KEDI Posted July 11, 2017 Posted July 11, 2017 mee uncle confirmed ani video vesa... adi ekada vachindo cheppataniki kadu
Raaz@NBK Posted July 11, 2017 Posted July 11, 2017 mee uncle confirmed ani video vesa... adi ekada vachindo cheppataniki kadu Inthaki mana paristhiti enti ??
sonykongara Posted August 11, 2017 Author Posted August 11, 2017 ప్రకాశం’ దిగువన బ్యారేజీ నిర్మాణానికి11-08-2017 03:35:54 డీపీఆర్ పంపండి: కేంద్రమంత్రి ఉమాభారతి అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానదిపై నిర్మించదలచిన బ్యారేజీ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికను పంపాలని కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతి కోరారు. ఈ మేరకు ఆమె సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన 12 కిలోమీటర్ల వద్ద నిర్మించదలచిన బ్యారేజీ కోసం డీపీఆర్‌ను పంపితే నిబంధనల మేరకు కేంద్ర జలసంఘానికి ప్రతిపాదనలు పంపుతామని అందులో పేర్కొన్నారు. కృష్ణానదిపై ట్రైబ్యునళ్లు ఇచ్చిన ఆదేశాలను కేంద్ర జలసంఘం పరిగణనలోకి తీసుకుంటుందని, దీనిని అంతర్ రాష్ట్ర నదీజలాల కోణంలో పరిశీలన చేస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు టెక్నో-ఎకనామిక్ ఆమోదంతోపాటు కేంద్ర జలవనరుల శాఖ సలహా సంఘం సమ్మతి కూడా కావాల్సి ఉంటుందన్నారు. ఏఐబీపీ కింద ఆర్థిక సహాయం ఇవ్వాలంటే ఇందుకు తగిన అర్హత ఉందో లేదో పరిశీలించాల్సి ఉందని, వీటన్నింటి నేపథ్యంలో డీపీఆర్‌ను పంపితే పరిశీలించి కేఆర్‌ఎంబీకి పంపుతామని ఆ లేఖలో కేంద్రమంత్రి తెలిపారు.
sonykongara Posted October 9, 2017 Author Posted October 9, 2017 ప్రకాశం’ దిగువన బ్యారేజీ నిర్మాణానికి 11-08-2017 03:35:54 డీపీఆర్ పంపండి: కేంద్రమంత్రి ఉమాభారతి అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానదిపై నిర్మించదలచిన బ్యారేజీ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికను పంపాలని కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతి కోరారు. ఈ మేరకు ఆమె సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన 12 కిలోమీటర్ల వద్ద నిర్మించదలచిన బ్యారేజీ కోసం డీపీఆర్‌ను పంపితే నిబంధనల మేరకు కేంద్ర జలసంఘానికి ప్రతిపాదనలు పంపుతామని అందులో పేర్కొన్నారు. కృష్ణానదిపై ట్రైబ్యునళ్లు ఇచ్చిన ఆదేశాలను కేంద్ర జలసంఘం పరిగణనలోకి తీసుకుంటుందని, దీనిని అంతర్ రాష్ట్ర నదీజలాల కోణంలో పరిశీలన చేస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు టెక్నో-ఎకనామిక్ ఆమోదంతోపాటు కేంద్ర జలవనరుల శాఖ సలహా సంఘం సమ్మతి కూడా కావాల్సి ఉంటుందన్నారు. ఏఐబీపీ కింద ఆర్థిక సహాయం ఇవ్వాలంటే ఇందుకు తగిన అర్హత ఉందో లేదో పరిశీలించాల్సి ఉందని, వీటన్నింటి నేపథ్యంలో డీపీఆర్‌ను పంపితే పరిశీలించి కేఆర్‌ఎంబీకి పంపుతామని ఆ లేఖలో కేంద్రమంత్రి తెలిపారు. edi emi ayyindi ?
rk09 Posted October 9, 2017 Posted October 9, 2017 ee barrage lu, ORR lu inko 5 years light especially ,Amaravati surroundings
surapaneni1 Posted November 28, 2017 Posted November 28, 2017 On 10/9/2017 at 8:15 PM, rk09 said: ee barrage lu, ORR lu inko 5 years light especially ,Amaravati surroundings
rk09 Posted November 28, 2017 Posted November 28, 2017 Any inside news on Polavaram Surapanenei bro? Gravity tho neellu ravataniki inka entha time pattotchu. (konchem atyasa anuko)
sonykongara Posted November 28, 2017 Author Posted November 28, 2017 కృష్ణాపై బెలూన్ బ్యారేజీ28-11-2017 02:06:47 రూ.609 కోట్ల వ్యయం.. 2.9 టీఎంసీల సామర్థ్యం ప్రకాశం బ్యారేజీకి దిగువన చోడవరం వద్ద నిర్మాణం అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): కృష్ణానది నుంచి నీరు వృథాగా పోకుండా ఓ బెలూన్ బ్యారేజీని ఏర్పాటు చేయాలని రాష్ట్రం నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు చెక్ డ్యాములను నిర్మించాలన్న యోచనలో ఉన్న జల వనరుల శాఖ.. ఇందులో భాగంగా యనమలకుదురు వద్ద ఒక చెక్ డ్యామ్‌ను నిర్మించాలని, లేదా పాత రైల్వే వంతెననూ ఒక చెక్ డ్యామ్‌గా వినియోగించుకోవాలని ఆలోచిస్తోంది. అలాగే... ప్రకాశం బ్యారేజీకి దిగువన చోడవరం వద్ద రూ.609 కోట్లతో 2.90 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన చెక్ డ్యామ్‌ను యూనిక్(విశిష్టం)గా బెలూన్ బ్యారేజీ విధానంలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ బెలూన్ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను కేంద్ర జల సంఘానికి పంపింది. దాని ఆమోదం లభించిని వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. బెలూన్ బ్యారేజీ అంటే... ప్రకాశం బ్యారేజీకి దిగువకు కృష్ణాజలాలను విడిచిపెడితే నేరుగా సముద్రంలోకి పోతాయి. అందువల్ల దిగువకు వదలకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు మరలిస్తున్నారు. దీంతో... ప్రకాశం బ్యారేజీకి ఒకవైపు నీటి నిల్వలతో కళకళలాడుతుంటే.. మరోవైపు నీటి జాడలు లేక రాళ్లూ కుప్పలు కనిపిస్తున్నాయి. పైగా దిగువ భాగాన ఉన్న గ్రామాలకు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. యనమలకుదురు, చోడవరం తదితర గ్రామాలకు సాగునీటితో సహా తాగునీటిని అందించేందుకు వీలుగా 2.09 టీఎంసీల నీటిసామర్థ్యం కలిగిన చెక్ డ్యామ్‌ను నిర్మించాలనే యోచనలోకి జల వనరులశాఖ వచ్చింది. సాధారణ చెక్‌డ్యామ్ తరహాలో కాకుండా పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేసేలా ఈ బెలూన్ బ్యారేజీని నిర్మించాలని భావించింది. ఈ దిశగా రూపకల్పన చేసింది. ఇందుకు చోడవరం అనువైన ప్రాంతంగా జల వనరులశాఖ భావించింది. ఈ ప్రాంతంలో నిర్మించే బెలూన్ బ్యారేజీ పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుందని జల వనరుల శాఖ వర్గాలు వివరించాయి. నదీ ప్రవాహానికి అడ్డంగా బెలూన్ కట్టడాన్ని ఏర్పాటు చేస్తారు. నీటి ప్రవాహ వేగాన్ని బట్టి బెలూన్‌లోని గాలి కూడా పెరుగుతుంది. ఈ బెలూన్ నదీ ప్రవాహానికి అడ్డుగా గోడలా నిలబడుతుంది. 2.90 టీఎంసీల కంటే ఎక్కువ ప్రవాహం ఉంటే... గాలిగోడను దాటుకుంటూ దిగువకు జలాలు వెళ్లిపోతాయి. నీటి ప్రవాహ వేగం తగ్గితే ఆ మేరకు బెలూన్‌లోని గాలి కూడా తగ్గుతుంది. ఈ చర్యలన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోయేలా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తారు. ఇలాంటి యూనిక్ చెక్ డ్యామ్ నిర్మాణంపై ఇప్పటికే కేంద్ర జల సంఘం ఆసక్తి చూపింది. కేంద్రం కోరిక మేరకు దీని డీపీఆర్‌ను రాష్ట్రం పంపింది.
ravikia Posted November 28, 2017 Posted November 28, 2017 Krishna ki chodavaram daggara build chese barrage meedhuga vehicles access vuntundha or is it just a water storage one ?
surapaneni1 Posted November 28, 2017 Posted November 28, 2017 8 hours ago, rk09 said: Any inside news on Polavaram Surapanenei bro? Gravity tho neellu ravataniki inka entha time pattotchu. (konchem atyasa anuko) present elections aite marchipovachhu... full length storage inko 10 yrs ki try cheyyochu... rk09 1
sonykongara Posted January 26, 2018 Author Posted January 26, 2018 (edited) 3 బ్యారేజీలు.. 22 టీఎంసీలువైకుంఠపురం వద్ద రూ. 1,900 కోట్లతో నిర్మాణం ప్రాజెక్టు నివేదిక వారంలో సిద్ధం, ఆ తర్వాత టెండర్లు చోడవరం, శ్రీకాకుళం వద్ద మరో రెండింటికి సన్నాహాలుఈనాడు - అమరావతి ప్రకాశం బ్యారేజి ఎగువన వైకుంఠపురం వద్ద కృష్ణా నదిపై బ్యారేజి నిర్మాణానికి దాదాపు రంగం సిద్ధం చేశారు. లైడార్ సర్వే పూర్తి చేసిన వ్యాప్కోస్ సంస్థ నిపుణులతో జలవనరులశాఖ అధికారులు గురువారం భేటీ అయ్యారు. జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, హైడ్రాలజీ చీఫ్ ఇంజినీర్ కుమార్, జలవనరులమంత్రి ఓఎస్డీ రాజేంద్రప్రసాద్ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజి దిగువన యనమలకుదురు సమీపంలో చోడవరం వద్ద; మరీ దిగువన ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద బ్యారేజీల నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసేందుకు వేరే కన్సల్టెన్సీ కసరత్తు చేస్తోంది. 12 టీఎంసీలు... 1,900 కోట్లుప్రకాశం బ్యారేజికి ఎగువన నిర్మించే బ్యారేజి వల్ల దాదాపు 10 నుంచి 12 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయవచ్చు. సుమారు 22 టీఎంసీల వరకు వినియోగించుకోవచ్చు. 50 లక్షల మంది తాగునీటికి లేదా రెండున్నర లక్షల ఎకరాలకు పైగా ఆయట్టుకు ఈ నీరు ఉపయోగపడుతుంది. వ్యాప్కోస్ వారు రూ.3,278 కోట్లతో ఈ బ్యారేజి నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. జలవనరులశాఖలో గతంలో పని చేసిన అనుభవం ఉండి మంత్రి దేవినేని ఓఎస్డీగా పని చేస్తున్న రాజేంద్రప్రసాద్ కొందరి అధికారుల సహకారంతో క్షేత్రస్థాయి సమాచారంతో రూ.1,901 కోట్లకే ఈ బ్యారేజి పూర్తి చేసేందుకు అవకాశం ఉందని ఒక నివేదిక సిద్ధం చేశారు. వీటిపై చర్చించిన అధికారులు 1,900 కోట్ల ఖర్చుతో నిర్మాణం పూర్తి చేయవచ్చని అంచనాకు వచ్చారు. మునేరు ఆధారంఈ బ్యారేజిలో నీటి నిల్వకు మునేరు వాగే పెద్ద ఆధారం. ఈ వాగులో ప్రతి ఏడాది దాదాపు రెండు నెలల్లో 50 టీఎంసీల లభ్యత ఉందని లెక్కిస్తున్నారు. గతంలో అన్ని చోట్లా వర్షాలు పడ్డ సమయంలో ఈ మునేరు నీరే సముద్రంలోకి వృథాగా పోయిన సందర్భాలూ ఉన్నాయి. పాలేరు వాగు నుంచి కూడా కొన్ని ప్రవాహాలు ఉంటాయి. లంకలు తొలగించి..కృష్ణా నదిలో కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, అమరావతి మండలాల్లో దాదాపు 8 లంకలు ఉన్నాయి. మొత్తం 13 వేల ఎకరాలకు పైగా భూమి అవసరం. ఈ లంకలను తొలగిస్తే నదిలో పూడిక తీసేయవచ్చు. దాదాపు 10.68 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక వస్తుంది. అది నది గట్లు పటిష్ఠం చేసుకునేందుకు, రాజధాని నిర్మాణానికి ఉపయోగపడుతుంది. నదిలో అదనంగా 3 టీఎంసీల వరకు నిల్వ చేసుకునే వీలుంటుంది. చోడవరం, శ్రీకాకుళం బ్యారేజీలతో...చోడవరం వద్ద 2.4 టీఎంసీలు నిల్వ చేసేలా బ్యారేజి నిర్మాణం జరిగితే విజయవాడ నగరం చుట్టూ నీరు ఉంటుంది. శ్రీకాకుళం వద్ద 6.5 టీఎంసీల నీటితో మరో బ్యారేజి వల్ల లంక గ్రామాల్లో భూగర్భజలాలు వృద్ధి చెందడంతో పాటు సముద్రం నుంచి ఆటుపోటుల వల్ల ఆ ప్రాంత భూములు ఉప్పుకయ్యలుగా మారుతున్న ఇబ్బందులూ పరిష్కారమవుతాయి. Edited January 26, 2018 by sonykongara
Anne Posted January 26, 2018 Posted January 26, 2018 Inka chukka niru rademo kindaki... Lanka gramalaki effect.. Water baga salty aipotayemo...
sonykongara Posted January 26, 2018 Author Posted January 26, 2018 11 minutes ago, Anne said: Inka chukka niru rademo kindaki... Lanka gramalaki effect.. Water baga salty aipotayemo... చోడవరం, శ్రీకాకుళం బ్యారేజీలతో...చోడవరం వద్ద 2.4 టీఎంసీలు నిల్వ చేసేలా బ్యారేజి నిర్మాణం జరిగితే విజయవాడ నగరం చుట్టూ నీరు ఉంటుంది. శ్రీకాకుళం వద్ద 6.5 టీఎంసీల నీటితో మరో బ్యారేజి వల్ల లంక గ్రామాల్లో భూగర్భజలాలు వృద్ధి చెందడంతో పాటు సముద్రం నుంచి ఆటుపోటుల వల్ల ఆ ప్రాంత భూములు ఉప్పుకయ్యలుగా మారుతున్న ఇబ్బందులూ పరిష్కారమవుతాయి.
rk09 Posted January 26, 2018 Posted January 26, 2018 7 hours ago, Anne said: Inka chukka niru rademo kindaki... Lanka gramalaki effect.. Water baga salty aipotayemo... Barrage or even a check dam kind is good near Srikakulam area - which stops salt water seepage ee year choodandi - oka chukka raledu Prakasam barrage kindaki -
Anne Posted January 26, 2018 Posted January 26, 2018 9 hours ago, sonykongara said: చోడవరం, శ్రీకాకుళం బ్యారేజీలతో...చోడవరం వద్ద 2.4 టీఎంసీలు నిల్వ చేసేలా బ్యారేజి నిర్మాణం జరిగితే విజయవాడ నగరం చుట్టూ నీరు ఉంటుంది. శ్రీకాకుళం వద్ద 6.5 టీఎంసీల నీటితో మరో బ్యారేజి వల్ల లంక గ్రామాల్లో భూగర్భజలాలు వృద్ధి చెందడంతో పాటు సముద్రం నుంచి ఆటుపోటుల వల్ల ఆ ప్రాంత భూములు ఉప్పుకయ్యలుగా మారుతున్న ఇబ్బందులూ పరిష్కారమవుతాయి. srikakulam kinda inka lankalu unay.....
Anne Posted January 26, 2018 Posted January 26, 2018 2 hours ago, rk09 said: Barrage or even a check dam kind is good near Srikakulam area - which stops salt water seepage ee year choodandi - oka chukka raledu Prakasam barrage kindaki - yess eee year asalu raledu...
swarnandhra Posted January 26, 2018 Posted January 26, 2018 (edited) veelainantha down lo check dam katti, guaranteed neeru vadalali (just enough to fill the check dams but not overflow). nadi prakkana vundi kuda tragu neeru(bores) leka povatam daarunam. our area bores, far away from river turned salty couple of decades ago. now we have 100 acre pond to save water for drinking needs(from irrigation canal). Edited January 26, 2018 by swarnandhra
sonykongara Posted June 10, 2018 Author Posted June 10, 2018 చోడవరానికి రూ.600 కోట్ల అంచనా రూ600 కోట్లతో మరో బ్యారేజీ ఇదే సమయంలో ప్రకాశం బ్యారేజీకి దిగువన 12 కిలోమీటర్ల దూరంలో చోడవరం గ్రామం వద్ద కృష్ణాపై బ్యారేజీని నిర్మించనున్నారు. దీనికోసం అధికారులు రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపారు. 2.7 టీఎంసీల నీటి నిల్వతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఎనిమిది మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కారం, 17వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణను ఉద్దేశించారు. సమీపంలో భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. దీని నిర్మాణానికి 55 హెక్టార్ల భూసేకరణ కూడా అవసరం. ఈ ప్రతిపాదన జలవనరుల శాఖ నుంచి ఆర్థిక శాఖకు వెళ్లింది. అక్కడ అనుమతి లభించాక పాలనామోదం ఇవ్వనున్నారు.
sonykongara Posted June 10, 2018 Author Posted June 10, 2018 రామలింగేశ్వరనగర్ వద్ద మరో రబ్బరుడ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు దీంతో పాటు ప్రకాశం బ్యారేజీ దిగువన నీటి వనరులను నిల్వ చేయటానికి రామలింగేశ్వరనగర్ దగ్గర మరో రబ్బరు డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానికి అవసరమైన నీటి వనరుల కోసం వైకుంఠపురం బ్యారేజీ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
sonykongara Posted June 10, 2018 Author Posted June 10, 2018 46 minutes ago, sonykongara said: రామలింగేశ్వరనగర్ వద్ద మరో రబ్బరుడ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు దీంతో పాటు ప్రకాశం బ్యారేజీ దిగువన నీటి వనరులను నిల్వ చేయటానికి రామలింగేశ్వరనగర్ దగ్గర మరో రబ్బరు డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానికి అవసరమైన నీటి వనరుల కోసం వైకుంఠపురం బ్యారేజీ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామలింగేశ్వరనగర్ ekkada konchem teisthe veyyandi
surapaneni1 Posted June 10, 2018 Posted June 10, 2018 2 hours ago, sonykongara said: రామలింగేశ్వరనగర్ ekkada konchem teisthe veyyandi Yanamalakuduru ki varadhi ki madyalo...
sonykongara Posted June 10, 2018 Author Posted June 10, 2018 4 minutes ago, surapaneni1 said: Yanamalakuduru ki varadhi ki madyalo... Chodavaram daggra katee barrage ante edana,leda edi vera bro
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now