Jump to content

NTR Anna canteens


sonykongara

Recommended Posts

  • Replies 559
  • Created
  • Last Reply
పల్లెల్లోనూ అన్న క్యాంటీన్లు 

 

నియోజకవర్గానికి ఒకటి 
అవసరమైన చోట రెండు 
151 క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు 
కొత్త ఏడాదిలో ప్రారంభించే అవకాశం 
ఈనాడు - అమరావతి

4ap-main4a_2.jpg

గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. అన్ని గ్రామీణ నియోజకవర్గ కేంద్రాలతో పాటు కొన్ని చోట్ల రెండేసి చొప్పున మొత్తం 151 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నెలాఖరులోగా కసరత్తు పూర్తి చేసి కొత్త ఏడాదిలో వీటిని ప్రారంభించనున్నారు. పేదలకు రూ.5కే భోజనం అందించే అన్న క్యాంటీన్లనుజులై 12న పట్టణ ప్రాంతాల్లో ప్రారంభించారు. 110 పట్టణాల్లో ఇప్పటివరకు 124 క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వీటిని రోజూ లక్షకుపైగా పేదలు ఉపయోగించుకుంటున్నారు. మధ్యాహ్నం వేళల్లో అత్యధికంగా 60 వేలకుపైగా  హాజరవుతున్నారు. పట్టణ ప్రాంత పేదల నుంచి చక్కని ఆదరణ లభించడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. గత నెల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం పచ్చజెండా ఊపడంతో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ తదుపరి చర్యలు తీసుకుంటోంది. పట్టణాల్లో ఇప్పటికే పనులు ప్రారంభించిన క్యాంటీన్లను  వచ్చే నెలలో ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. పనుల్లో జాప్యంతో ప్రతిపాదిత 215 అన్న క్యాంటీన్లను  పూర్తిగా ప్రారంభించని పరిస్థితి. కాంట్రాక్టు పొందిన నిర్మాణ సంస్థ మళ్లీ వేరొకరికి సబ్‌ లీజులకు ఇవ్వడంతో చాలాచోట్ల పనుల్లో పురోగతి లోపిస్తోంది. స్థలాల కొరత, ఇతరత్రా కారణాలతో ఇంకొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులే మొదలు కాలేదు. వీటిని అధిగమించేలా చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్లు కదిలారు.

4ap-main4b.jpg

4ap-main4c.jpg

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...