sonykongara Posted July 29, 2016 Author Posted July 29, 2016 'వనం-మనం'ను ప్రారంభించిన సీఎం బాబు విజయవాడ : ఏపీ అంతటా వనం-మనం కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా సుంకొల్లు గ్రామంలో వనం-మనం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వనం-మనంలో భాగంగా ఈరోజు ఒక్కరోజు కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది.
sonykongara Posted July 29, 2016 Author Posted July 29, 2016 వాడ వాడలా ‘వనం-మనం’ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రంలో ‘వనం-మనం’ కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. ఇవాళ ఒక్కరోజే కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ‘వనం- మనం’ కార్యక్రమంలో ఉత్సాహం గా పాల్గొని మొక్కలు నాటారు. * తూర్పుగోదావరిజిల్లా కాకినాడ తిలక్‌వీధిలో హోం మంత్రి చినరాజప్ప వనం-మనం కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. * విశాఖ కంభాలకొండ అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ ప్రవీణ్, అధికారులు పాల్గొన్నారు. * ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రవాణాశాఖ మంత్రి శిద్దారాఘవరావు మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ సుజాత శర్మ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. * నెల్లూరులోని కొత్తూరు కేంద్రీయ విద్యాలయంలో మంత్రి నారాయణ మొక్కలు నాటారు. ఇవాళ జిల్లా వ్యాప్తంగా 8లక్షల మొక్కలు నాటుతున్నామని మంత్రి తెలిపారు. * పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో మంత్రి మాణిక్యాలరావు పాల్గొని మొక్కలు నాటారు. * గుంటూరు జిల్లా పేరేచర్ల మండలం నల్లపాడు రిజర్వ్ ఫారెస్టులో ‘వనం-మనం’ కార్యక్రమాన్ని మంత్రి రావెల కిశోర్‌బాబు ప్రారంభించారు. జిల్లాల్లో 16.50 లక్షల మొక్కలు నాటేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేసింది. * తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో ఏర్పాటు చేసిన ‘వనం-మనం’ కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని మొక్కలు నాటారు. *రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు, మేయర్ రజనీశేషసాయి పాల్గొని మొక్కలు నాటారు. * విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో ‘వనం-మనం’ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మొక్కల పెంపకంపై అవగాహన కోసం వేలమంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించా
abhitdp Posted July 29, 2016 Posted July 29, 2016 jffa heroes ekadapoyaru oka raledu plant natatanki aa jaffa governor kuda raledu ade tg lo pilvakapoyna pyaru egasokini aa akkineni allu siro jaffalu
sonykongara Posted July 29, 2016 Author Posted July 29, 2016 విజయవాడ : అవసరమైతే ట్రాన్స్‌ఫర్‌కు కౌన్సెలింగ్ అప్పుడు ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని కాపాడారన్నదానికి ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రమోషన్లకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పిల్లలు ఎవరైతే ఎక్కువ మొక్కలు నాటుతారో వారికి అవసరమైతే పరీక్షల్లో ఐదు మార్కులు ఎక్కువ ఇచ్చి ప్రోత్సహిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
sonykongara Posted July 30, 2016 Author Posted July 30, 2016 హరిత హారం అంటే ఎగబడ్డారు, వనం-మనం అంటే మొఖం చాటేశారు...ఎవరి గురించి అనుకుంటున్నారా ? మన ఘనతవహించిన టాలీవుడ్ హీరోలు, హీరోయిన్ లు గురించి....అది హైదరాబాద్ మీద మోజో, లేక కెసిఆర్ అంటే భయమో, హరిత హారం అని తెలంగాణా ప్రభుత్వం పిలుపు ఇవ్వగానే, ఒక్కొక్కడు ఎగబడి, మొక్కలు నాటుతూ ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో షేర్ చేసి, లెక్చర్లు ఇచ్చారు.. సరే, మంచి పనికి సహకిరించారు, దాంట్లో తప్పేమీ ఉందిలే అనుకున్నాం...కాని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వనం-మనం అంటే, ఒక్కడు కాకపొతే, ఒక్కడు కుడా కన్నెత్తి ఇటు చూడలా...మరి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అంటే చులకన భావామో, చంద్రబాబు అంటే లెక్కలేని తనమో... వైజాగ్ లో స్టూడియో లు కట్టుకోవటానికి, ఫిలిం ఛాంబెర్లు ఏర్పాటుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావలి....అక్కడిదాకా ఎందుకు, వీళ్ళ సినిమాలు కలెక్షన్ రావాలి అంటే, ఆంధ్రావాడు కావాలి...ప్రభుత్వం ఒక సామాజిక కార్యక్రమానికి పిలుపు ఇస్తే, ఒక్కడు అంటే ఒక్కడు ముందుకు రాలేదు అంటే, వాళ్లకి కాదు, వాళ్ళను ఇంకా ఆదరించి, అభిమాన హీరోలుగా ఆరాధించే మనకు ఉండాలి... ఎవ్వడు ముందుకి వచ్చినా, రాకపోయినా, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి, తమ రాష్ట్రము పట్ల అభిమానం ఉంది...అందుకే ఇవాళ వాడవాడలా, పెద్ద, చిన్నా అందరం కలిసి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తీ చేసుకున్నాం...మీలాగా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టుకోము, ఇంతటితో దులుపుకుని వెళ్లిపోము....ఆ మొక్కకి, మేమే రోజు నీళ్ళు పోస్తాం, దేగ్గరుండి పెంచుతాం, పెద్దది చేస్తాం, మా రాష్ట్రాని హరితాంధ్రప్రదేశ్ చేసుకుంటాం...మీ నాటకాలు మీరు హైదరాబాద్లో ఆడుకోండి టాలీవుడ్ హీరోలు..
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now