Jump to content

‘కియ’పై అమెరికా ఆరా!


vinayak

Recommended Posts

సిఎం కార్యాలయానికి వచ్చిన కాన్సులేట్‌ సిబ్బంది 
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ఆటోమొబైల్‌ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఆటోమొబైల్‌ దిగ్గజ కంపెనీ ‘కియ’తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చడీచప్పుడూ లేకుండా గురువారం ఒప్పందం కుదుర్చుకోవడంపై అమెరికా ఆశ్చర్యపోయింది. తమకు కూడా తెలియకుండా ఒప్పందం ఎలా సాధ్యమైందా అని ఆరా తీస్తోంది. శుక్రవారం అమెరికా కాన్సులేట్‌ సిబ్బంది ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. దక్షిణ కొరియాకు చెందిన కియ.. అనంతపురం జిల్లాలో రెండు బిలియన్‌ డాలర్ల మేర (సుమారు రూ.13 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు నిజంగా ముందుకొచ్చిందా అధికారుల వద్ద ఆరా తీశారు. అంత గోప్యంగా, గుంభనంగా ఎలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. అమెరికా కాన్సులేట్‌ వర్గాలు దీనిపై ఆరా తీయడం సిఎంఒ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

గురువారం.. దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ కియాతో కుదుర్చుకున్న ఒప్పంద వివరాలివే...

 

 
హ్యుండయ్‌ కార్ల తయారీ కేంద్రంగా రాష్ట్రం 
దక్షిణ కొరియా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం 
చరిత్రాత్మకమైన రోజుగా పేర్కొన్న సీఎం 
నిజాయితీగా.. పారదర్శకంగా అనుమతులు 
ప్రతి నెలా 4వ సోమవారం కియపై సమీక్ష 
నోడల్‌ అధికారిగా అనంతపురం కలెక్టర్‌ 
2019 తొలి అర్ధభాగంలోనే కార్ల ఉత్పత్తి 
సంస్థలో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే 
మా శ్రమ ఫలితంతోనే రాష్ట్రానికి కియ 
ఆటోమొబైల్‌ హబ్‌గా ఏపీ : చంద్రబాబు 
 
ఈ బంధం ఎంతో పటిష్ఠం 
‘‘కియ ప్లాంటు ఏర్పాటుకు పలు రాష్ట్రాల నుంచి యాజమాన్యంపై ఒత్తిడి వచ్చింది. అయితే ఆంధ్ర ప్రభుత్వ చిత్తశుద్ధి, విశ్వసనీయత, వంటి అంశాలను పరిశీలించాక రాష్ట్రంలోనే తమ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు కియ యాజమాన్యం ముందుకొచ్చింది. ఇక ఏపీకి, కియకు వివాహం జరిగిపోయినట్లే.’’ 
- ముఖ్యమంత్రి చంద్రబాబు 
636289434103076406.jpg

 ‘ఆటోమొబైల్‌ రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న ‘కియ’తో ఒప్పందం చేసుకొన్న ఈ రోజు చరిత్రాత్మకమైనది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి - అమ్మవారిపల్లి ప్రాంతంలో రూ.13 వేల కోట్లతో కియ కార్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు సంస్థ యాజమాన్యానికి.. ప్రభుత్వానికి మధ్య గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది. దక్షిణ కొరియాకు చెందిన కియ సంస్థ ప్రెసిడెంట్‌ - సీఈవో హూమ్‌ వూ పార్క్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియరాజ్‌ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసి, పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. దీంతో రాష్ట్రంలో హ్యుండయ్‌ కార్ల ఉత్పతిక్తి అంకురార్పణ జరిగినట్లయింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే తన లక్ష్యమని ప్రకటించారు. తమ తమ రాష్ట్రాల్లో కియ ప్లాంటు స్థాపించాలంటూ సంస్థ యాజమాన్యంపై ఒత్తిడి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. అయితే, ఏపీ ప్రభుత్వంలోని చిత్తుశుద్ధి, విశ్వసనీయత వంటి అంశాలను పరిశీలించాకే రాష్ట్రంలోనే తమ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు కియ యాజమాన్యం ముందుకు వచ్చిందన్నారు. ఏపీకి, కియకు వివాహం జరిగినట్టేనని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి అనుమతుల జారీలో పారదర్శకంగా.. నిజాయితీగా వ్యవహరించేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తానన్నారు. ప్రతి నెలా నాలుగో సోమవారం ‘కియ’పై సమీక్ష నిర్వహిస్తానన్నారు. ప్లాంటు పూర్తయ్యేంత వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అనంతపురం కలెక్టర్‌ వీరపాండ్యన్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారని చంద్రబాబు ప్రకటించారు. కియ కార్ల తయారీ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 14 ప్లాంట్లు ఉన్నాయని, ఏపీలో ఏర్పాటు చేస్తున్నది 15వ ప్లాంటని తెలిపారు. హైదరాబాద్‌ను నాలెడ్జ్‌ హబ్‌గా మార్చానని .. ఏపీని ఆటోమొబైల్‌ హబ్‌గా మారుస్తానన్నారు. కియ రాకతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పెద్ద దన్ను లభించిందన్నారు. రానున్న 15 ఏళ్లలో రాష్ట్రం 15 శాతం వృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. 

స్థానికులకు ఉపాధి 

సుమారు రూ.13 వేల కోట్లు పెట్టుబడితో స్థాపించే ఈ ప్లాంటులో 4000 మందికి శాశ్వతంగా, 7000 మందికి తాత్కాలికంగా ఉపాధి లభిస్తుందని చంద్రబాబు వివరించారు. కియ ప్లాంటులో 90 శాతం మేర స్థానికులకే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఎగ్జిక్యూటివ్‌ తరహా ఉద్యోగాల్లో మాత్రమే స్థానికేతరులు ఉండే అవకాశముందని సీఎం స్పష్టం చేశారు. కియ ప్లాంటుకు సమీపంలో ఉద్యోగుల కోసం టౌన్‌షిప్‌, ట్రైనింగ్‌ సెంటర్‌ నిర్మిస్తున్నారని, ఈ సంస్థలో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలను రాష్ట్ర స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ స్థానిక యువతకు అందజేస్తుందని సీఎం వివరించారు. 

కియ కార్ల తయారీ యూనిట్‌ను రాష్ట్రానికి రప్పించడంలో తీవ్రస్థాయిలో కృషి చేశామని, ఒకటి రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియ ముగిసిపోలేదని సీఎం చెప్పారు. ఏడాదిన్నరగా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, శ్రమించిన ఫలితంగానే రాష్ట్రానికి కియ వచ్చిందన్నారు. సుమారు 630 ఈ మెయిల్స్‌ సంప్రదింపులు, ఐదు సార్లు కియ యాజమాన్యంతో ద్వైపాక్షిక భేటీలు, సంస్థ ప్రెసిడెంట్‌తో తాను నేరుగా 2 సార్లు సమావేశం కావడంతో కియ రాష్ట్రానికి వచ్చిందన్నారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియ రాజ్‌, కొద్దికాలంపాటు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కార్తాకేయ మిశ్రా, సీఎంఓ ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్‌ తదితరులు నిరంతరం కియ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని సీఎం వివరించారు. ఇప్పటికే దాదాపు 100 కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. కియ నుంచి 2019 ద్వితీయార్థంలో వాణిజ్యపరంగా కార్ల ఉత్పత్తి జరుగుతుందని యాజమాన్యం చెబుతోందని, కానీ 2018 ముగింపు నాటికి ట్రయల్‌ రన్‌ను పూర్తి చేసి, 2019 మొదటి క్వార్టర్‌లోనే కార్లను విక్రయాలకు సిద్ధం చేయాలని తాము కోరుతున్నామన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ నాలుగు, లేదా ద్విచక్రవాహనం ఉండాల్సిందేనని ఆ దిశగా తలసరి ఆదాయంలోనూ.. వృద్ధి రేటులోనూ పెరుగుదల కన్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. 

9babu-kia.jpg

పరస్పర ప్రయోజనం: కియ ప్రెసిడెంట్‌ పార్క్‌ 
రాష్ట్రంలో కియ ప్లాంటు ఏర్పాటు వల్ల ఏపీకీ, సంస్థకూ పరస్పర ప్రయోజనం చేకూరుతుందని కియ ప్రెసిడెంట్‌ పార్క్‌ చెప్పారు. సీఎం చంద్రబాబు పారదర్శక పాలన,  దూరదృష్టి కారణంగానే తాము ఏపీలో ప్లాంటును స్థాపిస్తున్నామని పార్క్‌ వివరించారు. ఏపీ ప్లాంటులో ఏటా 3 లక్షల కార్లను తయారు చేస్తామని, ఇందులో 90 శాతం దేశీయ మార్కెట్లోనే విక్రయిస్తామన్నారు. కియ ఏర్పాటుతో రాష్ట్రంలో కొత్త శకం మొదలైందని పార్క్‌ ప్రకటించారు. అట్టహాసంగా జరిగిన ఒప్పంద కార్యక్రమానికి మంత్రులు ఎన్‌. అమర్నాథ రెడ్డి, కామినేని శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, కిమిడి కళావెంకటరావు, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, జవహర్‌, ఏపీఐఐసీ చైర్మన్‌ పి.కృష్ణయ్య, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎ్‌స.రావత, యువజన సర్వీసుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్దార్థ జైన్‌, ఏపీఐఐసీ వీసీఎండీ నివాస్‌, అనంతపురం కలెక్టర్‌ వీర పాండ్యన్‌ తదితరులు హాజరయ్యారు. ‘కియ’ సంస్థ ప్రెసిడెంట్‌-సీఈవో హూమ్‌ వూ పార్క్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బ్యుంగ్‌యూన్‌ పార్క్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కూక్‌ హైయున్‌ షిన్‌, తదితరులతో కూడిన 15 మంది సభ్యుల బృందం పాల్గొంది.
Link to comment
Share on other sites

america vallu aara teeyadam mana goppa thanam anukomakandi.. dont have these illusions... mexico cheyyakunda toyota ki addu paddaru.. be paranoid, ikada ade jaragachu... then it will be a mess if global trade and relationships..

 

 

90% ikkade ante really good.. they might not have a problem..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...