Jump to content

ఎన్టీఆర్‌ కోరికను బాలయ్య తీరుస్తున్నారు


Ramesh39

Recommended Posts

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ వందో చిత్రానికి దర్శకత్వం వహించడం తన అదృష్టమని దర్శకుడు క్రిష్‌ అన్నారు. ఈ చిత్రంపై యూనిట్‌ మొత్తానికి పూర్తి విశ్వాసం ఉందని.. తప్పకుండా ఘనవిజయం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విజయాన్ని కాంక్షిస్తూ బాలకృష్ణ అభిమానులు ఈరోజు ఫిలింనగర్‌లోని దైవసన్నిధానంలో మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, క్రిష్‌, చిత్ర యూనిట్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా క్రిష్‌ మాట్లాడుతూ.. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని బాలకృష్ణ తప్ప మరొకరు చేయలేరని అన్నారు. దాదాపు అన్ని పౌరాణిక పాత్రలు పోషించిన స్వర్గీయ ఎన్టీఆర్‌కు గౌతమిపుత్ర శాతకర్ణి పాత్ర తీరని కోరికగా మిగిలిపోయిందని.. దానిని ఆయన కుమారుడు నెరవేర్చారని అన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ 79రోజుల్లోనే పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రీ రికార్డింగ్‌ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. బాలకృష్ణ అభిమానులతో పాటు ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు క్రిష్‌ వెల్లడించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...