Jump to content

దర్శకేంద్రుడు, తారక్.. ఓ క్రేజీ కాంబినేషన్!


Ramesh39

Recommended Posts

636112644096254658.jpg

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలను పరిచయం చేశారాయన. రొమాంటిక్ పాటలను తీయడంలో దిట్ట. వేటగాడు, అడవిరాముడు అంటూ సందేశాత్మక చిత్రాలు తీసినా.. జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి ఫాంటసీ కథను తెరపై చూపించినా.. అన్నమయ్య, రామదాసులతో భక్తిరసాన్ని పండించినా ఆయనకే చెల్లింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆయన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అని. అవును ఆయనే. నిన్నటితరం దర్శకులంతా నేటితరం దర్శకుల ముందు నిలవలేక కనుమరుగైపోతున్నా దర్శకేంద్రుడు మాత్రం నిలదొక్కుకున్నారు. తాజాగా నాగార్జునతో ఓం నమో వెంకటేశాయ సినిమాను తీస్తున్నారు. రాఘవేంద్రరావుకు శిష్యుడైన రాజమౌళి ‘బాహుబలి’ లాంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించిన నేపథ్యంలో.. గురువుగారు కూడా విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్దపీట వేసేలా ఓ సినిమా తీయబోతున్నారట. అయితే ఆ సినిమాలో హీరోగా ఎవరో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. జనతాగ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్‌తో మళ్లీ తానేంటో చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి ఆ సినిమా చేస్తాడట దర్శకేంద్రుడు. అయితే.. ఈ విషయం మాత్రం అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తారని అంటున్నారు. ఆ సినిమా ఓ పౌరాణిక చిత్రం అయినా ఆశ్చర్యపోనవసరం లేదని టాలీవుడ్ వర్గాల టాక్. మరి ఈ కాంబినేషన్ సెట్ అయితే.. క్రేజీ కాంబినేషన్ అన్నట్టే మరి!!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...