భూమిని 400 కోట్ల రూపాయ‌ల‌తో భూసేక‌ర‌ణ చేస్తామ‌న్న అధికారులు అటు మ‌చిలీప‌ట్నం పోర్టుకు ఈ నెలాఖ‌రుకు శంకుస్ధాప‌న చేస్తామ‌న్నారు. అటు బ్రేక్ వాటర్, నావిగేష‌న్ ఛాన‌ల్ నిర్మాణానికి 2500 కోట్లు రూపాయ‌లు ఖ‌ర్చు అవుతాయ‌ని అంచ‌నా వేస్తున్న అధికారులు ఈపోర్టులో రెండు బెర్తులు ఏసియా పేప‌ర్ మిల్లుకు, రెండు బెర్తులు జిందాల్ సంస్ధకు , ఒక బెర్తు రాంకో సంస్ధకు క్యాపిట‌ల్ బెర్తులుగా కేటాయించ‌నున్నారు. మిగిలిన మూడు బెర్తుల‌ను క‌మ‌ర్షియ‌ల్ బెర్త్‌లుగా అభివృద్ది చేయ‌నున్నామ‌ని ప్రకటించారు. మొత్తం 13 మిలియ‌న్ ట‌న్నుల కెపాసిటీతో ఈ పోర్టును ప‌నిచేయించ‌డానికి ప్రణాళిక‌ల ర‌చిస్తున్నామ‌న్నారు.
 
రామాయప‌ట్నంలో పోర్టు నిర్మాణానికి దొన‌కొండ ఇండ‌స్ట్రీయ‌ల్ క్లస్టర్‌ తో పాటు నేష‌న‌ల్ ఇండ‌స్ట్రీయ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మ్యానిఫెక్చరింగ్ జోన్ ల‌కు అతి స‌మీపంలో ఉంటుంద‌ని చెపుతున్నారు. అటు పోర్టుకు అనుబంధంగా ఆసియా పేప‌ర్ మిల్స్ 20 వేల‌మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌డంతో పాటు మెట్ట ప్రాంతాల్లో పండించే స‌రుగుడు ,జామాయిల్ రైతుల‌కు ఊర‌ట నిచ్చే మంచి ధ‌ర ల‌భిస్తుందంటున్నారు. అటు పోర్టుకు అనుబంధంగా స్టీల్ ప్లాంట్ తో పాటు, సిమెంటు ప‌రిశ్రమ కూడా రానుంద‌ని చెపుతున్నారు. మొత్తం ఎనిమిది బెర్తుల‌తో నిర్మించే ఈపోర్టు సామ‌ర్ధ్యం చాలా ఎక్కువ‌గా ఉండ‌నుంద‌న్నారు. కేంద్రం ప‌రిధిలో ఉండే పోర్టుల‌ను మేజ‌ర్ పోర్టులు అని, రాష్ట్రం ప‌రిధిలో ఉండే పోర్టుల‌ను మైన‌ర్ పోర్టులంటార‌ని అయితే కృష్ణప‌ట్నం లాంటి మైనర్ పోర్టు కోల్‌క‌త్తా, చెన్నై పోర్టుల‌ను మించి ప‌నితీరును క‌న‌బ‌రుస్తుంద‌న్న అధికారులు ఇదే అవ‌కాశం రామాయ‌ప‌ట్నంకు వ‌స్తుంద‌న్నారు. ఈ ప్రాజెక్టకు పెట్టే ఖ‌ర్చు 12 సంవ‌త్సరాల్లోనే బ్రేక్ ఈవెన్‌కు రానుంద‌న్న అధికారులు ...సిఆర్ జెడ్ కు 6నెల‌ల్లో అనుమ‌తులు వ‌స్తాయ‌ని, ప‌ర్యావ‌ర‌ణ అనుమతుల‌కు సంవత్సరం పాటు స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.
 
కేంద్రం నేర‌వేర్చని విభజన హామీలను ఛాలెంజ్ గా తీస‌ుకుంటున్న రాష్ట్రప్రభుత్వం ఒక్కోటి టేక‌ప్ చేసి నిర్మాణాల‌కు స‌మాయ‌త్తం అవుతుండం ప‌ట్ల స్ధానిక ప్రజ‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. తమకు మేలు జరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు.
Link to comment
Share on other sites

పారిశ్రామిక క్రాంతి!
 

రామాయపట్నం పోర్టుకు ‘జిందా’బాద్‌
రూ. 4 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ పైపులైన్లు
‌ఎరువుల తయారీ కంపెనీ చూపులూ ఇటే

pks-top1a_37.jpg

సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించాడు... మకర సంక్రమణం మొదలైంది. ఉత్తరాయణ పుణ్యకాలమని భావించే ఈ సమయంలోనే జిల్లా ప్రగతికీ శుభసూచకాలు కనిపిస్తున్నాయి. దీనికి రామాయపట్నం పోర్టు కేంద్ర బిందువు కానుంది. ఉలవపాడు మండలంలోని రామాయపట్నం తీరం పరిసరాల్లో ఓడరేవు నిర్మాణానికి ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. పోర్టు ఆధారంగా పలు పరిశ్రమలు తరలి రానున్నాయన్న సంకేతాలు శుభపరిణామమనే చెప్పాలి. ఈ పండుగ వేళ... జిల్లాకు పారిశ్రామిక క్రాంతి ప్రసరించాలని ఆకాంక్షిద్దాం.

ఈనాడు డిజిటల్‌- ఒంగోలు

జిల్లాకు ఊపిరి పోసే పోర్టు కల నెరవేరింది. మూడేళ్లలో కళ్ల ముందు సాకారం కానుంది. మరి పోర్టు అంటే నిర్మాణంతో సరిపెడతారా... సరకు రాకపోకలు తప్పనిసరి. అది అప్పుడు చూసుకుందామనుకుంటే జరగదు. అందుకే పోర్టుకు సమీపంలోనే ప్రఖ్యాత కంపెనీలూ కొలువుదీరనున్నాయి. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. బెర్తులు ఖరారు చేసుకుంటున్నాయి. రామాయపట్నం పోర్టుకు సమీపంలో పలు ప్రముఖ కంపెనీలు తమ యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన ఏపీపీ (ఆసియన్‌ పల్ప్‌, పేపర్‌) పరిశ్రమ ఇప్పటికే ముందుకు వచ్చింది. ఎంవోయూ, శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి చేశారు. మరో రెండేళ్లలోగా కార్యకలాపాలు మొదలుకాన్నాయి. అంతర్జాతీయంగా ఖ్యాతి ఉన్న ఉక్కు పరిశ్రమ జిందాల్‌ కూడా పోర్టుకు సమీపంలోనే యూనిట్‌ నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. ప్రస్తుతానికి మాత్రం పోర్టులోని రెండు బెర్తులు ఖరారు చేసుకునేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఎరువుల కంపెనీ ‘అకార్డ్‌’ ప్రతినిధులు కూడా పోర్టుకు సమీపంలో భూములు పరిశీలించి వెళ్లారు. ఎరువుల తయారీ యూనిట్‌ నెలకొల్పి ఎగుమతి చేసుకునేందుకు ఒక బెర్తు కోసం ఆరా తీశారు. వెయ్యి ఎకరాల భూమి అవసరమని, ప్రాథమికంగా రూ. 1200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు అధికారవర్గాలు పేర్కొన్నాయి. రామ్‌కో సిమెంటు కంపెనీ యూనిట్‌ను కూడా ఇక్కడే నెలకొల్పే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇలా అంతర్జాతీయంగా పేరొందిన ఏపీపీ, జిందాల్‌, రామ్‌కో, అకార్డ్‌ వంటి కంపెనీల లావాదేవీలకు పోర్టు పరిసరాలు వేదిక కానున్నాయి.

బళ్లారి నుంచి జిందాల్‌ పైపులైన్‌
జిందాల్‌ ఉక్కు పరిశ్రమకు ముడి సరకు కర్ణాటకలోని బళ్లారి సమీపంలో లభిస్తుంది. ఈ సరకును విదేశాలకు పంపాల్సి ఉంటుంది. జిందాల్‌ కంపెనీ ఇప్పుడు రామాయపట్నంలో ఓ ప్లాంటు నెలకొల్పే యోచనలో ఉంది. ఆ కంపెనీ ప్రతినిధులు నెల రోజుల కిందట భూములు పరిశీలించి వెళ్లారు. ప్లాంటు కంటే ముందుగా పోర్టు ద్వారా తమ సరకును ఎగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బళ్లారి నుంచి రామాయపట్నం పోర్టు వరకు అంతర్గత పైపులైను నిర్మించేలా ప్రణాళికలు వేశారు. అందుకు రూ. 4 వేల కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించారు. పైపులైను ద్వారా ఉక్కును పోర్టుకు తరలించి, ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ నెలాఖరున ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రతిపాదన తుది దశలో ఉందని, దాదాపు ఖరారైనట్లేనని ఓ అధికారి వెల్లడించారు.

2022 నాటికి కొలిక్కి...
రామాయపట్నం పోర్టును 2022 నాటికి కార్యకలాపాల్లోకి వచ్చేలా ప్రణాళికలు ఖరారయ్యాయి. ఈ ఏడాది జులై నాటికి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక సిద్ధమవుతుంది. తద్వారా నిర్మాణాన్ని ఆరంభిస్తారు. మొదటి దశలో రూ. 4240 కోట్ల వ్యయం అంచనాలతో 8 బెర్తులను ఏర్పాటు చేయనున్నారు. ఏడాదికి 40 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉంటుంది. ఈ నెల 9న జరిగిన జన్మభూమి సభలో పోర్టుల డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాటల్లోనూ ఇదే చెప్పారు. 2022 నాటికి పోర్టుని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. అప్పటికి కనీసం అయిదు ప్రతిష్ఠాత్మక యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇవన్నీ ప్రస్తుతానికి ప్రతిపాదనలు, ప్రణాళికల దశలో ఉన్నాయి. జిందాల్‌ పరిశ్రమ విషయమై ఈ నెలాఖరుకు స్పష్టత వస్తుందని ఏపీఐఐసీ జోనల్‌ అధికారి నరసింహారావు తెలిపారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  • No registered users viewing this page.
×
×
 • Create New...