Jump to content

Amaravati


Recommended Posts

అసెంబ్లీ, హైకోర్టుకు కొత్త డిజైన్లు
13-12-2017 03:19:09
 
636487319541701950.jpg
  • సవరించిన డిజైన్లు తీసుకొచ్చిన నార్మన్‌ ఫోస్టర్స్‌
  • సీఎం ఓకే అంటే వెంటనే ఖరారు!
  • చంద్రబాబు చెప్పినట్లుగానే ప్లాన్‌లో మార్పులు
  • మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకూ సీఆర్‌డీఏ పరిశీలన
  • నేటి భేటీలో పాల్గోనున్న దర్శకుడు రాజమౌళి
అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): నార్మన్‌ ఫోస్టర్స్‌ ఇచ్చిన అసెంబ్లీ డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం పరిశీలించనున్నారు. అన్నీ ఓకే అయితే వెంటనే ఖరారు చేసే అవకాశం ఉంది. రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో తలమానికంగా నిర్మించదలచిన అసెంబ్లీ డిజైన్లపై లండన్‌ నుంచి వచ్చిన మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ప్రతినిధులు ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులకు మంగళవారం వివరించారు.
 
విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో సాయంత్రం ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి పొద్దుపోయేవరకు గంటల తరబడి సుదీర్ఘంగా సాగింది. ఈ భేటీలో ఫోస్టర్‌ ప్రతినిధులు అసెంబ్లీ కోసం రూపొందించిన 2 డిజైన్లను ప్రదర్శించినట్లు తెలిసింది. వీటితోపాటు గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదించిన హైకోర్టు(అమరావతిలోని మరొక ఐకానిక్‌ బిల్డింగ్‌, స్థూపాకారం) డిజైన్‌ కు సంబంధించిన మార్పులను, మొత్తంగా పరిపాలనా నగరం కోసం సిద్ధం చేసిన మాస్టర్‌ప్లాన్‌ను వారు చూపించినట్లు సమాచారం.
 
వీటన్నింట్లో సీఆర్డీయే ఉన్నతాధికారులు, నిపుణులు కొన్ని మార్పుచేర్పులను సూచించారని తెలిసింది. ఆ ప్రకారం సవరించిన డిజైన్లను ఫోస్టర్‌ ప్రతినిధులు బుధవారం వెలగపూడిలో చంద్రబాబుకు చూపించి, ఆయన అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. గత కొన్ని నెలలుగా డిజైన్ల రూపకల్పన ప్రక్రియలో చురుకైన పాత్ర పోషిస్తోన్న ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎ్‌స.రాజమౌళి కూడా ఈ కీలక భేటీకి హాజరు కానున్నారు.
 
 
హైకోర్టు డిజైన్‌ , మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు...
అక్టోబరులో హైకోర్టు కోసం ఆమోదించిన బౌద్ధ స్థూపాకారపు డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మలచి, ఫోస్టర్‌ ప్రతినిధులు తాజా సమావేశంలో ప్రదర్శించినట్లు తెలిసింది. అంతేకాకుండా దీనిలోని అంతర్గత నిర్మాణాలు, ఫ్లోర్‌ ప్లాన్‌ ఇత్యాది అంశాల్లోనూ చెప్పుకోదగిన మార్పుచేర్పులు సూచించినట్లు భోగట్టా. పరిపాలనా నగరపు మాస్టర్‌ ప్లాన్‌లోనూ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయని తెలిసింది. గతంలో ఇందులో చూపిన జలవనరులు, పచ్చదనం, నిర్మాణాలకు మధ్యన ప్రతిపాదించిన ఖాళీ స్థలం తదితర అంశాల్లోనూ ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేసి, మెరుగైన మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించినట్లు సమాచారం.
 
 
ఆకట్టుకున్న టవర్‌ డిజైన్‌?
ఈ ఏడాది అక్టోబరులో ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో మంత్రి నారాయణ, దర్శకుడు రాజమౌళి, సీఆర్డీయే ఉన్నతాధికారులతో కూడిన బృందం లండన్‌ వెళ్లి, మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నిపుణులతో జరిపిన చర్చల్లో అసెంబ్లీకి సంబంధించి 2 డిజైన్ల పట్ల సుముఖత వ్యక్తమవడం తెలిసిందే. వీటిల్లో ఒకటి చతురస్రాకారపు ఆకృతి కాగా, మరొకటి మధ్యలో పొడవాటి సూదిమొనను పోలిన టవర్‌ను కలిగిన డిజైన్‌. అయితే మన సంస్కృతి, వారసత్వాలకు అద్దం పడుతూనే మరింత సృజనాత్మకంగా, వైవిధ్యంగా ఆకృతులు ఉండాలని సీఎం కొన్ని మార్పులు సూచించారు. ఆ ప్రకారం సవరించిన డిజైన్లను నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు మంగళవారం సీఆర్డీయే ఉన్నతాధికారులకు చూపించారు.
 
అసెంబ్లీకి తాజాగా తెచ్చిన 2 డిజైన్లూ గతంతో పోల్చితే గణనీయంగా మెరుగు పడినప్పటికీ, వాటిల్లో టవర్‌ ఉన్న ఆకృతి, సమావేశంలో పాల్గొన్న వారిలో అత్యధికుల మన్ననలను చూరగొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి మొదటి నుంచీ ఈ డిజైన్‌కే అధికారులు, నిపుణులతోపాటు ప్రజల మద్దతు కూడా లభించింది. అయితే నిర్మాణ, భద్రతాపరమైన కారణాల దృష్ట్యా మధ్యలో కొంత ఎత్తు వరకే ‘వ్యూయింగ్‌ టవర్‌’లాగా నిర్మించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

విశ్వ నగరి’కి మరిన్ని హంగులు!
13-12-2017 03:20:32
 
  • నిపుణుల సూచనలకు ఆహ్వానం
  • రేపటి నుంచి డీప్‌ డైవ్‌ వర్క్‌షాప్‌
అమరావతి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దుకునేందుకు వడివడిగా అడుగులేస్తున్న అమరావతి అదే సమయంలో ‘హ్యాపీ సిటీ’గానూ విలసిల్లాలంటే ఇంకా ఏమేం చర్యలు, విధానాలు చేపట్టాలో నిపుణుల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు ఏపీ సీఆర్డీయే గురు, శుక్రవారాల్లో ‘అమరావతి డీప్‌ డైవ్‌ వర్క్‌షాప్‌’ నిర్వహించనుంది. దేశ, విదేశాల్లో పేరొందిన ప్రముఖుల అభిప్రాయాలను ఈ వర్క్‌షా్‌పలో సీఆర్డీయే సేకరించి, తన భావి ప్రణాళికల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వనుంది. ‘ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌, క్వాలిటీ లివింగ్‌, స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ ఇన్‌ ఫ్రా స్ట్రక్చర్‌, గవర్నెన్స్ ’ అనే 4 అంశాలపై ప్రధానంగా సలహాలు, సూచనలు పొందనుంది.
 
 
తొలిరోజు సీఎం చంద్రబాబు రాజధానిపై తమ ఆకాంక్షలు, లక్ష్యాలను వర్క్‌షాపులో వివరిస్తారు. అనంతరం పైన పేర్కొన్న అంశాలపై నిపుణులు సలహాలు, సూచనలు అందజేస్తారు. రాజధానిలో నిర్మించనున్న గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌, అందులోని అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ సముదాయం, గవర్నమెంట్‌ హౌసింగ్‌, ప్రాంగణంలో జల వనరులు, పచ్చదనం (బ్లూ గ్రీన్‌కాన్సెప్ట్ ) తదితరాలపై సీఆర్డీయే ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది. మౌలిక వసతులు, రవాణా వ్యవస్థ, రాజధానిని హ్యాపీ సిటీగా మలచేందుకు తాము తీసుకున్న చర్యలను సీఆర్డీయే వివరించనుంది.
 
 
అంతర్జాతీయ వైద్య, స్వస్థత కేంద్రంగానూ, గ్లోబల్‌ మీడియా సిటీగానూ అమరావతిని అభివృద్ధి చేయడంతోపాటు ఇందులోని స్పోర్ట్స్‌ సిటీ కోసం నిర్ధేశించుకున్న ‘టార్గెట్‌ 2036’, విజ్ఞానాధారిత ఆర్థికాభ్యున్నతికి నెలవుగా రాజధానిని మలచడంపై నిపుణులు ప్రసంగిస్తారు. అమరావతికి మొదట వచ్చిన విట్‌, ఎస్‌.ఆర్‌.ఎం, అమృత విశ్వవిద్యాలయాల ప్రతినిధులతోపాటు సింగపూర్‌ కన్సార్షియం సభ్యుల ప్యానెల్‌ చర్చ నిర్వహించనుంది.
 
అమరావతిని హ్యాపీసిటీగా, లీజర్‌ డెస్టినేషన్‌గా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా చర్చిస్తారు. రాబోయే సంవత్సరానికి అమరావతి నిర్మాణంలో అనుసరించదగిన విధానాలపై శుక్రవారం మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ సవివర చర్చ జరుగుతుంది. అంతటితో ఈ వర్క్‌షాప్‌ ముగుస్తుంది.
Link to comment
Share on other sites

ఏపీ సచివాలయంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి
13-12-2017 11:07:54
 
636487600786948456.jpg
అమరావతి: ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బుధవారం ఏపీ సచివాలయానికి విచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో సీఆర్డీఏ అథారటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు దర్శకుడు రాజమౌళితోపాటు రాష్ట్ర మంత్రి నారాయణ, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులు విచ్చేశారు. కాగా... అమరావతిలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, ఆయా విభాగాల డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. 
Link to comment
Share on other sites

14, 15 తేదీల్లో అమరావతి అభివృద్ధిపై కార్యశాల

ఈనాడు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నగరాన్ని బహుముఖంగా సుఖ జీవనానికి అనువైన రీతిలో అభివృధ్ధి చేయడంపై రెండు రోజులపాటు కార్యశాల నిర్వహించనున్నారు. రాష్ట్రప్రభుత్వం, రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ (సీఆర్‌డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) కలసి ఈ నెల 14, 15 తేదీల్లో విజయవాడలో ఈ కార్యశాల ఏర్పాటుచేశాయి. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి, యోగ్యమైన జీవనం, స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పన, పాలన అనే అంశాలు కార్యక్రమ ఎజెండాలో ఉన్నాయి. మెక్‌కిన్సే, సింగపూర్‌కి చెందిన సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌, ఫోస్టర్స్‌ పార్ట్‌నర్స్‌, సీహెచ్‌2ఎం లాంటి ప్రముఖ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాలుపంచుకొంటారు. తొలి రోజు సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పురపాలక మంత్రి నారాయణ హాజరవుతారు. అమరావతిని ఆనంద నగరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన దృక్పథం, ప్రణాళిక, కార్యాచరణపై  చర్చిస్తారు.

Link to comment
Share on other sites

రాజధాని ఆకృతులు నేడు ఖరారయ్యే అవకాశం!
13brk80a.jpg

అమరావతి: రాజధాని నిర్మాణం, భవనాల ఆకృతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. మంత్రి నారాయణ, సినీ దర్శకుడు రాజమౌళి, నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు, సీఆర్‌డీఏ అధికారులు హాజరైన ఈ సమావేశంలో అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లు ఖరారు చేసే అవకాశముంది. అమరావతి నిర్మాణంపై నిపుణులతో విజయవాడలో రేపటి నుంచి రెండ్రోజుల కార్యశాల నిర్వహించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యశాలలో 15 బృందాలతో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. మౌలిక సదుపాయాలు, నాలెడ్జ్‌ ఎకానమీ, నిర్మాణ రీతులు, రవాణా వ్యవస్థ, ఉద్యోగాల కల్పన, సుస్థిర ఆర్థికాభివృద్ధి వంటి అంశాలతో పాటు నవ నగరాల నిర్మాణంపై బృంద చర్చలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. స్థానికంగా ఉండే ఆర్కిటెక్‌లు, ప్రొఫెసర్లు, ప్రముఖులను ఈ కార్యశాలలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు.

 

Link to comment
Share on other sites

ఆర్డీఏ అథారిటీ సమావేశం ప్రారంభం
13-12-2017 12:52:28
636487663529539761.jpg
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ బుధవారం సమావేశమైంది. మంత్రి నారాయణ, దర్శకుడు రాజమౌళి, సీఆర్డీఏ ఉన్నతాధికారులు, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అమరావతిలోని అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లను ప్రభుత్వం ఖరారు చేయనుంది. నార్మన్‌ ఫోస్టర్స్‌ ఫోస్టర్స్ బృందం ఇచ్చిన కొత్త డిజైన్లను చంద్రబాబు పరిశీలించనున్నారు. అన్నీ ఓకే అయితే వెంటనే ఖరారు చేసే అవకాశం ఉంది.
 
రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో తలమానికంగా నిర్మించదలచిన అసెంబ్లీ డిజైన్లపై లండన్‌ నుంచి వచ్చిన మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులకు మంగళవారం వివరించారు. వీటితో పాటు గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదించిన హైకోర్టు డిజైన్‌కు సంబంధించిన మార్పులను, మొత్తంగా పరిపాలనా నగరం కోసం సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్స్‌ను చూపించారు. వీటన్నింటిలో సీఆర్డీఏ ఉన్నతాధికారులు, నిపుణులు కొన్ని మార్పులు, చేర్పులను సూచించారని తెలిసింది. ఆ ప్రకారం సవరించిన డిజైన్లను పోస్టర్ ప్రతినిధులు వెలగపూడిలో చంద్రబాబు చూపించి ఆయన అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా డిజైన్ల రూపకల్పన ప్రక్రియలో పాలు పంచుకుంటున్న ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి కూడా ఈ కీలక భేటీకి హాజరయ్యారు.
 
ఈ ఏడాది అక్టోబరులో ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో మంత్రి నారాయణ, దర్శకుడు రాజమౌళి, సీఆర్డీయే ఉన్నతాధికారులతో కూడిన బృందం లండన్‌ వెళ్లి, మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నిపుణులతో జరిపిన చర్చల్లో అసెంబ్లీకి సంబంధించి 2 డిజైన్ల పట్ల సుముఖత వ్యక్తమవడం తెలిసిందే. వీటిల్లో ఒకటి చతురస్రాకారపు ఆకృతి కాగా, మరొకటి మధ్యలో పొడవాటి సూదిమొనను పోలిన టవర్‌ను కలిగిన డిజైన్‌. అయితే మన సంస్కృతి, వారసత్వాలకు అద్దం పడుతూనే మరింత సృజనాత్మకంగా, వైవిధ్యంగా ఆకృతులు ఉండాలని సీఎం కొన్ని మార్పులు సూచించారు. ఆ ప్రకారం సవరించిన డిజైన్లను నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు...సీఆర్డీయే ఉన్నతాధికారులకు చూపించారు. వీటిపై ఇప్పుడు చర్చించి సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకోనున్నారు.
Link to comment
Share on other sites

అసెంబ్లీ ఆకృతులను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం
13-12-2017 16:13:09
636487783945417391.jpg
అమరావతి: అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు కొత్త డిజనైన్లు సిద్ధమయ్యాయి. నార్మన్ పోస్టర్స్ బృందం ఇచ్చిన కొత్త డిజైన్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అసెంబ్లీ భవనానికి టవర్ డిజైన్‌వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపారు. అసెంబ్లీకి సంబంధించి టవర్, స్థూపకాల డిజైన్లను ఆన్‌లైన్‌లో ఉంచుతామని మంత్రి నారాయణ ప్రకటించారు. గురువారం సాయంత్రం వరకు ప్రజాభిప్రాయం తెలుసుకోనున్నారు. ఆ తర్వాత నార్మన్ పోస్టర్స్ బృందంతో బాబు సమావేశమవుతారు. అనంతరం అధికారికంగా డిజైన్ల ఖరారును ప్రకటించే అవకాశం ఉంది.
 
రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో తలమానికంగా నిర్మించదలచిన అసెంబ్లీ డిజైన్లపై లండన్‌ నుంచి వచ్చిన మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులకు వివరించారు. వీటితోపాటు గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదించిన హైకోర్టు, డిజైన్‌‌కు సంబంధించిన మార్పులను, మొత్తంగా పరిపాలనా నగరం కోసం సిద్ధం చేసిన మాస్టర్‌ప్లాన్‌ను చూపించారు. వీటన్నింటిలో సీఆర్‌టీఏ ఉన్నతాధికారులు, నిపుణులు కొన్ని మార్పులు, చేర్పులు సూచించారని సమాచారం. ఆ ప్రకారం సవరించిన డిజైన్లను నార్మన్ పోస్టర్ ప్రతినిధులు వెలగపూడిలో చంద్రబాబు చూపించి ఆయన అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా డిజైన్ల రూపకల్పనల ప్రక్రియలో పాలుపంచుకుంటున్న దర్శకుడు రాజమౌళి కూడా ఈ కీలక భేటీకి హాజరయ్యారు.
 
ఈ ఏడాది అక్టోబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో మంత్రి నారాయణ, రాజమౌళి, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులతో కూడిన బృందం లండన్ వెళ్లి మాస్టర్ ఆర్కిటెక్ట్ నిపుణులతో జరిపిన చర్చల్లో అసెంబ్లీకి సంబంధించి రెండు డిజైన్లపట్ల సుముఖత వ్యక్తం చేసింది. వీటిల్లో ఒకటి చతురస్రాకారపు ఆకృతి కాగా, మరొకటి మధ్యలో పొడవాటి సూదిమొనను పోలిన టవర్‌ను కలిగిన డిజైన్‌. అయితే మన సంస్కృతి, వారసత్వాలకు అద్దం పడుతూనే మరింత సృజనాత్మకంగా, వైవిధ్యంగా ఆకృతులు ఉండాలని సీఎం కొన్ని మార్పులు సూచించారు. ఆ ప్రకారం సవరించిన డిజైన్లను నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు సీఆర్డీయే ఉన్నతాధికారులకు చూపించారు. వీటిపై ఇప్పుడు చర్చించి సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకోనున్నారు.
Link to comment
Share on other sites

తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సూచనలు చేశాం: రాజమౌళి
13-12-2017 16:42:16
636487801415697780.jpg
 
అమరావతి: పాలనా నగర భవనాలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సూచనలు చేశామని దర్శకుడు రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ఆమోదించిన డిజైన్‌లో వాటిని పొందుపరచలేదని అన్నారు. మీడియా సిటీ, సాంస్కృతిక కేంద్రం భవనాల్లో తెలుగు సంస్కృతికి సంబంధించిన మార్పులు చేస్తామన్నారు. అసెంబ్లీకి టవర్‌ డిజైన్‌ వైపే అందరూ మొగ్గు చూపారని అన్నారు. సీఎం చంద్రబాబు కూడా టవర్‌ డిజైన్‌ వైపే మొగ్గు చూపారని రాజమౌళి పేర్కొన్నారు.
 
అంతకుముందు కలిసినప్పుడు నార్మన్ పోస్టర్స్ బృందానికి రెండు డిజైన్లపై వర్క్ చేయమని సీఎం చంద్రబాబు చెప్పారని, ఇవాళ నార్మన్ బృందం వాటిపై ప్రజంటేషన్ ఇచ్చారని రాజమౌలి తెలిపారు. అందులో ఒక డిజైన్ ఖరారు అయిందని, టవర్ ఆకృతికి తన సలహా ఏమీ లేదని దర్శకుడు తెలిపారు. రేపు సాయంత్రం వరకు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని ఆ తర్వాత సీఎం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
Link to comment
Share on other sites

2019 మార్చి నాటికి రాజధాని భవనాల నిర్మాణం పూర్తి: నారాయణ
13-12-2017 17:00:47
 
636487812525165352.jpg
అమరావతి: వారం రోజుల్లో అమరావతి పాలనా నగర భవనాల నిర్మాణాలకు టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. బుధవారం నార్మన్ పోస్టర్స్ బృందం ఇచ్చిన అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు కొత్త డిజనైన్లు సీఎం చంద్రబాబుతోపాటు నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2019 మార్చి నాటికి రాజధాని భవనాల నిర్మాణం పూర్తి అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏడాదిలో భవనాలు పూర్తిచేస్తామని అన్నారు. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతుందని, భవిష్యత్‌ తరాలు గుర్తించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, జాప్యం జరుగుతుందన్న ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి అన్నారు. అసెంబ్లీకి టవర్, స్థూపాకార డిజైన్లను ఆన్‌లైన్‌లో ఉంచుతామని, రేపు సాయంత్రం వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం సీఎంతో సమావేశమవుతామన్నారు. హైకోర్టుకు స్థూపాకార డిజైన్‌ ఇప్పటికే ఖరారు అయిందని నారాయణ వెల్లడించారు.
Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణంలో నాది ఉడుత పాత్ర: రాజమౌళి
13brk119a.jpg

అమరావతి: రామసేతు నిర్మాణంలో ఉడుత పోషించిన పాత్రను రాజధాని నిర్మాణంలో తాను పోషిస్తున్నానని సినీ దర్శకుడు రాజమౌళి తెలిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి తెలుగుదనం ఉట్టిపడేలా తాను కొన్ని డిజైన్లు రూపొందించానన్న ఆయన.. తాను సూచించిన కొన్ని మార్పులను మీడియాసిటీకి వాడుకుంటామని సీఎం చెప్పినట్లు వివరించారు. రాజధానిలో అసెంబ్లీ నిర్మాణం కోసం ఇచ్చే డిజైన్‌ కోసం పని చేయాలని సీఎం కోరారని, ఒక డిజైన్‌ అందరికీ నచ్చిందని ఆయన వెల్లడించారు.

అసెంబ్లీకి సంబంధించి రెండు ఆకృతులపై చర్చించామని, టవర్‌ ఆకృతి అందరికీ నచ్చిందని మంత్రి నారాయణ వెల్లడించారు. రెండు డిజైన్లను రేపు సాయంత్రం వరకు పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచుతామన్న ఆయన రేపు మళ్లీ నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నట్లు తెలిపారు. సభాపతికి అసెంబ్లీ డిజైన్లు చూపిస్తామని చెప్పారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Dravidict said:

Emi ledhani vadu kuda foundation stone chupinchadu. SRM vaadu keka. Appatlo photo lo chupinchina building as it is dimputhunnadu. Complete ayyaka super look vuntundhi

 

SRM-University-Amravati.jpg

Yes as it is dimpaadu appatlo ee design chusi asalu same ilane kadathara ledha photos lo matrame ila vuntada anukunna bu as it is dimpaadu

Link to comment
Share on other sites

14 minutes ago, mahesh1987 said:

BR shetty vallu ento asalu start cheyyaledu inkaa

బీఆర్‌ షెట్టి మెడిసిటీ: అబుదాబికి చెందిన బీఆర్‌ షెట్టి సంస్థ రాజధానిలో మెడిసిటీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. రాజధానికి వస్తామని ఆ సంస్థ చెప్పి ఏడాదిన్నర దాటింది. ప్రతిపాదన దశలోనే చాలా జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఆ సంస్థకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) 100 ఎకరాలు కేటాయించింది. బీఆర్‌ షెట్టి మెడిసిటీ ప్రాజెక్టుకు ఆగస్టు రెండో వారంలో శంకుస్థాపన జరిగింది. తొలి దశలో రూ.6,500 కోట్లు పెట్టుబడి పెడతామని బీఆర్‌ షెట్టి ప్రకటించారు.

5ap-main9b.jpg

ప్రస్తుత పరిస్థితి: సీఆర్‌డీఏ భూమి అప్పగించింది. అమ్మకపు ఒప్పందం జరగాల్సి ఉంది. తమ పెట్టుబడులకు రిజర్వు బ్యాంకు నుంచి కొన్ని అనుమతులు కావలసి ఉందని, ఈ ప్రాజెక్టు కోసం అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడానికి సమయం పడుతోందని బీఆర్‌ షెట్టి సంస్థ చెబుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అబుదాబీలో పర్యటించినప్పుడు బీఆర్‌ షెట్టితో రాజధానిలో మెడిసిటీ ప్రాజెక్టు ప్రస్తావనా వచ్చింది. ఒక గుత్తేదారు సంస్థను ఎంపిక చేశామని, ప్రణాళిక సిద్ధమవుతోందని షెట్టి చెప్పారు. ఇప్పుడు గుత్తేదారు ఎంపిక కోసం మళ్లీ టెండర్లు పిలవనున్నట్టు ఆ సంస్థ చెబుతోందని సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. మరో నెలా, రెండు నెలల్లో పనులు మొదలు కావొచ్చునని భావిస్తున్నారు.
ఐయూఐహెచ్‌: బ్రిటన్‌కు చెందిన ఇండో-యూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సంస్థ లండన్‌లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్‌ కాలేజీ హాస్పిటల్‌ భాగస్వామ్యంతో మెడిసిటీ ప్రాజెక్టు చేపడుతోంది. ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో 50 ఎకరాలు కేటాయించింది. రెండో దశలో మరో 100 ఎకరాలు ఇవ్వాలన్నది ఒప్పందం. ఈ ప్రాజెక్టుకు ఆగస్టు మూడో వారంలో శంకుస్థాపన జరిగింది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...