Jump to content

Mirchi farmers ki good news


Recommended Posts

  • 3 weeks later...
  • Replies 94
  • Created
  • Last Reply

నెలాఖరు వరకూ పసుపు, మిర్చి కొనుగోళ్లు

ఇందుకోసం రూ.140 కోట్ల అదనపు నిధులు

మార్కెటింగ్‌ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

రైతులు గిట్టుబాటు ధర లభించేలా శాశ్వత కార్యాచరణకు ఆదేశం

ఈనాడు - అమరావతి

పసుపు, మిర్చి కొనుగోళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగించారు. గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్కెటింగ్‌ అధికారులను ఆదేశించారు. రైతులకు అందిస్తున్న ధర సక్రమంగా ఉండాలని స్పష్టం చేశారు. రైతులకు సదా గిట్టుబాటు ధర లభించేలా శాశ్వత ప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. మార్క్‌ఫెడ్‌ లాంటి సంస్థలకు వచ్చే లాభాలను మూలనిధి(కార్పస్‌ఫండ్‌)గా ఏర్పాటు చేసుకుని, రైతులకు ధరల పరంగా ఇబ్బందులొచ్చినపుడు దాన్ని వినియోగించి ఉత్పత్తులను కొనడం ద్వారా అండగా నిలిచే విషయాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు. శుక్రవారం ముఖ్యమంత్రి వెలగపూడి సచివాలయంలో మార్కెటింగ్‌ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఏర్పాటుచేసిన కేంద్రాల ద్వారా 1,74,474 క్వింటాళ్ల పసుపు, 4,77,425 క్వింటాళ్ల మిర్చి కొనుగోలు చేశామని, ధరపై రైతులకు అదనంగా చెల్లిస్తున్నందున పసుపు కొనుగోళ్ల కోసం రూ.110కోట్లు, మిర్చికి రూ.71కోట్లు వ్యయమైనట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ నెలాఖరు వరకు కొనుగోళ్లను పొడిగిస్తే అదనపు నిధులు అవసరమవుతాయని చెప్పగా.. పసుపు కొనుగోళ్లకు రూ.100 కోట్లు, మిర్చికి రూ.40 కోట్లు మొత్తం రూ.140 కోట్లు అదనంగా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఎక్కడా రాజీపడబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పౌరసరఫరాల సంస్థ, మార్క్‌ఫెడ్‌, గిడ్డంగుల సంస్థ సమన్వయంతో వ్యవహరించడం ద్వారా గిట్టుబాటు ధర కల్పించడంలో రైతులకు అండగా నిలవాలన్నారు. మార్క్‌ఫెడ్‌, పౌరసరఫరాల సంస్థలు రాష్ట్ర అవసరాలకు ఉపయోగించుకోగా మిగిలిన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలన్నారు. రైతుల అవసరాల మేరకు రాష్ట్రంలో తగినన్ని గిడ్డంగులను నిర్మించాలని ఆదేశించారు. రూ.430కోట్లు వెచ్చించి 85వేల టన్నుల కందులను ఇప్పటివరకూ కొనుగోలు చేసినట్లు అధికారులకు ముఖ్యమంత్రికి నివేదించగా.. గిడ్డంగుల సంస్థతో సమన్వయం చేసుకుంటూ వాటిని నిల్వచేయాలని, మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ కేంద్రాల్లో వినియోగించేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...