Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో... ఆనందం.. ఆరోగ్యం
15-02-2019 08:57:22
 
636858178440134179.jpg
  • ఇది నవ్యాంధ్ర రాజధానిలోనే సాధ్యం
  • 18 నెలల్లో బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం
  • శాస్త్రోక్తంగా శంకుస్థాపన కార్యక్రమం
  • హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు
గుంటూరు/తుళ్లూరు (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలోని తుళ్లూరులో గురువారం బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి, పరిశోధన సంస్థకి వైభవంగా శంకుస్థాపన క్రతువు జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ట్రస్ట్‌ చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్‌, స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు శంకుస్థాపన కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. మంచు విపరీతంగా ఉండటంతో హెలిక్రాఫ్టర్‌లో రావాల్సిన సీఎం ఉదయం 9.15 గంటలకు రోడ్డుమార్గంలో శంకుస్థాపన ప్రదేశానికి చేరుకొని శిలాఫలకం ఆవిష్కరించారు. అంతకంటే ముందే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర ప్రత్యేక హోమం నిర్వహించి వాస్తుదోష పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగించారు. గౌతమబుద్ధ శాతకర్ణి వీరగాథని బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించి ఈ తరానికి వారి గొప్పని తెలియజేశారు. అలానే ఎన్‌టీఆర్‌ జీవితాన్ని కథానాయకుడు సినిమా రూపంలో తీసుకొచ్చి ఈ తరానికి ఆయన గొప్పతనాన్ని కళ్లకు కట్టారు. గౌతమీ పుత్ర శాతకర్ణి స్ఫూర్తితో అమరావతిని అభివృద్ధి చేస్తానని సీఎం వాగ్దానం చేశారు.
 
 
34 వేల ఎకరాల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌లో ఇచ్చారు.. ఇక్కడి రైతుల స్ఫూర్తిని నేనెప్పుడూ మరచిపోను అన్నారు. మీరు భూములు ఇవ్వకపోయి ఉంటే అభివృద్ధి లేదు. ఒకప్పుడు కొండవీటి వాగు వరద ముంపుని చూడటానికి వచ్చి రైతులకు న్యాయం చేసేందుకు పోరాడేవాళ్లం. అలాంటి కొండవీటి వాగు ముంపుని శాశ్వతంగా అదుపులోకి తీసుకొచ్చాం. ప్రకాశం పంతులు బ్యారేజ్‌కు పునాదిరాయి వేసిన రోజునే వైకుంఠపురం బ్యారేజ్‌కు శంకుస్థాపన చేశాం. ఇదొక చరిత్ర, నగరాన్ని నిర్మించడమే కాదు, అందులో అందరూ ఆనందంగా ఎలా ఉండాలనేదే ఆలోచన అని చెప్పారు. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉన్నది. ఎంత ఆనందంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారని సూచించారు.
 
 
రాజధానిని కాలుష్యరహిత ప్రదేశంగా అభివృద్ధి చేస్తున్నాం. విద్యుత్‌ వాహనాలు, ఎయిర్‌ కండీషనర్లు లేకుండా ఒక డక్ట్‌ ద్వారా ఇంటింటికి కనెక్షన్లు ఇవ్వడం, గ్యాస్‌, వాటర్‌ లైన్స్‌ వంటివన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇదొక శక్తిమంతమైన అమరావతి కావాలన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రముఖ అంకాలజిస్టు నోరి దత్తాత్రేయుడు ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబునాయుడు సహకారంతో ఇక్కడ కూడా క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్మాణం జరగబోతోన్నది. ఆయన ఈ దేశానికి ఒక గర్వకారణం. అది ఎన్నో సందర్భాల్లో నిరూపణ అయిందన్నారు. ట్రస్టుబోర్డు సభ్యురాలు డాక్టర్‌ తులసీ దేవి పోలవరపు ప్రసంగిస్తూ తాము జీవితం అంటే సంపాదనే కాదు సమాజానికి సేవ చేస్తేనే పరమార్థం అని నిర్ణయించుకొని 1992లో పాఠశాల స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాఠశాలని ఇంగ్లీషు మీడియంలో నిర్వహిస్తోన్నాం.
 
 
ఆ పాఠశాలలో చదువుకొన్న ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని చెప్పారు. బసవతారకం ఆస్పత్రికి తాము రూ.12 కోట్లు విరాళాలు సేకరించి ఇంచి అందులో భాగస్వామ్యం కావడం జరిగిందన్నారు. నాడు 35 శాతంగా ఉన్న బ్రెస్టు క్యాన్సర్‌ రోగులు నేడు 3 శాతానికి తగ్గిందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ తులసీ దేవి పోలవరపు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, ఎన్‌ఎండీ ఫరూక్‌, కొల్లు రవీంద్ర, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, నాట్స్‌ అధ్యక్షుడు మన్నవ మోహన్‌కృష్ణ, కలెక్టర్‌ కోన శశిధర్‌, జేసీ హిమాన్షు శుక్ల, సీఆర్‌డీఏ కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, దామినేని శ్రీనివాసరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు, ట్రస్టు బోర్డు సభ్యులు డాక్టర్‌ జీ దశరాథరామిరెడ్డి, జేఎస్‌ఆర్‌ ప్రసాద్‌, శ్రీభారత్‌ మోత్కుపల్లి, రాజధాని రైతులు తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం బాలకృష్ణ, సీఎం చంద్రబాబు నాయుడిని రాజధాని రైతులు, నందమూరి అభిమాన సంఘం అధ్యక్షుడు నెకుదిటి చందు మిత్రమండలి సభ్యులు గజమాలతో సత్కరించారు
 
 
ఎన్టీఆర్‌ సదాశయంతో..
ఎన్టీఆర్‌ సదా శయంతో పు రుడు పోసుకొన్న సంస్థ ఇది. 120 పడకలతో ఆ స్పత్రిని ప్రా రంభించి నేడు 500ల పడకలకు పెంచాం. 150 మంది వైద్యులు, 1,500 మంది సిబ్బంది నిరంతరం క్యాన్సర్‌ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అమరావతిలో నిర్మించే ఆస్పత్రిని హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తాం. తొలిదశలో 300 పడకలు, రెండో దశలో 200, మూడో దశలో 500 పడకలు కలిపి మొత్తం వెయ్యి పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయబోతున్నాం. ఇందుకోసం రూ.300 కోట్లు ఖర్చు పెడుతున్నాం.
- నందమూరి బాలకృష్ణ
 
 
మానవీయ కోణంలో వైద్యసేవలు
హైదరాబా ద్‌లో నిర్మించిన బసవతారకం క్యాన్సర్‌ ఆస్ప త్రికి రాజకీయ, ఆర్థిక, సాంకేతిక ఒడిదుడుకులు కార ణంగా 12 ఏళ్ల సమయం పడితే అమరావతి ఆస్పత్రి నిర్మాణానికి పన్నెండు నెలలే తీసుకొంటాం. ఈ సంస్థ రోగ నిర్ధారణ, క్యాన్సర్‌కి చికిత్స అందించడంలో ముందుంది. పేదలకు మానవీయకోణంలో పని చేస్తుంది.
- డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, ఏపీ శాసనసభాపతి
Link to comment
Share on other sites

అమరావతి మెడికల్‌ హబ్‌
15-02-2019 02:09:12
 
636857933537361993.jpg
  • బసవతారకం ఇండో- అమెరికన్‌ కేన్సర్‌ హాస్పిటల్‌ శంకుస్థాపనలో సీఎం
గుంటూరు, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ‘దేవతలకు రాజధాని అమరావతి. దేవేంద్రుడు పరిపాలించిన ప్రాంతమిది. గౌతమిపుత్ర శాతకర్ణి ఒక యుద్ధ వీరుడిలా పోరాడారు. అయితే ఇప్పుడు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన స్ఫూర్తితో అమరావతిని ప్రపంచానికి ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతా’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. బసవతారకం ఇండో-అమెరికన్‌ కేన్సర్‌ హాస్పిటల్‌, పరిశోధన సంస్థ నిర్మాణానికి రాజధాని పరిధి గ్రామం తుళ్లూరులో గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ, ‘మా అత్త బసవతారకం కేన్సర్‌ సోకి చాలా బాధపడ్డారు. ఆ బాధను మేమంతా చూశాం. అప్పట్లో చెన్నై, ముంబై వంటి నగరాల్లోనే ఆస్పత్రులు ఉండేవి. అమెరికాలో చికిత్స తీసుకొన్న తర్వాత ఆమె చనిపోయారు.
 
ఆ సందర్భంలోనే మనం ఒక కేన్సర్‌ ఆస్పత్రి పెట్టుకోలేమా అని ఎన్టీఆర్‌ ప్రశ్నించారు. ఆ స్ఫూర్తితో ముందడుగు వేశాం. హైదరాబాద్‌లో ఆస్పత్రి ఏర్పాటు చేశాం. కేన్సర్‌ను తగ్గించడమే ఎన్టీఆర్‌కు ఇచ్చే నివాళి’ అని అన్నారు. 14 మెడికల్‌ కళాశాలలు, ఆస్పత్రులతో అమరావతి దేశానికే మెడికల్‌ హబ్‌ కాబోతోందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. స్పీకర్‌ కోడెల మాట్లాడుతూ హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి 12ఏళ్ల సమయం పడితే అమరావతిలో 12నెలల్లోనే నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రసంగిస్తూ తొలిదశలో 300, రెండో దశలో 200, మూడో దశలో 500 పడకలు కలిపి మొత్తం వెయ్యి పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయబోతోన్నామని, ఇందుకోసం రూ.300కోట్లు ఖర్చు పెడుతోన్నామన్నారు.
 
శంకుస్థాపన కార్యక్రమానికి నందమూరి వారసులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు. కాగా, కేన్సర్‌ బారినపడి చనిపోయిన కాళహస్తి కిరణ్‌కుమార్‌ జ్ఞాపకార్థం ఆయన తండ్రి దుర్గారావు రూ.5లక్షల విరాళాన్ని ఆస్పత్రి నిర్మాణానికి సీఎం చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆంకాలజిస్టు నోరి దత్తాత్రేయుడు, డాక్టర్‌ తులసీదేవి, మంత్రులు పుల్లారావు, ఆనంద్‌బాబు, ఫరూక్‌, రవీంద్ర పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Foundation stone of cancer hospital laid in Amaravati
Foundation stone of cancer hospital laid in Amaravati

Foundation stone of cancer hospital laid in Amaravati

Friday, Feb 15, 2019

 

 

Chief Minister Chandrababu Naidu laid the foundation for Basavatarakam Indo-American Cancer Hospital and Research Institute at Tullur village in Amaravati yesterday.

A world-class cancer hospital and research institute with 1,000-bed capacity will be built in 15 acres of site allotted by State govt, in three phases. In the first phase, 300-bed hospital will be developed for awareness, prevention and early detection of cancer. It will provide state of the art diagnostic facilities, advanced treatment as a nonprofit organization in the service of cancer patients.

Speaking on the occasion, the Chief Minister stressed upon the need for more research programs to prevent cancer. "The priority should be given to research regarding detection of cancer at an early stage. He said Amravati stands for innovation and by adopting best practices it would be developed as a medical hub," he said.

"Everyone should work for serving the society and reducing the suffering of people," he added.

Over 12.5 million people are suffering from cancer globally. The proposed cancer hospital in Amaravati would be developed as a world-class cancer center with support from the State government.
 
Link to comment
Share on other sites

అమరావతి నిర్మాణం బాగుంది
16-02-2019 09:24:14
 
636859058532833842.jpg
  • రాజధానిని సందర్శించిన ఆనంద నగరాల సదస్సు ప్రతినిధులు
అమరావతి ఆంధ్రజ్యోతి): అ మరావతి నగరం చక్కగా రూ పుదిద్దుకుంటోందని దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు కితాబిచ్చారు. ఆనంద నగరాల స దస్సు-2019లో భాగంగా శుక్రవారం వారు రాజధానిని సందర్శించారు. విజయవాడ నుం చి బయల్దేరినవారు తొలుత ఉద్ధం డరా యునిపాలెంలోని ఎక్స్‌పీరియన్స్‌ సెంట ర్‌కు చేరుకోగా, సీఆర్డీయే అధికారులు రాజ ధాని రూపకల్పనకు సంబంధించిన విశేషాలను తెలియజేశారు. ఆ కేంద్రంలో ప్రదర్శిస్తున్న అమరావతిలోని వివిధ నిర్మాణాల 3 డి నమూనాలు ప్రతినిదులను ఆకట్టుకున్నాయి. అనంతరం అఖిల భారత సర్వీస్‌ అధికారుల కోసం రాయపూడిలో నిర్మిస్తున్న నివాస సము దాయాన్ని వారు పరిశీలించారు. అక్కడ అన్ని హంగులతో సిద్ధమైన నమూనా ఫ్లాట్‌ను చూ సి, దానిపై సంతృప్తి ప్రకటించారు. ఆ తర్వాత సచివాలయం మరియు శాఖాధిపతుల కార్యా లయాలకు ఉద్దేశించిన టవర్లు, మంత్రులు, సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారుల కోసం నిర్మిస్తున్న బంగళాలు, హైకోర్టు తాత్కాలిక నిర్వహణ కోసం నిర్మించిన జ్యుడీషియల్‌ కాం ప్లెక్స్‌, గెజిటెడ్‌, ఎన్జీవోల కోసం నిర్మిస్తున్న టవ ర్లను, విట్‌ అమరావతి ప్రాంగణాన్ని వారు చూశారు. చివర్లో వెలగపూడి సచి వాలయం లోని రియల్‌ టైం గవర్నెన్స్‌ కేంద్రాన్ని సందర్శించిన ప్రతినిధులకు అక్కడి అఽధికారులు దాని పనితీరు గురించి వివరించగా, బాగుందన్నారు.
Link to comment
Share on other sites

హైకోర్టు భవనాన్ని పరిశీలించిన ఏసీజే

 

16ap-state20a.jpg

తుళ్ళూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో నిర్మిస్తోన్న హైకోర్టు భవనాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ శనివారం పరిశీలించారు. భవనంలో జరుగుతున్న పనులు, ఏర్పాటుచేస్తున్న సౌకర్యాలను ఇంజినీర్లు ఆయనకు వివరించారు.

 

Link to comment
Share on other sites

జూన్‌నాటికి అంబేడ్కర్‌ స్మృతివనం 

 

మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడి

16ap-state5a_1.jpg

శాఖమూరు(తుళ్ళూరు),న్యూస్‌టుడే: ప్రపంచానికే తలమానికంగా   నిలిచేలా భారత రాజ్యాంగ రచయిత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనం నిర్మిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. రాజధాని అమరావతి పరిధిలో శాఖమూరు వద్ద నిర్మిస్తున్న అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేస్తోన్న స్మృతివనం పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.వచ్చే జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని వివరించారు.

 

Link to comment
Share on other sites

అంబేద్కర్‌ కీర్తిని చాటేలా స్మృతివనం
17-02-2019 09:15:52
 
636859917512110210.jpg
  • మంత్రి ఆనందబాబు
  • ఉన్నతాధికారులతో కలిసి పనుల పరిశీలన
తుళ్లూరు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటేలా రాజధాని అమరావతిలో ఆయన స్మృతి వనం నిర్మిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శాఖమూరు రెవెన్యూలో ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్‌ స్మృతివనాన్ని మంత్రి శనివారం పరిశీలించారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం పనులు, 20 ఎకరాలలో నిర్మిస్తున్న స్మృతివనాన్ని మంత్రి ఆనందబాబు సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రావత్‌తో కలసి పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. త్వరితిగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనందబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అంబేద్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకొని ఆయన కీర్తి ప్రతిష్టలు దశదిశలా వ్యాపించేలా నూతన రాజధాని అమరావతి నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహ ఏర్పాటుతోపాటు స్మృతి వనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
 
 
దీనిలో భాగంగా రాష్ట్రంలో అధికారులు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని విగ్రహం , స్మృతివనం నమూనాను కూడా ఎంపిక చేసే పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఫౌండేషన్‌ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయని, జూన్‌ మాంసాంతానికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత నిర్మాణ సంస్థకు, అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి ఆనందబాబు వివరించారు. రూ.168 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తుండగా, కేపీసీ సంస్థ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా స్మృతి వనంలో ఆయన జీవిత విశేషాలన్నీ ప్రస్ఫుటించేలా నిర్మాణం చేపట్టడంతోపాటు ఆయన రచనలకు సంబంధించిన పుస్తకాలన్నీ ఉండేలా లైబ్రరీని కూడా ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలో ప్రతి పర్యాటకుడు ఒక్కసారి అంబేద్కర్‌ స్మృతి వనాన్ని సందర్శించేలా నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు మద్దిరాల జోసెఫ్‌ ఇమ్యానియేల్‌ (మ్యానీ), సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
 
Link to comment
Share on other sites

రాజధానికి రాచబాట

 

ap-main1a_8.jpg

రాజధాని అమరావతికి మణిహారంగా భావిస్తున్న సీడ్‌యాక్సిస్‌ రహదారి తుది దశ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉండవల్లి నుంచి దొండపాడు గ్రామం వరకు సుమారు 21 కిలోమీటర్ల మేరకు.. ఆరు వరుసలతో అత్యంత నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాలతో పటిష్ఠంగా దీనిని నిర్మిస్తున్నారు. వర్షపు నీరు చుక్క కూడా నిలవకుండా రోడ్డుకు ఇరువైపులా ప్రత్యేక డ్రైనేజీల నిర్మాణంతో పాటు భవిష్యత్తులో విద్యుత్‌ తీగలు, వివిధ కేబుళ్ల నిమిత్తం రహదారిని తవ్వకుండా పవర్‌డక్టులనూ ఏర్పాటు చేస్తున్నారు. అమరావతిని గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఈ సీడ్‌ యాక్సిస్‌ రహదారికి ఇరువైపులా భారీగా మొక్కలను నాటారు. ప్రస్తుతం దీనిపై వాహనాలు దూసుకుపోతున్నాయని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 90 శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. స్థానికంగా నిర్మించే ఆర్టీరియల్‌, కలెక్టోరల్‌ రోడ్లను దీనికి అనుసంధానం చేస్తామని వివరించారు.    - ఈనాడు, అమరావతి

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...