sonykongara Posted December 6, 2018 Author Posted December 6, 2018 కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం06-12-2018 10:19:40 అమరావతి: ఆటో మొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక అడుగు వేసింది. 'రాబోయే తరం పర్యావరణ రవాణా'పై చంద్రబాబు సమక్షంలో కియా మోటార్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం ఉదయం సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కార్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్లకు ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగించవచ్చు. ఇందుకోసం విజయవాడలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత ఏపీలోని ఆకర్షణీయ పట్టణాలు, నగరాలలో పర్యావరణహితమైన ఆధునిక రవాణా వ్యవస్థకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. Tags : Andhrapradesh, Kia Motors, Amaravati
sonykongara Posted December 6, 2018 Author Posted December 6, 2018 కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం విజయవాడ: ఏపీలో ఆటోమొబైల్ రంగంలో కీలక అడుగు పడింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయేతరం పర్యావరణ రవాణాపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్, ఎలక్ట్రిక్ కార్లను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సీఎం ప్రారంభించిన నిరో హైబ్రిడ్, నిరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ కార్లను కియా మోటార్స్ రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చింది. ఈ కార్లు ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే వీలుంటుంది. త్వరలో విజయవాడలో వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను కియా మోటార్స్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఆ కంపెనీ అనంతపురంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
sonykongara Posted December 6, 2018 Author Posted December 6, 2018 పర్యావరణ హిత రవాణాలో ముందడుగు ప్రభుత్వం, కియా మోటార్స్ మధ్య నేడు కీలక ఒప్పందం ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, కియా మోటార్స్ మధ్య గురువారం కీలక ఒప్పందం జరగనుంది. ‘భవిష్యత్తు తరం పర్యావరణ రవాణా’కు సంబంధించి సచివాలయం కేంద్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగే ఈ ఒప్పందం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వానికి కియా మోటార్స్ నిర్వాహకులు బహుమతిగా ఇవ్వనున్న నిరో హైబ్రిడ్, నిరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ వెహికల్ కార్లు ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నాయి. గురువారం ముఖ్యమంత్రి వీటిని ప్రారంభిస్తారు. సచివాలయంతోపాటు విజయవాడలోనూ కియా ఆధ్వర్యంలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. కియా మోటార్స్ నిర్వాహకులు అనంతపురం యూనిట్‌లో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఆకర్షణీయ పట్టణాల్లో పర్యావరణ హిత రవాణా వ్యవస్థ ఏర్పాటుకు సహకరించనున్నారని అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
sonykongara Posted December 6, 2018 Author Posted December 6, 2018 కియాతో అనంత రూపురేఖలు మారిపోతాయి: చంద్రబాబు06-12-2018 12:22:34 అమరావతి: కియా మోటార్ కంపెనీ రాకతో అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోతాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం సచివాలయంలో ఎలక్ట్రిక్ కార్లను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్ట్రికల్ కారులో తొలిసారి ప్రయాణించానని...సౌకర్యవంతంగా ఉందని తెలిపారు. కియా తొలి కారు జనవరిలో బయటకు వస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఇక్కడ తయారైన కార్లలో 90 శాతం దేశీయ అవసరాలకు సరిపోతాయని, 10 శాతం ఎగుమతులకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వివిధ పరిశ్రమల రాకతో ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారిందన్నారు. రాబోయే కాలంలో యూనిట్ సౌర విద్యుత్ రూపాయిన్నరకే లభ్యంకానుందని, ఆ దిశగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. త్వరలో 7,300 ఎలక్ట్రిక్ వాహనాలను వ్యర్ధ సేకరణలో వినియోగిస్తామన్నారు. పర్యావరణ హితమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇది కొత్త యుగం వైపు ప్రయాణానికి తొలి అడుగుగా చంద్రబాబు పేర్కొన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కియా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగపడుతోందన్నారు. ఏపీకి పెట్టుబడులు పెద్దఎత్తున వస్తున్నాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో ఎలక్ట్రిక్ కార్లను సీఎం ప్రారంభించగా నిరో హైబ్రిడ్, నిరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ కార్లను ప్రభుత్వానికి కియా మోటార్స్ బహుమతిగా అందజేసింది. ఈ కార్లకు ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు.
sonykongara Posted December 6, 2018 Author Posted December 6, 2018 Another big step with Eco-Cars.... "Future Mobility Partnership" with AP Government. Kia Niro EV runs 455km with single charge!!!!
BalayyaTarak Posted December 6, 2018 Posted December 6, 2018 What a wonderful step towards future mobility.
sonykongara Posted December 28, 2018 Author Posted December 28, 2018 విద్యుత్ వాహనాలు కొంటే ఎంతో మేలు రిజిస్ట్రేషన్ రుసుము, జీవితకాల, త్రైమాసిక పన్నుల మినహాయింపు 2023 జూన్ 7 లోపు కొనుగోలు చేసే వాటికి వర్తింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఈనాడు - అమరావతి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ (ఎలక్ట్రిక్) వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త. మీరు కొనుగోలు చేసే వాహనాలకు రిజిస్ట్రేషన్ రుసుము, జీవితకాల, త్రైమాసిక పన్నులను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే.. 2023 జూన్ 7 లోపు వాహనాలను కొన్న వారికి మా త్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. బ్యాటరీలు, ఆల్ట్రా కెపాసిటర్లు, ఫ్యాయల్ సెల్స్‌తో తిరిగే ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే ఈ మినహాయింపు లభించనుంది. రాష్ట్రంలో కాలుష్య రహిత రవాణా వ్యవస్థను తీర్చిదిద్దే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ మొబిలిటీ విధానం 2018-23ను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ రుసుములు, అన్ని రకాల పన్నులు మినహాయిస్తామని అందులో పేర్కొన్న సంగతి విదితమే. దానికి అనుగుణంగా పన్నులకు సంబంధించి ఈ ఏడాది నవంబరు 1న జారీ చేసిన ఉత్తర్వులకు రవాణా శాఖ గురువారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జారీ చేసిన ఉత్తర్వుల్లో 2024 డిసెంబరు వరకూ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొనగా..గురువారం జారీ చేసిన సవరణ ఉత్తర్వుల్లో 2023 జూన్ 7 వరకే మినహాయింపు అని స్పష్టం చేశారు. ఆ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విధానం ముగియనున్నందున ఆ మేరకు సవరణ తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ రుసుముల మినహాయింపునకు సంబంధించి ఏపీ మోటారు వాహనాల నియమాలను సవరిస్తూ నవంబరు 1న ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేశారు.అభ్యంతరాలను స్వీకరించి గురువారం తుది నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ గురువారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. తాజా సవరణల ప్రకారం చేకూరే లబ్ధి ఎంతంటే.. * ఎవరైనా కారు కొంటే ప్రస్తుతం దాని విలువపై 12 శాతం జీవితకాల పన్ను విధిస్తున్నారు. ఆ లెక్కన రూ.10 లక్షల విలువైన ఎలక్ట్రిక్ కారు కొంటే జీవిత కాల పన్ను మినహాయింపుగా రూ.1.20 లక్షలు ఆదా అవుతుంది. * ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం 9 శాతం జీవితకాల పన్ను ఉంది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలు కొనేవారికి ఆ మేరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. * ఇవి కాకుండా రిజిస్ట్రేషన్ రుసుములు కూడా లేనందున ఆ మేరకు కొనుగోలుదారులకు లబ్ధి చేకూరుతుంది. * బస్సులకు త్రైమాసిక పన్ను రూపంలో సంవత్సరానికి దాదాపు రూ.6 లక్షల మేర చెల్లిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులకు ఈ మొత్తం మినహాయింపు లభించనుంది.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now