Jump to content

Craze ante idi


rajanani

Recommended Posts

మెగా ఫ్యామిలీకి షాక్.. ధృవకు.. కరువైన స్పందన!

 

మరో రెండు రోజుల్లో.. మెగా వారసుడు రామ్ చరణ్ ‘ధృవ’తో ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్‌లీ వంటి పరాజయాల తరువాత తప్పనిసరిగా హిట్ సాధించాలనే పట్టుదలతో ఉన్న చెర్రీ ఈ సినిమాతో వస్తున్నాడు. అయితే, ఈ సినిమా టికెట్ల విషయంలో వస్తున్న వార్తలు.. చెర్రీ ఆశలను నీరుగార్చేలా ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే.. మెగా ఫ్యామిలీ ఆశలనే నీరుగార్చాయనే చెప్పాలి. ఎందుకంటే, చెర్రీకి మాంచి బూస్ట్ ఇవ్వడానికి ఆ కుటుంబం మొత్తం ఈ సినిమా కోసం ఎంతో శ్రమిస్తోంది. అసలు విషయం ఏమిటంటే, సాధారణంగా స్టార్ హీరోల సినిమాల టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమైన గంటల్లోనే టికెట్లన్నీ అమ్ముడవుతాయి. అంతేకాదు, రెండో రోజు టికెట్లు దొరకడం కూడా కష్టమే. కానీ, చెర్రీ సినిమా టికెట్లు మాత్రం మొదటి రోజుకు కూడా ఇంకా అందుబాటులోనే ఉన్నాయట. ఈ సినిమా ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమై.. రెండు రోజులు గడిచింది. దీంతో ఇంకా టికెట్లు అందుబాటులో ఉండడం ఈ సినిమాపై ప్రజలు ఎంత ఆసక్తిగా ఉన్నారనే దానికి అద్దం పడుతుందని విశ్లేషిస్తున్నారు టాలీవుడ్ జనాలు. మల్టీఫ్లెక్స్ థియేటర్లలోనే పరిస్థితి ఇలా ఉంటే, బీసీ సెంటర్లలో ఇంకెంత దారుణంగా ఉంటుందో అని లెక్కలు వేస్తున్నారు మెగా అభిమానులు.

Source: anddhrajyothy online

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...