Jump to content

It is not easy for Jagan to win from Srikakulam


swarnandhra

Recommended Posts

కడపలో జగన్‌ గెలవడం గొప్పకాదు 
25-08-2016 02:42:47
636076897684294352.jpg
  •  శ్రీకాకుళంలో నెగ్గడం ఆయనకు సులువు కాదు 
  •  టీడీపీలోకి నేను వెళ్తే ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం 
  •  ధర్మాన సంచలన వ్యాఖ్యలు 
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి) 
వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కడపలో పోటీచేసి గెలవడం గొప్ప కాదని, అక్కడ పార్టీకి అనుకూలంగా ఓటు వేసే వాళ్లు అధికంగా ఉంటారని, అదే శ్రీకాకుళంలో గెలవడం జగన్‌కు కష్టమని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లను దగ్గరకు తీసుకోవడం, ఓడిపోయిన వారిని దూరం పెట్టడం అనే నైజాన్ని జగన్‌ ఇప్పటికైనా వదులుకోవాలని హితవుపలికారు. తాను టీడీపీలో చేరితే శ్రీకాకుళంలో ఎమ్మెల్యేగా గెలవగలనని ఘంటాపథంగా చెప్పారు. బుధవారం సాయంత్రం శ్రీకాకుళంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో ధర్మాన కాస్త ఆవేశంగా ప్రసంగించారు. ‘కడప జిల్లాలో 26 శాతం ఎస్సీ, ఎస్టీలున్నారు. అలాగే రెడ్లు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీ వర్గాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వైసీపీ తరపున కడపలో జగనే కాకుండా ఇంకెవరు పోటీచేసినా గెలవగలరు. అక్కడ నేను పోటీ చేసినా గెలుస్తాను. కుల సమీకరణాల పరంగా వైసీపీకి అనుకూలంగా ఆరు జిల్లాలే ఉన్నాయి. మిగతా జిల్లాల్లో ఇతర పార్టీలకు ఆకర్షితులైన వర్గాలు అధికంగా ఉన్నందున వైసీపీ తరుఫున ఎవరూ పోటీచేసినా గెలవడం కష్టమే. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుల సమీకరణలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ వెనుకబడిన బీసీ వర్గాలు ఎక్కువ. కాళింగ, కాపు, వెలమ ఇతర సామాజికవర్గాల ప్రభావం చాలా అధికం. ఇక్కడ ఎవరుపడితే వారు గెలవడం సాధ్యం కాదు. అందుకే జగన్‌ శ్రీకాకుళానికి వచ్చి పోటీ చేస్తే నెగ్గడం అంత సులభం కాదు. నేను గనుక టీడీపీలో చేరి శ్రీకాకుళంలో పోటీచేస్తే కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తా’ అని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ‘గడప గడపకూ వైసీపీ’ కార్యక్రమానికి ప్రజాదరణ బాగుందని, కానీ పార్టీకి అనుకూల పత్రిక ఉండి కూడా ప్రజల్లోకి చొచ్చుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమావేశంలో పలువురు కార్యకర్తలు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన ఇప్పటికైనా తన మైండ్‌సెట్‌ మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. 

 
ధర్మాన వ్యాఖ్యలతో వైసీపీలో కలకలం
జగన్‌పై ధర్మాన వ్యాఖ్యలు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సమావేశం తర్వాత పలువురు పార్టీ రాష్ట్ర నేతలు ధర్మానను వివరణ అడిగినట్లు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలు ప్రతిపక్షం బలహీనతలపై విరుచుకుపడేందుకు అధికార పక్షానికి ఆయుధాన్ని అందించాయని, ప్రజల్లో పార్టీ చులకనవడానికి అవకాశం కల్పించాయని పార్టీ నేతలు మండిపడుతున్నారు. నిజానికి ధర్మాన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాక పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. సీనియర్‌ నేతను అయినప్పటికీ.. కేవలం ఓటమిపాలయ్యానన్న కారణంతో జగన్‌ దూరంగా ఉంచారనే భావన ఆయనలో నెలకొంది. ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల తర్వాత జగన్‌ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. తమిళనాడులో గోడకూలి చనిపోయిన శ్రీకాకుళం కార్మికుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చారు. ఆ సమయంలో ధర్మాన జగన్‌ను కలవలేదు. పార్టీ నేతల ఒత్తిడి, తన సోదరుడు ధర్మాన కృష్ణదా్‌సతో మంతనాలతో కాస్త మెత్తబడి జగన్‌ను కలిశారు. క్రమేపీ సత్సంబంధాలు నెలకొన్నాయి. దీంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఆయనకు కట్టబెట్టారు. అయితే తనకు గాని, తన వర్గానికి గాని  జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని ఆయన ఆశించారు. కానీ రెడ్డి శాంతికి ఇవ్వడంతో ధర్మాన హతాశుడై క్రియాశీల పాత్ర పోషించడం తగ్గించారు. కాగా.. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి.. పెన్నా సిమెంట్స్‌కు అడ్డగోలుగా భూములు కేటాయించిన కేసులో గత నెలలో సీబీఐ ధర్మానపై సప్లమెంటరీ చార్జిషీట్‌ కూడా నమోదు చేసింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...