sonykongara Posted February 9, 2019 Author Posted February 9, 2019 నేడే గృహప్రవేశం09-02-2019 02:45:28 స్వగృహమస్తు నేడు 4 లక్షల ఎన్టీఆర్ ఇళ్లల్లో సామూహిక గృహ ప్రవేశాలు నెల్లూరులో ప్రారంభించనున్న సీఎం నెరవేరనున్న పేదల సొంతింటి కల గ్రామాల్లో 3 లక్షలు, పట్టణాల్లో లక్ష ఇళ్లు అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శనివారం కీలక ఘట్టం ఆవిష్కరణ కానుంది. పేదలకు సొంత గూడు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఒక్కరోజే 4 లక్షల ఇళ్ల ల్లో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహిస్తోంది. గతంలో 2 విడతల్లో 4లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేపట్టగా, ఈసా రి ఒకేసారి 4లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహిస్తుండటం విశేషం. ఇందులో 3లక్షల ఇళ్లను గ్రామీణ గృహనిర్మాణ శాఖ నిర్మించగా, లక్ష ఇళ్లను మున్సిపల్ పరిధిలోని ఏపీటిడ్కో అపార్టమెంట్ల రూపంలో నిర్మించింది. నెల్లూరులో టిడ్కో నిర్మించిన కాలనీని సీఎం చంద్రబాబు శనివా రం ప్రారంభిస్తారు. అదే సమయానికి తిరుపతిలో ఏపీ హౌ సింగ్ కార్పొరేషన్ నిర్మించిన 1800 ఇళ్ల కాలనీని గృహనిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, పంచాయతీరాజ్ మంత్రి లోకేశ్‌లు ప్రారంభిస్తారు. 4 లక్షల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలకు చిహ్నంగా నెల్లూరులో సీఎం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. గ్రామీణ గృహనిర్మాణ శాఖ 3,02,247 ఇళ్లకు రూ.3,574కోట్లు ఖర్చుచేసింది. మొదటి, రెండో విడతలో పూర్తి చేసిన ఇళ్లతో కలుపుకొంటే గ్రామీ ణ గృహనిర్మాణ శాఖ ఇప్పటివరకూ మొత్తం 7.7లక్షల గృహాలను పూర్తిచేసింది. వీటికి రూ.9,137 కోట్లు ఖర్చు చేసింది. ఎన్టీఆర్ హౌసింగ్, పీఎంఏవై- ఎన్టీఆర్ పథకాల కింద వ్యక్తిగత ఇళ్లు నిర్మిస్తుంటే, ఏపీటిడ్కో ఎన్టీఆర్ నగర్ పథకం కింద అపార్ట్మెంట్ల తరహాలో ఇళ్లు నిర్మించి ఇస్తోంది. గ్రామాల్లోనే 20లక్షలు ఒకప్పుడు గృహనిర్మాణ శాఖే గ్రామీణ, పట్టణ ఇళ్లు నిర్మించేది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పట్టణాల్లోని ఇళ్లను టిడ్కో చేపట్టింది. అయితే పట్టణాల్లోని సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే పథకాన్ని మాత్రం గృహనిర్మాణ శాఖే పర్యవేక్షిస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ హౌసింగ్ కింద 10,86,000 ఇళ్లు మం జూరు చేసింది. ఇందులో ఇచ్చే రూ.లక్షన్నర రాయితీని పూర్తిగా రాష్ట్రమే భరిస్తోంది. పీఎంఏవై గ్రామీణ్-ఎన్టీఆర్ పథకం కింద కేంద్రంతో కలిసి 1.2లక్షలు, పీఎంఏవై అర్బన్ (బీఎల్సీ) కింద 4.5లక్షలు మంజూరు చేసింది. ఇవికాకుండా ఎన్టీఆర్ పథకానికి ముందు కాంగ్రెస్ హయాంలో ప్రారంభమై మధ్యలో ఆగిపోయిన మరో 4.5లక్షల ఇళ్లు కూడా చేపట్టింది. వెరసి 20లక్షల ఇళ్లు చేపట్టగా అందులో ఇప్పటివరకూ 7.7లక్షలు పూర్తిచేసింది. మరో 70వేల ఇళ్లు దాదాపుగా పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇటీవలే 6లక్షల ఇళ్లు మంజూరుచేయగా వాటిని ఇంకా లబ్ధిదారులకు కేటాయిస్తున్నారు. ఎన్టీఆర్ హౌసింగ్‌లో ఎస్సీ, ఎస్టీలకు రూ.2లక్షలు, ఇతరులకు రూ.లక్షన్నర రాయితీ ఇస్తున్నారు. పీఎంఏవై గ్రామీణ్- ఎన్టీఆర్ పథకం కింద రూ.2లక్షలు, పీఎంఏవై అర్బన్ (బీఎల్సీ)కి రూ.3.5లక్షలు ఇస్తున్నారు. మరోవైపు గ్రామాల్లోనూ జీ ప్లస్ తరహాల ఇళ్లకు శ్రీకారం చుట్టారు. మొట్టమొదటగా కుప్పం నియోజకవర్గంలో 2వేల ఇళ్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. పేదలకు ఇంధన సామర్థ్య నివాసాలు: సీఎం ఎన్టీఆర్ నగర్ గృహనిర్మాణం పథకంలో భాగంగా ఆర్థిక బలహీన వర్గాలకు ఇంధ న సామర్థ్యంతో కూడిన పక్కా ఇళ్లు రాష్ట్ర ప్రభుత్వం అందించనుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ఎన్టీఆర్ నగర్’ పథకం కింద రూ.356.13 కోట్లతో నెల్లూరులో నిర్మించిన 4,800 ఇళ్లను సీఎం శనివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ పథకం దేశంలోని ఇతర గృహనిర్మాణ పథకాలతో పోలిస్తే ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ అర్హులైన పేదలకు శాశ్వత ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యం తో ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్నారు. మూడోసారి ఇళ్ల పండగ గ్రామీణ పేదలకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఇళ్లను కేటాయించిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్లు నిర్మించి మూడోసారి ఇళ్ల పండగకు సిద్ధమయ్యామని మంత్రి కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీలో తెలిపారు. జిల్లాల వారీగా గృహప్రవేశాల వివరాలు జిల్లా గ్రామీణ ఇళ్లు పట్టణ ఇళ్లు శ్రీకాకుళం 19567 1280 విజయనగరం 16676 2880 విశాఖపట్నం 22047 3800 తూర్పుగోదావరి 39169 12330 పశ్చిమగోదావరి 25378 22035 కృష్ణా 22274 గుంటూరు 23816 14662 ప్రకాశం 18135 నెల్లూరు 17117 14441 చిత్తూరు 21782 కడప 19913 అనంతపురం 27513 కర్నూలు 28860 25696 మొత్తం 302247 97124
sonykongara Posted February 9, 2019 Author Posted February 9, 2019 Beautiful aerial visual of #NTRHousing at Mandapeta
sonykongara Posted February 9, 2019 Author Posted February 9, 2019 N Chandrababu NaiduVerified account @ncbn 3m3 minutes ago నేడు 4 లక్షల గృహ ప్రవేశాలు చేశాం. ఇళ్లలోకి వెళ్తోన్న పేదల ఆనందోత్సాహం చూస్తుంటే ఎన్ని కష్టాలైనా ఎదుర్కోగల ధైర్యం వస్తోంది. మొత్తం రూ.80 వేల కోట్లతో 30 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే 8.70 లక్షల ఇళ్లను పూర్తి చేశాం, మిగిలినవి త్వరలోనే పూర్తి చేస్తాం. #NTRHousing Flash 1
sonykongara Posted February 9, 2019 Author Posted February 9, 2019 N Chandrababu NaiduVerified account @ncbn 4m4 minutes ago ధనిక రాష్ట్రాల్లో కూడా ఇన్ని గృహాలు నిర్మించలేదు. ఇళ్లే కాదు.. రూ.375 కోట్లతో 1,630 కి.మీ మేర సీసీరోడ్లు వేశాం. 320 గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందించాం. ఎన్టీఆర్ వైద్యసేవ కింద 1.43 లక్షల మందికి లబ్ది చేకూర్చాం. #NTRHousing
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now