Jump to content

Mirchi farmers ki good news

Recommended Posts

మిరప రైతులు ఆందోళన చెందవద్దు

వ్యవసాయశాఖ కార్యదర్శి రాజశేఖర్‌ స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: అదనపు ధర పథకం కింద మిరప కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ స్పష్టం చేశారు. వాస్తవంగా మిరప సాగు చేసిన రైతులందరికీ సాగు ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని అన్నారు. మిరప నిల్వలు, కొనుగోళ్లపై వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల అధికారులతో సోమవారం గుంటూరులోని వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో ఆయన సమీక్షించారు. రైతుల ఇబ్బందులతో పాటు పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వం వద్ద నిధుల్లేవని, సాగు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం నిలిపేస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నదని ఈ సందర్భంగా కొందరు అధికారులు ప్రస్తావించారు. అలాంటి వూహాగానాలకు తెరదించాలని రాజశేఖర్‌ సూచించారు. క్వింటాకు రూ.1500 చొప్పున అదనంగా ఇచ్చేందుకు నిధులకు కొరత లేదని పేర్కొన్నారు. వాస్తవంగా పండించిన రైతులందరికీ సాగుదారు ధ్రువీకరణ పత్రాలను ఇస్తామన్నారు. అకాలవర్షాలకు గుంటూరు యార్డుకు వచ్చిన మిరప తడవకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ మల్లికార్జునరావు చెప్పారు. టార్పాలిన్‌ పట్టాలను అందుబాటులో ఉంచామన్నారు

Link to comment
Share on other sites

  • Replies 94
  • Created
  • Last Reply
నిరంతరం మిర్చి కొనుగోళ్లు
02-05-2017 01:49:11
  • పసుపు రైతులకు అండగా ఉంటాం
  • అమరావతిలో ప్రాంతీయ బీమా కార్యాలయం
  • మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి వెల్లడి
కడప సెవెనరోడ్స్‌, మే 1: మిర్చి, పసుపు రైతులకు ఎలాంటి కష్టం కలుగకుండా వారిని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. మిర్చిని జూన 30వ తేదీ వరకే కాకుండా నిరంతరం కొనుగోళ్లు జరుపుతామన్నారు. రైతులను ఆర్థికంగా ఆదుకొనేందుకు ప్రాంతీయ బీమా కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. సోమవారం కడపలో వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, గ్రామీణ నీటి పారుదల విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మార్కెటింగ్‌, సహకార శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీమా కార్యాలయం హైదరాబాద్‌లో ఉండడంతో ఏపీ రైతులు వివక్షకు గురవుతున్నారన్నారు.
 
అందుకే త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఇతర అధికారులతో చర్చించి అమరావతిలో ప్రాంతీయ బీమా కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. పసుపు రైతులనూ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఏ గ్రేడ్‌ పసుపునకు రైతులు క్వింటాలుకు రూ.6 వేలు డిమాండ్‌ చేస్తే రూ.6500, బి గ్రేడ్‌కు రూ.5500 డిమాండ్‌ చేస్తే రూ.6000 చెల్లించేలా సీఎం ఆదేశాలు ఇచ్చారని సోమిరెడ్డి తెలిపారు. టీడీపీ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. సొంత భూమిలో గడ్డి పెంచుకునే రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. పాల డెయిరీ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే రైతులకు సహకరిస్తామన్నారు.
Link to comment
Share on other sites

మిర్చిపై కేంద్రం మతలబు
రాష్ట్రంలో రైతుల నుంచి నాఫెడ్‌, మార్క్‌ఫెడ్‌ మిర్చి కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేసింది. కానీ క్వింటా మిర్చిని గరిష్ఠంగా రూ.5 వేలకు మించి కొనుగోలు చేయరాదని, అలా కొనడం వల్ల వచ్చే నష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలని పేర్కొంది. ఆ నష్టం మొత్తం కొన్న విలువలో 25 శాతం దాటకూడదని అంతవరకే తాము భరిస్తామని, అది దాటాక ఎంత నష్టం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని తెలిపింది. ఈ నిర్ణయం మనకు ఆమోదయోగ్యం కాదని, ప్రస్తుతం మిర్చి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకి ఇస్తున్న రూ.1500 అదనపు మొత్తంలో కొంత భారాన్ని భరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మళ్లీ కోరదామని సమావేశంలో నిర్ణయించారు.

nastam aithe enti  raitulake kada pettedi emana dubara chestunara  :wall:

Link to comment
Share on other sites

Chilli 334 prices were quoting steady at Rs 5,200-5,500 per quintal in theGuntur spot market. The total arrivals stood steady at 30,000 bags (5,000 bagsof  Khammam teja).

Mandi Variety Prices (Rs per quintal) changes from previous day Guntur (Andhra Pradesh)

334

        5200-5500  

Steady

  Teza New

7500-7800

 Steady   Khammam Teja 8100  Steady   No- 341 5500-6000  Steady   No-5 5000-5200  Steady   No-273

6000

 Steady

The NCDEX Chilli December contract moved in the range of  Rs 5,240-5,168and is currently trading at Rs 5,212 per quintal, up by Rs 38 or 0.73% perquintal.

Link to comment
Share on other sites

మిర్చి రైతులకు బోనస్ ప్రకటించిన ఏపీ సర్కార్
 
విజయవాడ: మిర్చి రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ధరను పెంచింది. మిర్చి క్వింటాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర పెంచడంతో రైతులకు ఊరట లభించింది. మిర్చి క్వింటాకు రూ.6250 కేంద్రం ప్రకటించింది. ఈ ధరకు అదనంగా ఏపీ ప్రభుత్వం రూ.1500 బోనస్‌‌ను ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాల్లో మిర్చి క్వింటా ధర రూ.7750 లభించింది. దీంతో రైతులకు కాస్త ఊరట అభించింది.

adenti centre only 5k anadi kada  :dream:

Link to comment
Share on other sites

Akkada center announce chesindi emiti ee papers chepthundi emiti, farmers ni malli rechhagottadaaniki Hyd media ready.

5000 Rs. min support price & 1250 for expenses center announced.

Local gaa 3000 Farmers ki vasthe rest of 3250 will be share equally & given by Center & AP state.

Max. farmers ki vachhedi 6250.

Link to comment
Share on other sites

  •  
మిర్చి చివరి బస్తా వరకు కొనుగోలు చేస్తాం: చంద్రబాబు
 
636296044700030665.jpg
అమరావతి: మిర్చి కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మిర్చి కొనుగోళ్లపై అమెరికా నుంచి అధికారులతో ఆయన మాట్లాడారు. చివరి బస్తా వరకు కొనుగోలు జరిగేలా చూస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. కర్నూలు, ఒంగోలు, చిలకలూరిపేటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. శని, ఆదివారాల్లో కూడా మిర్చి కొనుగోళ్లు చేయాలని, హమాలీలకు అదనపు భత్యం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. మిర్చి కొనుగోళ్ల గడువును పొడిగించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. క్వింటాల్‌కు మద్దతు ధర రూ. 8వేలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.
Link to comment
Share on other sites

కేంద్రం మిర్చికి ఇచ్చే ధర వల్ల ఉపయోగం లేదు: సోమిరెడ్డి
05-05-2017 16:16:22
 
636295990190168901.jpg
అమరావతి: కేంద్రం ఇచ్చే ధర వల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఎఫ్ఏక్యూ మిర్చి ధర రూ.5 వేల కన్నా ఎక్కువ పలుకుతోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రూ.1500 బోనస్‌తో జూన్ 20 వరకు మిర్చి కొంటామన్నారు. అవసరమైతే జూలై వరకు పొడిగిస్తామని తెలిపారు. వ్యాపారులు ధరలు తగ్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సోమిరెడ్డి హెచ్చరించారు.
Link to comment
Share on other sites

రైతులు ఆతృత పడొద్దు: ఆదినారాయణరెడ్డి
05-05-2017 15:39:31
అమరావతి: అందరికీ ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తున్నామని, రైతులు ఆతృత పడొద్దని మంత్రి ఆదినారాయణరెడ్డి సూచించారు. ప్రతిపక్షనేత జగన్‌ దీక్షతో కేంద్రం దిగి వచ్చిందని, కేంద్రం పట్టించుకోవడం లేదని మరోసారి చెప్పి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతులు అపోహలను నమ్మొద్దని ఆదినారాయణరెడ్డి సూచించారు.
Link to comment
Share on other sites

గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ సెలవులు తగ్గించాం’
05-05-2017 16:22:06

గుంటూరు: మిర్చి మార్కెట్ యార్డ్ సెలవులు 40 రోజుల నుంచి 20 రోజులకు తగ్గించామని ఏపీ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. గుంటూరు, దాచేపల్లి, నందిగామ, పర్చూరు మార్కెట్‌ యార్డుల్లో శని, ఆది వారాల్లో మిర్చి కోనుగోలు చేస్తామన్నారు. గుంటూరు మార్కెట్ యార్డు ద్వారా ఏప్రిల్ 20 నుంచి ఇప్పటివరకు 355 మంది రైతుల వివరాలు ప్రాసెస్ చేశామని, రూ.10 కోట్లను
రైతుల బ్యాంక్‌ అకౌంట్లలో వేస్తామని రాజశేఖర్ చెప్పారు.
Link to comment
Share on other sites

Rojuki oka media channel edusthundi AP govt. meeda special programs esi. TG lo problem ekkuva vunte TG & AP kalipi vaayisthunnayi. Ee week lone Tv9 vaadu 2 times 1Hr. program vesadu for Mirchi farmers. 

Migatha parties vaallu vachhi eki padesthunnaru State Govt's ni, including BJP. TDP nunchi Market yard chairman anta Mannava Subba Rao emi answer chesthunnaru evariki artham kaadu. Mirchi farmer ki 10K ichhina gittubaatu kaadu antaadu. Rajanikanth only 2-3K isthunnaru Guntur yard lo ante kaneesam daaniki sarigga answer kooda cheyyledu.

TDP nunchi News channels ki velle vaallu 90% worst, no subject/speaking abilities to counter opposition arguments.

'

don't forget that we are in power,opposition lo unnappudu vachina spokespersons power lo unnappudu studio ki ravali ante its not possible,varla ramaiah,yvb rajendra prasad,somireddy ilanti vallu ravadam impossible,

raka emi pikutunnaru akkada

Link to comment
Share on other sites

నందిగామ, జగ్గయ్యపేట యార్డుల్లో మిర్చి కొనుగోళ్లు

amr-gen3a.jpg

నందిగామ, న్యూస్‌టుడే: నందిగామ, జగ్గయ్యపేట మార్కెట్‌ యార్డుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మిర్చి కొనుగోళ్లు చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. శనివారం జగ్గయ్యపేట, ఆదివారం నందిగామ మార్కెట్‌ యార్డుల్లో కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు. స్థానిక మార్కెట్‌ యార్డులో శుక్రవారం మిర్చి కొనుగోళ్లపై సబ్‌కలెక్టర్‌ చక్రపాణి, కార్మిక శాఖ కమిషనర్‌ పి.వి.ఎస్‌. సుబ్రమణ్యం, మార్కెటింగ్‌, రెవెన్యూ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 15 మండలాల్లో 35 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారని చెప్పారు. ప్రభుత్వం మిర్చి రైతులకు అందిస్తున్న మొత్తం కోసం గుంటూరు యార్డుకి వెళ్లి విక్రయించుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నందిగామ, జగ్గయ్యపేట యార్డుల్లోను కొనుగోళ్లు చేయాలని నిర్ణయించారని చెప్పారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనలో ఉన్నా మిర్చి రైతుల ఇబ్బందులపై నిరంతరం వివరాలు తెలుసుకుంటున్నారని తెలిపారు. ఏ రైతు ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో తగిన చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీనిలో భాగంగా నందిగామ మార్కెట్‌ యార్డులో నందిగామ, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల రైతులు, జగ్గయ్యపేట యార్డులో జగ్గయ్యపేట నియోజకవర్గ రైతులు మిర్చి విక్రయించేలా కేంద్రాలు ప్రారంభిస్తున్నారని చెప్పారు. వ్యాపారులు వచ్చి అక్కడే రైతుల వద్ద పంట కొనుగోలు చేస్తారన్నారు. క్వింటా రూ.8 వేలు కంటే తక్కువ కొనుగోలు చేస్తే ప్రభుత్వం ప్రోత్సాహంగా క్వింటాకు రూ. 1500 చెల్లిస్తుందని చెప్పారు. ప్రతి రైతు 20 క్వింటాళ్ల వరకు ప్రోత్సాహం లభిస్తుందని, రూ. 30 వేలు ప్రభుత్వ సాయం వస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో దళారుల ప్రమేయం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ మల్లికార్జునరావుకు ఫోన్‌ చేసి ఆదేశించారు. ఎక్కువ మంది వ్యాపారులు ఇక్కడికి వచ్చి మిర్చి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెక్‌పోస్టులను పటిష్ఠం చేస్తున్నట్లు చెప్పారు. ఆయా కేంద్రాలు వద్ద స్థానిక ఎమ్మెల్యేలు నిరంతరం పర్యవేక్షణ చేస్తారన్నారు. యార్డుల్లో పోలీస్‌, రెవెన్యూ, అగ్నిమాపక, మార్కెటింగ్‌ శాఖల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు, జిల్లా కార్యదర్శి బత్తిన రవి, యార్డు మాజీ ఛైర్మన్‌ కొత్తా వెంకటసాంబశివరావు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Mirchi AP lo entha pandindi, ippati varaku entha kongolu chesaru?

Ninna raghuveera edo antunnadu 1-2L Tonnes ee konugolu chesaru ani. Market yard chairman entha konugolu chesamo correct number cheppakunda anni cheptunnadu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...