Jump to content

Fake News : Sakshi writes CM announced Nobel for..

onlytruth

Recommended Posts

చంద్రబాబు ‘నోబెల్ ’పై సాక్షి గోబెల్స్ కథనం..!

విజ‌య‌వాడ‌లో క్రీడాకారుడు శ్రీ‌కాంత్ కిడాంబిని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌న్మానించారు. ఈ వార్త‌ను సాక్షి దిన ప‌త్రిక ఏకంగా బేన‌ర్ ఐట‌మ్ చేసి అచ్చేసింది! ఇంత‌కీ.. ఏ ప్రాతిప‌దిక ఆ వార్త‌ టాప్ ప్రియారిటీ న్యూస్ అయిందంటే, ‘ఒలిపింక్స్ లో గెలిస్తే నోబెల్ ఇస్తా’ అని చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన‌ట్టు ఆ క‌థ‌నంలో రాశారు. నిజానికి, శ్రీ‌కాంత్ ను స‌న్మానించిన సంద‌ర్భంలో చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు జాగ్ర‌త్త‌గా వింటే.. గ‌తంలో ఆయ‌న చెప్పిన మాట‌ల‌కు కొన‌సాగింపుగా ఉంటాయే త‌ప్ప‌… తానే ఏదో నోబెల్ ఇచ్చేస్తా అనే మీనింగ్ ధ్వ‌నించ‌దు. చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే… ‘మ‌న పిల్ల‌లు ఒలింపిక్ గేమ్స్ లో కూడా గెల‌వాలి. గెలిచే వ‌ర‌కూ మీరు గ‌ట్టిగా ప్రాక్టీస్ చెయ్యాలి. మొద‌టి స్థానంలో ఎవ‌రు నిలిస్తే.. ఇటీవ‌ల నేను అనౌన్స్ కూడా చేశాను, నోబెల్ ప్రైజ్ కి కూడా అనౌన్స్ చేశాను’ అన్నారు. ఒలింపిక్స్ లో కూడా ఇదే మాదిరిగా విజ‌యం సాధిస్తే, విజ‌య‌వాడ‌లో బ్ర‌హ్మాండంగా స‌న్మానం చేయాలన్న‌ది త‌న ఆశ, ఆశ‌యం అని చంద్ర‌బాబు చెప్పారు. ఇదే ఇష్యూని సాక్షి ఇంకోలా ప్రెజెంట్ చేసింది. ఒలిపింక్స్ లో గెలిచిన‌వారికి చంద్ర‌బాబు నోబెల్ ఇస్తారట అంటూ క‌థ‌నం ప్ర‌చురించింది. ఒలింపిక్స్ కూ , నోబెల్ కూ లింక్ పెట్ట‌డం విస్మ‌యాన్ని క‌లిగిస్తోంద‌నీ, అత్యుత్త‌మ‌మైన పుర‌స్కారాన్ని తానే ఇస్తానంటూ ఏపీ సీఎం ప్ర‌క‌టించుకోవ‌డం విడ్డూరం అన్న‌ట్టుగా ఆ క‌థ‌నంలో రాశారు. అయితే, విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. గ‌తంలో కూడా తాను ఇదే మాట చెప్పాన‌ని అన్నారు. ఆ గ‌త‌మేంటో ఆ మాటేంటో మాట్లాడిన సంద‌ర్భ‌మేంటో గుర్తుంటే ఇలాంటి వ‌క్రీక‌ర‌ణ‌కు ఆస్కారం ఉండేది కాదు! జ‌న‌వ‌రి 5వ తేదీన తిరుప‌తిలో చిల్డ్ర‌న్స్ సైన్స్ కాంగ్రెస్ జ‌రిగింది. ప‌ద్మావ‌తీ మ‌హిళా విశ్వ విద్యాల‌య ప్రాంగ‌ణంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ‘ఆంధ్రాకు చెందిన శాస్త్రవేత్త‌లు ఎవ‌రైనా నోబెల్ బ‌హుమ‌తి సాధిస్తే… రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున రూ. 100 కోట్లు బ‌హుమానంగా ఇస్తాం. నోబెల్ ఎలా సాధించాల‌నే ఉత్సుక‌తను ఇప్ప‌ట్నుంచే మీరు పెంచుకోవాలి. ఎలా సాధించాల‌నేదానిపై క‌ష్ట‌ప‌డి ప‌నిచెయ్యాలి. మీరు నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు సంపాదించిన‌ట్టు అవుతుంది. ప్ర‌తీ ఒక్క‌రిలో ఆ ఆలోచ‌నా విధానం రావాలి’ అంటూ విద్యార్థుల్ని ప్రోత్స‌హించే క్ర‌మంలో ఆ విధంగా మాట్లాడారు. దానికి కొన‌సాగింపుగానే ఇప్పుడు విజ‌య‌వాడలో శ్రీ‌కాంత్ స‌న్మాన కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. ‘నేను గతంలోనే చెప్పాను’ అంటూ చంద్రబాబు ఊటంకించిన సంద‌ర్భం అది. అదే మాదిరిగా ఒలిపింక్స్ లో బ్యాట్మింట‌న్ గెలిస్తే రూ. 100 కోట్లు ఇస్తాన‌ని చెప్పారు. వాస్త‌వం ఇదైతే.. నోబెల్ తానే ఇస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు సాక్షి పేర్కొంది. విలువ‌ల‌తో కూడిన జ‌ర్న‌లిజం మాది అని సాక్షి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు చెప్పుకుంటూ ఉంటారు! ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాల‌ను తెలియ‌జేయ‌డం కోస‌మే ప‌త్రిక‌ను స్థాపించామ‌ని గొప్ప‌లకు పోతుంటారు. అలాంట‌ప్పుడు చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల విష‌యంలో ప్ర‌జ‌ల‌కు సాక్షి చేర‌వేసిన వాస్త‌వాలు ఇవేనా..! బుర‌ద‌చ‌ల్లే కార్య‌క్ర‌మ‌మే ప్ర‌దాన అజెండాగా పెట్టుకుని బ్యాన‌ర్ వార్త‌ల్ని కూడా వండివార్చేస్తుంటే.. ఇంకా విలువ‌ల గురించి చ‌ర్చ ఎందుకు..? నిజానికి.. ఈ వ్యాఖ్య‌ల‌పై సాక్షితోపాటు కొన్ని ఇత‌ర మీడియా సంస్థ‌లు కూడా నిన్న‌ట్నుంచీ ‘చంద్ర‌బాబు నోబెల్ ప్ర‌క‌టించ‌డ‌మా’ అంటూ ఊద‌ర‌కొడుతున్నాయి.
 
Link to comment
Share on other sites

This is worst kind of journalism

Link to comment
Share on other sites

చంద్రబాబు తాను "నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేశా" అనలేదురా దివాళాకోర్స్. ఇటీవల నేను "నోబెల్ ప్రైజు కి కూడా" అనౌన్స్ చేశాను అన్నాడు. ఏం అనౌన్స్ చేశాడు ? తెలుగువాడెవరైనా నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటే వందకోట్ల పారితోషికం ఇస్తా అన్నాడు. జనవరి 5, 2017 న తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతున్నప్పుడు, 2015 ఫిజిక్స్ నోబెల్ విజేత జపాన్‌కి చెందిన ప్రొఫెసర్ తకాకీ కజితాని సత్కరించే సందర్భంలో, మన పిల్లల్ని ప్రోత్సహించడానికి ఆ అనౌన్స్‌మెంట్ చేశాడు.

ఆ విషయాన్నే నిన్న శ్రీకాంత్ కిడాంబి సన్మానసభలో, తన ప్రసంగం మధ్యలో క్లుప్తంగా ప్రస్తావిస్తూ, అదే మాదిరిగా ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ గెలిస్తే వందకోట్లిస్తా, ఇదే విజయవాడలో బ్రహ్మాండమయిన సన్మానం చేయాలని నా ఆశ అన్నాడు. చెవులేమన్నా దొబ్బినయా ? "అదే మాదిరిగా" అనే ఆయన ట్రేడ్‌మార్క్ మాట వినబళ్ళేదా? లేక బ్రెయిన్‌వాష్ వల్ల 'అనుకోకుండా ఒకరోజు' సినిమాలో కల్ట్‌లాగా తయారయ్యారా ?

బొంకరా బొంకరా పోలుగా అంటే, టంగుటూరి మిరియాలు తాటికాయలంతేసి అన్నట్లు తయారయింది మీ సాక్షిట్ రాతల యవ్వారం. వక్రీకరణకి ఒక హద్దుండాలి. పైగా ఫ్రంట్ పేజీలో టాప్ హెడ్డింగ్ ! మిగతా పత్రికలన్నీ మీరాకుమార్ నామినేషన్, జీఎస్టీ, సెవెంత్ సెంట్రల్ పే కమిషన్ సిఫార్సులు తదితర అంశాలతో ఫస్ట్ పేజీ నింపితే, మీ నిర్వాకం ఇదీ. పెంట తినే బఱ్ఱె, కొమ్ములు కోస్తె మానుతుందా అని సామెత వెనకటికి. జనం ఎంత ఛీ కొట్టినా మీరు మారరుగాక మారరు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...