Jump to content
Sign in to follow this  
sonykongara

Kurnool Airport, Orvakal.

Recommended Posts

ర్నూలు ఎయిర్‌పోర్టు రెడీ!
01-01-2019 03:36:16
 
636819105772242939.jpg
  • విజయవంతమైన ట్రైల్‌ రన్‌
  • 8న జాతికి అంకితం చేయనున్న సీఎం
  • ఏప్రిల్‌, మేలలో ప్రయాణికుల విమానాలు
కర్నూలు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): కర్నూలు(ఓర్వకల్లు) విమానాశ్రయం సిద్ధమైంది. కీలకమైన రన్‌వే, అప్రాన్‌, టెర్మినల్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) భవనాల నిర్మాణాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 8న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన ట్రైల్‌ రన్‌ విజయవంతమైం ది. అన్ని అనుమతులూ తీసుకు న్న తరువాత ఏప్రిల్‌, మే నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం విమానాలు నడుస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ము ఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. రాయలసీమ జిల్లాలో ఇది 4వ విమానాశ్రయం.
 
2007లో నిర్మాణానికి శ్రీకారం
రాష్ట్ర విభజన తరువాత రాజధాని అమరావతికి వచ్చింది. రాజధానికి వెళ్లాలంటే ఆరేడు గంటల ప్రయాణం చే యాలి. ఓర్వకల్లును పారిశ్రామిక హ బ్‌గా తీర్చిదిద్దుతాని సీఎం చంద్రబాబు 2014 ఆగస్టు 15న కర్నూలులో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో హామీ ఇచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు జిల్లాకు రావాలంటే రవాణా సౌకర్యం మెరుగుపడాలి. ఆ సమయంలోనే జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే ఆలోచన తిరిగి మొదలైంది. ఓర్వకల్లు సమీపంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఎకరా ఒక్కింటికి రూపాయి చొప్పున 999.50 ఎకరాలను ప్రభుత్వం ‘ఏపీ విమానాశ్రయ అ భివృద్ధి సంస్థ’కి కేటాయించింది. నిర్మాణాలకు రూ.90.5 కోట్లు మంజూరు చేశారు. 2017 జూన్‌లో పనులు చేపట్టారు.
 
దాదాపుగా పూర్తి
రన్‌వే చుట్టూ 9.4 కి.మీ. ప్రహరీ, రన్‌వే చుట్టూ 5.3 కి.మీ. పెరిఫెరల్‌ రోడ్డు, ప్రయాణికులు, వాహనాల రాకపోకలకు వీలుగా 1.7 కి.మీ. పొడవుతో మరో 4 రోడ్లు, కర్నూలు-నంద్యాల జాతీయ రహదారి నుంచి ఎయిర్‌పోర్ట్‌ చేరుకోవడానికి 2.4 కి.మీ. అప్రోచ్‌ రోడ్‌ నిర్మించారు. రోడ్డు పొడవునా మొక్కలు నాటా రు. పచ్చదనాన్ని తీర్చిదిద్దుతున్నా రు. ఏటీసీ భవనం పర్తికావచ్చింది. ఎలక్ర్టికల్‌ సబ్‌ స్టేషన్‌ భవనాలు నిర్మించారు. ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌(పీటీబీ)ను 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 80-85 మంది ప్రయాణించే ఏటీఆర్‌-760 విమానాలు 4 ఒకేసారి పార్కింగ్‌ చేసుకోగలిగేలా ఈ టెర్మినల్‌కు ఎదురుగా ఆప్రాన్‌ నిర్మించారు. తొలి విడతగా కర్నూ లు విమానాశ్రయం నుంచి గన్నవరం, హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రాయలకు డొమెస్టిక్‌ విమానాలు నడపవచ్చని అధికారులు చెపుతున్నారు.
 
విజయవంతంగా ట్రైల్‌ రన్‌
కర్నూలు విమానాశ్రయంలో సోమవారం నిర్వహించిన ట్రైల్‌ రన్‌ విజయవంతమైంది. తొలి విమానం విజయవంతంగా దిగింది. హైదరాబాద్‌లోని శంషాబా ద్‌ అంతర్జాతీయ విమనాశ్రయం నుంచి సెస్నా సైటేషన్‌ సీజే-2 టర్బో జెట్‌ విమానంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు బయలుదేరి మద్యాహ్నం 12.15 గంటలకు కర్నూలు ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి, ఏపీ ఎయిర్‌పోర్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సీఈవో వీరేంద్రసింగ్‌ తదితరులు అజయ్‌జైన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
 
అనంతరం ఢిల్లీ నుంచి వ చ్చిన బృందం, ఏపీ ఎయిర్‌పోర్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు, సాంకేతిక సిబ్బందితో కలిసి రన్‌వే, ఆప్రాన్‌, ప్యాసింజర్‌ టెర్మినల్‌ పనులను పరిశీలించా రు. అక్కడే ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ విలేకరులతో మాట్లాడారు. ‘‘18 నెలల్లోనే కాంట్రాక్టు సంస్థ, ఏపీ ఎయిర్‌పోర్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు ఎయిర్‌పోర్టును పూర్తి చేయడం ఓ చరి త్ర. జనవరి 8న సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేస్తున్నారు. నెల్లూరులో రూ.350 కోట్లతో నిర్మించే ఎయిర్‌పోర్టుకు జనవరి 6న, కుప్పంలో రూ.100 కోట్లతో నిర్మించే డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్టుకు 3వ తేదీన సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు’’ అన్నారు.
 
రన్‌వే నిర్మాణం ఇలా,...
కర్నూలు నగరానికి 20 కి.మీ. దూరంలో ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయానికి మొదట్లో ఓర్వకల్లు ఎయిర్‌ పోర్టుగా పిలిచారు. ఆ తరువాత కర్నూలు విమానాశ్రయంగా మార్చారు. 2.12 కి.మీ. పొడవు, 30 మీటర్ల వెడల్పుతో 1.15 మీటర్ల మందం... ఐదు లేయర్లలో రన్‌వే నిర్మించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంలో రన్‌వే అత్యంత కీలకం. భూమట్టం నుంచి 15 సెం.మీ. ఎర్రమట్టిని వేసి ఇంజనీరింగ్‌ నిబంధనల మేరకు గట్టిపడే వరకు రోలింగ్‌ చేసి.. దానిపై 30 సెం.మీ. కంకర (జీఎ్‌సబీ), దానిపై 20 సెం.మీ. వెట్‌మిక్స్‌, ఆపైన 7.5 సెం.మీ. డెన్స్‌ బిటమినెస్‌ కాంక్రీట్‌ (డీబీసీ), టాప్‌లేయర్‌లో 5 సెం.మీ. బిటమినెస్‌ కాంక్రీట్‌ (బీసీ) లేయర్‌తో రన్‌వే నిర్మించారు.

Share this post


Link to post
Share on other sites

Chandrababu Naidu's New Year gift to Kurnool: Orvakal Airport trial run successfully held

Kurnool is one of the 50 locations identified by the Centre in 2013 for the development of low-cost airports in order to improve connectivity to remote areas.

Published: 31st December 2018 03:12 PM  |   Last Updated: 31st December 2018 03:13 PM   |  A+A-

Kurnool_airport_EPS.jpeg

Turbo Airlines company conducted Trial Run at the new Orvakal Airport on Monday. The airport will be formally inaugurated by AP chief minister Chandrababu Naidu on January 7, 2019. (Photo | EPS)

By Express News Service

VIJAYAWADA: In what can be considered as a New Year gift to the people of Kurnool district and neighbouring districts, the trial run of flight services to the newly constructed greenfield airport at Orvakal was successfully held on Monday. The airport will now be thrown open on January 7 by Chief Minister N Chandrababu Naidu.

Kurnool is one of the 50 locations identified by the Centre in 2013 for the development of low-cost airports in order to improve connectivity to remote areas. The works on the airport construction were started in June 2017 and they have been completed within one-and-half years.

The airport is constructed in 960 acres at Orvakal, some 40 kilometres from the Kurnool district headquarters with a cost of Rs 100 crore, officials said.

Officials said with the construction of airport at Orvakal will bring air connectivity to Kurnool as well as adjoining major towns like Nandyal and Kadapa within the State and also towards major towns in neighbouring Karnataka State.

 
 

 

As part of trial run, a small aircraft of Turbo Aviation, which took off from Hyderabad, landed at the airport successfully on Monday. Chief Minister N Chandrababu Naidu will inaugurate the airport on January 7, officials said.

Share this post


Link to post
Share on other sites
కర్నూలుకు కొత్త రెక్కలు

 

ఓర్వకల్లులో దిగిన విమానం.. స్థానికుల కేరింతలు

31main4a.jpg

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: కర్నూలు జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. సోమవారం హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన ‘సెస్నా సైటేషన్‌ సీజే-2’ టర్బో విమానం మధ్యాహ్నం 12.15 గంటలకు  కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో రన్‌-వేపై వాలింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విమానం దిగడంతో ట్రయల్‌రన్‌ విజయవంతమైంది. విమానాన్ని చూసేందుకు ప్రజలు తరలివచ్చి కేరింతలు కొట్టారు. విమానంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, టర్బో ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ ఉమేష్‌తోపాటు మరో నలుగురు ప్రయాణించారు. కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ ఫక్కీరప్ప, ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి వారికి స్వాగతం పలికారు. అనంతరం టెర్మినల్‌ భవనాన్ని అజయ్‌ జైన్‌ పరిశీలించారు. తొలిసారి ఓర్వకల్లు విమానాశ్రయానికి వచ్చిన టర్బో వద్ద గంటన్నరసేపు సెల్ఫీల సందడి నెలకొంది. జనవరి 8న ఈ విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితమివ్వనున్నారు. రికార్డు స్థాయిలో 18 నెలల్లోనే విమానాశ్రయ నిర్మాణం పూర్తయిందని అజయ్‌జైన్‌ విలేకరులతో అన్నారు. రాయలసీమవాసులు రాజధాని అమరావతికి అరగంటలో చేరుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆలోచన సుగమమైందన్నారు. కేంద్రం నుంచి డీజీసీఏ, బీసీఏ అనుమతులు మరో మూడు నెలల్లో వస్తాయన్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో ఉడాన్‌ పథకం కింద ప్రతిరోజూ రెండు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు.  మొదటి సర్వీసు విజయవాడకు ఉంటుందని.. ఆ తర్వాత మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రజల అభిప్రాయం సేకరించి చెన్నై లేదా బెంగళూరుకు కనెక్టవిటీ ఇస్తామన్నారు. కుప్పంలో 3వ తేదీన, నెల్లూరులో 6న సీఎం చేతుల మీదుగా విమానాశ్రయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగే అవకాశాలున్నాయన్నారు. అనంతరం అదే టర్బో విమానంలో ఆయన హైదరాబాద్‌కు వెనుదిరిగారు.

45 నిమిషాలు పట్టింది
టర్బో విమానం పైలెట్‌ రిజ్వాన్‌, కోపైలెట్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ టెస్ట్‌ ఫ్లైట్‌ కావడంతో బేగంపేట నుంచి 45 నిమిషాలు పట్టిందని, తొలిసారిగా రన్‌-వేపై దిగడం సంతోషంగా ఉందన్నారు.

 

Share this post


Link to post
Share on other sites
18 నెలల్లో ఓర్వకల్లు విమానాశ్రయం

 

రూ.110 కోట్ల వ్యయంతో నిర్మాణం
రేపు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు-అమరావతి: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ.110 కోట్ల వ్యయంతో 1,010 ఎకరాల్లో నిర్మించిన విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ప్రారంభించనున్నారు. 3సీ కేటగిరికి చెందిన ఈ విమానాశ్రయాన్ని రికార్డు స్థాయిలో 18 నెలల్లో పూర్తి చేసినట్లు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ కార్గో విమానాలు సైతం నిర్వహించే సామర్థ్యం ఈ విమానాశ్రయానికి ఉందన్నారు. 2 వేల మీటర్ల రన్‌వేతో పాటు విమానాల పార్కింగ్‌కు 4 యాఫ్రాన్‌లు ఉన్నాయని తెలిపారు. రాయలసీమ జిల్లాలను ఆధునిక, అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా మార్చడంలో ఓర్వకల్లు విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో విలువైన ఖనిజాలు, ఇతర సహజ వనరులు పుష్కలంగా ఉన్నందున కచ్చితంగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కర్నూలు నుంచి విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ప్రయాణించవచ్చని అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని, కుప్పంలో చిన్న విమానాశ్రయం అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పలు జిల్లా కేంద్రాల్లో హెలీప్యాడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

Share this post


Link to post
Share on other sites
సీమకు జీవనాడిగా ‘ఓర్వకల్లు’
07-01-2019 02:53:38
 
636824264163562027.jpg
  • విమానయాన పెట్టుబడులకు గమ్యస్థానం
  • రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విమానయాన రంగానికి కీలక పాత్ర
  • కరువును పారద్రోలే లక్ష్యంతో పనిచేస్తున్నాం
  • టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ‘‘రాయలసీమకు ఓర్వకల్లు విమానాశ్రయం జీవనాడిగా మారుతుంది. రాయలసీమ వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతం. విమానాశ్రాయాలను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమలు, ఆర్థికాభివృద్ధికి గమ్యస్థానంగా మారడం ఖాయం. విమానయాన రంగంలో పెట్టుబడులకు 2022 నాటికల్లా ఆంధ్రప్రదేశ్‌ తొలి గమ్యస్థానంగా మారనుంది. ఇందుకోసం పెద్దఎత్తున ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. తద్వారా రాష్ట్రంలో గణనీయమైన ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన, ప్రజలకు ఆదాయం సమకూరనుంది’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 8న కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సందర్భంగా ఆదివారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
 
‘‘వెనుకబడిన రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనలో విమానయాన రంగానిది కీలకపాత్ర. విమానాశ్రయాలు అభివృద్ధి కేంద్రాలుగా పనిచేస్తాయి. రాష్ట్రం మొత్తం ఎయిర్‌ కనెక్టివిటీని పెంచడం ద్వారా తయారీ, పర్యాటకం, వ్యాపారాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. ఓర్వకల్లు ప్రాంతంలో విలువైన ఖనిజాలు, ఇతర సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇది అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. ఈ విమానాశ్రయం వల్ల భవిష్యత్తులో విజయవాడ, విశాఖపట్నం, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లడానికి కర్నూలు వాసులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో, నెల్లూరు జిల్లా దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కుప్పంలో చిన్న విమానాశ్రయం అభివృద్ధి చేస్తున్నాం.
 
అలాగే వివిధ జిల్లా కేంద్రాల్లో హెలిప్యాడ్లను అభివృద్ధి చేయనున్నాం. సీమ ప్రాంతం నుంచి కరువును పారదోలే లక్ష్యంతో పనిచేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పని ప్రారంభించాం. నిర్ధిష్ట ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తాం. ఇటీవల గోరకట్లు రిజర్వాయర్‌ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ ద్వారా కృష్ణా నీటిని రాయలసీమకు మళ్లించనున్నాం. సాగునీటి కొరతను అధిగమించేందుకు కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయనున్నాం’’ అని చంద్రబాబు వివరించారు. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ మాట్లాడుతూ, ‘‘ఇది గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు. రికార్డు సమయంలో దీనిని పూర్తి చేశాం. ఈ విమానాశ్రయం 3సీ కేటగిరీలో ఉంది. ఏటీఆర్‌-72, బాంబార్డియర్‌ క్యూ-400 వంటి భారీ కార్గో విమానాలను నిర్వహించే సామర్థ్యం ఉంది. 2 వేల మీటర్ల రన్‌వే, విమానాల పార్కింగ్‌కు 4 ఆప్రాన్‌లు ఉన్నాయి’’ అని వివరించారు.

Share this post


Link to post
Share on other sites
ర్నూలులో ఎయిర్‌పోర్టు ప్రారంభం...జాతికి అంకితం
08-01-2019 11:51:56
 
636825451166520488.jpg
కర్నూలు: జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, సోలార్‌ పార్క్‌ను ప్రారంభించిన సీఎం జాతికి అంకింతం చేశారు. అనంతరం కర్నూలు ఆస్పత్రిలో స్టేట్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు, ఫార్మా క్లస్టర్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఆపై పాణ్యం మండలం బ్రాహ్మణపల్లి, జూపాడుబంగ్లా మండలం తంగడంచ, బనగానపల్లె పరిధిలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎయిర్‌పోర్టులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×