sonykongara Posted December 2, 2016 Posted December 2, 2016 http://www.nandamurifans.com/forum/index.php?/topic/374208-vijayawada-convention-center-update/
sonykongara Posted December 2, 2016 Author Posted December 2, 2016 విజయవాడ కన్వెన్షన్ సెంటర్ డిజైన్ ఖరారు అదిరేలా డిజైన్లు.. అందుకునేదెవరో...? విజయవాడ కన్వెన్షన సెంటర్ డిజైన్లు విడుదల చేసిన ఇన్ కాయిస్ ఆసక్తి వ్యక్తీకరణ చేసే సంస్థలకు సూచన బిడ్స్ దాఖలుకు పొడిగింపుతో కాలక్షేపం నవ్యాంధ్ర రాజధాని చెంతన విజయవాడకు ఖ్యాతి తెచ్చేలా ఇబ్రహీంపట్నం వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ‘విజయవాడ కన్వెన్షన్ సెంటర్’ డిజైన్లను తాజాగా ఇనక్యాప్ విడుదల చేసింది. అదిరిపోయేలా డిజైన్లు విడుదల చేసినా.. ఔత్సాహిక సంస్థల నుంచి స్పందన రాలేదు. బిడ్డర్లు కోరుతున్న అంశాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవటం వల్లనే ఆసక్తి చూపించటం లేదని తెలుస్తోంది. (ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మెట్రోపాలిటన్ సిటీ కాబోతున్న విజయవాడ నగరంలో అంతర్జాతీయస్థాయి కలిగిన కన్వెన్షన్ సెంటర్ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దీని బాధ్యతలను ఇండస్ర్టియల్ ఇనఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన ఆఫ్ ఇంధ్రప్రదేశ (ఇన్ కాయిస్) సంస్థకు అప్పగించింది. ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్టుకు ఇనక్యా్‌ప టెండర్లను పిలిచింది. అమరావతి రాజధానికి చెంతన.. విజయవాడకు సమీపంలో ఉత్తరం వైపున ఉన్న కృష్ణానది తీరాన ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 33.68 ఎకరాల స్థలాన్ని కన్వెన్షన కోసం కృష్ణాజిల్లా రెవెన్యూ శాఖ గుర్తించింది. వరదలను కూడా తట్టుకునేలా, కృష్ణానది అందాలను తనివితీరా చూడటానికి వీలుగా రెవెన్యూ శాఖ ఇక్కడి భూములను గుర్తించింది.ఈ మేరకు ఇనక్యా్‌ప ఏడాది కిందట ఫేజ్-1, ఫేజ్-2లలో కన్వెన్షన సెంటర్‌ను అభివృద్ధి చేయటానికి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) కోరింది. ఫేజ్-1లో 3వేలమంది సామర్ధ్యానికి సరిపడా భారీ కన్వెన్షన సెంటర్, 50 వేల చదరపు అడుగుల స్థలంలో ఎగ్జిబిషన సెంటర్ 150 గదులతో కూడిన స్టార్ హోటల్, 75వేల చదరపు అడుగుల స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ తదితరాల వంటి వాటికి కలిపి ఆసక్తి వ్యక్తీకరణ కోరింది. మొత్తం 33.68 ఎకరాలలో ఎంట్రన్స/సెక్యూరిటీ చెక్ గేట్, ఎంట్రీ ల్యాండ్ స్కేప్, మెయిన ఇంటర్నల్ రోడ్డు, కార్ అండ్ బస్ పార్కింగ్, అర్బన ప్లాజా, రివర్ సైడ్ ల్యాండ్‌స్కేప్, ఆంపీ థియేటర్, రిటెయిల్ మాల్, మల్టీప్లెక్స్ సినిమా, మల్టీలెవల్ పార్కింగ్ గ్యారేజి, జనరేటర్, ఎలక్ర్టికకల్ సబ్‌స్టేషన, సర్వీసురోడ్డు, బస్సు స్టాప్ వంటివి అదనంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటన్నింటి కోసం ఒక లేఅవుట్ మ్యాప్‌ను ‘ఇనక్యా్‌ప’ విడుదల చేసింది. ఏడాది కిందటే ఆసక్తి వ్యక్తీకరణ కోరినా.. ఒక్క సంస్థ కూడా బిడ్ దాఖలు చేయలేదని విశ్వసనీయ సమాచారం.కన్వెన్షన్ సెంటర్’కు కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవటంతో.. బిడ్స్ సమర్పణ తేదీలను ఇండస్ర్టియల్ ఇనఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన్ కొంతకాలంగా పొడిగిస్తూ వస్తోంది. ఓ పక్క టెండర్లకు కనీస స్పందన లేకపోగా.. గడువు పొడిగిస్తున్న ఇనక్యా్‌ప ఇటీవల కన్వెన్షన సెంటర్ డిజైన్లను విడుదల చేసింది. అదిరిపోయేలా డిజైన్లు విడుదల చేసినా.. ఔత్సాహిక సంస్థల నుంచి స్పందన రాకపోవటం గమనార్హం. లీజు, అగ్రిమెంట్ ఫీజుల విషయంలో బిడ్డర్లు కోరుతున్న అంశాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవటం వల్లనే ఆసక్తి చూపించటం లేదని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టు గురించి వివరాలు వెల్లడించటానికి ప్రాజెక్టు మేనేజర్ నిరాసక్తత కనిపిస్తున్నారు.ఈ డిజైన్లను చూపిస్తూ...మంచి వ్యాపార భవిష్యత్తు ఉంటుందన్న భరోసా బిడ్డర్లలో నింపే ప్రయత్నాన్ని ఇనక్యా్‌ప చేసింది. విడుదల చేసిన డిజైన్లలో ఓవరాల్‌గా కన్వెన్షన సెంటర్ స్వరూపం.. మల్టీప్లెక్స్ ఎలాఉండాలి? ఎగ్జిబిషనసెంటర్, స్టార్ హోటల్, మూన హోటల్ ఎలా ఉండాలి? అంతర్గతంగా ల్యాండ్ స్కేపింగ్, ఇంటీరియర్ డిజైనింగ్‌కు సంబంధించి డిజైన్లను విడుదల చేసింది. వాటిని చూసిన తర్వాతైనా బిడ్డర్లు ఆసక్తి చూపుతారనుకుంటే సింగిల్ బిడ్ కూడా రాలేదు. డిజైన్స విడుదల చేసినా.. ఆదరణ రాకపోవటానికి కారణమేమిటన్నది అంతుచిక్కటం లేదు. ఇనక్యా్‌ప చర్యలు వ్యాపార వర్గాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వారి కోణంలో.. కొన్ని నిబంధనలు బిడ్స్ వేయటానికే ఇబ్బందికరంగా ఉందని తెలుస్తోంది. పీపీపీ విధానంలో పనులు అప్పగించినపుడు గతంలో విఫలమైన అంశాలను, ప్రభుత్వం నష్టపోతున్న అంశాలను దృష్టిలో ఉంచుకుని అగ్రిమెంట్ నిబంధనలను టైట్ చేసింది. పీపీపీకి ఇచ్చేటపుడు లీజ్ అగ్రిమెంట్‌తో పాటు, రెవెన్యూ షేర్ విలువలకు సంబంధించి నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉన్నాయన్న ఉద్దేశ్యంతో సంస్థలు ముందుకు రావటం లేదని సమాచారం. లీజు విలువల ఏటా 5 శాతం చొప్పున పెంచుకుంటూ పోవటం వల్ల నష్టపోతామన్న భావనలో బిడ్డర్లు ఉన్నట్టు సమాచారం. బిడ్డర్ల నుంచి వస్తున్న ప్రతిపాదనలను ఇనక్యా్‌ప పరిగణనలోకి తీసుకోవటం లేదు. విమర్శలు వస్తున్న నేపథ్యంలో, విజయవాడ కన్వెన్షన సెంటర్ భవిష్యత్తుపై ఇనకాయిస్ అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వచ్చి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
sonykongara Posted December 2, 2016 Author Posted December 2, 2016 ఇబ్రహీంపట్నం కన్వెన్షన్ సెంటర్ డిజైన్ ఖరారు విజయవాడ కు సమీపంలో, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన, కన్వెన్షన సెంటర్ కు డిజైన్లు ఖరారు చేసింది, ఇండస్ర్టియల్ ఇనఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన ఆఫ్ ఇంధ్రప్రదేశ (ఇన్ కాయిస్). అమరావతిలో అంతర్జాతీయ స్థాయి కలిగిన కన్వెన్షన్ సెంటర్ లేకపోవటంతో, ఈ నిర్మాణం చేపట్టాలి అని, ప్రభుత్వం భావించింది. కృష్ణానది తీరాన ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 33.68 ఎకరాల స్థలంలో కన్వెన్షన సెంటర్ నిర్మంచనున్నారు. ఈ నిర్మాణం, రెండు ఫేజ్-1, ఫేజ్-2లలో కట్టనున్నారు. ఫేజ్-1లో 3 వేలమంది సామర్ధ్యానికి సరిపడా భారీ కన్వెన్షన సెంటర్, 50 వేల చదరపు అడుగుల స్థలంలో ఎగ్జిబిషన సెంటర్ 150 గదులతో కూడిన స్టార్ హోటల్, 75వేల చదరపు అడుగుల స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. అయితే, ఈ నిర్మాణ టెండర్లకు, కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదు. లీజు, అగ్రిమెంట్ ఫీజుల విషయంలో బిడ్డర్లు లేవనెత్తిన అంశాలు, ఇండస్ర్టియల్ ఇనఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన్ పట్టించుకోవట్లేదు అని, అందుకే ఎవరూ ముందుకు రావట్లేదు అని అంటున్నారు. కొన్ని నిబంధనలు మారిస్తే, కాంట్రాక్టర్లకు వెసులుబాటు ఉంటుంది అని, అవి సవరిస్తే, బిడ్డర్లు ముందుకు వచ్చే అవకాసం ఉంది. తొందరగా ఈ సమస్య పరిష్కారం అయితే, విజయవాడ కు ఈ కన్వెన్షన్ సెంటర్ ఒక మణిహారం అవుతుంది అనటంలో అతిశయోక్తి లేదు
AnnaGaru Posted December 15, 2016 Posted December 15, 2016 Today cabinet approved Vijayawada convention center మంత్రివర్గం తీసుకున్న కొన్ని నిర్ణయాలు..* అమరావతిలో 186 కి.మీల బాహ్య, అంతరవలయ రహదారుల నిర్మాణానికి ఆమోదం* విజయవాడలోని జక్కంపూడిలో 250 ఎకరాల పరిధిలో ఆర్థికనగరం అభివృద్ధికి ఆమోదం* విశాఖలోని 11 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం
sonykongara Posted December 15, 2016 Author Posted December 15, 2016 Today cabinet approved Vijayawada convention center మంత్రివర్గం తీసుకున్న కొన్ని నిర్ణయాలు.. * అమరావతిలో 186 కి.మీల బాహ్య, అంతరవలయ రహదారుల నిర్మాణానికి ఆమోదం * విజయవాడలోని జక్కంపూడిలో 250 ఎకరాల పరిధిలో ఆర్థికనగరం అభివృద్ధికి ఆమోదం * విశాఖలోని 11 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం edi vizag kadha bro
AnnaGaru Posted December 15, 2016 Posted December 15, 2016 @sonykongara, my bad. This is vizag and in the present CII summit area. They want to complete in an year it seems.
sonykongara Posted December 15, 2016 Author Posted December 15, 2016 @sonykongara, my bad. This is vizag and in the present CII summit area. They want to complete in an year it seems. http://www.nandamurifans.com/forum/index.php?/topic/378791-vizag-smart-city/
swarnandhra Posted December 15, 2016 Posted December 15, 2016 Jakkampudi lo "ardhika nagaram" enti, akkada (265 acres lo) poor ki free housing (28000 units) annaruga?
AnnaGaru Posted December 15, 2016 Posted December 15, 2016 convention center much needed Asap .. Chustunte adi kattelopu Taj Gateway vadu inko hotel kadatadu Govt pay chese money tho
nivas_hyd Posted December 16, 2016 Posted December 16, 2016 Convention center exact location ekkada?..
Saichandra Posted December 16, 2016 Posted December 16, 2016 Convention center exact location ekkada?.. pwd grounds,mg road,opposite state guest house
swarnandhra Posted December 20, 2016 Posted December 20, 2016 Jakkampudi lo "ardhika nagaram" enti, akkada (265 acres lo) poor ki free housing (28000 units) annaruga? it was clarified today in AndhraJyothy. no housing as earlier anounced. now it is for economic city ఏపీ ఆర్థిక నగరంగా జక్కంపూడి అభివృద్ధి20-12-2016 06:24:46 విజయవాడ నగర ఉత్తర వాయువ్య దిశలో ఉన్న జక్కంపూడి ప్రాంతాన్ని ఆర్థిక నగరంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడ నుంచి భవిష్యత్తులో రాష్ర్టాభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జక్కంపూడిని వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడను మరింత విస్తరింప చేయటానికి ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ఉత్తర, వాయువ్య ప్రాంతాన్ని అటు నున్న, ఆగిరిపల్లి, నూజివీడు ఇటు గన్నవరం వరకు ఉన్న ప్రాంతంపై దృష్టి సారించారు. ఆర్థిక నగరాన్ని ప్రారంభించటానికి వీలుగా ముందుగా హౌసింగ్ కోసం సిద్ధం చేసిన 265 ఎకరాల లే అవుట్‌ను దీని కోసం ఉపయోగించుకోవాలని చూడటం గమనార్హం.(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
sonykongara Posted March 7, 2017 Author Posted March 7, 2017 నిబంధనలు ‘కన్వెన్షన్ సెంటర్’కు అడ్డంకులు ఫ నిబంధనలపై బిడ్డర్ల అసంతృప్తి లీజు, రెవెన్యూ షేర్‌లపై పెదవి విరుపు నాలుగు నెలలుగా వాయిదా పడుతున్న టెండర్లు రాజధాని చెంతన కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. పీపీపీ విధానంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ బిడ్డర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం దగ్గర రాజధాని అవసరాలకు తగిన విధంగా భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని చేపట్టాలన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన్ ఆఫ్ ఆధ్రప్రదేశ్ (ఇన్‌క్యాప్) పీపీపీ విధానంలో టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఇన్‌క్యాప్ పిలిచిన టెండర్లకు మంచి స్పందన వచ్చింది. దాదాపుగా 10 సంస్థలు టెండర్లలో పాలు పంచుకోవటానికి పోటీ పడ్డాయి. మూడువేల కెపాసిటీ కలిగిన కన్వెన్షన్ సెంటర్‌తో పాటు 300 - 400 సామర్ధ్యం కలిగిన సమావేశ మందిరాలు, వైఫై కనెక్ట్ ఏరియాలు, లాంజ్ స్పేస్, కియోస్క్ , 12 మీటర్ల ప్లీనరీ హాల్‌తో పాటు, ఎగ్జిబిషన్ హాల్స్, ఔట్‌డోర్ ఎగ్జిబిషన్ హాల్, 150 రూములు కలిగిన ఫోర్ స్టార్ హోటల్, షాపింగ్ మాల్ సినిమా థియేటర్లు, ఫుడ్ కోర్టులు, గేమింగ్ జోన్ వంటివి ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయటానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)ను విడుదల చేసింది. ఈ ఆర్‌ఎఫ్‌పీ ప్రకారం కాంట్రాక్టు సంస్థలు పనులు చేపట్టవలసి ఉంటుంది.సిండికేట్‌గా బిల్డర్లు ఈ ప్రాజెక్టు పీపీపీ విధానంలో ఉండటంతో బిడ్డర్లు ఎంవోయూ ప్రాజెక్టుల నిబంధనలను అధ్యయనం చేశారు. నిబంధనల గురించి తెలిసిన తర్వాత బిడ్డర్లు ఎప్పటికప్పుడు గడువు కోరుతున్నారు. బిడ్డర్లంతా సిండికేట్‌గా ఏర్పడి గడువు కోరుతున్నారు. దీంతో నాలుగు నెలలుగా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇంతకీ ఎంఓయూ ఒప్పందాలలో ఏముందంటే.. సంస్థకు అందించే స్థల నిర్మాణానికి మార్కెట్ విలువ ఆధారంగా 2 శాతం చొప్పున అద్దె విలువను చెల్లించాల్సి ఉంటుంది. ఈ అద్దె ప్రతి సంవత్సరం 5శాతం చొప్పున పెరుగుతుంటుంది. గతంలో పీపీపీ ప్రాజెక్టులకు లీజు కాల వ్యవధి 33 సంవత్సరాలు ఉండేది. ఇటీవల ప్రభుత్వం లీజు కాల వ్యవధిని 99 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం మార్కెట్ విలువపై 5 శాతం అద్దె పెంచుకుంటూపోతే తాము నష్టపోతామన్న భావనలో బిడ్డర్లు ఉన్నారు. దీంతో పాటు రెవెన్యూ షేర్ నిబంధన వల్ల ప్రభుత్వానికి ప్రయివేటు సంస్థల ఆదాయంలో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.పీపీపీ విధానంతో ఆదాయం గతంలో పీపీపీ ప్రాజెక్టుల వల్ల ప్రయివేటు సంస్థలు లబ్ధిపొందేవి. ప్రభుత్వ రాయితీలతో వ్యాపారాలు చేసుకుని తాము మాత్రమే బాగు పడేవి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ర్టాభివృద్ధికి ఆదాయం అవసరమన్న కోణంలో ప్రభుత్వం పీపీపీ విధానాన్ని సమీక్షించింది. ఈ సందర్భంగాఈ రెండు నిబంధనలనుప్రవేశపెట్టింది. ఈ నిబంధనలనే ఇప్పుడు బిడ్డర్లు ప్రశ్నిస్తున్నారు. బిడ్డర్ల అభ్యంతరాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు టెండర్లు ఖరారయ్యే పరిస్థితి కనిపించటం లేదు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now