minion Posted October 22, 2016 Posted October 22, 2016 I hope they make it affordable so middle class can participate and enjoy. That's how a vibrant, inclusive society and economy is built.
Anne Posted October 22, 2016 Posted October 22, 2016 I hope they make it affordable so middle class can participate and enjoy. That's how a vibrant, inclusive society and economy is built.ohh. Ivi middel class games antaru ok..
minion Posted October 22, 2016 Posted October 22, 2016 ohh. Ivi middel class games antaru ok.. what's wrong with that?
Nfdbno1 Posted October 25, 2016 Posted October 25, 2016 ohh. Ivi middel class games antaru ok.. Kachitham ga... watersports middle class ee kada. Intlo swimming pool kattali anatledu kada
sonykongara Posted August 21, 2017 Author Posted August 21, 2017 నవ్యాంధ్రకు జల క్రీడాహారం నాగాయలంక జలక్రీడల అకాడమీకి అంగీకరించిన అధికారులు..! నాగాయలంక : రాష్ట్రాన్ని జలక్రీడాకారుల కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం జల క్రీడల కేంద్రాల ఏర్పాటుకు చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరుకుంది. కృష్ణా జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, నాగాయలంక ప్రాంతాల్లో జలక్రీడల శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కావాల్సిన భూమి సమస్య తొలగిపోవటంతో సోమవారం జలక్రీడా కేంద్రాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. నాగాయలంకలో శ్రీరామ పాదక్షేత్రం ఘాట్ సమీపంలో 70 సెంట్ల ప్రభుత్వ భూమిని జలక్రీడల అకాడమీ కోసం రెవెన్యూ అధికారులు కేటాయించగా తాత్కాలిక వసతి ఏర్పాటు కోసం కె.పాలెం ప్రాథమిక పాఠశాలను ఎంపికచేశారు. రాజధాని సమీపంలో ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద మూడెకరాల భూమిని జలక్రీడల కేంద్రం కోసం సేకరించగా ఇక్కడ భవనాల నిర్మాణం పూర్తయిన అనంతరం కార్యకలాపాలు ప్రారంభించేందుకు జిల్లా క్రీడా ప్రాధికారిత సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. నేడు విజయవాడలో వెలువడనున్న ప్రకటన జలక్రీడల శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై సోమవారం విజయవాడలో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేలా విజయవాడ పున్నమీఘాట్ వద్ద సోమ, మంగళవారాల్లో క్రీడా ప్రాధికారిత సంస్థ జలక్రీడల క్రీడాకారులతో ప్రత్యేకంగా ప్రదర్శనలు ఇస్తారు. ఆదివారం సాయంత్రం దీనికి సంబంధించి పలువురు క్రీడాకారులు ముందస్తుగా రిహార్సల్స్ చేసుకోగా సోమవారం సాయంత్రం మూడు గంటల నుంచి ఈ ప్రదర్శనలు ఉంటాయి. రాష్ట్రంలో నాలుగుచోట్ల జలక్రీడల కేంద్రాలు జలక్రీడలను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాల నుంచి మెరికల్లాంటి క్రీడాకారులను తయారుచేసేందుకు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో జలక్రీడల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా జిల్లా పరిధిలోని నాగాయలంక, ఇబ్రహీంపట్నం వద్ద, పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రకాలువ వద్ద, విజయనగరం జిల్లా తాటిపూడి వద్ద జలక్రీడల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గత నాలుగురోజులుగా రాష్ట్ర క్రీడా ప్రాధికారిత సంస్థ, జలక్రీడల నిపుణులతో ఆయా కేంద్రాల్లో పరిశీలన చేపట్టి అక్కడి పరిస్థితులకనుగుణంగా డిజైన్‌లను రూపొందిస్తున్నారు. ఆదివారం రాష్ట్ర కయాకింగ్ అండ్ కనోయింగ్ సొసైటీ కార్యదర్శి సాంబశివారెడ్డి నాగాయలంక ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడ జలక్రీడల అకాడమీ ఏర్పాటుకు ఎలాంటి వనరులు కల్పించాలనే విషయమై అధ్యయనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కయాకింగ్, కనోయింగ్ విభాగంలో 19 రకాల పోటీలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఉన్నాయని, వాటిలో క్రీడాకారులకు శిక్షణ ఇస్తామని సాంబశివారెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం కేటాయించిన భూములను, బ్యాక్‌వాటర్‌తో కూడిన నదీపాయను సద్వినియోగం చేసుకుంటామన్నారు. త్వరలో అకాడమీ ఏర్పాటు నాగాయలంకలో జలక్రీడల నిర్వాహకులకు అనువైన స్థలం నదిని ఆనుకొని లభించడంతోపాటు తాత్కాలికంగా శిక్షణ పొందేవారికి వసతి కల్పించేందుకు భవనాలు కూడా అందుబాటులో ఉండటంతో రాబోయే ఒకట్రెండు నెలల్లోనే నాగాయలంకలో జలక్రీడల శిక్షణ కేంద్రం ప్రారంభం కానుంది. దాదాపు 30కిపైగా వివిధ రకాల బోట్లతో 40 మంది విద్యార్థులకు కయాకింగ్, సెయిలింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. కేరళ రాష్ట్రంలో మాత్రమే బ్యాక్‌వాటర్ పాయల్లో నదీ ప్రవాహానికి ఎదురుగా శిక్షణ పొందే వీలు ఉండగా నాగాయలంకలోని బ్యాక్‌వాటర్ పాయలోనూ అలాంటి పరిస్థితులే ఉండటంతో కయాకింగ్‌లో శిక్షణ పొందే విద్యార్థులకు సామర్థ్యం అధికమయ్యే అవకాశం ఏర్పడుతుందని శివారెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నంలో నది గ్రామానికి దూరంగా ఉండటంతో అక్కడ మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేయటం పూర్తయిన తరువాత జలక్రీడల కేంద్రాన్ని ప్రారంభించవచ్చని తెలుస్తోంది. నాగాయలంకలో రానున్న పదిపదిహేను రోజుల్లో జలక్రీడలపై ఈ ప్రాంతవాసులకు అవగాహన కల్పించేలా ఒక భారీ ప్రదర్శనను ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. ఇప్పటికే జలక్రీడల శిక్షణ పొందిన క్రీడాకారులతో కయాకింగ్, సెయిలింగ్ విన్యాసాలు చేయిస్తున్నామని శివారెడ్డి తెలిపారు. ఆదివారం నాగాయలంక ఘాట్‌ను, జలక్రీడల కోసం కేటాయించిన భూమిని తహశీల్దార్ ఎస్.నరసింహారావు, ఎంపీపీ సజ్జా గోపాలకృష్ణ, దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ మండవ బాలవర్థిరావుతో కలిసి ఆయన పరిశీలించారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now