sonykongara Posted February 13, 2018 Author Posted February 13, 2018 తెలంగాణాలో, హరిత హారం అంటే ఎగబడ్డారు, ఆంధ్రప్రదేశ్ లో వనం-మనం అంటే మొఖం చాటేశారు...ఎవరి గురించి అనుకుంటున్నారా ? మన ఘనతవహించిన టాలీవుడ్ హీరోలు, హీరోయిన్ లు గురించి....అది హైదరాబాద్ మీద మోజో, లేక కెసిఆర్ అంటే భయమో, హరిత హారం అని తెలంగాణా ప్రభుత్వం పిలుపు ఇవ్వగానే, ఒక్కొక్కడు ఎగబడి, మొక్కలు నాటుతూ ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో షేర్ చేసి, లెక్చర్లు ఇచ్చారు.... సరే, మంచి పనికి సహకిరించారు, దాంట్లో తప్పేమీ ఉందిలే అనుకున్నాం...కాని అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వనం-మనం అంటే, ఒక్కడు కాకపొతే, ఒక్కడు కుడా కన్నెత్తి ఇటు చూడలా... ఇలాంటి వారికి మొఖం పగిలిపోయే వార్త.. చేసే పని పట్ల చిత్తసుద్ధి ఉండాలి అనేది అందుకే.. ‘స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2017’ పేరిట కేంద్ర అటవీ, పర్యావరణశాఖ పరిధిలోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ ఐ) రూపొందించిన నివేదికలో, పచ్చదనం పెంపొందించడం లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది... తెలంగాణ ఐదో స్థానం సాధించింది... 2015-17 మధ్య కాలంలో ఏపీలో 2,141 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది... 1,101 చదరపు కిలోమీటర్లతో కర్ణాటక, 1,043 చ.కి.మీ.తో కేరళ, 885చ.కిమీ.తో ఒడిశా, 565 చ.కి.మీ.తో తెలంగాణ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.... అందుకే చేసే పని పై చిత్తసుద్ధి ఉండాలి అనే అనేది... ఒక ప్రణాలిక చంద్రబాబుకి ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ లో పచ్చదనం ఇంత పెరిగింది... తెలంగాణాలో పోల్చటానికి కారణం, అక్కడ హైదరాబాద్ బ్యాచ్ ఆంధ్రా పై అవలంభిస్తున్న విధానం వలన.. అమరావతి కట్టుకుంటే, చెట్లు నరికేశారు అని మీడియా స్టొరీలు వేస్తుంది... హరిత హారం, వనం-మనం పోల్చుతూ, ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని హేళన చేస్తూ కధనాలు వేస్తాయి... చివరకు ఏమైంది ? అక్కడ ఫోటోలు దిగి, కెసిఆర్ ద్రుష్టిలో పడటానికి సినిమా బ్యాచ్ ఎగబడితే, ఇక్కడ మా రాష్ట్రం కోసం, వాడవాడలా, పెద్ద, చిన్నా అందరం కలిసి, వనం-మనం కార్యక్రమాన్ని దేశ చరిత్రలో నిలాపాం... ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేసి, ఇంతటితో దులుపుకుని వెళ్ళిపోలా....ఆ మొక్కకి, మేమే రోజు నీళ్ళు పోసాం, దగ్గరుండి పెంచాం, పెద్దది చేసాం, మా రాష్ట్రాని హరితాంధ్రప్రదేశ్ చేసుకుంటున్నాం... దాని ఫలితాలే ఇవాళ, పచ్చదనం పెంపొందించడం లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది...
Guest Urban Legend Posted February 13, 2018 Posted February 13, 2018 in india film stars vasthey mokkalu peragavu govt dedication vundali ...i.e cbn
sonykongara Posted May 25, 2018 Author Posted May 25, 2018 హరితోద్యమానికి సర్వం సిద్ధం25-05-2018 03:18:01 అమరావతి, మే 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని 2029 నాటికి 40లక్షల చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనంతో హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకు ప్రతి ఒక్కరినీ భాగస్వామిని చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో అవకాశమున్న ప్రతి చోటా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు, విద్యార్థులకు, డ్వాక్రా సంఘాలకు అప్పగించనుంది. వివిధ శాఖల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జూన్ నుంచి ప్రారంభించి వర్షాకాలం ముగిసే వరకూ ఓ యజ్ఞంలా చేపట్టబోతోంది.
sonykongara Posted July 12, 2018 Author Posted July 12, 2018 మొక్కల పండగకు వేళాయె ఈ నెల 14 నుంచి ‘వనం-మనం’ ప్రారంభం కార్తీక వనసమారాధన వరకూ నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా 26 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రారంభించనున్న చంద్రబాబు ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మొక్కల పండగకు వేళయింది. తొలకరి జల్లుల వేళ ‘వనం-మనం’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ నెల 14 నుంచి నవంబరు మాసంలో జరిగే కార్తీక వనసమారాధన వరకూ ప్రతి రోజూ దీన్ని మహోద్యమంలా చేపట్టాలని నిర్ణయించింది. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. జిల్లాల్లో మంత్రులు నిర్వహిస్తారు. మొత్తం అయిదు నెలల వ్యవధిలో 26 కోట్ల మొక్కలను నాటాలన్నది లక్ష్యం. ప్రారంభం రోజునే రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటనున్నారు. దీనికి సంబంధించి మొత్తం 22 ప్రభుత్వ విభాగాలకు బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సంక్షేమ వసతి గృహాలు, కళాశాలలు, పాఠశాలలు, దేవాలయాలు, పరిశ్రమలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు, రహదారులకు ఇరువైపులా నాటనున్నారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులు, స్వయం శక్తి సంఘాల మహిళలు, రైతులు, వనమిత్ర బృందాలు, వనసంరక్షణ సమితి, వాటర్‌షెడ్ సభ్యులను వనం-మనంలో భాగస్వాముల్ని చేయనున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు 5 వేల మంది విద్యార్థులు పాల్గొంటారు. అంతకంటే ముందు వాటి పరిరక్షణకు సంబంధించిన కార్యాచరణ కూడా ఖరారు చేయనున్నారు. దీని నిర్వహణ, రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు బుధవారం వెలగపూడి సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. విధివిధానాలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయాలని సూచించారు.
sonykongara Posted July 12, 2018 Author Posted July 12, 2018 50 శాతం పచ్చదనం లక్ష్యం: శిద్దా12-07-2018 03:58:07 అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యాభై శాతం పచ్చదనం పెంపు లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వనం-మనం కార్యక్రమాన్ని ఈ నెల 14న కృష్ణా జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. బుధవారం అమరావతిలోని ఏపీ సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోని 22 ప్రభుత్వ శాఖల సమన్వయంతో 26 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉందని చెప్పారు.
mahesh1987 Posted July 13, 2018 Posted July 13, 2018 varshalu aagipoinapude start chestharu ento eppudu oka 10 days back start chesthe super vundedi
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now